myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

కాలివేలు విరగడం (ఫ్రాక్చర్) అంటే ఏమిటి?

పాదాలకి ఏదైనా ఆకస్మిక గాయం లేదా ఒక మాములు గాయం అనేది ఎముకను రెండు లేదా అంతకంటే ఎక్కువ ముక్కలుగా విరిగిపోయెలా లేదా ఎముక మీద సన్నని పగుళ్ళు (హెయిర్లైన్ ఫ్రాక్చర్స్) ఏర్పడేలా చేస్తుంది. గాయం తీవ్రత ఆధారంగా, అనేక చికిత్సా విధానాలు ఉన్నాయి.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

 • నిరంతరమైన సలుపుతో కూడిన నొప్పి విరిగిన వేలి యొక్క ప్రాధమిక లక్షణం.
 • వేలి మీద వాపు కూడా సంభవిస్తుంది.
 • విరిగిన కాలి వేలి యొక్క ఏవిధమైన కదలికైనా బాధాకరంగా ఉంటుంది, ఇది నడవడాన్నీ  లేదా కదలడాన్నీ కష్టంగా చేస్తుంది.
 • సన్నని ఫ్రాక్చర్ (హెయిర్లైన్ ఫ్రాక్చర్స్) సందర్భంలో, నొప్పి తక్కువగా ఉంటుంది మరియు ఏ ఇబ్బంది లేకుండా నడవడం కూడా సాధ్యమవుతుంది.
 • పగులు (ఫ్రాక్చర్ ) చాలా తీవ్రంగా ఉంటే, కాలివేలు నీలం రంగులోకి మారుతుంది మరియు వైకల్యంతో కనిపిస్తుంది.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

 • వేలు మీద ఏదైనా భారీ వస్తువు పడినప్పుడు ఫ్రాక్చర్ జరుగవచ్చు. కాలి వేళ్ళు కాళ్ళ నుండి ముందుకి ఉండే పొడుగైన భాగం కాబట్టి,సాధారణంగా వేళ్ళకి గాయాలు అయ్యే అవకాశం ఎక్కువ.
 • పాదాలు ఏవైనా గట్టివస్తువులకి ఆకస్మికంగా గుద్దుకున్నపుడు కూడా ఫ్రాక్చర్ ఏర్పడవచ్చు.
 • బోలు ఎముకల వ్యాధి (ఆస్టియోపొరోసిస్) కారణంగా బలహీనమైన ఎముకలు ఉన్న వ్యక్తులు తరచూ ఒత్తిడి పగుళ్ల (stress fractures) తో బాధపడుతుంటారు. దీని అర్థం, ఎక్కవగా నడవడం వలన లేదా సరిపడని బూట్లు కారణంగా కూడా ఎముకలు విరిగిపోతాయి.
 • ఎముకలపై నిరంతర ఒత్తిడి లేదా అధిక కదలికల కారణంగా కూడా ఒత్తిడి పగుళ్లు లేదా సన్నని పగుళ్లు (హెయిర్లైన్ ఫ్రాక్చర్స్) సంభవించవచ్చు.

ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

కీళ్ళ వైద్యు నిపుణులు (orthopaedic doctor) వేలి యొక్క భౌతిక పరీక్ష మరియు ఎక్స్-రే ఆధారంగా వేలి ఫ్రాక్చర్ను నిర్ధారించగలరు. ఏవైన కమిలిన గాయాలు లేదా బహిరంగ పుండ్ల కారణంగా గాయమైతే, సంక్రమణను/ఇన్ఫెక్షన్ను అనుమానించవచ్చు. దాని నిర్దారణ కోసం, వైద్యులు రక్త పరీక్షను ఆదేశించవచ్చు.

చికిత్స అనేది ఫ్రాక్చర్ తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది.

 • హెయిర్లైన్ ఫ్రాక్చర్స్ వంటి చిన్న ఫ్రాక్చర్లకు  విశ్రాంతి మరియు నొప్పి నివారుణులకి మించి వేరే చికిత్స అవసరం లేదు. పగుళ్లను (ఫ్రాక్చర్ను) అదే స్థానంలో  పట్టివుంచడానికి బ్యాండేజ్ సరిపోతుంది.
 • ఫ్రాక్చర్ తో  పాటు సంక్రమణ (ఇన్ఫెక్షన్) ఉంటే కనుక యాంటీబయాటిక్స్ సూచించబడతాయి.
 • విరిగిన వేలుకి స్ప్లింట్లు (బద్ద కట్టడం) పెట్టడం వలన అది కదలికను తగ్గిస్తుంది మరియు వేలుని దృఢపరుస్తుంది.
 • ఫ్రాక్చర్ వేలుని దాని స్థానం నుండి మారిపోయేలా చేస్తే, ఎముకను (వేలును) తిరిగి స్థానంలో అమర్చాలి. అదేవిధంగా, రెండు కన్నా ఎక్కువ ముక్కలుగా ఎముక  విరిగితే శస్త్రచికిత్స అవసరమవుతుంది.
 • పగుళ్లు కోసం గృహ సంరక్షణలో కాలుని పైకి పెట్టడం, ఐసుని ఉపయోగించడం (ప్రభావిత వేలి పై రుద్దడం) మరియు తగినంత విశ్రాంతి తీసుకోవడం వంటివి ఉన్నాయి.
 • చాలా సందర్భాలలో, ఒక విరిగిన వేలు నాలుగు నుంచి ఎనిమిది వారాల్లోనే నయమవుతుంది.
 1. కాలివేలు విరగడం (ఫ్రాక్చర్) కొరకు మందులు

కాలివేలు విరగడం (ఫ్రాక్చర్) కొరకు మందులు

కాలివేలు విరగడం (ఫ్రాక్చర్) के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine NamePack SizePrice (Rs.)
BrufenBrufen 200 Tablet4
CombiflamCOMBIFLAM 60ML SYRUP24
Ibugesic PlusIbugesic Plus Oral Suspension Strawberry27
BrugelBrugel 5% W/W Gel114
TizapamTizapam 400 Mg/2 Mg Tablet42
FbnFbn 0.03% Eye Drop50
FlurbinFlurbin 0.03% W/V Eye Drop51
Espra XnESPRA XN 500MG TABLET 10S104
LumbrilLumbril Tablet16
OcuflurOcuflur Eye Drop44
TizafenTizafen 400 Mg/2 Mg Capsule53
EndacheEndache Gel47
FenlongFenlong 400 Mg Capsule21
Ibuf PIbuf P Tablet11
IbugesicIbugesic 100 Mg Suspension16
IbuvonIbuvon 100 Mg Suspension8
Ibuvon (Wockhardt)Ibuvon Syrup9
IcparilIcparil 400 Mg Tablet23
MaxofenMaxofen Tablet5
TricoffTricoff Syrup48
AcefenAcefen 100 Mg/125 Mg Tablet23
Adol TabletAdol 200 Mg Tablet33
BruriffBruriff 400 Mg Tablet4

మీకు గానీ లేదా మీ కుటుంబములో ఎవరికైనా గానీ ఈ వ్యాధి ఉందా? దయచేసి ఒక సర్వే చేసి ఇతరులకు సహాయపడండి

References

 1. M.E. Van Hal et al. Stress fractures of the great toe sesamoids. First Published March 1, 1982. [Internet]
 2. Eves TB, Oddy MJ. [text]. J Foot Ankle Surg. 2016 May-Jun;55(3):488-91. PMID: 26961415
 3. Van Vliet-Koppert ST et al. Demographics and functional outcome of toe fractures.. J Foot Ankle Surg. 2011 May-Jun;50(3):307-10. PMID: 21440463
 4. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Broken toe - self-care
 5. Hatch RL, Hacking S. Evaluation and management of toe fractures.. Am Fam Physician. 2003 Dec 15;68(12):2413-8. PMID: 14705761
और पढ़ें ...