థైరాయిడ్ క్యాన్సర్ - Thyroid Cancer in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

January 11, 2019

October 29, 2020

థైరాయిడ్ క్యాన్సర్
థైరాయిడ్ క్యాన్సర్

థైరాయిడ్ క్యాన్సర్ అంటే  ఏమిటి?

థైరాయిడ్ గ్రంథి యొక్క క్యాన్సర్ నే “థైరాయిడ్ క్యాన్సర్” అంటారు. థైరాయిడ్ గ్రంథి స్వరపేటిక కింద, మెడ యొక్క ముందు భాగంలో ఉంటుంది. థైరాయిడ్ గ్రంధి శరీరంలో వివిధ జీవక్రియ విధుల నియంత్రణ బాధ్యతను నిర్వహిస్తుంది. థైరాయిడ్ గ్రంధి యొక్క కణాల అనియంత్రిత పెరుగుదల ఓ ద్రవ్యరాశి లేదా కణితి ఏర్పడి, ఆ తర్వాత అదే కణితి థైరాయిడ్ క్యాన్సర్ కు దారితీస్తుంది.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

థైరాయిడ్ క్యాన్సర్ యొక్క అన్ని వైద్యకేసులు ప్రారంభం నుండీనే వ్యాధి లక్షణాలను చూపించవు; అయినప్పటికీ, థైరాయిడ్ క్యాన్సర్ యొక్క ప్రారంభ లక్షణాలు మరియు సంకేతాలలో అత్యంత సాధారణమైనవి కిందివిధంగా ఉంటాయి:

  • మెడ ముందు ఒక గడ్డ లేదా ముద్ద (చాలా సందర్భాలలో కనిపించదు)
  • శ్వాసలో లేదా మ్రింగుటలో సమస్యలు
  • కంఠము బొంగురుపోవడం
  • గొంతు లేదా మెడ ప్రాంతంలో నొప్పి మరియు దగ్గు
  • జుట్టు రాలడం (హెయిర్ ఫాల్)
  • ఆకలి కోల్పోవడం మరియు బరువు నష్టం
  • గొంతు ప్రాంతంలో వాపు
  • చెమట పట్టడం
  • వేడి వాతావరణానికి అసహనం
  • రుతుక్రమం అసమానతలు

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

థైరాయిడ్ క్యాన్సర్ కు కొన్ని వంశపారంపర్య కారకాలు లేదా జన్యువులు కారకమని భావిస్తున్నారు; అయితే, థైరాయిడ్ క్యాన్సర్ కు ప్రధాన కారణం ఇంకా తెలియదు. చాలా వైద్య కేసుల్లో థైరాయిడ్ క్యాన్సర్ కు దారి తీసే చాలా సాధారణ కారకాలు గుర్తించబడ్డాయి.

ఒక ముఖ్యమైన కారకం ఆన్కోజెన్లు మరియు కణితి నిరోధక జన్యువుల మధ్య అసమతుల్యత. మానవ శరీరంలోని క్యాన్సర్ కణాల పెరుగుదలకు ఆన్కోజీన్లు బాధ్యత వహిస్తాయి మరియు కణితిని అణిచివేసే జన్యువులు క్యాన్సర్ కణాల పెరుగుదలను నివారిస్తాయి లేదా సరైన సమయంలో క్యాన్సర్ కణాల మరణానికి తోడ్పడి కాన్సర్ కణితి వృద్ధిని  నివారిస్తుంది.

థైరాయిడ్ క్యాన్సర్ అభివృద్ధికి దోహదం చేసే ఇతర అంశాలు:

  • ఊబకాయం
  • థైరాయిడ్ క్యాన్సర్ యొక్క కుటుంబ చరిత్ర
  • రేడియేషన్ కు బహిర్గతమవడం
  • వంశపారంపర్యంగా కుటుంబంలో వచ్చే అడినోమాటోస్ పోలీపోసిస్

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

థైరాయిడ్ క్యాన్సర్ అభివృద్ధిలో సూచించిన సంకేతాలు లేదా లక్షణాలను చూసినట్లయితే, ఆ వ్యక్తి డాక్టర్ను చూడాలి. ఖచ్చితమైన కారణాన్ని కనుగొని, థైరాయిడ్ క్యాన్సర్ కోసం తనిఖీ చేయటానికి కొన్ని పరీక్షలు ఉన్నాయి. ఈ పరీక్షలు:

  • రక్త పరీక్ష - థైరాయిడ్ ఫంక్షన్ పరీక్షగా పేరు పొందిందీ రక్త పరీక్ష, రక్తప్రవాహంలో అసాధారణ థైరాయిడ్ హార్మోన్ల కోసం తనిఖీ చేయబడుతుంది ఈ రక్తపరీక్ష. ఈ పరీక్షలో పెరిగిన స్థాయి పాయింట్లు థైరాయిడ్ క్యాన్సర్ యొక్క ఒక సంభావ్య పరిస్థితిని సూచిస్తాయి.
  • జీవాణుపరీక్ష (బయాప్సి)
  • ఎంఆర్ఐ (MRI) స్కాన్
  • సిటి (CT) స్కాన్

థైరాయిడ్ క్యాన్సర్ విషయంలో వ్యాధిని నిర్ణయించిన తర్వాత, వైద్యులు పరిస్థితి (క్యాన్సర్ తీవ్రత మరియు విస్తృతిని గుర్తించడం)ని దశలవారీగా చేసుకొని చికిత్సను అందిస్తారు. థైరాయిడ్ క్యాన్సర్ విషయంలో ప్రాథమిక మరియు అత్యంత సాధారణ చికిత్స ప్రక్రియలో కొన్ని కిందివిధంగా ఉంటాయి:

  • రేడియోధార్మిక (radioactive) అయోడిన్ చికిత్స
  • థైరాయిడైక్టోమి - థైరాయిడ్ లేదా దానిలోని భాగాన్ని తొలగించడానికి శస్త్ర చికిత్స (సర్జరీ)
  • రేడియోథెరపీ
  • కీమోథెరపీ.



వనరులు

  1. National Health Service [Internet]. UK; Thyroid cancer.
  2. American Cancer Society [Internet] Atlanta, Georgia, U.S; About Thyroid Cancer.
  3. National Institutes of Health; National Cancer Institute. [Internet]. U.S. Department of Health & Human Services; Thyroid Cancer—Patient Version.
  4. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Thyroid Cancer.
  5. Quang T. Nguyen et al. Diagnosis and Treatment of Patients with Thyroid Cancer. Am Health Drug Benefits. 2015 Feb; 8(1): 30–40. PMID: 25964831

థైరాయిడ్ క్యాన్సర్ వైద్యులు

Dr. Anil Heroor Dr. Anil Heroor Oncology
22 Years of Experience
Dr. Kumar Gubbala Dr. Kumar Gubbala Oncology
7 Years of Experience
Dr. Patil C N Dr. Patil C N Oncology
11 Years of Experience
Dr. Vinod Kumar Mudgal Dr. Vinod Kumar Mudgal Oncology
10 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

థైరాయిడ్ క్యాన్సర్ కొరకు మందులు

Medicines listed below are available for థైరాయిడ్ క్యాన్సర్. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.

Medicine Name

Price

₹1500.0

₹93000.0

₹1006964.71

Showing 1 to 0 of 3 entries