గుండెవాపు (పెరికార్డయిటిస్) - Pericarditis in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

December 14, 2018

March 06, 2020

గుండెవాపు
గుండెవాపు

గుండెవాపు (పెరికార్డయిటిస్) అంటే ఏమిటి?

‘పెరికార్డియం’ అనేది గుండె యొక్క ఉపరితలంపై రెండు పొరల (డబుల్ లేయర్డ్) తో కూడిన ఓ తిత్తి. ఈ తిత్తి ఎర్రబడడం, మంటకుగురవడం, మరియు వాపుదేలడాన్నే “గుండెవాపు” లేక “పెరికార్డిటిస్” అని పిలుస్తారు. దీన్నే “గుండె వెలుపలి పొర వాపు” అని కూడా పిలుస్తారు. కొన్నిసార్లు, అదనపు ద్రవాలు పెర్సికార్డియల్ పొరల్లో  క్రోడీకరించబడతాయి, దీన్నే “పెరీకార్డియల్ ఎఫ్యూషన్: గా పిలుస్తారు. గుండెవాపు లేదా పెరికార్డిటిస్ సాధారణంగా అకస్మాత్తుగా సంభవిస్తుంది మరియు మూడు నెలల తర్వాత తగ్గిపోతుంది. ఇది అన్ని వయస్సుల వారికి వస్తుంది కానీ సాధారణంగా 16 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వయసు మధ్యలో ఉండే పురుషులలోనే గుర్తించవచ్చు.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

పెరికార్డిటిస్ అనేది ఛాతీ నొప్పికి కారణమవుతుంది, ఈ ఛాతీ నొప్పి చాలా తీవ్రమైన, పదునైన నొప్పిగా ఉంటుంది. మరియు ఇది దగ్గినప్పుడు, మింగినపుడు, మరియు లోతైన శ్వాస తీసుకున్నపుడు మరింతగా తీవ్రమైన నొప్పిగా మారుతుంది. గుండెవాపు యొక్క ఇతర లక్షణాలు:

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

ఈ వ్యాధి కారణం ఎక్కువగా తెలియదు కాని ఇది తరచుగా కింది కారకారణాల వల్ల వస్తుంది:

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

గుండెవాపు నిర్ధారణకు ఉపయోగించే పరీక్షలు క్రింది విధంగా  ఉంటాయి:

 • ఇమేజింగ్ పరీక్షలు
  ఇమేజింగ్ పరీక్షల్లో ఛాతీ మరియు గుండె ఎంఆర్ఐ , ఛాతీ ఎక్స్- రే, ఎకోకార్డియోగ్రామ్, ఎలెక్ట్రోకార్డియోగ్రామ్ మరియు గుండె యొక్క సిటి (CT) స్కాన్ ను కలిగి ఉంటుంది.
 • ల్యాబ్ పరీక్షలు
  గుండె కండరాలకు అయిన హానిని పరీక్షించేందుకుట్రోపోనిన్ ఐ టెస్ట్, సూక్ష్మజీవుల ఉనికి కోసం రక్తం సాగు పరీక్ష, పూర్తి రక్త గణన, టబుర్కులైన్ చర్మ పరీక్ష, హెచ్ఐవి (HIV) పరీక్ష, యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీ టెస్ట్ మరియు ఎరైత్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ పరీక్షల్ని ఈ ల్యాబ్ పరీక్షల్లో చేస్తారు.

చికిత్సా విధానం కారణం మీద ఆధారపడి ఉంటుంది. ఈ కారణం మీద ఆధారపడిన చికిత్సలు కిందివిధంగా ఉంటాయి:

 • సంక్రమణ రకం ఆధారంగా మందులు
  యాంటీబయాటిక్స్ ను బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు కోసం, శిలీంధ్ర వ్యాధులకు యాంటీ ఫంగల్ మందులు మరియు వైరల్ ఇన్ఫెక్షన్ల కోసం యాంటివైరల్స్ ఉపయోగిస్తారు.
 • ఇతర మందులు
  శరీరంలో జమైన ద్రవం తొలగించడానికి ప్రెడ్నిసోన్ (prednisone) వంటి కార్టికోస్టెరాయిడ్స్ మరియు మూత్రకారక మందుల్ని వాడడం జరుగుతుంది.
 • పెరికార్డియోసెంటిసిస్ (Pericardiocentesis)
  ఇందులో సూది ఉపయోగించి ద్రవాన్నితొలగించే ప్రక్రియ ఉంటుంది.
 • పెరికార్డిఎక్టోమీ (Pericardiectomy)
  ఇది తీవ్రమైన సందర్భాల్లో ఉపయోగించే శస్త్రచికిత్స మరియు పెరికార్డియమ్ యొక్క దెబ్బతిన్న భాగం యొక్క తొలగింపును కలిగి ఉంటుంది. దీన్ని దీర్ఘకాలిక గుండె వాపు చికిత్సకు మాత్రమే ఉపయోగిస్తారు.వనరులు

 1. Cleveland Clinic. [Internet]. Cleveland, Ohio. Pericarditis.
 2. National Health Service [Internet]. UK; Pericarditis.
 3. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Pericarditis.
 4. National Health Portal [Internet] India; Pericarditis.
 5. Dababneh E, Siddique MS. Pericarditis. [Updated 2019 Apr 9]. In: StatPearls [Internet]. Treasure Island (FL): StatPearls Publishing; 2019 Jan-.

గుండెవాపు (పెరికార్డయిటిస్) కొరకు మందులు

గుండెవాపు (పెరికార్డయిటిస్) के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।