దానిమ్మ అనేది లెథరేసీ (Lythraceae) కుటుంబానికి చెందిన ఉపఉష్ణమండల పండు. సాధారణంగా హిందీలో అనార్ అని పిలుస్తారు, దానిమ్మపండు దాని రాసాలూరే రుచి వలన బాగా ప్రసిద్ధి పొందింది. కానీ ఈ పండు కేవలం రుచిని మాత్రమే అందించదు. దానిమ్మలో పొటాషియం, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి, చాలా తక్కువ కేలరీలు ఉంటాయి మరియు ఫైబర్ యొక్క ఒక అద్భుతమైన వనరు. దానిమ్మపండు యొక్క తాజా రసంలో అధిక మొత్తంలో పాలిఫేనోల్స్ ఉంటాయి ఇది ఒక ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్, దీనిలో అంథోసయనిన్లు, ఎల్లాగిక్ యాసిడ్ మరియు టానిన్లు వంటి పాలిఫేనోల్స్ ఉంటాయి. ఈ బయోఆక్టివ్ పదార్థాలన్నీ కలిపి దానిమ్మను పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి ఉపయోగపడే అద్భుతమైన ఔషధంగా చెప్పగల ఒక "సూపర్ ఫుడ్" గా తయారుచేసాయి. ఇది కడుపు నొప్పి, కండ్లకలక, మోనోపాస్ వలన కలిగే వేడి ఆవిర్లు, ఆస్టియోఆర్థరైటిస్ మరియు హేమోరాయిడ్స్ వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. అదనంగా, ఇది చాలా ప్రభావవంతమైన వాపు నిరోధక (యాంటీ-ఇన్ఫలమేటరి) మరియు ఇమ్యునోమోడలింగ్ (రోగనిరోధక శక్తిని పెంచే) ఏజెంట్. వాస్తవానికి, ఇది ఆరోగ్యానికి అందించే అనేక ప్రయోజనాల వలన దీనిని "అనేక విత్తనాలు కలిగిన ఆపిల్" గా పిలుస్తారు.

దానిమ్మపండు దాని తలపై కిరీటంతో కెంపు వంటి ఎరుపు రంగులో ఉంటుంది. తేమతో కూడిన ఉష్ణమండలలో మరియు మధ్యదార ప్రాంతాలలో దానిమ్మ చెట్టు సులభంగా పెరుగుతుంది మరియు పండు సరిగా పరిపక్వం (ముగ్గడానికి) చెందటానికి ఎక్కువ కాలం పాటు ఉండే ఎండాకాలం అవసరం. ఇది లోతైన బంక నేలలో పెరుగుతుంది, కానీ వివిధ రకాల నేలలను కూడా తట్టుకోగలదు. ఇవి భూమి ఉత్తర భాగంలో సెప్టెంబర్ నుండి ఫిబ్రవరి వరకు మరియు దక్షిణ భాగంలో మార్చి నుండి మే నెలల వరకు అందుబాటులో ఉంటాయి. దానిమ్మపండు పండు లోపల అనేక చిన్న ముత్యాల వంటి తినదగిన విత్తనాలు ఉంటాయి, అవి ఒక ప్రత్యేకమైన క్రంచ్ (తినేటప్పుడు కరకరమనే) ను మరియు తీపి కలిగి ఉంటాయి. స్మూతీలు, వైన్లు, కాక్టెయిల్లు, సలాడ్లు, ఆహార పదార్దాల అలంకారాలలోనూ (గార్నిష్), కేకులు మరియు రసాలు వంటి తీపి మరియు రుచికరమైన వంటకాల్లో వీటిని వాడతారు.

పురాతన నాగరికతలలో దానిమ్మపండు యొక్క తొక్కలతో తోలు(leather)లకు రంగు వేసేవారని  మరియు దానిమ్మపండు పూవ్వులతో ఎరుపు రంగును తయారు చేసేవారని తెలిస్తే మనకు ఆశ్చర్యం కలుగక మానదు. దీనిని కొన్ని వర్గాల వారు పవిత్రమైన పండుగా భావించేవారు మరియు కొంతమంది గ్రీకు దేవతలకు ప్రత్యేకంగా సమర్పించేవారు. హిందూమతంలో, దానిమ్మ విత్తనాలను సమృద్దైన సంతానానికి చిహ్నంగా భావిస్తారు. ఇది కేవలం వారి విశ్వాసం మాత్రమే కాకపోవచ్చు, బహుశా వారికీ ఈ చిన్న గింజలు యొక్క అద్భుతాలు తెలిసి ఉండవచ్చు.

 

దానిమ్మపండు గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు:

  • శాస్త్రీయ నామం: ప్యూనికా గ్రానేటం (Punica granatum)
  • కుటుంబం: లెథరేసీ (Lythraceae)
  • సాధారణ నామం: అనార్, దానిమ్మ
  • సంస్కృత నామం: దాడిమ్ (Dāḍimaṁ)
  • ఉపయోగించే భాగాలు: బెరడు, కాండము, పండ్లు, పువ్వులు మరియు ఆకులు దానిమ్మపండు చెట్టు యొక్క అన్ని భాగాలు ఉపయోగకరంగా ఉంటాయి
  • స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం: దానిమ్మపండు ఇరాన్ నుంచి ఉత్తర భారతదేశంలో హిమాలయాలకు వచ్చింది మరియు పురాతన కాలం నుండి మధ్యధరా ప్రాంతం మొత్తంలో సాగుచేయబడుతుంది. ఇది భారతదేశం అంతటా విస్తృతంగా  సాగుచేయబడుతుంది మరియు దీనిని ఆగ్నేయ ఆసియా, ఈస్ట్ ఇండీస్, మలయా, మరియు ఉష్ణమండల ఆఫ్రికా యొక్క పొడి భాగాలలో సాగు చేస్తారు. 1769 లో, స్పానిష్ సెటిలర్లు ఈ చెట్టును కాలిఫోర్నియాలోకి ప్రవేశపెట్టారు. యునైటెడ్ స్టేట్స్ లో, ఇది ప్రధానంగా కాలిఫోర్నియా మరియు అరిజోనాలోని పొడి భాగాలలో సాగుచేయబడుతుంది . చైనా, బంగ్లాదేశ్, భారతదేశం, పాకిస్తాన్, జపాన్, ఈజిప్టు, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, ఆఫ్గనిస్తాన్, బర్మా మరియు సౌదీ అరేబియా దేశాలు దీనిని ప్రధానంగా సాగుచేస్తున్నారు.
  • ఆసక్తికరమైన నిజాలు: రిఫ్రిజిరేటర్ లో రెండు నెలల వరకు దానిమ్మలను నిల్వ చేయవచ్చు.
    దానిమ్మ చెట్లు 200 సంవత్సరాలకు పైగా నివసిస్తాయి.
  1. దానిమ్మపండు పోషక వాస్తవాలు - Pomegranate nutrition facts in Telugu
  2. దానిమ్మ ఆరోగ్య ప్రయోజనాలు - Pomegranate health benefits in Telugu
  3. దానిమ్మ దుష్ప్రభావాలు - Pomegranate Side effects in Telugu
  4. ఉపసంహారం - Takeaway in Telugu

ఫైబర్లు, ఖనిజాలు (మినరల్స్), విటమిన్లు మరియు బయోఆక్టివ్ సమ్మేళనాలతో దానిమ్మ పండు నిండి ఉంటుంది. దీనిలో కొలెస్ట్రాల్ లేదా ఎటువంటి సాచురేటెడ్ కొవ్వులు ఉండవు. అలాగే దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు మరియు బయోఆక్టివ్ పాలిఫేనోల్స్ అధిక సాంద్రతలో ఉంటాయి. ఒక కప్పు దానిమ్మపండు గింజలు 24 గ్రాముల చక్కెర మరియు 144 కేలరీలు కలిగి ఉంటాయి.

యు.యస్.డి.ఏ (USDA) న్యూట్రిషన్ డేటాబేస్ ప్రకారం, 100 గ్రాముల దానిమ్మ ఈ క్రింది పోషక విలువలను కలిగి ఉంటుంది:

పోషకాలు

100 గ్రాములకు

నీరు

77.93 గ్రా

శక్తి

83 కిలో కేలరీలు

ప్రోటీన్

1.67 గ్రా

కొవ్వులు

1.17 గ్రా

కార్బోహైడ్రేట్లు

18.70 గ్రా

ఫైబర్

4.0 గ్రా

చక్కెరలు

13.67 గ్రా

ఖనిజాలు  

100 గ్రామూలకు

కాల్షియం

10 mg

ఐరన్

0.30 mg

మెగ్నీషియం

12 mg

ఫాస్ఫరస్ 

36 mg

పొటాషియం

236 mg

జింక్

0.35 mg

సోడియం

3mg

విటమిన్లు  

100 గ్రాములకు

విటమిన్ బి1

0.067 mg

విటమిన్ బి2

0.053 mg

విటమిన్ బి6

0.075 mg

విటమిన్ బి3

0.293 mg

విటమిన్ బి9

38 μg

విటమిన్ సి

10.2 mg

విటమిన్ ఇ

0.6 μg

విటమిన్ కె

16.4 mg

కొవ్వులు / కొవ్వు ఆమ్లాలు

100 గ్రాములకు

అసంతృప్త

0.120 గ్రా

మోనోఅన్సాచురేటెడ్

0.093 గ్రా

పాలీఅన్సాచురేటెడ్   

0.079 గ్రా

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.
Long Time Capsule
₹714  ₹799  10% OFF
BUY NOW
  • దానిమ్మ విటమిన్ సి కి  ఒక ఉత్తమైన వనరు, విటమిన్ సి చర్మ,రక్తనాళాల  మరియు ఎముకల ఆరోగ్యంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది, కాబట్టి దానిమ్మను తీసుకుంటే  చర్మం మరియు ఎముకల ఆరోగ్య మెరుగుపడుతుంది
  • క్యాన్సర్, గుండె జబ్బులు, ఊబకాయం, టైప్ 2 మధుమేహం, మరియు అల్జీమర్స్ వంటి అనేక సమస్యల ప్రధాన లక్షణం వాపు. దానిమ్మకు  వాపు నిరోధక లక్షణాలు ఉన్నాయని అనేక అధ్యయనాలు సూచించాయి. దానిమ్మలో ఉండే ప్యూనిసిక్ ఆసిడ్ వాపు నిరోధక చర్యలకు బాధ్యత వహిస్తుందని తెలుస్తుంది.
  • దానిమ్మకు ప్రభావంతమైన రక్త చెక్కెర స్థాయిలను తగ్గించే చర్యలు ఉన్నాయి.దానిమ్మ గింజలు మరియు పువ్వులు ఈ లక్షణాలను కలిగి ఉన్నాయని అనేక అధ్యయనాలు సూచించాయి.
  • దానిమ్మ ఒక అద్భుతమైన హైపోటెన్సివ్ ఏజెంట్ (రక్తపోటును తగ్గించే చర్య), తద్వారా ఇది గుండె మీద అధిక ఒత్తిడిని తగ్గిస్తుంది. దానిమ్మలో ఉండే ప్యూనిసిక్ ఆసిడ్ అనే ఫ్యాటీఆసిడ్ దీనికి కారణం అని కొన్ని పరిశోధనలు తెలిపాయి.
  • దానిమ్మ రసం తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) యొక్క ఆక్సిడేషన్ ను నిరోధిస్తుంది, ఈ ఆక్సిడేషన్ చర్య ఎథీరోస్క్లెరోసిస్ కు ఒక ముఖ్య కారణం, తద్వారా దానిమ్మ ఎథీరోస్క్లెరోసిస్ను మరియు అలాగే గుండెను కూడా  రక్షిస్తుంది.
  • కాండిడా అల్బికెన్స్ అనే ఈస్ట్ పై పోరాడడంలో దానిమ్మపండు చాలా సమర్థవంతంగా ఉందని అధ్యయనాలు పేర్కొన్నాయి అలాగే దానిమ్మకు అనేక యాంటీ మైక్రోబియల్ మరియు యాంటీ బాక్టీరియల్ చర్యలు ఉన్నాయి.
  • దానిమ్మ నోటి  ఆరోగ్యానికి అవసరమైన పండు. ఇది పెరియోడోంటైటిస్ మరియు జింజివైటిస్ వంటి వ్యాధుల నుండి పంటి చిగుళ్ళను మరియు దంతాలను రక్షిస్తుంది.  
  • ప్రోస్టేట్ క్యాన్సర్ మరియు రొమ్ము క్యాన్సర్ వంటి వివిధ రకాల క్యాన్సర్లపై వ్యతిరేకంగా దానిమ్మ చర్యలు చూపిస్తుందని కొన్ని అధ్యాయాలను తెలిపాయి అయితే దీనిపై మరింత పరిశోధన అవసరం

విటమిన్ సి వనరుగా దానిమ్మపండు - Pomegranate as a vitamin C source in Telugu

రక్త నాళాలు, చర్మం మరియు ఎముకల అభివృద్ధి మరియు నిర్వహణకు విటమిన్ సి చాలా ముఖ్యం. దానిమ్మ ఈ విటమిన్ యొక్క సహజ మూలం/వనరు. దానిమ్మ రసం మానవ శరీరానికి రోజువారీ అవసరమయ్యే విటమిన్ సిలో 40% కంటే ఎక్కువ భాగాన్ని అందిస్తుంది. కానీ ఇది పాశ్చరైజేషన్ సమయంలో విచ్ఛిన్నమైపోతుంది (తొలగిపోతుంది), కాబట్టి ఉత్తమమైన పోషక ప్రయోజనాలను పొందడానికి ఇంట్లో తయారు చేసిన లేదా తాజా దానిమ్మపండు రసాన్ని తీసుకోవడం మంచిది.

యాంటీ ఇన్ఫలమేటరీ ఏజెంట్ గా దానిమ్మ - Pomegranate as an anti-inflammatory agent in Telugu

దీర్ఘకాలిక వాపు క్యాన్సర్, గుండె జబ్బులు, ఊబకాయం, టైప్ 2 మధుమేహం, మరియు అల్జీమర్స్ తో సహా అనేక తీవ్రమైన వ్యాధుల ముఖ్య కారణాలలో ఒకటి.

జీర్ణశయాంతర ప్రేగుల యొక్క వాపు పరిస్థితులను తగ్గించడంలో దానిమ్మపండు ప్రభావవంతంగా ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అదనంగా, దానిమ్మపండులో ఉండే ఎల్లాజిక్ ఆసిడ్ (ellagic acid) ఈ పండు యొక్క వాపు నిరోధక లక్షణాలకు బాధ్యత వహిస్తుందని ఈ అధ్యయనం నివేదించింది.

టైప్ 2 మధుమేహంతో బాధపడుతున్న 50 మందితో ఒక 12-వారాల అధ్యయనం నిర్వహించబడింది. ప్రతిరోజు ఒక నిర్దిష్ట మొత్తంలో దానిమ్మ రసం తీసుకోవడం వలన ఇంటర్లీకిన్ 6 మరియు ఇన్ఫలమేటరి మార్కర్ సిఆర్ పి(CRP) లను తగ్గించవచ్చని ఈ అధ్యయనం సూచించింది. మధుమేహ రోగులలో వాపు తగ్గించడానికి వారి ఆహార విధానంలో దానిమ్మను చేర్చవచ్చు.

ల్యాబ్ అధ్యయనాలు దానిమ్మపండులో ఉండే ప్యూనిసిక్ యాసిడ్ (punicic acid), కొన్ని రొమ్ము క్యాన్సర్ కణలుకు వ్యతిరేకంగా బలమైన వాపు నిరోధక ప్రభావాన్ని చూపిందని సూచిస్తున్నాయి.

(మరింత సమాచారం: ఇన్ఫలమేటరీ వ్యాధి)

మధుమేహం కోసం దానిమ్మ - Pomegranate for diabetes in Telugu

శరీరంలోని రక్త చక్కెర స్థాయిలను తగ్గించడంలో దానిమ్మలు చాలా ప్రభావవంతమైనవి. మధుమేహం మరియు హైపర్ గ్లైసీమియా (hyperglycemia) తో బాధపడుతున్న రోగులపై ముఖ్యంగా దానిమ్మ చెట్టు పువ్వులు మరియు దానిమ్మ గింజలు ప్రభావవంతంగా ఉంటాయి. రక్త చక్కెర స్థాయిలను తగ్గించడం మరియు హైపోగ్లైసెమిక్ లక్షణాలలో దానిమ్మ సామర్థ్యాలను అర్థం చేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా వైద్యులు దానిమ్మ గింజలు, పువ్వులు, సారాలు మరియు రసాలపై వివిధ అధ్యయనం చేస్తున్నారు.

దానిమ్మపండులోని కొన్ని సమ్మేళనాలు యాంటి డయాబెటిక్ చర్యలను కలిగి ఉన్నాయని పరిశోధనలు తెలుపుతున్నాయి. ఇంకా, దానిమ్మ రసంలో ప్రత్యేక యాంటీఆక్సిడెంట్ పోలీఫెనోల్స్ అయిన టానిన్లు మరియు అంథోసయనిన్లు ఉన్నట్లు గుర్తించారు, ఇవి  టైప్ 2 డయాబెటీస్ పరిస్థితులను నియంత్రించడానికి సహాయపడతాయి. కాబట్టి, దానిమ్మపండు యొక్క డయాబెటిక్ వ్యతిరేక చర్యలకు రుజువు ఉంది, అయితే ఇది నిశ్చయాత్మకమైనది కాదు.

(మరింత సమాచారం: మధుమేహ సంరక్షణ)

రక్తపోటు కోసం దానిమ్మ - Pomegranate for blood pressure in Telugu

అధిక రక్తపోటు ప్రతి తరంలో సాధారణమైనది. ఇది సాధారణంగా సరిలేని జీవనశైలి మరియు ఆహార అలవాట్లతో ముడిపడి ఉంటుంది మరియు ఇది స్ట్రోక్ మరియు గుండెపోటుకు ఒక ముఖ్యమైన కారణంగా పరిగణించబడుతుంది. ఒక అధ్యయనం ప్రకారం, 2 వారాల పాటు ప్రతిరోజూ 5 ఔన్సుల దానిమ్మ రసాలను తీసుకోవడం వల్ల రక్తపోటు గణనీయంగా తగ్గిందని తెలిసింది. మరో అధ్యయనం దానిమ్మ రసం సిస్టోలిక్ రక్తపోటును గణనీయంగా తగ్గిస్తుందని కనుగొంది.

(మరింత సమాచారం: అధిక రక్తపోటు)

గుండెకు దానిమ్మపండు - Pomegranate for heart in Telugu

ప్రపంచ వ్యాప్తంగా అకాల మరణానికి అతి సాధారణ కారణాలు గుండెవ్యాధులు. ఒత్తిడి, జీవనశైలి, అధిక రక్తపోటు మరియు శరీరంలోని అసమతుల్య కొలెస్ట్రాల్ స్థాయిలు వంటి వివిధ కారణాలు గుండె వ్యాధుల ప్రాబల్యానికి కారణం. దానిమ్మ గుండె మీద కలిగే అదనపు ఒత్తిడి నుండి ఉపశమనం కలిగించే ఒక మంచి హైపోటెన్సివ్ ఏజెంట్ [hypotensive agent ](రక్తపోటును తగ్గిస్తుంది) గా గుర్తించబడింది. దానిమ్మపండులో ప్యూనిసిక్ ఆసిడ్ అని పిలవబడే ఒక ఫ్యాటీ ఆసిడ్ ఉంటుంది, ఇది గుండె జబ్బుకు వ్యతిరేకంగా రక్షించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి,.

ఒక క్లినికల్ అధ్యయనంలో, అధిక కొలెస్ట్రాల్తో బాధపడుతున్న 51 మందికి నాలుగు వారాల పాటు దానిమ్మపండు గింజల నూనె ఇవ్వడం జరిగింది. నియమిత కాలం ముగిసే సమయానికి, ట్రైగ్లిజరైడ్స్ మరియు అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ల (HDL) యొక్క మెరుగైన నిష్పత్తితో పాటు ట్రైగ్లిజరైడ్ స్థాయిలు గణనీయంగా తగ్గాయి. మరొక అధ్యయనంలో టైప్ 2 డయాబెటిస్ మరియు హైపర్ కొలెస్టెరోలేమియా (అధిక కొలెస్ట్రాల్) తో బాధపడుతున్న వారికీ దానిమ్మపండు రసాన్ని ఇవ్వడం ద్వారా వారిలో చెడు కొలెస్టరాల్ స్థాయిలలో (LDL) గణనీయమైన తగ్గుదల గమనింపబడింది. తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL)లో ఆక్సిడేషన్ జరగడం వలన అది ఎథీరోస్క్లెరోసిస్కు కారణమవుంతుంది, అయితే దానిమ్మ రసం  తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ యొక్క ఆక్సిడేషన్ను నిరోధిస్తుందని నిరూపించబడింది.

(మరింత సమాచారం: గుండె వ్యాధి కారణాలు)

అంగస్తంభన లోపం కోసం దానిమ్మ రసం - Pomegranate juice for erectile dysfunction in Telugu

అంగస్తంభన లోపం ఆక్సిడెటివ్ డామేజ్ తో ముడిపడి ఉంటుంది, ఇది పురుషాంగ కణజాలంలో రక్త ప్రవాహ తగ్గుదలకు కారణమవుతుంది. సాంప్రదాయకంగా దానిమ్మ రసాన్ని అంగస్తంభన లోపం యొక్క లక్షణాలను తగ్గించడానికి ఉపయోగిస్తారు. జంతువులపై చేసిన అధ్యయనాలు దానిమ్మ రసం పురుషాంగ కణజాలంలో రక్త ప్రవాహాన్ని పెంచుతుందని సూచిస్తుంది, తద్వారా అది అంగస్తంభనకు సహాయపడుతుంది.

ఒక క్లినికల్ అధ్యయనంలో, అంగస్తంభన లోపంతో బాధపడుతున్న  53 పురుషులకు ప్రతిరోజూ దానిమ్మ రసం ఇవ్వబడింది. ఏదేమైనా, ఈ సమస్యను తగ్గించడంలో దానిమ్మపండు రసం ఎలాంటి సంతృప్తికరమైన ప్రభావాలు చూపలేదని ఈ అధ్యయనం నివేదించింది.

అంగస్తంభన లోపం యొక్క చికిత్సలో దానిమ్మ యొక్క సమర్థతను అర్థం చేసుకోవడానికి ఇంకా విస్తృతమైన పరిశోధన అవసరమవుతుంది.

యాంటిమైక్రోబయాల్ గా దానిమ్మపండు - Pomegranate as an antimicrobial in Telugu

దానిమ్మపండులో హానికరమైన సూక్ష్మజీవులతో పోరాడడంలో సహాయపడే మొక్కల సమ్మేళనాలు (plant compounds) ఉంటాయి. ఇన్ఫెక్షన్లను కలిగించే కాండిడా అల్బికెన్స్ (Candida albicans) అనే ఈస్ట్ పై పోరాడడంలో దానిమ్మపండు చాలా సమర్థవంతంగా ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కాపర్ తో కలిసిన దానిమ్మ సారాలు స్టెఫిలోకోకస్ ఆరియస్ (Staphylococcus aureus) యొక్క మితిసిల్లిన్-రెసిస్టెంట్ స్ట్రెయిన్స్ పై వ్యతిరేకంగా కొన్ని యాంటీమైక్రోబయాల్ చర్యలను కలిగి ఉన్నాయని కనుగొనబడింది. దానిమ్మపండు సారాల యొక్క యాంటీ బాక్టీరియల్ ప్రభావాలను కొన్ని ఓరల్ (నోటి) బ్యాక్టీరియాలను నివారించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి, పెరియోడోంటైటిస్ మరియు జింజివైటిస్ వంటి వ్యాధుల నుండి పంటి చిగుళ్ళను మరియు దంతాలను దానిమ్మ రక్షిస్తుంది.

మెదడుకు దానిమ్మపండు - Pomegranate for brain in Telugu

జ్ఞాపకశక్తి మెరుగుదలతో దానిమ్మ ముడిపడి ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. శస్త్రచికిత్స జరిగిన రోగులపై చేసిన అధ్యయనంలో దానిమ్మపండు సారం శస్త్రచికిత్స తర్వాత రోగులలో జ్ఞాపకశక్తి లోపాన్ని నిరోధించగలదని సూచించింది. మరోక అధ్యయనం దానిమ్మపండు రసం దృశ్య మరియు శబ్ద మెమోరీ మార్కర్లను (visual and verbal memory markers) మెరుగుపరుస్తుందని సూచిస్తుంది. అంతేకాకుండా, అల్జీమర్స్ యొక్క లక్షణాలపై పోరాడడంలో  కూడా దానిమ్మ సహాయపడుతుందని కనుగొనబడింది.

(మరింత సమాచారం: చిత్తవైకల్యం చికిత్స)

జాయింట్ నొప్పులు మరియు ఆర్థరైటిస్ కోసం దానిమ్మ - Pomegranate for joint pain and arthritis in Telugu

దానిమ్మపండు యొక్క వాపు నిరోధక లక్షణాలు ఆర్థరైటిస్ వలన కలిగే జాయింట్ల వాపును తగ్గించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దానిమ్మపండు సారాలు ఆస్టియోఆర్థరైటిస్ ఉన్నవారిలో కీళ్ళకు హాని కలిగించే ఎంజైమ్లను నిరోధించడంలో సహాయకరంగా ఉంటుందని ఒక ప్రయోగశాల ఆధారిత పరిశోధన సూచించింది . ఇన్ వివో అధ్యయనాలు కూడా దానిమ్మపండు సారాలకు ఆర్థిరైటిస్ వ్యతిరేక ప్రభావాలు ఉన్నాయని తెలిపాయి. కానీ మానవులపై ఇప్పటివరకు పరిమితమైన పరిశోధన మాత్రమే నిర్వహించబడింది, కాబట్టి దానిమ్మపండు యొక్క యాంటీ-ఆర్థిరైటిక్ ప్రభావాల గురించి మరింత తెలుసుకోవడానికి వైద్యునితో మాట్లాడటం ఉత్తమం.

క్యాన్సర్ నివారణకు దానిమ్మపండు - Pomegranates prevent cancer in Telugu

పురుషులలో సంభవించే క్యాన్సర్లలో సాధారణమైన రకం ప్రోస్టేట్ క్యాన్సర్. క్యాన్సర్ కణాల అభివృద్ధిని నిరోధించేందుకు మరియు క్యాన్సర్ కణాలకు మరణం కలిగించడంలో కూడా దానిమ్మపండు యొక్క సారాలు ఉపయోగకరంగా ఉంటాయని ఒక ప్రయోగశాల ఆధారిత అధ్యయనం తెలిపింది. ప్రోస్టేట్ క్యాన్సర్ కోసం రక్తంలో ఉండే ఒక రకమైన బ్లడ్ మార్కర్ ప్రోస్టేట్-స్పెసిఫిక్ యాంటిజెన్ (PSA). ఈ ప్రోస్టేట్-స్పెసిఫిక్ యాంటిజెన్ సంఖ్య/స్థాయి తక్కువ సమయంలోనే రెట్టింపైతే, అది పురుషులు ప్రోస్టేట్ క్యాన్సర్ కారణంగా మరణించే ప్రమాదాన్ని సూచిస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం, దానిమ్మపండు రసాన్ని రోజూ 8 ఔన్సులు తీసుకుంటే ప్రోస్టేట్-స్పెసిఫిక్ యాంటిజెన్ రెట్టింపు అయ్యే సమయాన్ని 15 నెలల నుండి 54 నెలల వరకు పెంచుతుంది, ఇది ఒక విశేషమైన చర్య అని ఆ అధ్యయనం సూచించింది. మరొక అధ్యయనం దానిమ్మపండు సారాన్ని ఉపయోగించి ఇదే ఫలితాన్ని కనుగొంది.

ఇతర అధ్యయనాలు కూడా, రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను దానిమ్మపండు సారాలు నిరోధిస్తాయని పేర్కొన్నాయి. అయితే, ప్రయోగశాల అధ్యయనాలకు మాత్రమే ఈ రుజువు పరిమితమై ఉంది. క్యాన్సర్ పై దానిమ్మ ప్రభావాలను ధృవీకరించడానికి మరింత పరిశోధన అవసరం.

(మరింత సమాచారం: క్యాన్సర్ రకాలు)

  • అల్ప రక్తపోటు
    దానిమ్మ రసం శరీరంలో రక్తపోటు స్థాయిలను తగ్గిస్తుందని గుర్తించబడింది. అల్ప  రక్తపోటుతో బాధపడుతున్నట్లయితే, దానిమ్మపండు రసం త్రాగడం మంచిది కాదు.
  • అలెర్జీ
    దానిమ్మపండు కొంతమందిలో అలెర్జీని కలిగించవచ్చు. దానిమ్మపండు అలెర్జీ యొక్క లక్షణాలలో  మ్రింగడం కష్టం కావడం, దద్దుర్లు, ముఖం వాచిపోవడం మరియు శ్వాస తీసుకోవడంలో కఠినత వంటివి ఉంటాయి.
  • దానిమ్మపండు ఎంజైమ్ కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది
    దానిమ్మపండులో కొన్ని ఎంజైమ్లు ఉంటాయి, అవి  కాలేయం యొక్క పనితీరును అడ్డుకోవచ్చు. ఒక వ్యక్తి కాలేయ రుగ్మత కోసం ఏవైనా మందులు వాడుతున్నట్లయితే, అతను/ఆమె దానిమ్మను  తినే ముందు వైద్యులని సంప్రదించాలి.
  • దానిమ్మ అధిక చక్కెర శాతాన్ని  కలిగి ఉంటుంది
    మధుమేహంపై పోరాడడంలో దానిమ్మపండు ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, దానిమ్మలో చక్కెరలు అధికంగా ఉంటాయి అవి రక్తంలో చెక్కర స్థాయిలను పెంచుతుంది, అందువలన మధుమేహంతో బాధపడుతున్న రోగులు దానిమ్మను తీసుకునే ముందు జాగ్రత్త వహించాలి.
  • అధిక కేలరీలు
    బరువును తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్న వారు దానిమ్మపండును తీసుకోవడాన్ని నిరోధించాలి ఎందుకంటే దీనిలో కేలరీలు అధికంగా ఉంటాయి మరియు అవి బరువు పెరుగుదలకు దారి తీయవచ్చు.
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Kesh Art Hair Oil by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to more than 1 lakh people for multiple hair problems (hair fall, gray hair, and dandruff) with good results.
Bhringraj Hair Oil
₹795  ₹850  6% OFF
BUY NOW

దానిమ్మపండు గొప్ప మరియు రుచికరమైన పండు. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంటుంది మరియు క్యాన్సర్, మధుమేహం, మరియు రక్తపోటు వంటి అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల లక్షణాల నుండి ఉపశమనం అందించగలదు. దానిమ్మపండులో వివిధ యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు, విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి, ఇవి మానవ శరీరానికి చాలా లాభదాయకం. దానిమ్మ యొక్క అనేక ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. దానిమ్మ పళ్ళను అధికముగా తీసుకుంటే అవి హాని కలిగించవచ్చు మరియు కొంతమంది ఈ పండుకు అలెర్జీక్ గా కావచ్చు. ఏదేమైనప్పటికీ తగినంత పరిమాణంలో దానిమ్మను తీసుకోవడం ద్వారా అది శరీరానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది.


Medicines / Products that contain Pomegranate

వనరులు

  1. United States Department of Agriculture Agricultural Research Service. Basic Report: 09286, Pomegranates, raw. National Nutrient Database for Standard Reference Legacy Release [Internet]
  2. Colombo E, Sangiovanni E, Dell'agli M. A review on the anti-inflammatory activity of pomegranate in the gastrointestinal tract. Evid Based Complement Alternat Med. 2013;2013:247145. PMID: 23573120
  3. Costantini S et al. Potential anti-inflammatory effects of the hydrophilic fraction of pomegranate (Punica granatum L.) seed oil on breast cancer cell lines. Molecules. 2014 Jun 24;19(6):8644-60. PMID: 24962397
  4. Sohrab G et al. Effects of pomegranate juice consumption on inflammatory markers in patients with type 2 diabetes: A randomized, placebo-controlled trial. J Res Med Sci. 2014 Mar;19(3):215-20. PMID: 24949028
  5. Sineh Sepehr K. Studies on the Cytotoxic Activities of Punica granatum L. var. spinosa (Apple Punice) Extract on Prostate Cell Line by Induction of Apoptosis. ISRN Pharm. 2012;2012:547942. PMID: 23320197
  6. Shirode AB et al. Antiproliferative effects of pomegranate extract in MCF-7 breast cancer cells are associated with reduced DNA repair gene expression and induction of double strand breaks. Mol Carcinog. 2014 Jun;53(6):458-70. PMID: 23359482
  7. Pantuck AJ et al. Phase II study of pomegranate juice for men with rising prostate-specific antigen following surgery or radiation for prostate cancer. Clin Cancer Res. 2006 Jul 1;12(13):4018-26. PMID: 16818701
  8. CJ Paller et al. A randomized phase II study of pomegranate extract for men with rising PSA following initial therapy for localized prostate cancer . Prostate Cancer Prostatic Dis. 2013 Mar; 16(1): 50–55. PMID: 22689129
  9. Jeune MA, Kumi-Diaka J, Brown J. Anticancer activities of pomegranate extracts and genistein in human breast cancer cells. J Med Food. 2005 Winter;8(4):469-75. PMID: 16379557
  10. Stowe CB. The effects of pomegranate juice consumption on blood pressure and cardiovascular health. . Complement Ther Clin Pract. 2011 May;17(2):113-5. PMID: 21457902
  11. Ahmed S et al. Punica granatum L. extract inhibits IL-1beta-induced expression of matrix metalloproteinases by inhibiting the activation of MAP kinases and NF-kappaB in human chondrocytes in vitro.J Nutr. 2005 Sep;135(9):2096-102. PMID: 16140882
  12. Hadipour-Jahromy M, Mozaffari-Kermani R. Chondroprotective effects of pomegranate juice on monoiodoacetate-induced osteoarthritis of the knee joint of mice. Phytother Res. 2010 Feb;24(2):182-5. PMID: 19504467
  13. World Health Organization [Internet]. Geneva (SUI): World Health Organization; The top 10 causes of death.
  14. Esmaillzadeh A et al. Cholesterol-lowering effect of concentrated pomegranate juice consumption in type II diabetic patients with hyperlipidemia. Int J Vitam Nutr Res. 2006 May;76(3):147-51. PMID: 17048194
  15. Kaplan M et al. Pomegranate juice supplementation to atherosclerotic mice reduces macrophage lipid peroxidation, cellular cholesterol accumulation and development of atherosclerosis. J Nutr. 2001 Aug;131(8):2082-9. PMID: 11481398
  16. Aviram M et al. Pomegranate juice consumption for 3 years by patients with carotid artery stenosis reduces common carotid intima-media thickness, blood pressure and LDL oxidation. Clin Nutr. 2004 Jun;23(3):423-33. PMID: 15158307
  17. Azadzoi KM et al. Oxidative stress in arteriogenic erectile dysfunction: prophylactic role of antioxidants. J Urol. 2005 Jul;174(1):386-93. PMID: 15947695
  18. Jurenka JS. Therapeutic applications of pomegranate (Punica granatum L.): a review. Altern Med Rev. 2008 Jun;13(2):128-44. PMID: 18590349
  19. Pai MB et al. Antifungal efficacy of Punica granatum, Acacia nilotica, Cuminum cyminum and Foeniculum vulgare on Candida albicans: an in vitro study. Indian J Dent Res. 2010 Jul-Sep;21(3):334-6. PMID: 20930339
  20. Vasconcelos LC et al. Use of Punica granatum as an antifungal agent against candidosis associated with denture stomatitis. Mycoses. 2003 Jun;46(5-6):192-6. PMID: 12801361
  21. Bookheimer SY et al. Pomegranate juice augments memory and FMRI activity in middle-aged and older adults with mild memory complaints. Evid Based Complement Alternat Med. 2013;2013:946298. PMID: 23970941
  22. Hartman RE et al. Pomegranate juice decreases amyloid load and improves behavior in a mouse model of Alzheimer's disease. . Neurobiol Dis. 2006 Dec;24(3):506-15. Epub 2006 Sep 28. PMID: 17010630
Read on app