పిప్పి పళ్ళు - Cavities (Dental Caries) in Telugu

Dr Razi AhsanBDS,MDS

December 01, 2018

March 06, 2020

పిప్పి పళ్ళు
పిప్పి పళ్ళు

పిప్పి పళ్ళు (క్యావిటీ) అంటే ఏమిటి?

పిప్పి పళ్ళు  అనేవి పంటి నిర్మాణంలో అధికంగా ఖనిజాలు చేరడం వలన (remineralisation)  లేదా ఖనిజాలు పళ్ళ నుంచి వెరైపోవడం వలన (demineralisation) కానీ దంతములో ఏర్పడే ఖాళీ స్థలాలు. పిప్పి పళ్ళు అనేవి సూక్ష్మక్రిముల వలన, చక్కెరవలన ఏ వయస్సులో సంభవించే ఒక పంటి సమస్య.

పిప్పి పళ్ళు, పాలు పళ్ళ (ప్రాధమిక దంతాలు) మరియు శాశ్వత దంతాలు (ద్వితీయ దంతాలు) రెండింటిలోనూ సంభవించవచ్చు, ఫలితంగా పంటి ఆకృతికి నష్టం జరుగుతుంది.

ప్రపంచ జనాభాలో 32% మంది పిప్పళ్ళచే ప్రభావితమవుతున్నారు, ఇది సాధారణ జలుబు తర్వాత రెండవ స్థానంలో ఉన్న వ్యాధి.

దాని సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

పిప్పి పళ్ళు యొక్క సంకేతాలు మరియు లక్షణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:

ప్రారంభ లక్షణాలు వీటిని కలిగి ఉంటాయి

 • వేడి మరియు చల్లని ఆహారాలకు సున్నితత్వం
 • నములుతున్నపుడు నొప్పి లేదా అసౌకర్యం
 • పంటి రంగు మారిపోవడం

తర్వాతి లక్షణాలు ఉన్నాయి

 • చిగుళ్ళ వాపు
 • నిరంతరమైన భరించలేని నొప్పి
 • రాత్రి సమయంలో నొప్పి
 • విరిగిపోయే దంతాలు

కొన్నిసార్లు, నొప్పి కూడా ఉండదు మరియు దంత వైద్యుడు పళ్ళలో పుచ్చుని కనుగొన్నప్పుడు వ్యక్తి ఆశ్చర్యపోవచ్చు.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

సుక్రోజ్, ఇతర చక్కెరలు మరియు శుద్ధిచేసిన పిండులతో పాటు దంతాలకి అంటిపెట్టుకుని ఉండే నోటిలోని బాక్టీరియా వల్ల పిప్పి పళ్ళు ఏర్పడతాయి. ఈ బ్యాక్టీరియా ఆమ్లాన్ని (acid) ఉత్పత్తి పంటి ఎనామెల్ ను హరిస్తుంది, ఎనామెల్ అనేది పంటి యొక్క బలమైన పొర.

స్ట్రెప్టోకోకస్ మ్యుటాన్స్ (Streptococcus mutans) మరియు స్ట్రెప్టోకాకస్ సోబ్రినస్ (Streptococcus sobrinus) పిప్పిపళ్లకు కారణమైయ్యే ప్రధాన బాక్టీరియా.

నిద్రవేళలో చక్కెర అధికంగా ఉన్న పాలును శిశువుకు పట్టిస్తే నర్సింగ్ బాటిల్ పిప్పిపళ్లు  (Nursing bottle caries) సంభవిస్తాయి.

ఎలా నిర్ధారిస్తారు మరియు చికిత్స ఏమిటి?

 • దంతవైద్యులు మొదట వైద్య పరికరాలతో నోటిని పరిశీలిస్తారు, పరిశీలన చేసి మరియు స్పర్శించడం ద్వారా పరీక్షిస్తారు.
 • అవసరమైతే, దంతవైద్యులు సరిగ్గా నిర్ధారించడానికి రేడియోగ్రాఫ్ను తీసుకోవచ్చు.
 • చివరకు, రోగి యొక్క లక్షణాలతో సమస్యను అనుసంధానించిన తర్వాత, దంతవైద్యులు చికిత్స ప్రణాళికను సూచిస్తారు.
 • పిప్పి పన్ను యొక్క వ్యాప్తిని బట్టి, దంతవైద్యులు చికిత్స విధానాన్ని నిర్ణయిస్తారు.
 1. ప్రారంభ దశ చికిత్స - ఎనామెల్ను తిరిగి ఏర్పరచేందుకు ఫ్లోరిడేటెడ్ వార్నిష్ పూత (Fluoridated varnish application) సహాయపడవచ్చు.
 2. తరువాతి దశల్లో, దంతాలలో ఏర్పడిన ఖాళీలను నింపి లేదా రూట్ కెనాల్ చికిత్సతో పునరుద్ధరించబడుతుంది, తీవ్రంగా క్షీణించిన కేసుల్లో, దంతవైద్యులు  దంతాలను తీసేయవచ్చు.
 • పంటి కురుపులు వంటి దంత సంక్రమణలలో (ఇన్ఫెక్షన్) జ్వరం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు
 • అయితే, పోషకమైన మరియు తక్కువ చక్కెర ఉండే ఆహారాలు తినడం వంటి స్వీయ సంరక్షణ చాలా ముఖ్యం.

భేదాత్మక నిర్దారణ (డిఫరెన్షియల్ డయాగ్నసిస్)

 • ప్రారంభంలో, దంతాలపై తెల్లటి మచ్చ కనిపిస్తాయి అవి డిమినేరాలైసెషన్ (demineralisation) ను సూచిస్తుంది. అయితే, కొన్నిసార్లు ఈ తెల్లని మచ్చలు అంతర్గత కారణంగా కూడా సంభవించవచ్చు  మరియు ఈ పరిస్థితిని డెంటల్ ఫ్లోరొసిస్ (dental fluorosis) అని పిలుస్తారు.
 • పెద్దపెద్ద గాయాల కారణంగా కూడా దంతాలు రంగు మారిపోవచ్చు. అందువల్ల, దంతాల రంగు మారిపోవడం అనేది ఎల్లప్పుడూ పిప్పి పన్నును సూచించదు.
 • టీ మరియు కాఫీ కారణంగా పళ్లలో గుంటలు మరియు పగుళ్ళు ఏర్పడవచ్చు. అందువల్ల, మొదట చికిత్స ప్రణాళికను నిర్ణయించడానికి ముందుగా దంత వైద్యులు పళ్ళను పూర్తిగా తనిఖీ చేయాలి.

చికిత్స యొక్క వ్యవధి పిప్పిపంటి స్థితి మీద ఆధారపడి ఉంటుంది. ఇటీవలి సాంకేతిక అభివృద్ధితో, ఒకేసారి చికిత్స చేయగలిగే ప్రణాళికలు (సింగిల్ సిటింగ్ ట్రీట్మెంట్ ప్లాన్స్) కూడా సాధ్యమే. దంత చికిత్స అనేది చాలా అరుదుగా బాధాకరమైనదిగా ఉంటుంది. తరచుగా, చికిత్సలు ఒక నొప్పిరహితంగా ఉండడానికి స్థానిక అనస్థీషియాను (మత్తు) ఇస్తారు. ఫెరోయిడ్ జెల్ను పూయడం ద్వారా లేదా దంతాల ఖాళీలను నింపడం ద్వారా పిప్పి పళ్ళకు చికిత్స చేయవచ్చు. ఖాళీ లోతుగా ఉంటే, దానిని శుభ్రం చేసి ఒక దంత ముసుగు (dental crown) తో కప్పవచ్చు. సమస్య తీవ్రంగా ఉంటే, దెబ్బతిన్న పంటిని తీసేయవచ్చు.

పిప్పి పళ్ళను నిరోధించడానికి గృహ-సంరక్షణ చిట్కాలు

 • రోజుకు రెండుసార్లు పళ్ళు తోమాలి
 • ఫ్లోరిడేటెడ్ టూత్ పేస్టును వాడాలి
 • తరుచుగా దంతాల స్వీయ-పరీక్ష
 • మౌత్ వాష్ యొక్క ఉపయోగం
 • భోజనం మధ్యలో చిరుతిళ్లను తగ్గించాలివనరులు

 1. National Health Service [Internet] NHS inform; Scottish Government; Tooth decay
 2. Yoon Lee. Diagnosis and Prevention Strategies for Dental Caries. J Lifestyle Med. 2013 Sep; 3(2): 107–109. PMID: 26064846
 3. Cologne, Germany [Internet]: Institute for Quality and Efficiency in Health Care (IQWiG). Tooth decay; 2006-.2006 Mar 17 [Updated 2017 Sep 21].
 4. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Tooth Decay
 5. National Health Portal [Internet] India; Oral Health

పిప్పి పళ్ళు వైద్యులు

Dr. Parampreet Kohli Dr. Parampreet Kohli Dentistry
10 Years of Experience
Dr. Priya gupta Dr. Priya gupta Dentistry
2 Years of Experience
Dr. Shrishty Priya Dr. Shrishty Priya Dentistry
6 Years of Experience
Dr. Hanushri Bajaj Dr. Hanushri Bajaj Dentistry
3 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

పిప్పి పళ్ళు కొరకు మందులు

Medicines listed below are available for పిప్పి పళ్ళు. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.