కళ్ళ దురద - Itchy Eyes in Telugu

Dr. Ajay Mohan (AIIMS)MBBS

December 05, 2018

July 31, 2020

కళ్ళ దురద
కళ్ళ దురద

కళ్ళ దురద అంటే ఏమిటి?

కళ్ళ దురద (ఒక్క్యూలర్ పృరైటస్),చాలా సాధారణ సమస్య, ఏదైనా ప్రేరేపకం (ట్రిగ్గర్) లేదా అలెర్జిన్ కు ప్రతిస్పందనగా హిస్టామైన్ అని పిలిచే ఒక రసాయనాన్ని శరీరం విడుదల చేసినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కళ్ళలో ఉండే రక్తనాళాల వ్యాకోచానికి దారితీస్తుంది చిరాకు మరియు దురద, నీళ్ళు కారడం, కొన్నిసార్లు కళ్ళ ఎర్రదనాన్ని కలిగిస్తుంది.

దాని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

కళ్ళ దురద పాటు కనిపించే సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు:

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

కళ్ళ దురద సాధారణంగా ఈ కింది కారణాల వలన కలుగుతుంది:

 • అలెర్జీ (దుమ్ము పురుగుల పుప్పొడి,బూజు, కంటి చుక్కలు (eye drops) లేదా జంతువుల బొచ్చు)
 • మీ కళ్ళు చుట్టూ ఉన్న చర్మవాపు
 • డ్రై ఐ సిండ్రోమ్ - శరీరం తగినంత కన్నీటిని ఉత్పత్తి చేయనప్పుడు, కళ్ళు యొక్క ఉపరితలం తేమగా మరియు సౌకర్యవంతంగా ఉంచడానికి అవసరం.
 • కెమికల్స్ లేదా కంటిలోకి ఏదైనా బయటి వస్తువు వెళ్లడం(స్విమ్మింగ్ పూల్ లోని క్లోరిన్ లేదా అలంకరణ వస్తువులు)
 • బ్లేఫరైటిస్ - కనురెప్పల యొక్క వాపుకు కారణమయ్యే ఒక సంక్రమణం
 • కాంటాక్ట్ లెన్సులు వలన సంక్రమణం
 • ప్రతికూల మందుల ప్రతిచర్యలు (యాంటిహిస్టమిన్, పెయిన్కిల్లర్స్, యాంటిడిప్రెసెంట్స్, లేదా జనన నియంత్రణ మాత్రలు)

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

వైద్యులు క్షుణ్ణంగా వీటిని పరిశీలిస్తారు:

 • కనురెప్పలు, కార్నియా మరియు కంజుంటివా
 • కళ్ళ కదలికలు
 • వెలుగుకి కనుపాప యొక్క స్పందన
 • దృష్టి/చూపు

కళ్ల దురద చికిత్స గుర్తించిన కారణం ఆధారంగా ఉంటుంది:

 • ముందుగా, ఏదైన బయటి వస్తువు కళ్ళలోకి  ప్రవేశించినట్లయితే, కింది వాటిని చేయవచ్చు:

 1. కళ్ళను శుభ్రపరచడానికి సైనైన్ లేదా వెచ్చని నీటిని ఉపయోగించవచ్చు.
 2. కళ్లు మూసి ఐస్ ప్యాక్ లేదా శుభ్రమైన, చల్లని, తడి వస్త్రాన్ని కంటి మీద ఉంచడం.
 3. కళ్ళు కడగడానికి చల్లని నీరు ఉపయోగించడం.
 4. కళ్ళు రుద్దకూడదు మరియు 24 గంటల లోపు ఉపశమనం కలుగకపోతే, వైద్యులని సంప్రదించాలి.
 • అలెర్జీ ఉన్నట్లయితే యాంటిహిస్టామైన్  లేదా యాంటి ఇన్ఫ్లమేటరీ కంటి చుక్కలు (eye drops) సూచించబడతాయి.
 • ముఖ్యంగా కళ్ళ నుండి అలెర్జెన్లను బయటకు నెట్టడానికి, పొడి కళ్ళకు లూబ్రికేషన్ కలిగించే (ఆర్టిఫీషియల్ టియర్స్) సూచించబడతాయి.
 • గదిలో చుట్టూ నీళ్ల గిన్నెలను ఉంచడం ద్వారా, సాధ్యమైనంతగా గాలిని తేమగా మార్చడం వలన అది దురదకు కారణమయ్యే పొడి కళ్ళ చికిత్సకు పని చేస్తుంది.

కంటి అంటురోగాల/సంక్రమణ చికిత్సకు యాంటివైరల్ లేదా యాంటిబయోటిక్ కంటి చుక్కలు (eye drops) లేదా ఆయింటిమెంట్లు.వనరులు

 1. Healthdirect Australia. Itchy eyes. Australian government: Department of Health
 2. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Eye burning - itching and discharge.
 3. National Eye Institute. Facts About Dry Eye. U.S. National Institutes of Health [Internet].
 4. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Pink Eye: Usually Mild and Easy to Treat.
 5. National Institute of Aging. [Internet]. U.S. Department of Health and Human Services. Aging and Your Eyes.

కళ్ళ దురద వైద్యులు

Dr. Meenakshi Pande Dr. Meenakshi Pande Ophthalmology
22 वर्षों का अनुभव
Dr. Upasna Dr. Upasna Ophthalmology
7 वर्षों का अनुभव
Dr. Akshay Bhatiwal Dr. Akshay Bhatiwal Ophthalmology
1 वर्षों का अनुभव
Dr. Surbhi Thakare Dr. Surbhi Thakare Ophthalmology
2 वर्षों का अनुभव
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

కళ్ళ దురద కొరకు మందులు

కళ్ళ దురద के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।