గ్లోమెరులోనెఫ్రైటిస్ - Glomerulonephritis in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

November 29, 2018

March 06, 2020

గ్లోమెరులోనెఫ్రైటిస్
గ్లోమెరులోనెఫ్రైటిస్

గ్లోమెరులోనెఫ్రైటిస్ అంటే ఏమిటి?

గ్లోమెరులోనెఫ్రైటిస్ అనేది కిడ్నీగ్లోమెరూలి (రక్తం నుండి వ్యర్ధాలను మరియు ద్రవాలను ఫిల్టర్ [వడకట్టడానికి] చేయటానికి సహాయపడే మూత్రపిండాల లోపల ఉండే చిన్న వడపోతలు)కి నష్టం కలిగించే ఒక మూత్రపిండాల వ్యాధి . ఇది సాధారణంగా ఆరోగ్యకరమైన మూత్రపిండాల కణజాలంపై రోగనిరోధక వ్యవస్థ దాడి చేయడం కలుగుతుంది/సంభవిస్తుంది.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

గ్లోమెరులోనెఫ్రైటిస్ తో ముడిపడి ఉండే సంకేతాలు మరియు లక్షణాలు:

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

గ్లోమెరులోనెఫ్రైటిస్ యొక్క ప్రధాన కారణాలు:

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

లక్షణాల సరైన వివరాలు తెలుసుకున్న తర్వాత వైద్యులు ఈ కింది పరీక్షలను ఆదేశించవచ్చు:

  • రక్త పరీక్షలు:
    • క్రియాటినిన్ (Creatinine) స్థాయిలు, ఇవి మూత్రపిండాల రుగ్మతలు ఉన్న వ్యక్తులలో అధికంగా ఉంటాయి.
    • ఎస్టిమేట్డ్ గ్లోమెరులర్ ఫిల్టరేషన్ రేటు (eGFR, Estimated glomerular filtration rate), ఇది కిడ్నీ వ్యాధులలో తగ్గుతుంది.
  • ఆటో ఇమ్యూన్ రియాక్షన్ (స్వయం ప్రతిరక్షక దాడిని) ప్రేరేపించే వివిధ రకాల యాంటీబాడీల తనిఖీ కోసం పరీక్షలు.
  • మూత్ర పరీక్ష: మూత్రంలో రక్తం లేదా ప్రోటీన్ల ఉనికిని తనిఖీ చేసేందుకు.
  • అల్ట్రాసౌండ్ స్కాన్: మూత్రపిండాలలో ఏవైనా సమస్యలు ఉంటే తనిఖీ చేయడానికి, అడ్డంకులు వంటివి ఏవైనా ఉంటే వాటి తనిఖీ కోసం.
  • జీవాణుపరీక్ష (బయాప్సీ): మూత్రపిండ కణజాల నమూనాను సేకరించి దానిని మైక్రోస్కోప్ తో పరిశీలిస్తారు.

గ్లోమెరులోనెఫ్రైటిస్ చికిత్స వ్యాధి తీవ్రతను బట్టి, లక్షణాలు బట్టి ఉంటుంది. తేలికపాటి కేసుల్లో, చికిత్స అవసరం లేదు.

చికిత్స పద్ధతుల్లో కొన్ని ఈ విధంగా ఉంటాయి:

  • ఆహార విధాన మార్పులు: అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచేందుకు ఉప్పు, పొటాషియం అధికంగా ఉండే ఆహార పదార్ధాలు మరియు ద్రవాలను తీసుకోవడం తగ్గించాలి.
  • పొగ త్రాగడం ఆపివేయాలి: ధూమపానాన్ని నివారించాలని సలహా ఇస్తారు, ఎందుకంటే ఇది గ్లోమెరులోనెఫ్రైటిస్ను మరింత తీవ్రతరం చేస్తుంది మరియు గుండె జబ్బులు, స్ట్రోక్ ల ప్రమాదాన్ని పెంచుతుంది.
  • మందులు:
    • ఆంజియోటెన్సెన్ రిసెప్టర్ బ్లాకర్స్ (ARBs,angiotensin receptor blockers), యాంజియోటెన్సిన్-కన్వర్టింగ్ ఎంజైమ్ (ACE, angiotensin-converting enzyme) ఇన్హిబిటర్లు, డైయూరిటిక్స్ మరియు మొదలైన మందుల వంటి రక్తపోటును తగ్గించే మందులు.
    • వాపు తగ్గించడానికి మరియు రోగనిరోధక వ్యవస్థ ప్రతిచర్యలు అణిచివేసేందుకు (తగ్గించేందుకు), కార్టికోస్టెరాయిడ్స్ (ప్రిడ్నిసోన్ [prednisone]) సూచించబడతాయి.
    • రోగనిరోధక వ్యవస్థలో సమస్యలు ఎదురైనప్పుడు, టాక్రోలిమస్ (tacrolimus), సైక్లోస్పోరిన్ (cyclosporine), అజాథయోప్రైన్ (azathioprine), రిట్యుక్సిమాబ్ (rituximab) లేదా మైకోఫెనోలట్ మోఫేటిల్ (mycophenolate mofetil) వంటి ఇమ్యునోసప్రెసెంట్స్ సూచించబడవచ్చు.
    • తక్కువ మోతాదులలో సైక్లోఫాస్ఫమైడ్ (Cyclophosphamide) కూడా ఇమ్యునోసప్రెసెంట్స్ గా  ఉపయోగిస్తారు.
    • వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నవారికి యాంటీవైరల్ మందులు ఇవ్వబడతాయి.
    • గ్లోమెరులోనెఫ్రైటిస్  ఉన్నవారిలో సాధారణంగా కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి, అందువల్ల కొలెస్ట్రాల్-తగ్గించే మందులు సూచించబడతాయి.
  • తీవ్ర సందర్భాలలో ప్లాస్మా మార్పు జరుపవచ్చు



వనరులు

  1. National Health Service [Internet] NHS inform; Scottish Government; Glomerulonephritis.
  2. National Health Service [Internet] NHS inform; Scottish Government; Glomerulonephritis.
  3. National Kidney Foundation. [Internet]. New York, United States; What is Glomerulonephritis?.
  4. The American Kidney Fund. [Internet]. North Bethesda, Maryland, United States; Glomerulonephritis.
  5. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Glomerulonephritis.

గ్లోమెరులోనెఫ్రైటిస్ వైద్యులు

Dr. Samit Tuljapure Dr. Samit Tuljapure Urology
4 Years of Experience
Dr. Rohit Namdev Dr. Rohit Namdev Urology
2 Years of Experience
Dr Vaibhav Vishal Dr Vaibhav Vishal Urology
8 Years of Experience
Dr. Dipak Paruliya Dr. Dipak Paruliya Urology
15 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

గ్లోమెరులోనెఫ్రైటిస్ కొరకు మందులు

Medicines listed below are available for గ్లోమెరులోనెఫ్రైటిస్. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.

Medicine Name

Price

₹494.0

Showing 1 to 0 of 1 entries