myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

కరివేపాకు చెట్టు ప్రధానంగా ఉష్ణమండం నుండి ఉపఉష్ణమండల ప్రాంతాల చెట్టు. శ్రీలంక మరియు భారతదేశానికి చెందినడి, ఇది రుటాసియే కుటుంబానికి చెందినది, సదాపచెట్టు, సాటిన్వుడ్ మరియు నిమ్మజాతి మొక్కలు కూడా ఈ కుటుంబానికి చెందుతాయి. 4-6 మీటర్ల పొడవు పెరిగే ఒక చిన్న చెట్టు ఇది, దీని కాండము సుమారు 40 సెంమీ వ్యాసం కలిగి ఉంటుంది. వాసనతో కూడిన కరివేపాకులు, కరివేపాకు చెట్ల కొమ్మలపై జంటలుగా  అమర్చబడి ఉంటాయి. ప్రతి రెమ్మ 11-21 ఆకులను కలిగి ఉంటుంది. కరివేపాకు మొక్క స్వీయ పరాగసంపర్కం చేసుకునే చిన్న తెలుపు పువ్వులు కలిగి ఉంటాయి. కూర మొక్క యొక్క పండు ఒక చిన్నగా మరియు మెరిసే-ముదురు రంగులో ఉంటుంది. ఈ పండులో ఒకే పెద్ద విత్తనం ఉంటుంది. ఈ పండు యొక్క గుజ్జును తినవచ్చు. ఇది తీపి రుచితో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. సాధారణంగా, పండు గుజ్జును లేదా విత్తనాన్ని వంట కోసం ఉపయోగించరు.

మసాలాలలో ఉపయోగించే ప్రధాన భాగం కావడంతో, కరివేపాకులను భారత దేశపు దక్షిణ మరియు పశ్చిమ తీర ప్రాంతాలలోని అత్యంత ముఖ్యముగా ఉపయోగిస్తారు . వండినప్పుడు, కరివేపాకులు ప్రత్యేకమైన వాసనను కలిగిస్తాయి, మరియు వంటకానికి ప్రత్యేక రుచిని అందిస్తాయి. ఇది భారతదేశం, శ్రీలంక మరియు సమీపంలోని దేశాల్లో చాలా సాధారణమైనది. శ్రీలంక వంటలలో, వంట మొదలు పెట్టె ముందు, ముందుగా ఈ ఆకులను, కొన్ని ఆవాలను మరియు కొన్ని చిన్న ముక్కలుగా ఉల్లిపాయను కలిపి వేయిస్తారు. కరివేపాకులను సాంబార్, రసం, వడ వంటి అనేక దక్షిణాది భారతీయ వంటకాలలో కూడా వాడతారు. ఉత్తర భారత వంటకం అయిన కఢీ తయారీలో వీటిని కూడా ఉపయోగిస్తారు.

వీటిని కూరల తయారీలో ప్రధానంగా ఉపయోగిస్తారు కాబట్టి కరివేపాకులకు ఆ పేరు వచ్చి ఉండవచ్చు. పలు భారతీయ భాషలలో వీటిని 'తీపి వేప ఆకులు' అని కూడా పిలుస్తారు. వేపాకులు మేలియాసీఏ (Meliaceae) కుటుంబానికి చెందినవి మరియు సాధారణంగా చేదుగా ఉంటాయి అయితే, కరివేపాకు మొక్క రుటాసియే కుటుంబానికి చెందినది.

ఇది ప్రధానంగా వంటకాలలో ఉపయోగించినప్పటికీ, ఆయుర్వేద మరియు సిద్ధ వైద్య విధానాలలో కరివేపాకులను వాటి చెక్కెర వ్యాధి వ్యతిరేక (యాంటీడైయాబెటిక్) లక్షణాల కోసం విస్తృతంగా ఉపయోగిస్తారు. అయినప్పటికీ, దీనికి అధారాలు ధృడంగా లేకపోవడం వలన దీని పై మరింత పరిశోధన అవసరం. తులసి ఆకులకు ప్రత్యామ్నాయంగా ఆచారాలు మరియు పూజలలో కూడా వీటిని ఉపయోగిస్తారు.

కరివేపాకు (మొక్క) గురించి ప్రాథమిక వాస్తవాలు:

 • శాస్త్రీయ నామం: ముర్రయ కోయినిగి (Murraya koenigii)
 • కుటుంబం: రూటేసియే (Rutaceae)
 • సాధారణ నామం: కర్రీ లీవ్స్, హిందీలో కడిపత్త
 • సంస్కృత నామం: గిరినిమ్బా
 • ఉపయోగించిన భాగాలు: ఆకులు
 • స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం: ఈ ఆకులను ప్రధానంగా భారతదేశం యొక్క పశ్చిమ మరియు దక్షిణ భాగాలలో విస్తృతంగా ఉపయోగిస్తారు. భారతదేశంనుండి వలస వెళ్లిన వారు ఆసియాలోని వివిధ దేశాలలో కరివేపాకులను ఒక ఇంట్లో పెంచుకునే మొక్కగా పరిచయం చేసారు. ఈ రోజుల్లో, భారతదేశం, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఫిజీ, బర్మా, మలేషియా, యూరప్, దక్షిణాఫ్రికా మరియు యునైటెడ్ స్టేట్స్లలో కూరగాయల మార్కెట్లలో మరియు దుకాణాలలో తాజా కరివేపాకులను సులభంగా కనుగొనవచ్చు.
 1. కరివేపాకు పోషక విలువలు - Curry leaves nutrition facts in Telugu
 2. కరివేపాకుల ఆరోగ్య ప్రయోజనాలు - Curry leaves health benefits in Telugu
 3. కరివేపాకు దుష్ప్రభావాలు - Curry leaves side effects in Telugu
 4. ఉపసంహారం - Takeaway in Telugu

కరివేపాకులలో కార్బోహైడ్రేట్స్, ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, కాపర్, ఫాస్పరస్ మరియు ఖనిజాలు వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. నికోటినిక్ యాసిడ్ మరియు విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ ఎ వంటి విటమిన్లతో పాటు, యాంటీఆక్సిడెంట్స్, ప్లాంట్ స్టెరాల్స్, అమైనో యాసిడ్లు, గ్లైకోసైడ్స్ మరియు ఫ్లేవానాయిడ్స్ వంటి ఇతర సెకండరీ (ద్వితీయ) పదార్ధాల వంటివి పుష్కలంగా ఉంటాయి.

ఇండియన్ జర్నల్ ఆఫ్ నేచురల్ ప్రొడక్ట్స్ అండ్ రిసోర్సెస్ వాల్యూ 2 (4), డిసెంబరు, 2011 నాటికి, 100 గ్రాములు కరివేపాకులు ఈ క్రింది విలువలను కలిగి ఉంటాయి:

పోషకాలు

100 గ్రాములకు

ప్రోటీన్

6గ్రా

కొవ్వులు

1 గ్రా

కార్బోహైడ్రేట్లు

18.7 గ్రా

కాల్షియం

830 mg

ఐరన్

0.93 mg

బీటా కెరోటిన్

7560 μg

 • మధుమేహం కోసం:కరివేపాకులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నిర్వహిస్తాయి. వీటిలో ఉండే ఖనిజాలు పాంక్రీయాస్ యొక్క బీటా కణాలను ప్రేరేపించి ఇన్సులిన్ ఉత్త్పత్తి అయ్యేలా చేస్తాయి. చెక్కర వ్యాధి రోగులలో కణ మరణం (సెల్ డెత్)  అధికంగా ఉంటుంది, కరివేపాకులో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఈ సెల్ డెత్ ను నివారిస్తాయి.
 • ఆర్థరైటిస్ కోసం: కరివేపాకులో ఆల్కలాయిడ్స్, ట్రైటెర్పినాయిడ్లు మరియు ఫ్లేవానాయిడ్లు ఉంటాయి, అవి  నొప్పి సంచలనాన్ని తగ్గిస్తాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి తద్వారా ఆర్థరైటిస్ లక్షణాలను కరివేపాకులు తగ్గిస్తాయి.
 • ఇన్ఫెక్షన్ల కోసం: కరివేపాకులలో కార్బాజోల్ అల్కలాయిడ్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. యస్. టైఫీ (S.typhi) మరియు ఈ.కోలి (E.coli) వంటి సాధారణ వ్యాధికారక బాక్టీరియాకు వ్యతిరేకంగా యాంటీ బాక్టీరియల్ లక్షణాలను మరియు సి.అల్బికెన్స్ (C. albicans) మరియు కాండిడా గ్లబ్రాట (Candida glabrata) వంటి ఫంగస్ కు వ్యతిరేకంగా యాంటీ ఫంగల్ చర్యలను కరివేపాకులు చుపిస్తాయని అధ్యయనాలు తెలిపాయి.
 • రక్తహీనతకు: కరివేపాకులు ఐరన్ కు మంచి మూలకాలు. కాబట్టి కరివేపాకుకు రక్తహీనతనుతగ్గించే లక్షణాలు ఉంటాయి. కరివేపాకు సారాలు ఉండే మిశ్రమాన్ని ప్రతిరోజూ తీసుకుంటే అది రక్తహీనత లక్షణాలను తగ్గించిందని అధ్యయనాలు కూడా సూచించాయి.
 • గుండె ఆరోగ్యానికి: కరివేపాకులు లిపిడ్ల యొక్క పేరాక్సిడేషన్ను నిరోధిస్తాయి, తద్వారా అథెరోస్క్లెరోసిస్ మరియు అధిక రక్తపోటు వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఈ రెండూ సమస్యలు గుండె జబ్బుల యొక్క ప్రధాన కారణాలు. అంతేకాక కరివేపాకులలో అధికమొత్తంలో పోటాషియం ఉంటుంది అది గుండెకు మంచిది.
 • జుట్టుకు: కరివేపాకులలో ఉండే బీటా-కెరోటిన్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది మరియు ప్రోటీన్లు జుట్ట పలుచబడకుండా చేస్తాయి. వీటితో పాటు జుట్టు పోషణకు అవసరమయ్యే అనేక ముఖ్య పోషక పదార్దాలు కరివేపాకులో ఉంటాయి.
 • చర్మం కోసం: కాలిన గాయాలు, కమిలిన గాయాలు, సెగగడ్డలు దద్దుర్లు వంటి పలు రకాల చర్మ సమస్యలకు కరివేపాకులు ఉపశమనం కలిగిస్తాయి.
 • కడుపు కోసం: కడుపుతిప్పు కోసం కరివేపాకు పేస్టూను మజ్జిగతో కలిపి తీసుకుంటే అది వెంటనే తగ్గిపోతుంది.అలాగే మలబద్దకం, విరేచనాలు, వికారం వాంతులు వంటి వివిధ రకాల కడుపు సమస్యల కోసం కరివేపాకులు సమర్థవంతంగా పని చేస్తాయి.  
 • కరివేపాకు కొంతమందిలో అలెర్జీ ప్రతిచర్యలు కారణం కావచ్చు. వక్తికి ఆస్తమా ఉన్నాలేదా పుప్పొడి వంటి మొక్క భాగాలకు అలెర్జీ ఉన్నా అటువంటి వారు కరివేపాకులు తినరాదని సిఫారసు చేయబడుతుంది. (మరింత సమాచారం: ఆస్తమా లక్షణాలు)
 • కరివేపాకు సుదీర్ఘకాలం పాటు జుట్టుకు ఉపయోగించడం అనేది హానికరం కావచ్చు. కాబట్టి, మరీ తరచుగా జుట్టు నూనెతో పాటు కరివేపాకును ఉపయోగించడాన్ని నివారించడం మంచిది.
 • కరివేపాకు మొక్కకు  కాసిన పిందులను తినకూడదు. ఈ విషయంపై ఇంకా పరిశోధన చేయవలసి ఉన్నప్పటికీ, కరివేపాకు పిందులు విషపూరితమని చెపుతారు.

వంటకాలకు సువాసనను అందించగల ఒక ఆహార పదార్థంగా మాత్రమే కాకుండా, కరివేపాకులకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, కరివేపాకులు ఎందుకు మరియు ఎలా మానవ శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తున్నాయని తెలుసునేందుకు శాస్త్రవేత్తలు ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారు. ఇతర ఆహార పదార్దాల మాదిరిగానే కరివేపాకులు కూడా కొన్ని దుష్ప్రభావాలు కలిగి ఉంటాయి అయితే అవి తాత్కాలికమైనవి మాత్రమే. అవి వ్యక్తిగత శరీరక తీరు మరియు దానిని వినియోగించిన విధానంపై ఆధారపడి ఉంటుంది.

और पढ़ें ...