myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

ఇ. కోలి (E. coli) అంటువ్యాధులు అంటే ఏమిటి?

ఎస్చెరిషియా కోలి, సాధారణంగా ఇ. కోలి అని పిలుస్తారు, ఇది మన ప్రేగులలో సహజంగానే  ఉంటుంది. 1880 ల చివరిలో ఈ బాక్టీరియాను గుర్తించడం జరిగింది, ఈ బ్యాక్టీరియా ఏరోబిక్ (ఆక్సిజన్ ఉండే) మరియు అనారోబిక్ (ఆక్సిజన్ లేని) పరిస్థితుల్లో కూడా  చాలా సులభంగా పెరుగుతుంది అందువల్ల ఇది మైక్రోబయలోజికల్ మరియు బయోటెక్నాలజీ అధ్యయనాల్లో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఇది 7 వేర్వేరు వ్యాధికారక రూపాలలో ఉంటుంది, అవి మూత్రాశయా మార్గ సంక్రమణ (UTI, urinary tract infection), సెప్టిసిమియా, మెనింజైటిస్ మరియు అతిసారం వంటి వివిధ అంటురోగాలకు కారణమవుతాయి. భారతదేశంలో,ఇ. కోలి (E. coli) అంటువ్యాధులు సాధారణంగా ప్రతి సంవత్సరం కనిపిస్తాయి, వాటిలో అతి సాధారణమైనవి అతిసారం మరియు మూత్రాశయా మార్గ సంక్రమణ.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

ఇ. కోలి (E. coli) యొక్క సంక్రమణ రకంపై  ఆధారపడి విస్తారమైన రకాలైన లక్షణాలను అనుభవించవచ్చు. సంక్రమణ రకాన్ని బట్టి, కనిపించే సంకేతాలు మరియు లక్షణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:

 • పిల్లలో  విరేచనాలు మరియు ప్రయాణికుల అతిసారం: నీళ్ల విరేచనాలు (కొన్నిసార్లు శ్లేష్మంతో [mucus]) మరియు వాంతులు.
 • హెమోరాజిక్ కొలైటిస్ (Haemorrhagic colitis): రక్తంతో కూడిన విరేచనాలు.
 • క్రోన్స్ వ్యాధితో కూడిన ఇ. కోలి (E. coli) సంక్రమణ: నిరంతరమైన పేగు వాపు, ప్రేగు గోడల మీద గాయాలు మరియు నీటి విరేచనాలు.
 • మూత్రాశయా మార్గ సంక్రమణ (UTI): బాధాకరమైన మూత్ర విసర్జన, మురికి వాసనతో కూడిన మూత్రం మరియు అధిక జ్వరము.
 • అప్పుడే పుట్టిన శిశువులలో (నియోనాటల్) మెనింజైటిస్: శిశువుల్లో అధిక జ్వరం.

దాని ప్రధాన కారణాలు ఏమిటి?

సంక్రమణ యొక్క ప్రధాన కారణం వ్యాధికారక ఇ. కోలి (E. coli) తో ఆహరం మరియు నీరు కలుషితమవ్వడం. ఇ. కోలి ప్రేగుల లోపల స్నేహపూరిత బాక్టీరియం అయినప్పటికీ, దాని వ్యాధికారక రకాలు (strains) మానవ శరీరాన్ని అతలాకుతలం చేయగలవు. ఆరోగ్యకరమైన వ్యక్తులలో కూడా ఇవి సంక్రమణలును (ఇన్ఫెక్షన్) ఉత్పత్తి చేయగలవు మరియు వేరేవాళ్లకి కూడా అవి వ్యాప్తి చెందుతాయి:

 • కలుషితమైన నీరు తాగడం
 • కలుషితమైన ఆహారం తినడం
 • ఇ. కోలితో కలుషితమైన నేలలో పెరుగిన  కూరగాయలు తినడం
 • అనాగ్యకరమైన ఆహారపు అలవాట్లు
 • ఇ. కోలి తో కలుషితమైన హాస్పిటల్ వ్యర్ధాలు

ఎలా నిర్ధారించాలి  మరియు చికిత్స ఏమిటి ?

వేర్వేరు ఇ. కోలి సంక్రమణల యొక్క నిర్ధారణ ప్రధానంగా నమూనాలోని బాక్టీరియా లేదా దాని విషపదార్ధాల (టాక్సిన్స్) యొక్క ఉనికిని పరీక్షిస్తుంది. సంక్రమణ మీద ఆధారపడి, నిర్వహించే నిర్దారణ పరీక్షలు ఈ క్రింది విధంగా ఉంటాయి:

 • మూత్రాశయా మార్గ సంక్రమణ (UTI): మూత్ర పరీక్ష మరియు ఇ. కోలి ఉనికి కోసం మూత్ర సాగు.
 • అతిసారం: మల నమూనా యొక్క పరీక్ష.
 • నియోనాటల్ (అప్పుడే పుట్టిన శిశువులలో) మెనింజైటిస్: సెరెబ్రోస్పానియల్ ఫ్లూయిడ్ (CSF) పరీక్ష మరియు ఇ. కోలి ఉనికి కోసం దాని సాగు.
 • క్రోన్స్ వ్యాధి: సాంకేతిక రేడియాలజీ ప్రేగులలో గాయాలను పరిశీలించి, వాటిని పెద్దప్రేగుల పుండ్ల నుండి వేరుచేస్తుంది, అలాగే మల పరీక్ష ఇ. కోలి ఉనికిని నిర్ధారిస్తుంది.

ఇ. కోలి (E. coli) యొక్క బహుళ ఔషధాల నిరోధక జాతులు (multidrug-resistant species), చికిత్సకు సవాలుగా మారుతున్నాయి. ఇ. కోలి (E. coli)  సంక్రమణల చికిత్స:

 • యాంటీబయాటిక్స్ యొక్క హేతుబద్ధ వినియోగం (Rational use of antibiotics)
 • ప్రోబయోటిక్స్
 • బ్యాక్టీరియోఫేజ్ థెరపి (Bacteriophage therapy)
 • యాంటీమైక్రోబయల్ పెప్టైడ్స్ (Antimicrobial peptides)

మందులతో పాటు, పుష్కలంగా నీటిని తాగడం మరియు విశ్రాంతి తీసుకోవడం వంటి కొన్ని స్వీయ-సంరక్షణ చర్యలు  ఉపయోగపడతాయి.

సరైన పరిశుభ్రత, సురక్షిత ఆహార పద్ధతులు మరియు మంచి పారిశుద్ధత వంటి నివారణా చర్యలు ఉన్నాయి

 1. ఇ. కోలి అంటువ్యాధులు కొరకు మందులు
 2. ఇ. కోలి అంటువ్యాధులు వైద్యులు
Dr. Neha Gupta

Dr. Neha Gupta

संक्रामक रोग

Dr. Jogya Bori

Dr. Jogya Bori

संक्रामक रोग

Dr. Lalit Shishara

Dr. Lalit Shishara

संक्रामक रोग

ఇ. కోలి అంటువ్యాధులు కొరకు మందులు

ఇ. కోలి అంటువ్యాధులు के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine NamePack SizePrice (Rs.)
Exel GnExel Gn 0.05% W/W/0.5% W/W Cream41
NeomycinNEOMYCIN OINTMENT 10GM0
Propygenta NfPROPYGENTA NF CREAM 20GM122
Canflo BnCanflo Bn 1%/0.05%/0.5% Cream34
Tenovate GnTenovate Gn Cream24
Crota NCrota N Cream27
Sigmaderm NSigmaderm N 0.025%/1%/0.5% Cream45
Tolnacomb RfTolnacomb Rf Cream23
Xeva NcXeva Nc Tablet23
ZotadermZotaderm Cream21
EclospanECLOSPAN CREAM 15 GM85
MegaspanMegaspan Cream17
NovacorNOVACOR SKIN CREAM 10GM27
ValbetVALBET 10GM CREAM49
ClostagenClostagen 0.5%/0.5% Cream84
Dipgenta FDipgenta F Cream64
Klosoft NKlosoft N 0.05%/0.5% Cream0
Clonit GClonit G Cream0
Cortisol GCortisol G Cream0
Powercort NPowercort N Cream32
Viclob NViclob N Cream0

మీకు గానీ లేదా మీ కుటుంబములో ఎవరికైనా గానీ ఈ వ్యాధి ఉందా? దయచేసి ఒక సర్వే చేసి ఇతరులకు సహాయపడండి

References

 1. Zachary D Blount. e Life. 2015; 4: e05826. Published online 2015 Mar 25. doi: [10.7554/eLife.05826]
 2. Nerino Allocati et al Escherichia coli in Europe: An Overview. Int J Environ Res Public Health. 2013 Dec; 10(12): 6235–6254.
 3. V.Niranjan and A.Malini. Antimicrobial resistance pattern in Escherichia coli causing urinary tract infection among inpatients.. Indian J Med Res. 2014 Jun; 139(6): 945–948
 4. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; E. coli (Escherichia coli).
 5. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; E. coli (Escherichia coli)
और पढ़ें ...