టైఫాయిడ్ జ్వరం - Typhoid Fever in Telugu

టైఫాయిడ్ జ్వరం
టైఫాయిడ్ జ్వరం

సారాంశం

టైఫాయిడ్ అనేది ‘సాల్మొనెల్లా టైఫి’ బ్యాక్టీరియ వల్ల కలిగే ఒక సాంక్రమిక విషక్రిమికారక వ్యాధి. టైఫాయిడ్ తో బాధ  పడుతున్న రోగికి జ్వరం, కడుపు నొప్పి, తలనొప్పి, ఆకలి లేకపోవటం, గులాబీ రంగు మచ్చలేర్పడ్డం వంటి వ్యాధి లక్షణాలుంటాయి. సాధారణంగా రుతుపవనాలకు (ముంగారు వర్షాలు) ముందుకాలం, వర్షాకాలం సీజన్లో మరియు వర్షాకాలం తర్వాత టైఫాయిడ్ వ్యాపిస్తుంటుంది. ఈ వ్యాధి ఒకరి నుండి మరొకరికి మలం ద్వారా, మరియు నోటి మార్గం ద్వారా  వ్యాపిస్తుంది. అందువల్ల, మలపరీక్ష (స్టూల్ టెస్ట్) ద్వారా రోగి టైఫాయిడ్ విషక్రిమితో (బ్యాక్టీరియాతో) బాధపడుతున్నాడా లేదా అన్న దాన్ని నిర్ధారించడం జరుగుతుంది. యాంటీబయాటిక్స్ మందులుపయోగించి టైఫాయిడ్ జ్వరానికి వైద్యులు పూర్తి చికిత్స చేస్తారు. చికిత్స చేయకపోతే, ప్రమాదకరమైన అంతర్గత రక్తస్రావం, కుళ్ళకం (సెప్సిస్) లాంటి  సమస్యలకు దారి తీస్తుంది. అరుదైన సందర్భాల్లో సరైన సమయంలో చికిత్స పొందని  టైఫాయిడ్ జ్వరం వల్ల మరణం కూడా సంభవించవచ్చు.

టైఫాయిడ్ అంటే ఏమిటి? - What is Typhoid Fever in Telugu

టైఫాయిడ్ మరియు ‘ప్యారాటైఫాయిడ్’ (paratyphoid) జ్వరాలను సమిష్టిగా ‘పేగు జ్వరం’ అని పిలుస్తారు. క్రిమి సంబంధమైన జ్వరమిది. ‘సాల్మొనెల్ల ఎంటేరికా’ కు చెందిన వివిధ జాతుల సూక్ష్మవిషక్రిములైన టైఫి, ప్యారాటైఫి-ఎ, బి మరియూ సి ల కారణంగా దాపురించే ఒక సాధారణ అంటువ్యాధి ఈ టైఫాయిడ్ జ్వరం. ఆరంభంలో ఇది మీ జీర్ణ వ్యవస్థను దెబ్బ తీస్తుంది. కానీ చికిత్స చేయకుండా అట్లే అశ్రద్ధగా వదిలేస్తే ఈ పరిస్థితి తీవ్రంగా మారి రోగి శరీరం యొక్క వివిధ అవయవాలకు వ్యాపిస్తుంది. తద్వారా, ఇది తీవ్రమైన ప్రమాదాలకు దారితీయవచ్చు, అది ప్రాణాంతకమూ  కావచ్చు.

టైఫాయిడ్ యొక్క లక్షణాలు - Symptoms of Typhoid Fever in Telugu

కలుషితమైన ఆహారాన్ని తీసుకున్న తరువాత, బాక్టీరియా మనిషి జీర్ణ వ్యవస్థలోకి ప్రవేసించి విపరీతంగా వృద్ధి చెందుతుంది. దీనితో టైఫాయిడ్ ప్రేరేపించబడి కింద చెప్పబడిన లక్షణాలు విపరీతమవుతూ ఉంటాయి.

​​ఈ దశలోనే త్వరపడి చికిత్స చేయకపోతే, లక్షణాలు మరింత విపరీతమై పోతాయి. దానికి తోడు కింద తెలిపిన మరిన్ని ఉపద్రవ లక్షణాలు రోగి అనుభవించాల్సి వస్తుంది.

 • అలసట
 • గందరగోళం
 • భ్రాంతులు (అక్కడ లేనిది ఏదో చూసినట్టు లేదా విన్నట్టు అనిపించడం)
 • ముక్కు రక్తస్రావం (అంటే జలుబు కారణంగా ముక్కు నుండి నీళ్లు కారడం)
 • ధ్యానలోపం లేదా సావధానత లోటు (దేని పైనా దృష్టి కేంద్రీకరించలేక పోవడం)
 • పొట్ట, ఛాతీ పైన గులాబీ రంగులో మచ్చలు (రోజ్ మచ్చలు), దద్దుర్లు ఏర్పడతాయి. 

పిల్లల్లో బలమైన రోగనిరోధక వ్యవస్థ ఉంటుంది మరియు అది మరింత అభివృద్ధి చెందుతూ ఉంటుంది. దీని కారణంగా టైఫాయిడ్ జ్వరం లక్షణాలు పెద్దల్లో కానవచ్చినట్లు పిల్లల్లో అంత త్వరగాను మరియు ప్రస్ఫుటంగాను  బయటపడవు. కనుక, పిల్లల్లో టైఫాయిడ్ లక్షణాలు తేలికపాటివిగా కన్పించినా వెంటనే చికిత్సనందించాలి.

టైఫాయిడ్ యొక్క కారణాలు - Causes of Typhoid Fever in Telugu

టైఫాయిడ్ ఫీవర్ యొక్క కారణాలు

టైఫాయిడ్ జ్వరం ‘సాల్మోనెల్లా టైఫి’ (ఒక రకం బాక్టీరియా క్రిమి) అనే విష క్రిమి వలన సంభవిస్తుంది. టైఫాయిడ్ ఒకరి నుండి మరొకరికి ఎలా అంటుకొంటుందీ అంటే మలం ద్వారా, మరియు నోటి మార్గం ద్వారా. ఒక వ్యక్తి, ఆమె కావచ్చు లేక అతడు కావచ్చు, కలుషితమైన చేతులతో వంట చేయడం, అలా వండిన ఆహారాన్ని ఇతరులకు వడ్డించినా టైఫాయిడ్ అంటువ్యాధి ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది.

ప్రమాద కారకాలు

టైఫాయిడ్ జ్వరం యొక్క కొన్ని ప్రమాద కారకాలు ఇలా ఉన్నాయి:

 • కలుషితమైన ఆహారం మరియు నీరు   
  ‘సాల్మోనెల్లా’ విషక్రిమితో కలుషితమైన ఆహారం మరియు నీరు సేవించడం ద్వారా ఈ టైఫాయిడ్ అంటువ్యాధి ఒకరి నుండి మరొకరికి సంక్రమిస్తుంది, ఇదే ఈ వ్యాధిని సంక్రమింపజేసే అత్యంత సాధారణ కారణం. సరిగ్గా శుభ్రపరచకుండా పండ్లు మరియు కూరగాయలను తినడం, కలుషితమైన చోటులో నిల్వ ఉంచబడిన ఆహారాన్ని తినటం, కలుషితమైన నీటిని తాగడం వల్ల టైఫాయిడ్ అంటువ్యాధి ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది.
   
 • పరిశుభ్రతా లోపం   
  టైఫాయిడ్ విషక్రిములు కల్గిన అపరిశుభ్ర స్నానపు గదుల్ని లేదా మూత్రశాలల్ని ఉపయోగించిన తర్వాత సరిగా చేతులు కడుక్కోకుండా అదే చేతులతో ఆహారం తినడం, లేదా శిశువులకు, పిల్ల వాండ్రకు తినబెట్టడం చేసినట్లయితే అలంటి వారికి టైఫాయిడ్ వ్యాధి అంటుకునే ప్రమాదం ఉంది. ఇందువల్ల కేవలం మీకే కాక మీ పిల్లలకూ టైఫాయిడ్ అంటుకునే ప్రమాదముంది.
   
 • టైఫాయిడ్ క్యారియర్లు   
  టైఫాయిడ్ జ్వరచరిత్ర కలిగిన వ్యక్తులు తరచుగా వారి మలం   మరియు మూత్రంలో టైఫాయిడ్ బ్యాక్టీరియా ఉన్న సంగతిని గుర్తించలేకపోవచ్చు. అందువల్ల, అలాంటి వారు టైఫాయిడ్ వ్యాప్తికి నిరంతర మూలస్థానంగా మారతారు. కలుషితమైన ఆహారం, నీరు, మరియు పరిశుభ్రంగా లేని వస్తువులను కుటుంబంలోని వారు వాడడం వల్ల టైఫాయిడ్ ఆ కుటుంబంలోని వారికే కాకుండా ఇతరులకు కూడా సంక్రమించే అవకాశం మెండుగా ఉంటుంది. టైఫాయిడ్ జ్వరంతో ఉన్న వ్యక్తి ఆహార పదార్థాలను ఇతరులకు వడ్డించడం, లేదా  ఆ ఆహారాన్ని నిర్వహించడం వంటి పనులు చేసినట్లయితే ఒకరి నుండి మరొకరికి టైఫాయిడ్ సోకుతుంది.
 •  
 • పర్యాటకం   
  అధిక పారిశుద్ధ్యలోపం మరియు పరిశుభ్రమైన నీటి కొరత ఉన్న పర్యాటక ప్రదేశాల (high-risk areas) కు వెళ్లడం లేదా అలాంటి ప్రమాదకర పర్యాటక ప్రదేశాలనుండి ఇతర ప్రాంతాలకు ప్రయాణించడం కూడా టైఫాయిడ్ జ్వరము యొక్క వ్యాప్తికి  కారణమవుతుంది.
   
 • లైంగిక సంబంధం
  టైఫాయిడ్ (విషక్రిమిని) కల్గిన వ్యక్తితో అసురక్షిత (అంటే ‘నిరోద్’ వంటి గర్భనిరోధకాలు వాడకుండా)  లైంగిక సంపర్కం-అది (Oral) నోటి సంపర్కం లేదా అంగ సంపర్కం కావచ్చు-చేయడం వల్ల అతని/ఆమె భాగస్వామికి కూడా టైఫాయిడ్ సోకవచ్చు.
   
 • మలం 
  ‘సాల్మోనెల్లా’ విషక్రిమితో కూడిన మలాన్నిపొలాలకు వేయడం వల్ల ఆ ప్రాంతం నేల, నీరు, అక్కడ పండే కూరగాయలు ఇతరత్రా పంటలు కూడా సాల్మొనెల్లా విషక్రిమితో సంకరమైపోతాయి, ఇలా కలుషితమైన ప్రదేశాల నుండి తెచ్చిన ఆహారాన్నిప్రజలు తినడం వల్ల టైఫాయిడ్ జ్వరం విస్తారంగా వ్యాప్తి చెందవచ్చు.
   
 • మూత్రం   
  మూత్రం ద్వారా టైఫాయిడ్ వ్యాప్తి చెందే అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో టైఫాయిడ్ సోకడానికి మూత్రం కూడా కారణమవడం సాధ్యమే.

టైఫాయిడ్ యొక్క వ్యాధినిర్ధారణ - Diagnosis of Typhoid Fever in Telugu

మీ అనారోగ్య పరిస్థితి నిర్ధారణకు ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పరీక్షలను చేయించుకొమ్మని మీ డాక్టర్ మీకు సూచించవచ్చు. ఈ పరీక్షలు క్రింది విధంగా ఉన్నాయి:

 • మలం పరీక్ష (స్టూల్ టెస్ట్) 
  ఈ పరీక్షలో, మీనుండి సేకరించిన ‘మలం మాదిరి’ (stool sample) లోని   ‘సాల్మోనెల్లా టైఫి’ విషక్రిమిని కనిపెట్టేందుకు సూక్ష్మదర్శిని (కంటికి కనిపించని జీవాలను మరియు పదార్ధాలను చూడడానికి ఉపయోగించే పరికరం) కింద పరిశీలించబడుతుంది.

 • రక్త పరీక్ష
  ఈ పరీక్షలో, మీ రక్తం నమూనాను CBC (పూర్తి రక్త గణన) పరీక్ష కోసం తీసుకోబడుతుంది. రక్త నమూనానిచ్చిన సదరు వ్యక్తికి టైఫాయిడ్ సంక్రమించి ఉంటే తెల్ల రక్త కణాల సంఖ్య పెరిగి ఉండడాన్ని ఈ పరీక్ష నిర్ధారిస్తుంది. రక్తాన్ని సూక్ష్మదర్శినిలో కూడా పరిశీలించి టైఫాయిడ్ సోకిందీ లేనిదీ నిర్ధారిస్తారు. టైఫాయిడ్ సోకి ఉంటే ప్లేట్లెట్ల (platelets)  సంఖ్య గణనీయంగా పడిపోయి ఉండడం ఈ రక్త పరీక్షలో తెలుస్తుంది.

 • మూత్ర పరీక్ష
  మూత్రం ద్వారా టైఫాయిడ్ బ్యాక్టీరియా వ్యాప్తి చెందడం అరుదు.  అరుదైనప్పటికీ ఒకవేళ సదరు వ్యక్తికీ టైఫాయిడ్ బ్యాక్టీరియా మూత్రం ద్వారానే సోకే  అవకాశం ఉంది. సూక్ష్మదర్శిని పరీక్ష టైఫాయిడ్ బాక్టీరియా ఉనికిని బహిర్గతం చేయవచ్చు.

 • ఎముక మజ్జ పరీక్ష
  పైన తెలిపిన పరీక్షలు ఏమీ తేల్చక పొతే ఎముక మజ్జ పరీక్షను చేస్తారు. ఎందుకంటే ఇది ఖచ్చితమైన పరీక్ష కాబట్టి. ఈ పరీక్షను చివరి పరిష్కారంగా జరుపుతారు. ఈ పరీక్ష ఒకింత బాధాకరమైన మరియు ఎక్కువ సమయం తీసుకునే ప్రక్రియ.

ఇతర పరీక్షలు:

 • ఎలిసా-టై (ELISA-Ty) పరీక్ష: (రసాయనికామ్లద్రవ-సంబంధమైన టైఫాయిడ్ రోగనిరోధక పరీక్ష)
  ఈ పరీక్ష శరీరంలోని టైఫాయిడ్-ప్రతిరోధకాలైన IgM మరియు IgG ల యొక్క రక్తరసి స్థాయిలను కొలుస్తుంది. శరీరంలో రోగకారక సూక్ష్మజీవులు మరియు వాటి ఉత్పత్తులను తటస్థం చేయడంలో IgM మరియు IgG ప్రతిరోధకాలు సాయపడతాయి.

 • పరోక్ష ఫ్లోరోసెంట్ యాంటిబాడీ టెస్ట్
  ​మరొక సెరోలాజికల్ పరీక్ష ఇది. టైఫాయిడ్ అంటువ్యాధిని  నిర్థారించడానికి ఉన్న వేగవంతమైన పరీక్ష

పైన పేర్కొన్న పరీక్షలు రోగిలో టైఫాయిడ్ అంటువ్యాధిని నిర్ధారించినప్పుడు, సదరు రోగి కుటుంబ సభ్యులకు కూడా ఈ పరీక్షలు జరిపి వారికేమైనా టైఫాయిడ్ సంక్రమణ ఏమైనా జరిగిందా లేదా అనే విషయాన్ని నిర్ధారిస్తారు.

టైఫాయిడ్ యొక్క చికిత్స - Treatment of Typhoid Fever in Telugu

టైఫాయిడ్ లక్షణాలు మరింత తీవ్రతరం కావడానికి ముందే తక్షణ వైద్య సహాయాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు తీసుకోబోయే చికిత్స యొక్క సాధారణ కోర్సు ఇక్కడ వివరించబడింది:

 • ఓరల్ యాంటీబయాటిక్స్
  మీరు వైద్య సహాయం కోసం వెళ్ళినప్పుడు మరియు రోగనిర్ధారణ ప్రారంభం కాగానే, 7-14 రోజులకు యాంటీబయాటిక్స్ (సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా ఇచ్చే మందులు) లోనికి తీసుకునేందుకు సూచించబడుతాయి. ఔషధాలను తీసుకొన్న 2-3 రోజులలోపు మీ జబ్బు లక్షణాలు తగ్గిపోవచ్చు, అట్లాగని యాంటీబయాటిక్స్ తీసుకోవటాన్ని నిలిపివేయవద్దని మీకు సిఫార్సు చేస్తున్నాం. ఎందుకంటే యాంటీబయాటిక్స్ కొనసాగించడం వల్ల మీ శరీరంలో బ్యాక్టీరియా పూర్తిగా తొలగించబడుతుంది.

 • ద్రవాహార ప్రత్యామ్నాయాలు
  మీ నిర్జలీకరణాన్ని (శరీరంలో నీరు లేకపోయే స్థితి)  మెరుగుపర్చడానికి పుష్కలంగా ద్రవాలను తీసుకోవాలని మీకు వైద్యులు సలహా ఇస్తారు.  రోగనిర్ధారణ ప్రారంభ సమయంలో సాధారణంగా ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందనవసరం లేదు మరియు రోగికి ఇంటి వద్దనే  యాంటీబయాటిక్ కోర్సును కొనసాగించవచ్చు.

 • ఆసుపత్రిలో
  ఎదో ఒక కారణం వల్ల మీరు చికిత్సను ఆలస్యం చేసినప్పుడు, యాంటీబయాటిక్స్ యొక్క పూర్తి కోర్సును తీసుకున్న తర్వాత కూడా టైఫాయిడ్ జ్వర లక్షణాలు తొలగిపోక పోయినా, లేదా లక్షణాలు మరింత తీవ్రమయినా వైద్యుడు మీ పరిస్థితిని పర్యవేక్షించడానికి ఆసుపత్రిలో చేరమని సలహా ఇస్తారు. మీ పరిస్థితి తీవ్రమైనది అయినట్లయితే, యాంటిబయోటిక్ సూది మందులు ఇవ్వబడతాయి. ఈ యాంటీబయాటిక్స్ వేగంగా పని చేస్తాయి మరియు మీ టైఫాయిడ్ లక్షణాల తీవ్రతను తగ్గించడానికి సహాయం చేస్తాయి. ఫ్లూయిడ్ (ద్రవాలు) మరియు ఎలెక్ట్రోలైట్ ప్రత్యామ్నాయం కూడా ఇంట్రావీనస్ (డ్రిప్స్) మార్గాన్ని ఉపయోగించి డాక్టర్ వైద్యం చేయడం జరుగుతుంది.

 • రెండవసారి మల పరీక్ష (స్టూల్ టెస్ట్)
  పూర్తి చికిత్స తర్వాత, ఇకపై మీ మలంలో టైఫాయిడ్ బ్యాక్టీరియా లేదని నిర్ధారించుకోవడానికి రెండవ స్టూల్ పరీక్ష (మల పరీక్ష) జరుగుతుంది. ఈ మల పరీక్షలో మళ్ళీ టైఫాయిడ్ బ్యాక్టీరియా ఉన్నట్లు తేలితే మరో 28-రోజుల నోటి యాంటీబయాటిక్స్ కోర్సు మీకు ఇవ్వబడుతుంది. అటుపై మీ మలంలో టైఫాయిడ్ విషక్రిములు పూర్తిగా తొలగాయా లేదా అని ధృవీకరించుకోవడానికి మల్లె మల పరీక్ష చేస్తారు.

 • పునఃస్థితి
  కొన్ని సందర్భాల్లో, పునఃస్థితి (తిరిగి టైఫాయిడ్ లక్షణాలు రావడం) సంభవిస్తుంది. పునఃస్థితి సాధారణంగా, మీ మందుల సేవనం పూర్తి చేసిన వారం తర్వాత రావచ్చు. పునఃస్థితి లక్షణాలు తేలికపాటివి  మరియు స్వల్పకాలికమైనవి. అయినా, యాంటీబయాటిక్స్ కోర్సు సాధారణంగా సూచించబడుతుంది. ఈ సందర్భంలో వైద్యుడు ప్రత్యేకంగా కుటుంబ సభ్యులను కోరేదేమంటే రోగిని పరీక్షగా జాగ్రత్తగా గమనించమని, ఎందుకంటే టైఫాయిడ్ యొక్క పునఃస్థితి శరీరాన్ని  బలహీనపరుస్తుంది.

టైఫాయిడ్ చికిత్సలో ఇటీవలి సవాళ్లు

వైద్య పరిశోధకులు టైఫాయిడ్ బాక్టీరియా యొక్క కొన్ని జాతులను ఎదుర్కొంటున్నారు. ఈ జాతులు ‘సిప్రోఫ్లోక్ససిన్’ వంటి యాంటీబయాటిక్స్ కు లొంగకుండా పోతున్నాయి. ఇటీవల పలు యాంటీబయాటిక్స్ ను వాడినా వాటికి లొంగకుండా టైఫాయిడ్ ను తీవ్రతరం చేసే పలు బ్యాక్టీరియాలను వైద్య పరిశోధకుల దృష్టిలోకి వచ్చాయి. అందువల్ల, పరిశుభ్రత మరియు పారిశుద్ధ్యాలను నిర్వహించినట్లయితే టైఫాయిడ్ అంటువ్యాధి నివారణా  బాధ్యత వైద్యుల చేతిలో కంటే మన చేతుల్లోనే చాలా బాగా కృతకృత్యమవుతుంది.

స్వీయ రక్షణ

 • అందరు వైద్యులు టైఫాయిడ్ రోగి ప్రారంభదశలో పూర్తి బెడ్ రెస్ట్ తీసుకొమ్మని సలహానిస్తారు.
 • టైఫాయిడ్ రోగి శరీరం బలహీనంగా మరియు వివిధ అంటురోగాలకు బాలయ్యేదిగా ఉంటుంది గనుక, కొబ్బరి నీరు, పండ్ల  రసాలను, లస్సీ, గ్లూకోజ్, నీరు వంటి ద్రవాహారాలను క్రమం తప్పకుండా తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తారు.
 • తేలికైన మరియు సులభంగా జీర్ణమయ్యే భోజన పదార్థాలైన వరిఅన్నం, పండ్లు మొదలైనవాటిని తక్కువ తక్కువ వ్యవధుల్లో తీసుకోవలసి ఉంటుంది. రోజులో మూడు సార్లు భారీగా భోంచేయడం కంటే ఇలా తక్కువ వ్యవధుల్లో చాలా సార్లు కొంచం కొంచం తినడం సబబని వైద్యులు చెబుతున్నారు.
 • నెయ్యి, పాలు, మొదలైనవి కొవ్వుకారకాలు గనుక అలంటి ఆహారాన్ని తినవద్దు. మంచి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించమని కూడా మీకు వైద్యులు సలహా ఇస్తారు.
 • టైఫాయిడ్ చికిత్స అనంతరం చాలామంది ఒకింత బాగైపోయినట్లు భావించి వెంటనే పనికెళ్ళడం లేదా విద్యార్థులైతే పాఠశాలలకు వెళ్లడం చేస్తుంటారు. అయితే, అయిదు సంవత్సరముల లోపు వయస్సు ఉన్న పిల్లలు, వృద్ధులు, ఉద్యోగం చేస్తూ, ఇల్లు-పిల్లల్ని సంరక్షించుకునే మహిళలు టైఫాయిడ్ చికిత్సానంతరం వెంటనే పనిలో కెళ్లకుండా కాస్త ఓపిక పట్టాలి. మలపరీక్షలో టైఫాయిడ్ క్రిమి లేదని, జ్వరం పూర్తిగా తగ్గిపోయిందని నిర్ధారించుకున్నాకే పనిలో కెళ్ళడం లేదా విద్యార్థులైతే పాఠశాలకు వెళ్లడం చేయచ్చు.

టైఫాయిడ్ యొక్క చిక్కులు - Complications of Typhoid Fever in Telugu

టైఫాయిడ్ విషయంలో వ్యాధి నిర్ధారణ సాధ్యమైనంత ముందుగానే చేయించుకుని చికిత్స తీసుకోకపోతే, తీవ్రమైన కష్టకర పరిస్థితి దాపురిస్తుంది. ప్రముఖంగా, టైఫాయిడ్ కు చికిత్స చేయకుండా అశ్రద్ధ చేస్తే జీర్ణ వ్యవస్థలో అంతర్గత రక్తస్రావం ఏర్పడడం,  ప్రేగు పడుట, సెప్సిస్, పేగుల్లో బెజ్జాలేర్పడడం, బహుళ అవయవ వైఫల్యం వంటి ప్రమాదకర పరిస్థితులు దాపురించి ప్రాణం మీదికొస్తుంది. అలా అశ్రద్ధ చేస్తే మరణం కూడా సంభవించే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

 • అంతర్గత రక్తస్రావం
  టైఫాయిడ్ బ్యాక్టీరియా త్వరితగతిన పెరుగుతూ, విషాన్ని విడుదల చేస్తే, అది ప్రేగు గోడలను నాశనం చేస్తుంది. ఇది చివరికి అంతర్గత రక్తస్రావానికి దారితీస్తుంది. ఇలాంటప్పుడు, రోగి వ్యాధిలక్షణాలు శోషణ, శ్వాసలో కష్టం, పాలిపోయినట్లున్న లేత చర్మం (రక్త నష్టం వల్ల రక్తహీనత), క్రమరహిత హృదయ స్పందన, వాంతుల్లో రక్తం పడడం,  అంతర్గత రక్తస్రావం వలన రోగి మలంలో నలుపు చారాలేర్పడ్డం వంటివి ఉంటాయి. మీ అంతర్గత రక్తస్రావం సుదీర్ఘకాలం కొనసాగినట్లయితే మీరు కోల్పోయిన రక్తాన్ని భర్తీ చేయడానికి రక్త మార్పిడి అవసరం కావచ్చు. పేగుల్లో ఎక్కడ రక్తస్రావం జరుగుతోందో అక్కడ రక్తం నష్టాన్ని నివారించడానికి శస్త్రచికిత్స చేయడం అనివార్యం అవుతుంది.

 • పేగుల్లో బెజ్జాలేర్పడ్డం (పెర్పొరేషన్)
  దీర్ఘకాలం చికిత్స తీసుకోని టైఫాయిడ్ రోగుల్లో పేగులకు రంధ్రాలు పడుట అనేది చాలా తీవ్రమైన సమస్య. పేగుల్లో బాక్టీరియా దీర్ఘకాలం చేరడం మరియు అవి వదిలే విషాల యొక్క నిరంతర స్రావం చివరకు ప్రేగు గోడలో రంధ్రాలు పడుటకు దారితీస్తుంది. అలా పేగుల్లో  రంధ్రాలేర్పడిన తర్వాత, పొత్తికడుపు యొక్క పొరలో (పెరిటోనియం) టైఫాయిడ్ బాక్టీరియా మరింత పెరుగుతుంది. పెరిటోనియం అనేది ఒక క్రిమిరహిత (సూక్ష్మజీవులు లేదా సంక్రమణం లేకుండా) అవయవము. పొత్తికడుపులో S. typhi బాక్టీరియా పెరుగుదల కారణంగా పదునైన కడుపు నొప్పి ఆకస్మికంగా వస్తుంది. ఈ లక్షణాలతో కూడిన అత్యవసరమైన వైద్య పరిస్థితి పొత్తికడుపులో పెరిటోనియంలో ఏర్పడుతుంది.

 • కుళ్లకం/ విషసర్పణము​  
  రక్తప్రసరణ ద్వారా సూక్ష్మజీవులు పెరిటోనియం కు వ్యాప్తి చెంది విషసర్పణము అనే విషమ పరిస్థితి దాపురిస్తుంది. 

 • అని పిలిచే ఒక పరిస్థితికి దారితీసే
  టైఫాయిడ్ లో భాగంగా భిన్నాంత్రోదరము (పెర్టోనిటిస్ లేదా ఉదర వాపు) తర్వాత బ్యాక్టీరియ రక్తప్రవాహం ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ బాసిరియా వ్యాప్తి నే కుళ్లకం లేదా సెప్సిస్ దశ గా వ్యవహరిస్తారు.

 • అనేకావయవాల వైఫల్యం
  టైఫాయిడ్ బ్యాక్టీరియా శరీరంలోని వివిధ భాగాలకు వ్యాపిస్తుంది. ఆ భాగాలే శోషరస గ్రంథులు (శరీరం నుండి విషాన్ని మరియు హానికరమైన అంటువ్యాధులు తొలగించడంలో సహాయపడే రోగనిరోధక వ్యవస్థ యొక్క భాగం), పిత్తాశయము, కాలేయం, ప్లీహము, మొదలైనవి. ఇలా టైఫాయిడ్ బ్యాక్టీరియా ఈ భాగాలకు వ్యాపిస్తే శరీరంలోని ఇతర అవయవాలకు కూడా దీని ప్రభావం సోకి ‘బహుళఅవయవాల వైఫల్యం’ ఏర్పడుతుంది. ఈ దశలో, రోగుల పరిస్థితి చాలా క్లిష్టమైనదిగాను, దయనీయంగాను ఉంటుంది. .

 • మరణం
  ఈ దశలో బతికే అవకాశం చాలా అరుదు గా ఉంటుంది.  వైద్య శాస్త్రం ఎంత పురోగతి చెందినా ఈ దశలో వైద్యం సాయం చేసే అవకాశాలు చాలా తక్కువ. ఇది దురదృష్టకరమే. టైఫాయిడ్ జ్వరం విస్తృతమైనప్పుడు మరియు రోగి అన్ని రకాల చికిత్సలకు ప్రతిస్పందించకుండా ఉన్నప్పుడు, కొన్ని తీవ్రమైన సందర్భాల్లో ప్రాణాంతకమైన ఫలితం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల టైఫాయిడ్ జ్వరాన్ని చాలా తేలికగా తీసుకోకూడదు, టైఫాయిడ్ జ్వరంతో ఉన్నామని తెల్సిన తక్షణం శ్రద్ధతో చికిత్స తీసుకోవడం ఉత్తమ మార్గం.

టైఫాయిడ్ యొక్క నివారణ - Prevention of Typhoid Fever in Telugu

టీకా మందు:

టైఫాయిడ్ జ్వరం రాకుండా నివారించేందుకు వివిధ రకాల టీకా మందులు  అందుబాటులో ఉన్నాయి. అలాంటి టీకా మందుల్లో కొన్ని ఏవంటే:

 • ఓరల్ టీకా
  ఓరల్ టీకా మందు ద్రవ సస్పెన్షన్ మరియు ‘ఎంటరిక్ పూత గుళికలుగా అందుబాటులో ఉన్నాయి. ఈ  టీకా మందును రోజు విడిచి రోజు మూడు మోతాదులు ఇవ్వబడుతుంది, అదనంగా, తర్వాతి మూడు సంవత్సరాల్లో, ప్రతి ఏడాదీ ఒక ‘బూస్టర్ డోస్’ ఇవ్వబడుతుంది. ఈ టీకా మందును గర్భిణీ స్త్రీలకు వాడకూడదు. కాప్సుల్/ప్యాకెట్ రూపంలో వచ్చే ఈ టీకామందును సురక్షిమైన త్రాగునీటితో ఇవ్వాలి.

 • వి వ్యాక్సిన్ (Vi vaccine) సూది మందు
  ఇది ఒక సూది మందుగా చర్మానికి దిగువున లేదా ఇంట్రాముస్కులర్ గా (భుజం లేదా హిప్ కండంలో) ఒక మోతాదుగా ఇవ్వబడుతుంది. ప్రతి మూడేళ్లకూ మళ్ళీ మళ్ళీ (రివాక్సినేషన్) ఈ వి వాక్సిన్ ని తీసుకోవలసి ఉంటుంది.

రెండు సంవత్సరాలు అంత  కంటే తక్కువ వయస్సు గల చిన్నపిల్లల సంరక్షణకుపయోగపడే ఈ టీకా మందుల సరఫరాలో కొరత ఏర్పడుతూ ఉంటుంది.

ఇప్పుడు 9 నుండి 12 నెలల మధ్య వయసున్న శిశువుల కోసం, టీకా మందులు వేయడం జరుగుతోంది. ఇటీవల విడుదలైన ఈ నాల్గవ-తరం టీకా మందును శిశువుకు వేసిన నాటి నుండి పది సంవత్సరాల పాటు టైఫాయిడ్ రాకుండా రక్షణ కల్పిస్తుంది.

పర్యాటకులు టైఫాయిడ్ జ్వరానికి అత్యంత ప్రమాదభరితమైన ప్రాంతాలకు     (హై-టైఫాయిడ్ రిస్క్ ప్రాంతాలు-దక్షిణ మరియు ఆగ్నేయ ఆసియా, భారత ఉపఖండం, ఆఫ్రికా, దక్షిణ అమెరికా తదితరాలు) వెళ్లడానికి ముందు ఈ టీకాలు వేయించుకోవాలి.

టైఫాయిడ్ వ్యాధి వ్యాప్తి సమయంలో, వ్యాధి సోకినవారున్న ప్రాంతంలో టైఫాయిడ్ మరింతగా వ్యాప్తి చెందకుండా నివారించడానికి మొత్తం అక్కడున్నవారందరికీ టీకాలు వేయాలి.

జాగ్రత్తలు:

‘మురికి వాతావరణం వ్యాధులకు ఒక నిలయమ’న్న సత్యం అందరికీ తెల్సిందే. అందువల్ల, టైఫాయిడ్ మరియు ఇతర అంటురోగాలను నివారించడానికి మీరు చేయగలిగిన కొన్ని జాగ్రత్తల జాబితాను మీకిక్కడ  అందిస్తున్నాము.

 • ఎల్లప్పుడూ సీలు చేయబడిన నీటిని, సీసా నీరు లేదా వేడి చేసిన (ఒక  నిమిషం పాటు వేడి చేసి) నీటిని త్రాగండి.
 • మంచు నీటిని, మంచు పానీయాలను ఉపయోగించకుండా ఉండండి. సీసా నీటి నుండి తయారైన మంచు (ఐస్) గద్దలైతే సరే తాగొచ్చు.  
 • వీధి విక్రయదారుల నుండి లేదా శుభ్రమైన నీటిని ఉపయోగించని అనుమానిత విక్రేతల నుండి రుచికరమైన ఐస్-క్యాండీలను తినడం మానుకోండి.
 • పచ్చి కూరగాయలు లేదా పండ్లను బాగా కడిగి శుభ్రపరిచాకనే తినండి.
 • మీరు పర్యాటకుడిగా ప్రయాణిస్తున్నట్లయితే, తినడానికి ముందు మీ చేతులను కడుక్కొనేందుకు మరియు టాయిలెట్ ను ఉపయోగించిన తర్వాత కూడా మీ చేతుల్ని కడుక్కునేందుకు ఒక సబ్బును వెంట ఉంచుకోండి. మీరు కొన్న పండ్లు, కూరగాయల్ని ఎల్లప్పుడు కడగడం మరువకండి, మరియు పీలర్ తో తొక్క తీసిన తర్వాతే వాటిని తినండి. వీధి విక్రేతలు మరియు రోడ్డుపక్క స్టాల్స్ నుండి ఆహారం కొనుగోలు మానుకోండి. మీ పర్యాటక మార్గంలో ఆకు కూరలను తినవద్దు, ఎందుకంటే వాటిని కడగడం కష్టం. మీరు చేతులు కడగడానికి పరిశుభ్రమైన నీటిని పొందలేకపోతే, ‘హ్యాండ్ స్యానిటైజర్’ తో చేతుల్ని కడుక్కోండి. అయితే మీరు ఎల్లప్పుడూ చేతులు కడుక్కోవడం మరియు కడగడం మంచిదన్నసంగతి మాత్రం గుర్తుంచుకోండి. .
 • వ్యక్తిగత పరిశుభ్రత మరియు పారిశుద్ధ్యం నిర్వహించండి మరియు మీ పిల్లలకు అదే బోధించండి.
 • ఎల్లప్పుడు మీ భోజనాన్ని బాగా ఉడికించాలి మరియు మీరు పర్యటనలో  ఉన్నపుడు వేడి ఆహారాన్ని మాత్రమే తినండి.


వనరులు

 1. National Health Service [internet]. UK; Typhoid fever: Overview
 2. Iowa Department of Public Health [internet]. TYPHOID FEVER, CARRIER. Acute Communicable Disease Control Manual (B-73), REVISION—JUNE 2018
 3. National Health Service [internet]. UK; Typhoid fever: Vaccination
 4. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Typhoid & Paratyphoid Fever. Infectious Diseases Related to Travel.
 5. National Health Portal [Internet] India; Typhoid / Enteric Fever
 6. World Health Organization [Internet]. Geneva (SUI): World Health Organization; Typhoid.

టైఫాయిడ్ జ్వరం వైద్యులు

Dr Rahul Gam Dr Rahul Gam Infectious Disease
8 वर्षों का अनुभव
Dr. Arun R Dr. Arun R Infectious Disease
5 वर्षों का अनुभव
Dr. Neha Gupta Dr. Neha Gupta Infectious Disease
16 वर्षों का अनुभव
Dr. Lalit Shishara Dr. Lalit Shishara Infectious Disease
8 वर्षों का अनुभव
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

టైఫాయిడ్ జ్వరం కొరకు మందులు

టైఫాయిడ్ జ్వరం के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

translation missing: te.lab_test.sub_disease_title

translation missing: te.lab_test.test_name_description_on_disease_page