లైమ్ వ్యాధి - Lyme disease in Telugu

Dr. Ajay Mohan (AIIMS)MBBS

December 05, 2018

March 06, 2020

లైమ్ వ్యాధి
లైమ్ వ్యాధి

లైమ్ వ్యాధి అంటే ఏమిటి?

లైమ్ వ్యాధి ‘బొర్రెలియా బర్గ్ డార్ఫరి’ (Borrelia burgdorferi) బాక్టీరియావల్ల సంక్రమించేది, ఇది “పినుజుల”నబడే జంతువుల పేను కాటు ద్వారా వ్యాపిస్తుంది. చర్మం మీద ఒక వృత్తాకార నమూనాలో పేనుకాటు దద్దరు వ్యాపిస్తుంది. ప్రారంభ దశల్లోనే నిర్ధారణ అయినట్లయితే, జంతువుల పేను కాటును సులభంగానే నయం చేసుకోవచ్చు. ఈ జంతువుల పేను కాటు రుగ్మత మరీ అంత ప్రమాదకరమైందేమీ కాదు.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

 • దద్దుర్లు (రాష్) - లైమ్ వ్యాధి ప్రారంభ దశల్లో, రుగ్మతలక్షణం సాధారణ దద్దుర్లు అని సులభంగా తప్పుగా అర్థం చేసుకోబడుతుంది. సాధారణంగా జంతువు పేను కుట్టిన 1-2 వారాల తర్వాత దద్దురు (లేదా 'ఎరిథామా మైగ్రన్స్') కనబడ్డం జరుగుతుంది. ఇది సాధారణంగా దురద పెట్టదు లేదా బాధాకరమైనదీ కాదు, కాని ఒక నెలపాటు నిరంతరంగా ఉంటుంది.
 • ఇతర లక్షణాలు - దద్దుర్లుతోపాటుగా, కీళ్లనొప్పి, జ్వరం మరియు అలసట కలుగుతాయి, ఈ లక్షణాలన్నీ భయపెట్టే సమస్యలుగా పరిగణించబడవు, తీవ్రంగా పరిగణించబడవు.

లైమ్ వ్యాధి యొక్క తరువాతి దశ మరియు మరింత అభివృద్ధి దశలలో, లక్షణాలు మరింత సంక్లిష్టతను ప్రదర్శిస్తాయి మరియు ఆందోళన కలిగించేవిగా ఉంటాయి. వీటిలో కొన్ని లక్షణాలు ఇలా ఉంటాయి.

 • తీవ్రమైన అలసట
 • బాధాకరంగా నొప్పిని కల్గించే మెడ లేక మెడలో పెడసరం
 • జ్వరం (ఫీవర్)
 • ముఖ పక్షవాతం / పాల్సీ
 • అంత్య భాగాల వద్ద జలదరింపుతో కూడిన బాధ
 • నిరంతర (పెర్సిస్టెంట్) జ్వరం

లైమ్ వ్యాధిలో లక్షణాలు మరియు వ్యాధిపరిస్థితులు శాశ్వతంగా ఉండనప్పటికీ, అవి  కొన్నిసార్లు చాలా బాధాకరంగా ఉంటాయి, పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే చివరికి ప్రమాదస్థితికి చేరుకొంటే ఆ స్థితిని భరించడం కష్టం. ప్రమాదకర దశ (అడ్వాన్స్ దశ) లక్షణాలు

 • నాడీ సంబంధిత రుగ్మతలు
 • అవయవాల విస్తృతమైన పక్షవాతం లేదా తిమ్మిరి
 • కీళ్ళనొప్పి, కీళ్లవాపు (ఆర్థ్రయిటిస్) కు దారితీసింది

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

లైమ్ వ్యాధికి బొర్రెలియా బర్గ్ డార్ఫరి’ అనే బాక్టీరియా జంతువుల్లోని పేను యొక్క కాటు ద్వారా మనుషులకు సోకుతుంది. జంతువుల పేను కొరికినపుడు స్పిరోచెటెస్ బాక్టీరియా మనిషి శరీరానికి బదిలీ అవుతుంది. ఇది రక్తప్రసరణలోకి ప్రవేశిస్తుంది, అటు పైన పేర్కొన్న వ్యాధి లక్షణాలను కలుగజేస్తుంది.

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

వ్యక్తి జంతువు పేను (టిక్) కాటుకు గురైన తర్వాత ఒకటి, రెండు వారాల్లో దద్దురు కనిపించినట్లయితే, వీలైనంత త్వరగా వైద్యుడువద్దకెళ్లి చికిత్స, సలహా తీసుకోవాల్సి ఉంటుంది. ఎరిథీమా మైగ్రాన్స్ అనేది ఒక ప్రత్యేక దద్దుర్లు రకం, ఇది కేవలం జంతు పేనులు  (టిక్స్) కరిచినపుడు మాత్రమే సంభవిస్తుంది. ఈ పేను కాటు దద్దురు ఒక వృత్తాకార నమూనాను, లేక ఇనుము కన్నును పోలి ఉంటుంది. ఈ వ్యాధిని యాంటీబయాటిక్స్ మందులతో సులభంగా చికిత్స చేయగలరు.

వ్యాధి లక్షణాలను నిర్లక్ష్యం చేయబడిన అంత్య దశలలో, వైద్యులు నిర్ధారణ కోసం పాలిమరెస్ చైన్ రియాక్షన్ (PCR) పరీక్షను కూడా సిఫార్సు చేయవచ్చు.

డాక్సిసైక్లిన్, అమోక్సిసిలిన్, లేదా సీఫ్రోక్సీమ్ ఆక్సెటిల్ వంటి మందులు ప్రారంభ దశల్లోనే ఉపయోగించబడతాయి. నరాల లేదా గుండె-సంబంధ రుగ్మతల (కార్డియాక్ పరిస్థితుల) రోగులకు, నరాలకు మందుల్ని ఎక్కించి (ఇంట్రావీనస్) చికిత్స చెస్తారు. సాధారణంగా పెన్సిలిన్ లేదా సెఫ్ట్ రియాగ్జోన్ (ceftriaxone) తో బాటు యాంటీబయాటిక్స్ మందులు సూచించబడతాయి.వనరులు

 1. American Lyme Disease Foundation. [Internet]. United States; Lyme Disease.
 2. National Health Service [Internet] NHS inform; Scottish Government; Lyme disease.
 3. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Lyme Disease.
 4. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Signs and Symptoms of Untreated Lyme Disease.
 5. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Lyme disease.

లైమ్ వ్యాధి వైద్యులు

Dr Rahul Gam Dr Rahul Gam Infectious Disease
8 वर्षों का अनुभव
Dr. Arun R Dr. Arun R Infectious Disease
5 वर्षों का अनुभव
Dr. Neha Gupta Dr. Neha Gupta Infectious Disease
16 वर्षों का अनुभव
Dr. Lalit Shishara Dr. Lalit Shishara Infectious Disease
8 वर्षों का अनुभव
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

లైమ్ వ్యాధి కొరకు మందులు

లైమ్ వ్యాధి के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।