ఆలివ్ ఆయిల్ మరియు పోషణ

ఆలివ్ నూనె మధ్యధరా వంటకాలు యొక్క అంతర్భాగమైనది కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరోగ్య స్పృహ ఉన్న ప్రతి వ్యక్తి యొక్క వంటగది ప్రియంగా మారింది. ఇది పట్టణ వంటగదిలో "ఒక ధోరణి" లేదా నూతన "వస్తువు" లా ప్రసిద్ధి కాకపోవచ్చు కానీ అది కాదు నమ్మండి. ఆలీవ్లు మరియు ఆలివ్ నూనె చాలా పొడవైన మరియు ఆసక్తికరమైన చరిత్రను కలిగి ఉన్నాయి.

మీరు  చరిత్ర ఔత్సాహికులు  లేదా క్రీడా ప్రేమికులు  అయితే ఒలింపిక్ క్రీడల గురించి ఖచ్చితంగా విని ఉండవచ్చు. ప్రాచీన గ్రీకు క్రీడల విజేతలకు ఒలీవ్ పుష్పగుచ్ఛములు ఇవ్వబడుతాయని మీకు తెలుసా? అవును, అది పత్రబరిచినిది మరియు సత్యం, కానీ మీరు ఆలివ్ ను ట్రోఫీగానో ఐకానిక్గానో ఏమి చేస్తారో అని ఆశ్చర్యపోవచ్చు? గ్రీకు పురాణంలో ఆలివ్ చెట్టు దేవత "ఎథీనా" నుండి బహుమతిగా భావించబడిందని మీకు తెలుసు. ఒకవేళ మీకు, ఎథీనా జ్ఞానం మరియు ధైర్యం యొక్క దేవత అని తెలియకపోవచ్చు. ఏథెన్సు నగరం ఎథీనా పేరు మీద నిర్మించబడి ఉంది. సహజముగా, ఆలివ్ చెట్టు మరియు దాని కొమ్మలు అత్యధికంగా గౌరవించబడ్డాయి. వాస్తవానికి గ్రీకులు ఇప్పటికీ ఆలివ్ను సంపద చిహ్నంగా భావిస్తారు. ఏథెన్స్ 2004 వేసవి ఒలింపిక్స్ విజేతలు ఆలివ్ కొమ్మల పుష్పగుచ్చాలు అందుకున్నారు.

ఆలివ్ నూనెను "గొప్ప వైద్యుడు" అని వైద్య నిపుణుడైన హిప్పోక్రేట్స్ పిలుస్తారు. కాబట్టి, ఆలివ్ దాని ఔషధ మరియు వైద్యం లక్షణాలకు ప్రసిద్ది చెందిందని చెప్పడం సురక్షితం.

చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, ఆలివ్ చెట్టు పెంపకం యొక్క పురాతన రికార్డులు 7000 సంవత్సరాల క్రితం నుండి వచ్చాయి. 3000 సంవత్సరాల నాటి ఆలివ్ చెట్టు యొక్క పురావస్తు నమూనాలు గ్రీసు దేశంలో కనుగొనబడ్డాయి. ప్రాచీన గ్రీకు సాహిత్యంలో ఆలివ్ల యొక్క ఔషధ మరియు వైద్యం యొక్క ప్రయోజనాలు కనుగొనబడ్డాయి. వాస్తవానికి, ప్రాచీన గ్రీకు రచయిత అయిన హోమర్, ఆలివ్ ఆయిల్ కోసం "ద్రవ బంగారం" అనే పదాన్ని ఉపయోగించాడు

గ్రీకులు తమ ద్రవ బంగారాన్ని రక్షిచడంలో మరియు కాపాడడంలో ఒంటరిగా లేరని తెలుసుకోవటానికి మీరు ఆశ్చర్యపోతారు. ఖురాన్లో ఆశీర్వదింపబడిన పండుగా ఆలివ్ పండు ప్రస్తావించబడింది మరియు బైబిల్ పాత నిబంధనలో కూడా ఈ పండ్లు ప్రస్తావించబడ్డాయి. ఈజిప్షియన్లు మమ్మిఫికేషన్ (mummification) విధానాలలో ఆలివ్ ఆకులు ఉపయోగించారు. ఈ అద్భుతమైన పండు ప్రపంచంలోని దాదాపు ప్రతి ప్రధాన దేశాలకి చేరుకుంది మరియు కూరగాయల నూనె, సన్ఫ్లవర్ ఆయిల్, లేదా సాచురేటెడ్ నూనెలు వంటి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా చేరింది.

  1. ఆలివ్ నూనె ఉపయోగాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలు - Olive oil uses and health benefits in Telugu
  2. మంచి ఆలివ్ నూనెను ఎంపిక చెయ్యడం ఎలా? - How to identify good olive oil in Telugu
  3. రోజుకి ఎంత ఆలివ్ నూనెను తీసుకోవచ్చు - How much olive oil to take per day in Telugu
  4. అదనపు నిర్మలమైన ఆలివ్ నూనె మరియు దాని ఉపయోగాలు - Extra virgin olive oil and its uses in Telugu
  5. ఆలివ్ నూనె దుష్ప్రభావాలు - Olive Oil Side Effects in Telugu

మనలో చాలా మందిఆలివ్ నూనె సీసాలను వంటగదిలో ఉంచి మరియు రోజువారీ వంటలో ఉపయోగిస్తారు. కానీ ఈ పాక ఆనందం వంటగదికే పరిమితం కాదు. ఆలివ్ నూనె ఆరోగ్యంపై బాగా ప్రయోజనకరమైన ప్రభావాలను కలిగి ఉంది. మీరు ఆలివ్ నూనె యొక్క వంట అవసరంలేని కొన్ని ఉపయోగాలు అన్వేషించండి.

  • జుట్టు కోసం: ఆలివ్ నూనె జుట్టును  మృదువుగా, ఆరోగ్యకరముగా మరియు మెరిసేలా  చేసి జుట్టుకి సరైన పోషణ అందించడానికి సహాయపడుతుంది.
  • చర్మం మరియు ముఖం కోసం: ఆలివ్ నూనె చర్మం కోసం అద్భుతమైన ఔషధంగా పని  చేస్తుంది, దీనిలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి ఆలివ్ నూనె చర్మం మృదువుగా మారుటకు  సహాయపడుతుంది మరియు చర్మాన్ని పోషిస్తుంది. అలాగే చర్మంపై మచ్చలు మరియు ముడుతలను తొలగించటానికి సహాయపడుతుంది.
  • గుండె కోసం: ఆలివ్ నూనె యొక్క గొప్ప యాంటీఆక్సిడెంట్ శాతం ఉండడం వలన ఆహారంలో తీసుకున్నప్పుడు, శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి మరియు గుండె వైఫల్యంపై  పోరాడటానికి సహాయపడుతుంది.ఆలివ్ నూనె యొక్క క్రమమైన వినియోగం గుండె జబ్బులు, ఎథెరోస్క్లెరోసిస్ మరియు స్ట్రోక్ వంటి హృదయ సంబంధ రుగ్మతల ప్రమాదాన్ని తగ్గిస్తుంది, ఇది HDL కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.
  • మధుమేహం కోసం: ఆలివ్ నూనె తీసుకోవడం అనేది మధుమేహ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది మరియు రక్త గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడం ద్వారా మధుమేహ నిర్వహణలో సహాయపడుతుందని కనుగొన్నారు.
  • కడుపు పుండ్ల కోసం: కొన్ని అధ్యయనాలు ఆలివ్ నూనె వాడకం హెచ్. పైలోరి (H.pylori) జాతులకి వ్యతిరేకంగా యాంటిమైక్రోబయల్ ప్రభావాన్ని కలిగి ఉందని, అది కడుపు పుండ్ల యొక్క నిర్వహణలో ప్రభావవంతంగా ఉంటుందని తెలిపాయి.
  • పిల్లల కోసం: ఆలివ్ నూనెను  పిల్లల చర్మంపై మర్దన చెయ్యడం వలన వారి చర్మం  మృదువుగా మారుతుంది మరియు డైపర్ దద్దుర్లు ఉపశమనకారిగా సమర్థవంతంగా సహాయపడుతుంది .
  • క్యాన్సర్ వ్యతిరేకకారిగా: ఆలివ్ నూనెలో ఉండే  యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ పెరుగుదల మరియు సంభావ్య నిరోధించడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్థాయి .

జుట్టు కోసం ఆలివ్ నూనె - Olive oil for hair in Telugu

ఆలివ్ నూనె వినియోగదారులు ఈ నూనె యొక్క జుట్టును పోషించే మరియు జుట్టుకు తేమని పెంచే ప్రయోజనాలను గురించి మాట్లాడటానికి ఇష్టపడతారు. వైద్య విద్వాంసులు ప్రకారం, ఆలివ్ నూనె స్క్వలెన్ (squalene) మరియు ఆలీక్ యాసిడ్ వంటి బయోకెమికల్స్ తో అధికంగా ఉంటుంది, ఇవి జుట్టు మీద మృదువైన ప్రభావాన్ని కలిగించేలా ఉంటాయి. ఆలివ్ నూనెలో ఉన్న కొవ్వులు మరియు విటమిన్స్ జుట్టుకు మంచి పోషకాహార కర్తలుగా పనిచేస్తాయి. ఆలివ్ నూనెను క్రమంగా ఉపయోగిస్తే మీ పొడి మరియు పొరలుగా విడిపోయే చర్మన్ని వదిలించుకోవటం కోసం సహాయపడుతుంది. అదనంగా, ఇది మీ జుట్టు ఫోలికల్స్ (follicles) ను పోషింస్తుంది. మీ జుట్టును మృదువుగా మరియు ప్రకాశించేలా చేస్తుంది.

Women Health Supplements
₹719  ₹799  10% OFF
BUY NOW

ముఖం మరియు చర్మ సౌందర్యం కోసం ఆలివ్ నూనె - Olive oil benefits for face and skin in Telugu

మీకు తెలుసా?

ఆలివ్ నూనెలో చరిత్ర ఉత్తమంగా ఉంచిన అందం యొక్క రహస్యంగా ఉంది. ఈ నూనెతో గ్రీకులు మరియు రోమన్లు ​​స్నానం చేసినట్లు చెబుతారు. ఆలివ్ నూనెను క్లియోపాత్రా యొక్క సుగంధ ద్రవ్యాలలో ఒక సమగ్ర భాగంగా ఉపయోగించడం జరుగింది. వాస్తవానికి, ఆలివ్ నూనెలో ఉన్న కొవ్వులు మీ ముఖం మరియు చర్మం కోసం ఒక అద్భుతమైన మాయిశ్చరైజర్గా చేస్తాయి. అంతర్జాతీయ ఆలివ్ కౌన్సిల్ ప్రకారం, ఆలివ్ నూనె విటమిన్ A, D, E మరియు K లలో సమృద్ధిగా ఉంటుంది, ఇవి ఆలివ్ నూనె ను ఒక అద్భుతమైన యాంటియోక్సిడెంట్గా చేస్థాయి. అంతేకాకుండా, ఆలివ్ నూనెలో స్క్వాలేన్ (ఒక రసాయనిక సమ్మేళనం) ఎక్కువ మొత్తంలో ఉంటుంది, ఇది బాగా తెలిసిన ఒక యాంటియోక్సిడెంట్. ఈ లక్షణాలు అన్ని కలిసి మీ చర్మాన్ని పోషించి మరియు మృదువుగా చేయడమే కాక, ముఖం పై అన్ని గీతలు మరియు నల్లని మచ్చలు తొలగించి మీ ముఖానికి ఒక మంచి ప్రకాశించే లుక్ ని ఇస్తాయి. కొంత మంది ప్రజల పై జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, ఆలివ్ నూనె తో కూడిన మధ్యధరా ఆహార విధానం పాటించే ప్రజలతో పోలిస్తే ఒలివ్ నూనె తీసుకోని ప్రజలలో అథెరోస్క్లెరోసిస్ (ఆర్టెరీలలో ఫలకాలు) వచ్చే అవకాశం ఎక్కువ ఉందని, మధ్యధరా ఆహారం యొక్క ఈ ప్రత్యేక ఆరోగ్య ప్రయోజనం కోసం ఆలివ్ నూనెలో ఉండే పాలిఫినోల్స్ బాధ్యత వహించవచ్చని సూచించబడింది. అయితే, ఆలివ్ నూనె యొక్క ప్రయోజనాలను పూర్తిగా మీ వైద్యుని సలహా తీసుకోవడం ఉత్తమం.

గుండె కోసం ఆలివ్ నూనె - Olive oil for heart in Telugu

ఒక ప్రముఖ పత్రిక సమీక్షా ప్రకారం, ఆలివ్ నూనె మోనోసంతరేటెడ్ కొవ్వులతో (మంచి కొవ్వులు) సమృద్ధిగా ఉంటుంది, ఇది సాధారణ కూరగాయ నూనెల్లో కొవ్వులకు మంచి ప్రత్యామ్నాయం. ఆలీవ్ నూనెను క్రమంగా ఉపోయోగిస్తే శరీరంలో HDL కొలెస్ట్రాల్ లేదా మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుందని చెప్పబడింది. అదనంగా, పాలీఫెనోల్స్ అనేది ఆలివ్ నూనెలో ఉండే యాంటియోక్సిడెంట్స్ యొక్క వర్గము, ఇవి ఫ్రీ రాడికల్ నష్టం నుండి శరీరాన్ని రక్షించాయి. ఇప్పుడు, మీరు ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా?  ఫ్రీ రాడికల్స్ శరీరం యొక్క వివిధ జీవక్రియ చర్యలు మరియు ఒత్తిడి మరియు కాలుష్యం వంటి కారకాలు ఫలితంగా శరీరంలో ఏర్పడిన రియాక్టివ్ ఆక్సిజన్ జాతులు. ఈ ఆక్సిజన్ జాతులు శరీరంలో తక్కువ-సాంద్రత కొలెస్టరాల్ (LDL) లేదా చెడ్డ కొలెస్ట్రాల్తో కలుపుకొని గొలుసు ప్రభావాన్ని ప్రారంభిస్తాయి. LDL ఆక్సీకరణం చెందుతున్నప్పుడు, ఫలక రూపంలో (plaques) ఆర్టెరీస్ గోడలపై చేరడం మొదలవుతుంది. ఈ ఫలకం అప్పుడు ఈ రక్త నాళాలను ఇరుకుగా చేసి మరియు గుండె మీద ఒత్తిడి పెరుగుదలకు కారణమవుతుంది. ఇది పరిస్థితి గుండెపోటు మరియు స్ట్రోక్స్ రూపంతో ముగుస్తుంది. అదృష్టవశాత్తూ, పాలీఫెనోల్స్ ఫ్రీ రాడికల్స్ ను శుభ్రపరచడమే కాకుండా అవి LDL కొలెస్టరాల్ స్థాయుల్ని తగ్గిస్తాయి, అందుచే సాధారణ గుండె వ్యాధుల ప్రమాదాన్నికూడా తగ్గిస్తాయి

ఆలివ్ నూనె ఒక యాంటీఇన్ఫ్లమేటరీ ఏజెంట్ - Olive oil as an anti-inflammatory agent in Telugu

ఆర్థరైటిస్, డయాబెటిస్, కొన్ని హృదయ వ్యాధులు, క్యాన్సర్ వంటి వ్యాధుల్లో, చాలామందికి వాపు రావాడాన్ని వైద్యులు గమనించారు. దీర్ఘకాలిక వాపు (నెమ్మదిగా వ్యాపించి ఎక్కువ కాలం ఉండే ఒక రకమైన వాపు)వెనుక సైన్స్ గురించి చాలా వరకు అర్థం కాలేదు. కానీ, శాస్త్రవేత్తలు దీర్ఘకాలిక పరిశోధనతో ఆహార పద్ధతులు ముఖ్యమైన పాత్రను కలిగి ఉన్నాయని నమ్ముతున్నరు. అయినప్పటికీ, కీళ్ళనొప్పులు వంటి వ్యాధుల రోగులలో వాపు లక్షణాలు (కీళ్ళువాపు మరియు నొప్పి) అసౌకర్యానికి ప్రధాన కారణం. ఆలివ్ నూనెలో ఉన్న ఓలిఒకేన్తాల్ (oleocanthal) (ఒక సహజ రసాయన సమ్మేళనం), శక్తివంతమైన యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. మరింత అధ్యయనం, స్వచ్ఛమైన ఆలివ్ నూనె యొక్క యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు సాధారణంగా ఉపయోగించే యాంటీఇన్ఫ్లమేటరీ మందులకు చాలా పోలికలు ఉన్నాయ్ అని సూచించింది. ఒకవేళ వాపు బాధపడుతున్నట్లయితే, ఏ రూపంలోనైనా ఆలివ్ నూనె తీసుకునే ముందు మీ వైద్యునితో మాట్లాడడం ఉత్తమం.

మధుమేహం కోసం ఆలివ్ నూనె - Olive oil for diabetes in Telugu

అధిక రక్త షుగర్ స్థాయిలు మొదట గొప్ప మరియు ఉన్నతి వర్గాల ప్రజల లక్షణంగా మాత్రమే ఉండేవి, కానీ ఇప్పుడు డయాబెటిస్ సమాజంలోని అన్ని వర్గాల ప్రజల్లోనూ దాని మూలాలను విస్తరించుకుంది. వైద్యులు ప్రకారం, ఈ పరిస్థితి పట్టణ జనాభా యొక్క అసహజ ఆహార ఎంపికల కారణమని చెప్పవచ్చు. రక్తంలో పెరిగిన చక్కెర స్థాయిలను నిర్వహించడం కష్టమే కాదు, అవి వ్యక్తి యొక్క జీవితాన్ని కొంతవరకు దుర్బలంగా చేస్తాయి. స్పెయిన్లో ఇటీవలి అధ్యయనాలు ఒకమోస్తరు మధ్యధరా ఆహారం తీసుకునే వ్యక్తులుకు డయాబెటిస్ అభివృద్ధి చెందే అవకాశాలు తక్కువగా ఉన్నారని పేర్కొన్నాయి. మరో అధ్యయనం ప్రకారం మధ్యధరా ఆహారం, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే ఇన్సులిన్ ద్వారా రక్తంలో గ్లూకోస్ స్థాయుల్ని తగ్గిస్తుందని సూచించబడింది. ఈ ఆహారం పూర్తిగా ఆలివ్ నూనె ఆధారితమైనది, ఇది వ్యాధి యొక్క తీవ్రతను తగ్గించడంలో పరోక్షంగా సహాయపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాన్ని కలిగి ఉంది. అయితే, వాపు మరియు మధుమేహం మధ్య ప్రత్యక్ష సంబంధం ఇప్పటికీ స్పష్టంగా లేదు కానీ అంతర్గత వాపు మధుమేహవ్యాధి యొక్క కారక ఏజెంట్లలో ఒకటిగా ఊహించబడింది. ఒకవేళ మీరు మధుమేహంతో జీవిస్తుంటే, మీ పోషకాహార నిపుణుడితో మాట్లాడి మీ ఆహారంలో ఆలివ్ నూనెను చేర్చడం ఎల్లప్పుడూ మంచిది. 

కడుపు పుండ్ల కోసం ఆలివ్ నూనె - Olive oil for stomach ulcers in Telugu

మీకు తెలుసా?

మీ మయోన్నైస్ మరియు సలాడ్లలో ఉండే ఆలివ్ నూనె సాధారణ ఆహారపదార్ధాల ద్వారా వచ్చే వ్యాధికారక క్రిముల నుండి రక్షిస్తుంది! ఆచ్యర్యం కదా?  స్వచ్ఛమైన ఆలివ్ నూనె యొక్క సజల సారం ఒక అద్భుతమైన యాంటీమైక్రోబయాల్ ఏజెంట్ అని అధ్యయనాలు సూచిస్తున్నాయి. స్వచ్ఛమైన ఆలివ్ నూనె, ప్రాసెస్ చేసిన ఆహారాలకు జోడించినప్పుడు, సాల్మోనెల్లా (Salmonella) మరియు లిస్టిరియా (Listeria) వంటి బాక్టీరియాను చంపడంలో ప్రభావవంచూపింది. ఎంత మంచిది కదా? స్వయంగా రక్షించే ఆహారం. కానీ అది దానికి సూచించిన షెల్ఫ్ జీవితం దాటి కాదు.కాబట్టి ఉపయోగించేముందు ముందు దయచేసి లేబుల్లను తనిఖీ చేయండి. అదనంగా, ఆలివ్ నూనెలో ఉన్న పాలీఫెనోల్స్ ఈ నూనె యొక్క యాంటీ బాక్టీరియల్ లక్షణాలకి బాధ్యత వహిస్తాయి. లాబ్ అధ్యయనాలు, ఆలివ్ నూనె హేలియోబొకేటర్ పిలోరి (Heliobacter pylori) అనే బాక్టీరియా ను చంపడంలో ప్రభావవంతంగా ఉంటుందని పేర్కొంది, ఇది పెప్టిక్ అల్సర్స్ (కడుపులో పుండ్లు) యొక్క కారక ఏజెంట్. అయినప్పటికీ, కడుపు పూతల\పుండ్ల యొక్క చికిత్సలో ఆలివ్ నూనె ప్రభావాన్ని అంచనా వేయడానికి నిర్ధారణా పరిశోధన (confirmatory research) కొనసాగుతోంది. కాబట్టి, మీరు ఈ పూతల నుండి బాధపడుతుంటే, ఆలివ్ నూనె తీసుకునే ముందు మీ వైద్యుని తో మాట్లాడడం అవసరం.

మెదడు పనితీరు మెరుగుపరిచేందుకు ఆలివ్ నూనె - Olive oil for improving brain function in Telugu

ఆలివ్ నూనె మిమ్మల్ని తెలివిగా చేయగలదని మీకు తెలుసా? మధ్యధరా ఆహారం మీద ఇటీవలి అధ్యయనాలు ఆలివ్ నూనె మెదడు పనితీరును మరియు జ్ఞానత (మెదడు యొక్క జ్ఞాపక శక్తి మరియు అర్థం చేసుసుకునే సామర్థ్యం) ను మెరుగుపరుస్తుందని తెలుపుతున్నాయి. తదుపరి అధ్యయనాలు ఆలివ్ ఆయిల్ యొక్క రోజువారీ వినియోగం మెమోరీని మెరుగుపరుస్తుందని మరియు మెదడులో ఫలకం ఏర్పడే అవకాశాలను తగ్గిస్తుందని సూచిస్తుంది. మెదడు ఫలకాలు (plaques) నిజానికి మెదడులో ప్రోటీన్ డిపాజిట్లను కలిగి ఉంటాయి, ఇది అల్జీమర్స్ వంటి నరాల సంబంధిత రుగ్మతలకు దారి తీస్తుంది. అయితే, అల్జీమర్స్ చికిత్సల్లో ఆలివ్ నూనెను అమలు చేయడానికీ, ఖచ్చితమైన పనితీరు మరియు పద్ధతులను అర్థం చేసుకోవడానికి ఇప్పటికీ అధ్యయనాలు జరుగుతున్నాయి. కాబట్టి, మెదడు ఆరోగ్యంపై ఆలివ్ నూనె యొక్క ప్రయోజనకరమైన ప్రభావాలను గురించి మరింత తెలుసుకోవడానికి మీ వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

చంటి పిల్లల కోసం ఆలివ్ నూనె - Olive oil for babies in Telugu

మనం అందరం చంటి పిల్లలుగా ఉన్నపుడు కచ్చితంగా ఆలివ్ నూనె తో మసాజ్ చేయించుకొని ఉంటాము. కావాలంటే మీరు మీ తల్లిగారిని అడగవచ్చు. ఆలివ్ నూనెను ఒక శిశువు మసాజ్ నూనెగా విస్తృతంగా ఉపయోగిస్తారు. మీరు ఎందుకు అని ఆలోచిస్తున్నారా? ఆలివ్ నూనె శిశువుల చర్మంపై మెత్తగా, మృదువుగా మరియు తేమవంటి ప్రభావం చూపుతుందని న్యాయవాదులు కూడా వాదించారు. ఇది పిల్లలను సాకి మరియు ఎక్కువ గాలి తగలకుండా చేస్తుందని చెప్తారు. ఆలివ్ నూనె సాధారణంగా డైపర్ చేసే దద్దుర్ల చికిత్సకు ఉపయోగిస్తారు. కాబట్టి ఇది ఆలీవ్ నూనెను పిల్లల నూనెల యొక్క రాజుగా చేసింది. అయితే, కొందరు పిల్లలు సహజంగా సున్నితమైన చర్మం కలిగి ఉంటారు, మీ బిడ్డకు ఒక ఆలివ్ నూనె మసాజ్ ఇచ్చే ముందు మీ డాక్టర్తో మాట్లాడటం మంచిది.

ఆలివ్ నూనె యొక్క యాంటీక్యాన్సర్ సామర్ధత - Olive oil anticancer potential in Telugu

క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా మానవ మరణానికి ప్రధాన కారణాలలో ఒకటిగా ఉద్భవించింది. WHO ప్రకారం, ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందిన దేశాలలో క్యాన్సర్కు ప్రధానమైన కారణాలు ఆహార ఎంపికలు మరియు జీవనశైలి. అనేక సానుకూల ఫలితాల (పాజిటివ్ రిజల్ట్స్) తో ఆలివ్ నూనె యొక్క యాంటీక్యాన్సర్ లక్షణాలను పరీక్షించడానికి అనేక మానవ మరియు జంతు అధ్యయనాలు నిర్వహించబడ్డాయి. ఆలివ్ నూనెలో ఉన్న పాలీఫెనోల్స్ క్యాన్సర్ కణాలను చంపి, క్యాన్సర్ పెరుగుదలను ఆపగలవని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాకుండా,క్యాన్సర్ తో భాదపడుతున్న వారిలో మధ్యధరా ప్రజల సంఖ్య గణనీయంగా తక్కువగా ఉండటం గమనించబడింది. మధ్యధరా ఆహారంలో ఉన్న అధిక ఆలివ్ నూనె దీనికి కారణం కావచ్చునని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఆలీవ్లులు మరియు ఆలివ్ నూనె యొక్క యాంటీక్యాన్సర్ లక్షణాలను అర్థం చేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి.

ఆలివ్ చెట్టు మధ్యధరా ప్రాంతానికి చెందినది మరియు ఇది ఆగ్నేయ యూరప్, పశ్చిమ ఆసియా మరియు ఆఫ్రికాలోని కొన్ని భాగాల్లో వ్యాపించింది. సాంప్రదాయకంగా, ఆలివ్ నూనెను ఆలివ్ చెట్టు (Olea europaea) యొక్క పండు నుండి చల్లని వత్తిడి (cold pressing) లేదా రాతి వత్తిడి (stone pressing) పద్ధతుల ద్వారా పొందవచ్చు. కానీ సాంకేతిక పరిజ్ఞానంవేగంగా పెరగడం వల్ల, వేగవంతమైన మరియు మెరుగైన పరికరాలు పాత పద్ధతులను భర్తీ చేస్తున్నాయి.

ఆలివ్ నూనె నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆలివ్ నూనె రుచి నూనె బ్యాచ్ తయారీలో ఉపయోగించిన ఆలివ్ల యొక్క రకం మరియు పరిపూర్ణత బట్టి మారవచ్చు. సాధారణంగా, పండు పక్వానికి చేరినదాని బట్టి, నూనె చేదు ఆధారపడి ఉంటుంది. పక్వానికి చేరిన స్థాయి బట్టి నూనె రంగు ఆకుపచ్చ నుండి ఆకుపచ్చనిబంగారురంగులోకి మారుతుంది.

కాబట్టి మీరు ఆలివ్ నూనె అనేక ప్రయోజనాలను చదివిన తర్వాత ఇప్పుడు మీ మొదటి సీసాని బయటకు వెళ్లి, తెచ్చుకోవాలని కోరుకోవచ్చు. కానీ మీరు మార్కెట్లో అందుబాటులో ఉన్న అనేక రకాలను చూసి కచ్చితంగా కంగారు పడవచ్చు. స్థానిక మరియు అంతర్జాతీయ బ్రాండ్లు చాలా రకాలైన స్వచ్ఛత మరియు ప్రమాణాల యొక్క వివిధ వాదనలతో ఆలివ్ నూనెను అమ్ముతాయి. కాబట్టి, అటువంటి సందర్భంలో మీరు ఆకట్టుకునే మొదటి సీసా కోసం చూడరాదు. ఆలివ్ నిపుణులు ముదురు రంగు సీసాలు లేదా టిన్స్ ను కొనుగోలు చేసేందుకు సలహా ఇస్తారు, ఇవి నూనెను ప్రత్యక్ష కాంతికి బహిర్గతం చేయవు. ఎందుకంటే కాంతి మరియు ఆక్సిజన్ను నూనె సీసాకి ప్రత్యక్షంగా బహిర్గతం చేయడం వలన నూనె నాణ్యత తగ్గించడంలో ప్రత్యక్ష ప్రభావం

ఉంటుంది. అదనంగా, ఒక మంచి గ్రేడ్ ఆలివ్ నూనె మీ నోటిలో ఫలారుచిని, లేత కూరగాయలు మరియు గడ్డి రుచిని కలిగి ఉంటుంది. మీరు మింగివేసినప్పుడు అది ఘాటుగా ఉండి తరువాత చేదు రుచిని కలిగిస్తుంది. మీరు ఏదైనా దుర్వాసనను గమనించినట్లయితే దాన్ని నివారించడం మంచిది.

ఫుడ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ప్రకారం, USAలో రోజుకు 15-20 gm ఆలివ్ నూనెను తీసుకుంటారు. అయితే, అదే ప్రకటనలో, ఈ ఆలివ్ నూనె మీ సాతురేటెడ్ కొవ్వుకు ప్రత్యామ్నాయంగా ఉండాలి కానీ అదనపు సప్లిమెంట్గా కాదు అని తెలిపారు. అంటే మీరు సాధారణ నూనెకు ఆలివ్ నూనెను ప్రత్యామ్నాయం చేయాలికానీ ఒక ఔషధంగా ఈ నూనె త్రాగడానికి ఉపయోగించరాదు. ఎందుకంటే ఆలివ్ నూనె చాలా ఆరోగ్య ప్రయోజనాలను కలిగిఉంది, కానీ ఇది కొవ్వులలో ఇంకా ఎక్కువగా ఉంది. మీ శరీరానికి కొవ్వులు కొంచెం మోతాదులోనే అవసరమవుతాయి కనుక, ఆలివ్ నూనె ఎక్కువగా తీసుకోకూడదు. ఆలివ్ నూనెను ఉపయోగించటానికి సరైన పద్ధతి గురించి మీ వైద్యుడిని అడగడం చాలా అవసరం ; అప్పుడు మీరు దాని నుండి గరిష్ట ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

అదనపు నిర్మలమైన ఆలివ్ నూనె అనే పదం దాని ఉత్పత్తి ప్రక్రియను సూచిస్తుంది. అదనపు నిర్మలం అనేది ఒక రకమైన ఆలివ్ నూనె యొక్క గ్రేడ్, ఇది శుద్ధి చేయనిది. పైగా ఇది ఉత్తమమైన ఆలివ్ నూనెగా పరిగణించబడుతుంది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, ఆలివ్ నూనెలోని కొన్ని ముఖ్యమైన రసాయన సమ్మేళనాలను తొలగించడం ద్వారా శుద్ధి చేయబడుతుంది. కాబట్టి, తక్కువగా శుద్ధి చేసిన ఆలివ్ నూనె ఎక్కువ ఆరోగ్యకరమైనది. వివిధ ఇటాలియన్ మరియు గ్రీకు వంటకాలలో ఆలివ్లను ఒక వంట పదార్ధంగా నేరుగా ఉపయోగిస్తారు. ఆలివ్ నూనెను వంట కోసమే కాక ఇతర ఉత్పత్తులైన సబ్బులు, షాంపూలు మరియు కండిషనర్లు మరియు కొన్నిసౌందర్య ఉత్పత్తుల తయారీ కూడా ఉపయోగిస్తారు.

Kumariasava
₹382  ₹425  10% OFF
BUY NOW

ఆలివ్ నూనెను సమయోచిత వాడిన తర్వాత చర్మపు అలెర్జీల వచ్చినట్లు కొన్ని నివేదించబడిన కేసులు ఉన్నాయి. కాబట్టి, ఒకవేళ మీకు అంతర్గతంగా సున్నితమైన లేదా జిడ్డుగల చర్మం ఉంటే, మీ చర్మంపై ఆలివ్ నూనెను ఉపయోగించే ముందు మీ వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. ఆలివ్ నూనె తామర మరియు సోరియాసిస్ వంటి కొన్ని చర్మ పరిస్థితులను మరింత తీవ్రతరం చేస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కాబట్టి,ఏమైనా చర్మంవ్యాధుల కోసం ఆలివ్ నూనె ఉపయోగించే ముందు చర్మవైద్యున్ని సంప్రదించడం మంచిది.

గర్భధారణ సమయంలో ఆలివ్ నూనెను వాడవచ్చు అనడానికి తగినంత సాక్ష్యాలు లేవు. కాబట్టి, గర్భిణీ స్త్రీలు వారి ఆహారంలో ఆలివ్ నూనె జోడించే ముందు వారి డాక్టర్ తో మాట్లాడడం ఉత్తమం. ఆలివ్ నూనె ఒక సహజ హైపోగ్లైసిమిక్ (రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది) కాబట్టి డయాబెటిక్ ప్రజలు ఆలివ్ నూనె యొక్క ఖచ్చితమైన మోతాదుని గుర్తించడానికి వారి వైద్యులను అడిగి తెలుసుకోవాలి.

వనరులు

  1. Nektaria Tsantila et al. Antithrombotic and Antiatherosclerotic Properties of Olive Oil and Olive Pomace Polar Extracts in Rabbits. Mediators Inflamm. 2007; 2007: 36204. PMID: 18253466
  2. Estruch R. Effects of a Mediterranean-style diet on cardiovascular risk factors: a randomized trial.. Ann Intern Med. 2006 Jul 4;145(1):1-11. PMID: 16818923
  3. Lucas L1, Russell A, Keast R. Molecular mechanisms of inflammation. Anti-inflammatory benefits of virgin olive oil and the phenolic compound oleocanthal.. Curr Pharm Des. 2011;17(8):754-68. PMID: 21443487
  4. Beauchamp GK et al. Phytochemistry: ibuprofen-like activity in extra-virgin olive oil. Nature. 2005 Sep 1;437(7055):45-6. PMID: 16136122
  5. Kastorini CM1, Panagiotakos DB. Dietary patterns and prevention of type 2 diabetes: from research to clinical practice; a systematic review. Curr Diabetes Rev. 2009 Nov;5(4):221-7. PMID: 19531025
  6. Medina E1, Romero C, Brenes M, De Castro A. Antimicrobial activity of olive oil, vinegar, and various beverages against foodborne pathogens. J Food Prot. 2007 May;70(5):1194-9. PMID: 17536679
  7. Lin YK1, Al-Suwayeh SA, Leu YL, Shen FM, Fang JY. Squalene-containing nanostructured lipid carriers promote percutaneous absorption and hair follicle targeting of diphencyprone for treating alopecia areata. Pharm Res. 2013 Feb;30(2):435-46. PMID: 23070602
  8. World Health Organization [Internet]. Geneva (SUI): World Health Organization; Diet, nutrition and the prevention of cance.
  9. Fabiani R. Anti-cancer properties of olive oil secoiridoid phenols: a systematic review of in vivo studies. Food Funct. 2016 Oct 12;7(10):4145-4159. PMID: 27713961
  10. Trichopoulou A1, Lagiou P, Kuper H, Trichopoulos D. Cancer and Mediterranean dietary traditions. Cancer Epidemiol Biomarkers Prev. 2000 Sep;9(9):869-73. PMID: 11008902
  11. Owen RW1, Haubner R, Würtele G, Hull E, Spiegelhalder B, Bartsch H. Olives and olive oil in cancer prevention. Eur J Cancer Prev. 2004 Aug;13(4):319-26. PMID: 15554560
  12. Martínez-Lapiscina EH. Mediterranean diet improves cognition: the PREDIMED-NAVARRA randomised trial. J Neurol Neurosurg Psychiatry. 2013 Dec;84(12):1318-25. PMID: 23670794
Read on app