ఆఘాతం - Trauma in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

January 12, 2019

March 06, 2020

ఆఘాతం
ఆఘాతం

ఆఘాతం అంటే ఏమిటి?

ఒక వ్యక్తి మానసికంగా లేదా భౌతికంగా హానికరమైన లేదా భయపెట్టే సంఘటనను అనుభవించడంవల్ల పొందిన ఓ (దయనీయమైన) స్థితి, దాన్నే “ఆఘాతం” (ట్రామా) అంటారు. వ్యక్తి అనుభవించిన ఆ సంఘటన పరిస్థితుల సమాహారం కావచ్చు. ఆ వ్యక్తి అనుభవించిన ఈ సంఘటన ఆ వ్యక్తి యొక్క సాంఘిక, భావోద్వేగ, భౌతిక పనితీరు మరియు శ్రేయస్సుపై దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటుంది.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

ఒక బాధాకరమైన లేదా ఆఘాతకర సంఘటనకు మానసిక ప్రతిస్పందనలు:

  • తగ్గిన జ్ఞాపకశక్తి (మెమరీ) మరియు ఏకాగ్రత
  • జరిగిన ఆ సంఘటన గురించి చెదిరిన ఆలోచనలు
  • గందరగోళం
  • పునరావృతంగా మనస్సులో ఆడుతున్న సంఘటన యొక్క భాగాలు
  • బాధాకరమైన ఆ సంఘటన యొక్క భాగాలు మనసులో పునరావృతంగా గుర్తుకొస్తుంటాయి.

ఓ బాధాకరమైన సంఘటనకు భౌతిక స్పందనలు:

  • చెదిరిన నిద్ర క్రమాలు
  • మైకము, వికారం మరియు వాంతులు
  • తలనొప్పి
  • విపరీతంగా చెమట పట్టడం
  • పెరిగిన హృదయ స్పందన రేటు

బాధాకరమైన సంఘటనకు ప్రవర్తనా ప్రతిస్పందనలు:

  • ఆకలి మార్పులు
  • సాధారణ నిత్యకృత్యాల నుండి దూరంగా జరిగిపోవడం
  • నిద్ర సమస్యలు
  • చేతరించుకునేందుకు (రికవరీకి) సంబంధించిన విధుల్లో నిమగ్నమవడం
  • సిగరెట్, మద్యం (ఆల్కాహాల్) మరియు కాఫీ సేవనం యొక్క అలవాట్లు చేసుకుంటారు
  • ఆ సంఘటన గురించిన ఆలోఛన్లను ఆపడానికి అసమర్థత
  • ఆ సంఘటనతో సంబంధం ఉన్న ఏ జ్ఞాపకాలను అయినా నిరోధించడం

బాధాకరమైన సంఘటనకు భావోద్వేగ స్పందనలు:

  • భయం, ఆందోళన, మరియు భయం
  • భావోద్వేగ భావన లేకుండడం
  • ఆఘాతం లేక దిగ్భ్రాంతి స్థితి
  • గందరగోళం మరియు వేరుచేయబడిన భావన
  • సహచరుల నుండి దూరంగా ఉండటం మరియు వారితో కలిసుండాలని కోరుకోకపోవడం
  • ఆ సంఘటన ఇంకా ఇప్పటికీ జరుగుతోంది మరియు చుట్టూ ప్రమాదం ఉందన్న భావన
  • ఆ సంఘటన ముగిసిన తర్వాత అలసట యొక్క భావం కల్గడం
  • ఆ సంఘటన ముగిసిన తర్వాత మానసికంగా న్యూనతకు గురవడం
  • న్యూనతకు గురైనదశలో అపరాధ భావం, నిరాశ, తప్పించుకుతిరగడం మరియు అతి సున్నితత్వం వంటి భావాలను అనుభవిస్తారు.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

ఈ కింది సంఘటనలను అనుభవించడం ఒక వ్యక్తిలో ఒక బాధాకరమైన స్పందనను ప్రేరేపిస్తుంది:

  • నష్టం
  • భౌతిక మరియు లైంగిక వేధింపు
  • సాంఘికపరమైన, కౌటుంబిక (domestic), కార్యాలయ హింస
  • క్రైమ్
  • ప్రకృతి వైపరీత్యాలు
  • లేమి యొక్క భావం (Feeling of deprivation)
  • బాధాకరమైన దుఃఖం
  • వైద్య విధానాలు, గాయం లేదా అనారోగ్యం

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

నెల కన్నా ఎక్కువ కాలం పాటు వయోజనుడైన వ్యక్తి పేర్కొన్న ఈ లక్షణాలను కలిగి ఉన్నప్పుడు ఆఘాతం యొక్క వ్యాధి నిర్ధారణను చేస్తారు:

  • కనీసం రెండు ప్రతిచర్యశీలత మరియు ప్రేరేపక లక్షణాలు
  • తిరిగి ఎదుర్కొంటున్న వ్యాధిలక్షణాల్లో కనీసం ఒకటి
  • కనీసం రెండు మానసిక (మూడ్) మరియు జ్ఞానసంబంధ (cognition) వ్యాధిలక్షణాలు
  • కనీసం (avoidance symptom) ఒక ఎగవేత లక్షణం

కిందివాటిని ఉపయోగించి ఆఘాతాన్ని నిర్ధారిస్తారు:

  • బుద్ధికి సంబంధించిన నడవడిక చికిత్స(కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ)
  • ఎక్స్పోజర్ థెరపీ (ఆందోళన రుగ్మతలకు చేసే చికిత్స)
  • కాగ్నిటివ్ రీస్ట్రుక్చరింగ్ (మేధావికాస పునర్నిర్మాణం)
  • సిస్టమాటిక్ డీసెన్సిటైజేషన్ (ఓ పధ్ధతి ప్రకారం గ్రాహకతను తగ్గించడం)
  • ఆందోళన నిర్వహణ
  • ఒత్తిడి తగ్గించే చికిత్స
  • ఐ మూవ్మెంట్ డీసెన్సిటైజేషన్ మరియు రీప్రోసెసింగ్ (కంటి కదలికల గ్రాహకతను తగ్గించడం మరియు రేప్రొసెస్సింగ్
  • కుంగుబాటు నివారణా  మందులు (యాంటిడిప్రెసెంట్స్) మరియు ఇతర మందులు.



వనరులు

  1. Missouri Department of Mental Health [Internet]: Missouri State; What is Trauma?
  2. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Trauma - reaction and recovery.
  3. National Institute of Mental Health [Internet] Bethesda, MD; Models of Trauma Treatment. National Institutes of Health; Bethesda, Maryland, United States
  4. Center for Substance Abuse Treatment (US). Trauma-Informed Care in Behavioral Health Services. Rockville (MD): Substance Abuse and Mental Health Services Administration (US); 2014. (Treatment Improvement Protocol (TIP) Series, No. 57.) Chapter 3, Understanding the Impact of Trauma.
  5. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Helping Patients Cope With A Traumatic Event .

ఆఘాతం కొరకు మందులు

Medicines listed below are available for ఆఘాతం. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.