టెస్టోస్టెరాన్ ఒక స్టెరాయిడ్ హార్మోన్. పురుషులు మరియు మహిళలలో శృంగార కణాలు ఏర్పడటానికి అవసరమైయ్యే శృంగార అవయవాల యొక్క బీజాగ్రంధుల (gonads) నుండి టెస్టోస్టెరాన్ ఉత్పత్తి మరియు విడుదల అవుతుంది. టెస్టోస్టెరాన్ ఉత్పత్తి చేసే ప్రధాన అవయవాలు మగవారిలో వృషణాలు(పునరుత్పత్తి వ్యవస్థలో వీర్యకణాలు ఉత్పత్తి చేసే అవయవం) మరియు ఆడవారిలో అండాశయాలు (పునరుత్పత్తి వ్యవస్థలో అండం ఉత్పత్తి చేసే అవయవం). ఈ అవయవాలు పిట్యూటరీ హార్మోన్ల ప్రభావంతో పనిచేస్తాయి.

టెస్టిస్టెరోన్ శరీరానికి చాలా ముఖ్యం. ఇది ముఖ జుట్టు పెరుగుదల,గొంతులో మార్పు, కండరాల పెరుగుదల,మొదలైన వాటిలో పురుష లక్షణాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. వివిధ అధ్యయనాలు మరియు వాటి సమీక్ష వ్యాసాలు ఇది భౌతిక బలం, శరీరంలో మంచి కొలెస్ట్రాల్ యొక్క నిర్వహణ, ఎముకల పెరుగుదల, మెదడు-నైపుణ్యాలు, లైంగిక వాంఛ మెరుగుపరుచుట, అంగస్తంభన పనితీరు, కొవ్వు పెరుగుడల తగ్గించడం, మూడ్ ని పెంచటం మరియు ఇన్సులిన్ హార్మోన్ పై శరీర సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది.

టెస్టోస్టెరోన్ స్థాయిలలో తగ్గుదల పురుషులలో సాధారణంగా 40 ఏళ్ల వయస్సు తరువాత మరియు మహిళల్లో మెనోపాజ్ (మహిళల్లో ఋతు చక్రాల శాశ్వత ముగింపు) తర్వాత కనిపిస్తుంది. తక్కువ సీరం టెస్టోస్టెరోన్ స్థాయిల యొక్క ఇతర కారణాలు వృషణాల వైఫల్యం, గవదబిళ్ళలు, రక్తంలో అధిక ఇనుము స్థాయిలు, గాయపడిన వృషణాలు, ఊబకాయం, ఒత్తిడి, అధిక కొలెస్ట్రాల్, కెమోథెరపీ, రేడియేషన్ థెరపీలు, హెచ్ఐవి-ఎయిడ్స్, పిట్యూటరీ గ్రంథి యొక్క లోపాలు మొదలైనవి. తక్కువ సీరం టెస్టోస్టెరోన్ చాలా శారీరక విధులను చాలా ప్రభావితం చేస్తుంది ఇది వృద్ధాప్య పురుషులు మరియు మహిళలు (రుతువిరతి తరువాత) ఆరోగ్య సమస్యగా ఉంది.

తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిలు చికిత్స కోసం వైద్యున్ని సంప్రదించవలసి వచ్చినప్పటికీ, శరీరంలో టెస్టోస్టెరోన్ ఉత్పత్తిని మెరుగుపరచడానికి మీరు క్రింది ఉన్న కొన్ని వాటిని కూడా ప్రయత్నించవచ్చు. మహిళల్లో, టెస్టోస్టెరోన్ అనేది లైంగిక కోరిక, ఎముక ఆరోగ్యం, మానసిక స్థితి మరియు శ్రేయస్సు మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

  1. బరువు తగ్గుదల టెస్టోస్టెరోన్ను పెంచుతుంది - Weight loss increases testosterone in Telugu
  2. వ్యాయామం టెస్టోస్టెరాన్ స్థాయిలు పెంచుతుంది - Exercise boosts testosterone levels in Telugu
  3. నిద్ర టెస్టోస్టెరోన్ను పెంచుతుంది - Sleep increases testosterone in Telugu
  4. టెస్టోస్టెరోన్ను పెంచడానికి ఒత్తిడిని వదిలించుకోండి - Release stress to increase testosterone in Telugu
  5. టెస్టోస్టెరోన్ను పెంచడానికి ఆరోగ్యకరమైన కొవ్వులు - Healthy fat to boost testosterone in Telugu
  6. టెస్టోస్టెరాన్ను పెంచడానికి విటమిన్ డి - Vitamin D to boost testosterone in Telugu
  7. అధిక టెస్టోస్టెరాన్ స్థాయికి జింక్ - Zinc for higher testosterone level in Telugu
  8. తక్కువ మద్యం అధిక టెస్టోస్టెరాన్ - Less alcohol more testosterone in Telugu
  9. టెస్టోస్టెరోన్ను పెంచడానికి మెగ్నీషియం - Magnesium to increase testosterone in Telugu
  10. టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచడానికి గోక్షుర - Gokhru to boost testosterone level in Telugu
  11. టెస్టోస్టెరాన్ను పెంచడానికి శాకాహారం - Vegan diet to increase testosterone in Telugu
  12. పురుష హార్మోన్లను పెంచడానికి అల్లం - Ginger to increase male hormones in Telugu
  13. సహజంగా టెస్టోస్టెరోన్ స్థాయులు పెంచే మెంతులు - Fenugreek as a natural testosterone booster in Telugu
  14. టెస్టోస్టెరాన్ని పెంచే అశ్వగంధ - Ashwagandha as a test booster in Telugu
టెస్టోస్టెరాన్ పెరుగుదలకు గృహ చిట్కాలు వైద్యులు

ఆసియా జర్నల్ ఆఫ్ ఆండ్రోలజీలో, టెస్టోస్టెరోన్ మరియు ఊబకాయం మధ్య ఉన్న సంబంధంపై ఆధారపడిన ఒక పరిశోధన ప్రచురించబడింది. ఆసియన్ జర్నల్ ఆఫ్ ఆండ్రోలజీ సూచించిన దాని ప్రకారం ఊబకాయం ఉన్న పురుషులు సీరం టెస్టోస్టెరోన్ యొక్క తక్కువ స్థాయిని కలిగి ఉంటారు. ఇది ఎందుకు జరుగుతుందంటే ఒక వ్యక్తి ఊబకాయంతో ఉన్నప్పుడు, శరీరం యొక్క ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. ఫలితంగా, టెస్టోస్టెరోన్ కు తగులుకుని ఉండే ప్రోటీన్లు కూడా తగ్గిపోతాయి, తద్వారా శరీరంలో టెస్టోస్టెరోన్ తగ్గిపోతుంది.

అందువల్ల శరీర బరువును తగ్గిస్తే సెరమ్ లో టెస్టోస్టెరోన్ స్థాయి పెరుగుతుంది. మీ ఆసక్తి మరియు శరీర రకానికి అనుగుణంగా విస్తృతమైన శారీరక శ్రమను చెయ్యడం ద్వారా మీరు బరువును సమర్థవంతంగా కోల్పోవచ్చు. పవర్ యోగా, సైక్లింగ్, జాగింగ్, స్విమ్మింగ్, తాయ్ చై వంటి కార్డియో వ్యాయామాలు చెయ్యడం, సమతుల్య ఆహారం తినటం అనేవి ఊబకాయ చికిత్సలో చాలా ప్రభావవంతమైనవి.

(మరింత సమాచారం: ఊబకాయం చికిత్స)
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas T-Boost Capsule by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for problems like low sperm count, muscle weakness, and low testosterone, with excellent results.
Testosterone Booster
₹719  ₹799  10% OFF
BUY NOW

సీరం టెస్టోస్టెరోన్ స్థాయిలపై వ్యాయామం యొక్క ప్రభావం ఆధారంగా జరిపిన ఒక అధ్యయనం, శారీరక శ్రమ మరియు వ్యాయామం రక్త సీరంలో టెస్టోస్టెరోన్ స్థాయిని గణనీయంగా పెంచుతుందని సూచిస్తుంది. వ్యాయామం తర్వాత టెస్టోస్టెరోన్ స్థాయిలలో మార్పులను చూడడానికి 12 నెలల వ్యవధిలో 102 మంది పురుషులపై ఇదే అధ్యయనం జరిగింది.

వ్యాయామం చేసిన తర్వాత పురుషులలో సీరం టెస్టోస్టెరోన్ పెరిగింది. దీనితో పాటు, వ్యాయామం తర్వాత సీరం యొక్క ప్రోటీన్ స్థాయి అనేది శృంగార హార్మోన్లకు అతుక్కొని ఉండి మరియు గుండె యొక్క సామర్ధ్యాన్ని కూడా పెంచుతుంది. అందువల్ల, మీ శారీరక బలాన్ని బట్టి, బరువులు ఎత్తడం లేదా ఒక వ్యాయమ శిక్షకుడిని ఏర్పాటు చేసుకుని క్రమంగా వ్యాయామం చేస్తే, కొంతకాలానికి మీ శరీరంలో టెస్టోస్టెరోన్ స్థాయి సాధారణ స్థాయికి చేరుకుంటుంది

నిద్రిస్తున్నపుడు పురుషుల శరీరంలో టెస్టోస్టెరోన్ మరింత ఎక్కుగా స్రవిస్తుంది. నిద్రలో టెస్టోస్టెరోన్ స్థాయిల ప్రభావాలను పరిశీలించడానికి 2011 లో ఒక అధ్యయనం నిర్వహించబడింది. తక్కువ నిద్ర, నిద్రలేమి లేదా కలత నిద్రతో బాధపడుతున్న వ్యక్తుల్లో టెస్టోస్టెరోన్ స్థాయిలు గణనీయంగా తగ్గుతాయని కనుగొనబడింది.

శరీరంలోని శృంగార హార్మోన్ స్థాయిలను మెరుగుపరిచేందుకు 7-8 గంటలు నిద్రించాలి. ఇది సెరమ్ టెస్టోస్టెరోన్ను పెంచడం లోనే కాక, శరీరం యొక్క అనేక ఇతర ముఖ్యమైన జీవ క్రియలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.

మూడ్ ను పెంచడంలో టెస్టోస్టెరోన్ కు సంబంధం ఉంది అని చెప్తారు. 2013 లో ప్రచురించబడిన ఒక పత్రిక శృంగార హార్మోన్లపై ఒత్తిడి మరియు ఆందోళన యొక్క ప్రభావాన్ని నొక్కిచెప్పింది, అధ్యయనంలో తక్కువ శృంగార ప్రేరణ మరియు తగ్గిన లైంగిక హార్మోన్ల శాతం అనేవి, వ్యాకులత మరియు మానసిక సమస్యలతో బాధపడుతున్న పురుషులు మరియు మహిళలు ఇద్దరిలో కనుగొనబడ్డాయి.

అందువల్ల వ్యాకులత మరియు మానసిక సమస్యలతో బాధపడుతున్న ప్రజలు తక్కువ లైంగిక వాంఛ మరియు లైంగిక హార్మోన్ల తక్కువ స్థాయిలను మెరుగుపరచేందుకు ఒత్తిడిని తగ్గించుకోవాలని సూచిస్తారు.

ఒత్తిడిని విడుదల చేసేందుకు సంగీతం, క్రమమైన నడక, వ్యాయామం, యోగ, ధ్యానం, నృత్యం లేదా ప్రశాంతతని ఇచ్చేవి ఏవైనా వాటి సహాయం తీసుకోవచ్చు. లేదా వైద్యుడిని సంప్రదించవచ్చు. ఇది శరీరంలో టెస్టోస్టెరోన్ యొక్క సాధారణ స్థాయిలకు సహాయపడవచ్చు.

(మరింత సమాచారం: ఒత్తిడి లక్షణాలు)
Shilajeet Capsule
₹719  ₹799  10% OFF
BUY NOW

లైంగిక హార్మోన్ స్థాయిలుపై కొవ్వు ఆమ్లల (fatty acids) సంబంధాన్ని ఆసియన్ జర్నల్ ఆఫ్ ఆండ్రోలజీ ప్రచురించింది. ఇది పోలీఆన్ సాతురేటెడ్ కొవ్వు ఆమ్లాలను (polyunsaturated fatty acids) తీసుకోవడం వాల్ల లైంగిక ఆరోగ్యం మరియు లైంగిక హార్మోన్ల నియంత్రణలో ఉపయోగకరంగా ఉంటుందని సూచించింది. ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ టెస్టోస్టెరాన్ స్థాయిలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని కూడా ఇది చెప్పింది.

టెస్టోస్టెరోన్ స్థాయి మెరుగుపరచడానికి, ఆలివ్ నూనె, కుసుంభ (safflower) నూనె, పామ్ ఆయిల్, కొబ్బరి నూనె వంటి పోలీఆన్ సాతురేటెడ్ కొవ్వు ఆమ్లాలను (polyunsaturated fatty acids) తినవచ్చు. జంక్ ఫుడ్ లో పెద్ద మొత్తాలలో ఉన్న క్రొవ్వు ఆమ్లాలు ఉన్నందున వాటి వినియోగాన్ని నివారించాలని సూచించబడింది.

టెస్టోస్టెరాన్ స్థాయిలలో విటమిన్ డి  అనుబంధకాల ప్రభావాన్నిపరీక్షించేందుకు 200 మంది పురుషులు మీద ఒక అధ్యయనం నిర్వహించారు. తగినంత వ్యాయామంతో పాటు, కొంత కాలం పాటు విటమిన్ D అనుబంధకాలు ఇవ్వబడ్డాయి. విటమిన్ D ఇవ్వని వారితో పోల్చితే ఇచ్చిన వారిలో, టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరిగాయి.

అందువలన, శరీరం లో టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచడానికి, సహజంగా విటమిన్ డి స్థాయిని పెంచడానికి కనీసం 10-15 నిమిషాలు ఉదయం సూర్యరశ్మి తీసుకోవాలని సిఫార్సు చేస్తారు. విటమిన్ డి అనుబంధకాల యొక్క సరైన మోతాదు మరియు వాటిని తీసుకోవాడానికి సరైన సమయం గురించి తెలుసుకోవడానికి వైద్యుడిని సంప్రదించండి.. మీ స్వంత లేదా సూచించబడని మందులు తీసుకోకపోవడమే ఇది ఉత్తమం.

జింక్ శరీరంలో నిల్వ చేయలేని ముఖ్యమైన ఖనిజం. అందువల్ల, జింక్-ఆధారిత ప్రక్రియలు సరిగ్గా పని చేయడానికి వీలుగా ఆహారంలో జింక్ ను క్రమంగా తీసుకోవాలి. పురుషులలో జింక్ మరియు టెస్టోస్టెరాన్ స్థాయిల మధ్య సంబంధాన్ని గుర్తించేందుకు నిర్వహించిన ఒక అధ్యయనం శరీరంలోని జింక్ లోపం అనేది తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిలతో సంబంధం కలిగి ఉందని సూచించింది. అయితే, ఈ అధ్యయనం తక్కువ శ్రేణిలో జరిగింది.

ఇటీవల 2018 లో జర్నల్ ఆఫ్ రిప్రొడక్షన్ అండ్ ఇన్ఫెర్టిలిటీ ద్వారా ప్రచురించబడిన ఒక పత్రిక జింక్ శరీరానికి ముఖ్యమైన మూలకం, ఇది టెస్టోస్టెరోన్ వంటి శరీర హార్మోన్ల సమతుల్యాన్ని కొనసాగించడంలో సహాయపడుతుంది మరియు పురుషుల్లో సంతానోత్పత్తికి చాలా ముఖ్యమైనది అని తెలిపింది.

అందువల్ల, టెస్టోస్టెరోన్ స్థాయిని మెరుగుపరచడానికి మరియు మీ పునరుత్పాదక పనితీరును మెరుగుపర్చడానికి మాంసం, గుడ్లు, కాయలు, చిక్కుళ్ళు (శనగలు, బీన్స్, కాయధాన్యాలు) వంటి జింక్ కలిగిన ఆహార పదార్ధాలు తినాలి. జింక్ మందుల గురించి మరింత తెలుసుకోవడానికి వైద్యుడిని లేదా లైంగిక ఆరోగ్య సమస్యల నిపుణుడిని సంప్రదించవచ్చు

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Energy & Power Capsule by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for problems like physical and sexual weakness and fatigue, with good results.
Power Capsule For Men
₹719  ₹799  10% OFF
BUY NOW

అధికంగా మద్యాన్ని తీసుకోవడం వల్ల పురుష పునరుత్పాదక వ్యవస్థ మరియు దానితో సంబంధం కలిగి ఉన్న హార్మోన్ల పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.

ఆల్కహాల్ మరియు పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థల సమీక్ష వ్యాసం ప్రకారం అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వలన శరీరంలో టెస్టోస్టెరోన్ స్థాయిని తగ్గించడమే కాకుండా ఇతర పునరుత్పాదక హార్మోన్లను కూడా ప్రభావితం చేస్తుంది. అందువల్ల, మద్యపాన సేవనాన్ని పరిమితం చేయడం మంచిది. అనుమతించదగిన పరిమితుల్లో మద్య వినియోగం మీ లైంగిక ఆరోగ్యానికి హానికరంగా పరిగణించబడదు.

మెగ్నీషియం మరొక ముఖ్యమైన ఖనిజము, ఇది శరీరంలో అనేక శక్తి ఉత్పత్తి ప్రక్రియలలో కీలక పాత్ర పోషిస్తుంది. శరీర శారీరక కార్యకలపాలపై మెగ్నీషియం మరియు టెస్టోస్టెరాన్ యొక్క ప్రయోజనాల ఆధారంగా అధ్యయనాల సమీక్ష జరిగింది. మెగ్నీషియం పురుషుల టెస్టోస్టెరోన్ యొక్క చురుకుదనానికి సానుకూల ప్రభావం చూపుతుందని ఇది సూచించింది.

అందువల్ల,మీ ఆహారంలో ఆకుకూరలు, చిక్కుళ్ళు, అరటి, అవోకాడో వంటి పండ్లు, సాల్మోన్, ట్యూనా వంటి సముద్ర ఆహారాలు శరీరంలోని టెస్టోస్టెరోన్ స్థాయిని పెంచడంలో సహాయపడతాయి. మెగ్నీషియం అనుబంధకాలు అవసరమైతే వాటి గురించి తెలుసుకోవడానికి వైద్యున్ని సంప్రదించాలి.

పురుషుల ఆరోగ్యంపై అమెరికన్ జర్నల్ ఆన్ మెన్'స్ హెల్త్ ప్రచురించిన ఒక పత్రిక ప్రకారం "హైపోగోనాడల్ పురుషులలో టెస్టోస్టెరోన్ స్థాయిలను మెరుగుపరుచుకోవటానికి అవసరమయ్యే ఆహార పదార్థాలు" ఏమి చెబుతున్నాయి అంటే, గోక్షుర (caltrops) అని కూడా పిలువబడే ట్రైబులస్ టెరెస్ట్రిస్ (Tribulus terrestris), అనే మొక్క సీరం టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచే ప్రయోజనకరమైన ఒక పుష్పించే మొక్క.

గోక్షుర అనుబంధకాలు ఎప్పుడు, ఎలా తీసుకోవాలో తెలుసుకోవడానికి మీ వైద్యుడిని లేదా ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించాలి.

హార్మోన్ మరియు ఆహారం విధానం మీద క్యాన్సర్ బ్రిటీష్ జర్నల్ ప్రచురించిన ఒక పత్రిక శాకాహార మగవాళ్ళలో టెస్టోస్టెరోన్ స్థాయి ఎక్కువగా ఉందని సూచిస్తుంది. అందువల్ల సంపూర్ణ ధాన్యాలు, చిక్కుళ్ళు, గింజలు, పండ్లు, కూరగాయలు, బంగాళాదుంపలు, వరి, మొక్కజొన్న మొదలైనవి కలిగిన శాకాహారం సీరం టెస్టోస్టెరోన్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది.

శాకాహార విధానం గుడ్లు, పాలు మరియు పాల పదార్దాలు వంటి జంతువుల ఉత్పత్తుల రహితంగా ఉంటాయి . అందువల్ల, ఈ ఆహారం ప్రారంభించే ముందు, శాకాహారాన్ని ఎలా తీసుకోవచ్చో తెలుసుకోవడానికి పోషకాహార నిపుణుడు లేదా వైద్యుడిని సంప్రదించాలి. ప్రజలు శాకాహారాన్ని సరైన విధంగా తీసుకోకపోతే తరచూ పోషకాహార లోపాలతో బాధపడవలసి వస్తుంది. ఇది జంతు-ఆధారిత ఆహార ఉత్పత్తులను తప్పించడం వలన ఏర్పడుతుంది, ఒక పోషకాహార నిపుణుడు / డైషీషియన్ మీ శరీరంలో పోషకాహార లోపాలను నిరోధించడానికి మీకు సహాయం చేస్తారు.

అల్లం ప్రపంచంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే మూలికలలో ఒకటి. మగ డయాబెటిక్ ఎలుకలలో 2013 లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, అల్లం వేర్లు (roots) శరీరంలోని టెస్టోస్టెరోన్ స్థాయిని పెంచడమే కాక, వీర్యం యొక్క నాణ్యతను మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి.

అందువలన, అల్లం తినడం అనేది టెస్టోస్టెరోన్ స్థాయిలు పెంచడానికి సహాయపడవచ్చు. అల్లం టీ, అల్లం ముక్కలు, అల్లమురబ్బాలు మరియు మీ భోజనంలో చిన్న ముక్కలుగా తరిగి అల్లాన్ని జోడించడం వంటి అనేక రూపాలలో అల్లాన్ని తీసుకోవచ్చు.

మెంతులు యొక్క ప్రయోజనాలు ఎన్నో రకాముల ఆరోగ్య స్పృహలలో మెండుగా ప్రసిద్ది చెందాయి.

మెంతుల యొక్క శారీరక అంశాలపై నిర్వహించిన క్లినికల్ అధ్యయనంలో, మెంతుల సారాలు లైంగికవాంఛను మెరుగుపరచడం మరియు శరీరంలో సాధారణ టెస్టోస్టెరాన్ స్థాయిలని నిర్వహించడంలో సహాయపడుతుంది తెలిసింది.

అందువల్ల, మంచి లైంగిక ఆరోగ్యానికి మెంతులను తినవచ్చు. సలాడ్ మీద మెంతులను చల్లుకోవచ్చు లేదా పెరుగుకు వాటిని జోడించి తినవచ్చు. సరియైన మార్గంలో మరియు మెంతుల యొక్క సరైన పరిమాణం గురించి తెలుసుకోవడానికి మీ వైద్యుడిని లేదా ఆయుర్వేద వైద్యున్ని సంప్రదించండి.

ఆయుర్వేదంలో అత్యంత ప్రశంసనీయ మూలికలలో అశ్వగంధ ఒకటి. ఇది చాలా ఆరోగ్య ప్రయోజనాల కోసం విస్తృతంగా ఉపయోగించబడుతుంది.

కండరాల శక్తి మీద అశ్వగంధ ప్రభావాలను అంచనా వేయడానికి 2015 లో నిర్వహించిన ఒక అధ్యయనంలో కండల పెరుగుదలలో మరియు వ్యాయామం తర్వాత కండరాల నష్టం తగ్గుదలలో ఆశ్వగంధ చాలా ప్రభావవంతమైనదని తెలిసింది .

ఆశ్వగంధ తీసుకున్న పురుషుల్లో టెస్టోస్టెరోన్ స్థాయిలు గణనీయంగా పెరిగాయి.

అందువల్ల, టెస్టోస్టెరోన్ను పెంచడానికి ఆయుర్వేద వైద్యుని పర్యవేక్షణలో ఆశ్వగంధను తినవచ్చు.

Dr Bhawna

Dr Bhawna

Ayurveda
5 Years of Experience

Dr. Padam Dixit

Dr. Padam Dixit

Ayurveda
10 Years of Experience

Dr Mir Suhail Bashir

Dr Mir Suhail Bashir

Ayurveda
2 Years of Experience

Dr. Saumya Gupta

Dr. Saumya Gupta

Ayurveda
1 Years of Experience

వనరులు

  1. Vineet Tyagi et al. Revisiting the role of testosterone: Are we missing something? Rev Urol. 2017; 19(1): 16–24. PMID: 28522926
  2. Kelly DM, Jones TH. Testosterone and obesity. Obes Rev. 2015 Jul;16(7):581-606. PMID: 25982085
  3. Zitzmann M. Testosterone and the brain. Aging Male. 2006 Dec;9(4):195-9. PMID: 17178554
  4. Travison TG, Morley JE, Araujo AB, O'Donnell AB, McKinlay JB. The relationship between libido and testosterone levels in aging men. J Clin Endocrinol Metab. 2006 Jul;91(7):2509-13. Epub 2006 May 2. PMID: 16670164
  5. Jerald Bain. The many faces of testosterone. Clin Interv Aging. 2007 Dec; 2(4): 567–576. PMID: 18225457
  6. J. Abram McBride, Culley C. Carson, III, Robert M. Coward. Testosterone deficiency in the aging male. Ther Adv Urol. 2016 Feb; 8(1): 47–60. PMID: 26834840
  7. Institute of Medicine (US) Committee on Assessing the Need for Clinical Trials of Testosterone Replacement Therapy; Liverman CT, Blazer DG, editors. Testosterone and Aging: Clinical Research Directions. Washington (DC): National Academies Press (US); 2004
  8. Peeyush Kumar, Nitish Kumar, Devendra Singh Thakur, Ajay Patidar. Male hypogonadism: Symptoms and treatment. J Adv Pharm Technol Res. 2010 Jul-Sep; 1(3): 297–301. PMID: 22247861
  9. Davis SR1, Wahlin-Jacobsen S. Testosterone in women--the clinical significance.. Lancet Diabetes Endocrinol. 2015 Dec;3(12):980-92. PMID: 26358173
  10. Goldstat R, Briganti E, Tran J, Wolfe R, Davis SR. Transdermal testosterone therapy improves well-being, mood, and sexual function in premenopausal women. Menopause. 2003 Sep-Oct;10(5):390-8. PMID: 14501599
  11. Mark Ng Tang Fui, Philippe Dupuis, Mathis Grossmann. Lowered testosterone in male obesity: mechanisms, morbidity and management. Asian J Androl. 2014 Mar-Apr; 16(2): 223–231. PMID: 24407187
  12. Sakamoto K, Wakabayashi I, Yoshimoto S, Masui H, Katsuno S. Effects of physical exercise and cold stimulation on serum testosterone level in men. Nihon Eiseigaku Zasshi. 1991 Jun;46(2):635-8. PMID: 1890772
  13. Rachel Leproult, Eve Van Cauter. Effect of 1 Week of Sleep Restriction on Testosterone Levels in Young Healthy MenFREE. JAMA. 2011 Jun 1; 305(21): 2173–2174. PMID: 21632481
  14. Jenna McHenry, Nicole Carrier, Elaine Hull, Mohamed Kabbaj. Sex Differences in Anxiety and Depression: Role of Testosterone. Front Neuroendocrinol. 2014 Jan; 35(1): 42–57. PMID: 24076484
  15. Zarrouf FA, Artz S, Griffith J, Sirbu C, Kommor M. Testosterone and depression: systematic review and meta-analysis. J Psychiatr Pract. 2009 Jul;15(4):289-305. PMID: 19625884
  16. Pilz S et al. Effect of vitamin D supplementation on testosterone levels in men. Horm Metab Res. 2011 Mar;43(3):223-5. PMID: 21154195
  17. Prasad AS, Mantzoros CS, Beck FW, Hess JW, Brewer GJ. Zinc status and serum testosterone levels of healthy adults. Nutrition. 1996 May;12(5):344-8. PMID: 8875519
  18. Emanuele MA, Emanuele N. Alcohol and the male reproductive system. Alcohol Res Health. 2001;25(4):282-7. PMID: 11910706
  19. Steels E, Rao A, Vitetta L. Physiological aspects of male libido enhanced by standardized Trigonella foenum-graecum extract and mineral formulation. Phytother Res. 2011 Sep;25(9):1294-300. PMID: 21312304
  20. Wankhede S, Langade D, Joshi K, Sinha SR, Bhattacharyya S. Examining the effect of Withania somnifera supplementation on muscle strength and recovery: a randomized controlled trial. J Int Soc Sports Nutr. 2015 Nov 25;12:43. PMID: 26609282
Read on app