లింఫోమా - Lymphoma in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

December 05, 2018

March 06, 2020

లింఫోమా
లింఫోమా

లింఫోమా అంటే ఏమిటి?

లైంఫోమా అనేది ఒక రకమైన క్యాన్సర్, దీనిలో లింఫోసైట్ కణాలు మరణించకుండా అనియంత్రంగా పెరుగుతూ ఉంటాయి. దీని వలన వాటి సంఖ్య బాగా పెరిగి శరీరమంతా  చేరిపోవడం (పోగుపడడం) జరుగుతుంది.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

లింఫోమా కొన్ని ప్రారంభ లక్షణాలను చూపుతుంది, కానీ అవి సాధారణంగా నిర్లక్ష్యం చేయబడతాయి లేదా సాధారణ ఆరోగ్య సమస్యలుగా భావింపబడతాయి. కొన్ని ప్రారంభ లక్షణాలు క్రింద ఇవ్వబడ్డాయి:

 • మెడ లేదా గజ్జల లేదా చంకల యొక్క లింఫ్ నోడ్ల (శోషరస గ్రంథుల) వాపు
 • అలసట
 • అస్థిరమైన లేదా మధ్య మధ్యన వచ్చే జ్వరం
 • రాత్రి సమయంలో చెమటలు పట్టడం
 • ఆకస్మిక మరియు అర్ధం కాని బరువు నష్టం
 • ఆకలి తగ్గుదల
 • జుట్టు ఊడుట

అయితే, నిర్లక్ష్యం చేస్తే, లక్షణాలు తీవ్రముగా మరియు మరింత విశేషముగా/ప్రత్యేకముగా మారుతాయి. కొన్ని చివరి దశ లక్షణాలు

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

లింఫోసైట్లు, అనగా, తెల్ల రక్త కణాలు (white blood cells), ఇవి బయటి ముప్పులకు/ప్రమాదాలకు వ్యతిరేకంగా పనిచేసే రోగనిరోధక శక్తికి కారణమైనవి. వివిధ కారణాల వలన చాలా అధిక సంఖ్యలో పెరుగుతాయి.

లింఫోసైట్లు అంత అధికంగా పెరగడానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియలేదు, మరియు కారణం గురించి తెలుసుకోవడానికి అధ్యయనాలు జరుగుతున్నాయి. వయస్సు మరియు లింగం వంటి కొన్ని అంశాలు క్యాన్సర్ యొక్క ప్రమాదాన్ని కలిగిస్తాయని అంచనా వేయబడుతున్నాయి, అయితే ఇప్పటి వరకు అవి సరైనవే అని నిరూపణ జరుగలేదు.

ఊబకాయం, క్యాన్సర్, మద్యపానం, ధూమపానం, రేడియేషన్ మరియు పొగాకు వంటివి తెలిసినటువంటి క్యాన్సర్ కారకాలు వాటిని నివారించవచ్చు.

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

లింఫ్ క్యాన్సర్ను సూచించే లక్షణాల ఆధారంగా, వైద్యులు లేదా హీమాటోపథాలజిస్ట్ (hematopathologist), అనియంత్రంగా పెరుగుతున్న కణాల యొక్క రకాన్ని గుర్తించడానికి మరియు వాటిని పరిశీలించడానికి బయాప్సీని (జీవాణుపరీక్ష) సిఫార్సు చేస్తారు.

లింఫోమా కణాలను గుర్తించిన తరువాత, శరీరంలోని ప్రభావిత ప్రాంతాలను గుర్తించడానికి కంప్యూటింగ్ టోమోగ్రఫీ (CT) లేదా మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (MRI) తో పాటు ఛాతీ ఎక్స్- రేలు మరియు రక్త పరీక్షలు వంటి పరీక్షలు నిర్వహించబడతాయి.

చికిత్సా విధానాలు క్యాన్సర్ దశపై ఆధారపడి ఉంటాయి.

ప్రారంభ దశల్లో అత్యంత సాధారణ చికిత్స మందులు మాత్రమే; అయితే, తరువాతి దశల్లో, కీమోథెరపీ మరియు రేడియేషన్ ఉంటాయి. క్యాన్సర్ ఉన్న B- కణాలను లక్ష్యంగా చేసుకుని వాటిని నివారించే రిట్యుక్సిమాబ్ (rituximab) వంటి మందులు  ఇటువంటి దశల్లో ఉపయోగకరంగా ఉంటాయి. రోగనిరోధక వ్యవస్థలో లోపం (immune deficiency) అధికంగా ఉన్న ప్రత్యేక సందర్భాలలో, వైద్యులు ఎముక మజ్జ (bone marrow) లేదా మూల కణ (stem cell) మార్పిడి (transplant) ని నిర్వహిస్తారు, ఇది కొత్త మరియు ఆరోగ్యకరమైన రోగనిరోధక (ఇమ్యూన్) కణాలను నిర్మించడానికి (మెరుగుపరచడానికి) సహాయపడుతుంది.వనరులు

 1. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Lymphoma.
 2. American Cancer Society [Internet] Atlanta, Georgia, U.S; Lymphoma.
 3. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Lymphoma.
 4. National Cancer Institute [Internet]. Bethesda (MD): U.S. Department of Health and Human Services; Lymphoma—Patient Version.
 5. National Cancer Institute [Internet]. Bethesda (MD): U.S. Department of Health and Human Services; Lymphoma—Health Professional Version Patient Version TREATMENT.

లింఫోమా వైద్యులు

David K Simson David K Simson Oncology
11 वर्षों का अनुभव
Dr. Nilesh Ranjan Dr. Nilesh Ranjan Oncology
3 वर्षों का अनुभव
Dr. Ashok Vaid Dr. Ashok Vaid Oncology
31 वर्षों का अनुभव
Dr. Ashu Abhishek Dr. Ashu Abhishek Oncology
12 वर्षों का अनुभव
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

లింఫోమా కొరకు మందులు

లింఫోమా के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।