గర్భధారణ అనేది చాలామంది మహిళలకు ఒక జీవితం మార్పు చెందే అనుభవం. గర్భధారణ సమయంలో ఒక మహిళ తన ఆహారాన్ని విధానాన్ని జాగ్రత్తగా ప్రణాళిక చేసుకుంటుంది. అలాగే, ప్రసవం తర్వాత కూడా ఆరోగ్యకరమైన ఆహార విధానం పాటించడం కూడా అంతే అవసరం. నిజానికి, ప్రసవం తరువాత అనుసరించవలసిన ఆహార విధానంపై, ఇంకా ఎక్కువ శ్రద్ధ అవసరం ఎందుకంటే తల్లి శిశువుకి చనుబాలు ఇవ్వవలిసిన బాధ్యత కలిగి ఉంటుంది. అంతేకాక, ఆమె రోజువారీ కార్యకలాపాలకు బలం మరియు శక్తి కూడా అవసరమవుతుంది, అందువల్ల అన్ని అవసరమైన పోషకాలను కలిగి ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవడం సహాయకరముగా ఉంటుంది.

గర్భధారణ సమయంలో తల్లులు చాలామంది బరువు పెరగవచ్చు. సాధారణంగా ప్రసవం తర్వాత తల్లులు అదనపు బరువును తగ్గించుకోవడానికి చర్యలు తీసుకోవాలని కోరుకుంటారు. పోషకరమైన ఆహారం దానిని సాధించడంలో కూడా సహాయపడుతుంది.

ప్రసవం తరువాత, స్త్రీలో పాలిచ్చే సమయం ప్రారంభమవుతుంది కాబట్టి ఆమె శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు జరుగుతాయి. ప్రసవం తర్వాత తీసుకునే ఆహారం సరిగ్గా చనుబాలివ్వడానికి సహాయాన్ని అందించే పోషకాలను కలిగి ఉండాలి, ఎందుకంటే ఇది నవజాత శిశువుకు పోషకాహారం అందే ఒకే ఒక మార్గం. ఈ వ్యాసం తల్లి మరియు శిశువులకు ఉపయోగకరంగా ఉండే ఆహారపదార్దాలు మరియు పోషకాల గురించి వివరిస్తుంది.

  1. సాధారణ ప్రసవం తరువాత ఆహార విధానం - Postnatal diet after normal delivery in Telugu
  2. శస్త్రచికిత్స ద్వారా ప్రసవం జరిగిన తరువాత ఆహారం - Postnatal diet after caesarian delivery in Telugu
  3. ప్రసవం తర్వాత తిసుకోవల్సిన ఆహారం కోసం భారతీయ ఆహార విధాన ప్రణాళిక - Indian diet plan after delivery in Telugu
  4. ప్రసవం తర్వాత బరువు తగ్గడానికి సహాయపడే ఆహార విధాన పట్టిక - Post-pregnancy diet chart to lose weight in Telugu
  5. ప్రసవం తర్వాత నివారించవలసిన ఆహారాలు - Foods to avoid post-pregnancy in Telugu

సాధారణ ప్రసవం, దీనిని యోని ప్రసవ విధానం అని కూడా పిలుస్తారు, దీనిలో యోని ద్వారా శిశువు బయటకు వస్తుంది. ఇది డెలివరీలలో అత్యంత ప్రమాదరహిత పద్ధతి మరియు దీనిలో తల్లి లేదా బిడ్డకు ఎక్కువ సమస్యలు కలుగవు. అయితే, తల్లి బిడ్డ జన్మించిన తర్వాత తన బలాన్ని తిరిగి పొందాలి మరియు బిడ్డకు సరిగ్గా తగినన్ని పాలు అందించాలి. ఈ అవసరాలను తీర్చడానికి, ఆహారం ఈ  క్రింది అంశాలను కలిగి ఉండాలి:

  • కార్భోహైడ్రేట్లు (పిండిపదార్థాలు):
    కార్భోహైడ్రేట్లు కొత్తగా తల్లైనా స్త్రీలకు తగ్గిపోయిన శక్తిని అందించడానికి అవసరమైన పోషకాలు. అయినప్పటికీ, తినేటప్పుడు సరైన కార్భోహైడ్రేట్లు ఎంచుకోవడం ముఖ్యం. హోల్ గ్రైన్ వీట్ బ్రెడ్, తృణధాన్యాలు మరియు ఇతర ఆరోగ్యకరమైన పిండి పదార్థాలను ఆహారం లో చేర్చాలి.
  • ప్రోటీన్లు:
    ప్రసవం తరువాత సాధారణంగా సులువుగా జీర్ణం అయ్యే ప్రోటీన్లు సిఫారసు చేయబడతాయి, లీన్ (మెత్తని) చికెన్, గుడ్లు, చేప, మరియు పప్పుల వంటివి తీసుకోవాలి. ప్రోటీన్లు ఆకలి తీరిన భావనను కలిగిస్తాయి మరియు బరువును తగ్గించుకోవాలనుకునే తల్లులకు కూడా ఇవి అవసరం. (మరింత సమాచారం: బరువు తగ్గుదల ఆహార విధాన పట్టిక)
  • ఫైబర్లు (పీచుపదార్దాలు):
    ప్రసవం తర్వాత తరచుగా మహిళలు మలబద్ధకాన్నీ అనుభవించవచ్చు. ఫైబర్లు అధికంగా ఉండే ఆహార వనరులైన వోట్ మీల్, అవిసెగింజలు లేదా ఆపిల్ పళ్ళు, మామిడి వంటి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పండ్లు లేదా కూరగాయలు మొదలైనవి ప్రసవం తర్వాత సమతుల్య ఆహారానికి చాలా అవసరం.
  • పాల ఉత్పత్తులు:
    పాలు, చీజ్ మరియు పెరుగు వంటి పాల ఉత్పత్తులు, ఇవి కాల్షియంకు కూడా గొప్ప వనరులు, తల్లి మరియు బిడ్డ కోసం చాలా ముఖ్యమైనవి. శాకాహారులు లేదా లాక్టోస్-అసహన ఉన్న తల్లులు లేదా లాక్టోస్-అసహనత ఉన్న బిడ్డ తల్లులు శాకాహార ఉత్పత్తులను ఎంచుకోవచ్చు.
  • తాజా పళ్ళు మరియు కూరగాయలు:
    తల్లులు, ప్రసవం తర్వాత వారి ఆహారం నుండి తగినంత విటమిన్లు మరియు ఖనిజాలు లభించడానికి తగినన్ని పండ్లు మరియు కూరగాయలు తీసుకోవాలి. న్యూట్రిషనిస్టులు ప్రసవం తర్వాత తల్లులు రోజుకు ఐదు సార్లైనా పళ్ళు తీసుకోవాలని సిఫార్సు చేస్తారు.
    (మరింత చదువు: విటమిన్ ఎ అధికంగా ఉండే ఆహారాలు)
Women Health Supplements
₹719  ₹799  10% OFF
BUY NOW

ప్రసవ సమయంలో సంక్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు శస్త్రచికిత్స ద్వారా ప్రసవం చెయ్యడం (సిజేరియన్ డెలివరీ) లేదా సి-సెక్షన్ సాధారణంగా సిఫార్సు చేయబడుతుంది. సిజేరియన్ డెలివరీ శిశువు మరియు తల్లి పట్ల అదనపు జాగ్రత్త అవసరం. శరీరం దాని శక్తిని తిరిగి పొందడానికి ప్రసవం తర్వాత తల్లి సరైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. శస్త్రచికిత్సా ప్రసవం తర్వాత ఆహారంలో చేర్చవలసిన పోషకాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి.

  • అధిక ఫైబర్ గల ఆహారం:
    సిజేరియన్ డెలివరీ తర్వాత తల్లులు పాస్తా లేదా జంక్ ఫుడ్లు వంటి ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇటువంటి ఆహారాలు ఉబ్బరం మరియు మలబద్ధకం కలిగించే అవకాశం ఉంటుంది. ఫైబర్-అధికంగా ఉండే ఆహార పదార్ధాల తీసుకోవడం వలన ఈ పరిస్థితులను నివారించడానికి మరియు మలవిసర్జన సులభతరం చేయడానికి సహాయపడతాయి.
  • ప్రోటీన్లు:
    ఆహారంలో ప్రోటీన్ తగినంత మొత్తంలో చేర్చడం వలన శస్త్రచికిత్స తర్వాత గాయం నయమయ్యే ప్రక్రియలో సహాయపడుతుంది. ప్రోటీన్లు కణజాలం యొక్క నిర్మాణం మరియు మరమత్తులో పాల్గొంటాయి, ఇవి శస్త్రచికిత్స యొక్క గాయం నయంకావడానికి సహాయపడతాయి. ఇవి శస్త్రచికిత్స తర్వాత శరీరం యొక్క కండర ద్రవ్యరాశిని (muscle mass) కూడా నిర్వహించడంలో సహాయపడతాయి. చేపలు (ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి) మరియు గుడ్లు వంటివి ఆహారంలో తీసుకోవడం వలన ప్రసవం తర్వాత అవసరమైన ప్రోటీన్లు అందిస్తాయి.
  • ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు:
    కొన్ని సందర్భాలలో, సిజేరియన్ పద్ధతిలో ప్రసవం జరిగిన సమయంలో తల్లికి ఎక్కువగా రక్తస్రావం అవుతుంది. హిమోగ్లోబిన్ స్థాయిలను నిర్వహించడానికి మరియు డెలివరీ ప్రక్రియలో కోల్పోయిన రక్తాన్ని భర్తీ చేయడానికి ఐరన్ చాలా అవసరం. గుడ్డు పచ్చ సొనలు,ఆక్రోటుకాయలు, బాదం పప్పులు మొదలైన ఐరన్ అధికంగా ఉండే ఆహార పదార్దాలను చేర్చాలి.
  • విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు:
    అంటువ్యాధులు పై పోరాడడంతో సహాయపడే విటమిన్ సి కొత్తగా తల్లి అయిన వారికీ అవసరం. ఈ విటమిన్ యొక్క యాంటీ ఆక్సిడెంట్ లక్షణం కణజాల మరమ్మత్తు (రిపేర్) ప్రక్రియను మెరుగుపరచడానికి మరియు కణజాల నస్టాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. విటమిన్ సి పుష్కలముగా ఉండే పండ్లు మరియు కూరగాయలు, నిమ్మకాయలు మరియు కివి వంటివి కొత్తగా తల్లి అయిన వారికి ఇచ్చే ఆహారంలో చేర్చాలి.
  • కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు:
    పాలు లేదా పాల ఉత్పత్తులు సాధారణంగా కాల్షియంను అధిక మొత్తంలో కలిగి ఉంటాయి, ఇది ఎముకలు పటిష్టం కావడానికి మరియు రక్తం గడ్డకట్టడానికి అవసరం. చీజ్, టోఫు, పెరుగు వంటి పాల ఉత్పత్తులలో తగినంత మొత్తంలో కాల్షియం ఉంటుంది.
    పాల ఉత్పత్తులతో పాటుగా, బచ్చలికూరలో కూడా కాల్షియం అధిక మొత్తంలో ఉంటుంది. చనుబాలు ఇచ్చే తల్లులు మంచి ఆరోగ్యం మరియు వారి బిడ్డ ఎదుగుదల కోసం తగినంత మొత్తంలో కాల్షియంను తీసుకోవాలి.

భారతీయ వంటకాల్లో మసాలాదినుసులు మరియు మూలికలను ఉపయోగించడం సాధారణం. ప్రసవం తర్వాత ఆహారంలో ఈ మసాలాదినుసులు  చేర్చితే అవి అద్భుతాలను చేయగలవు. భారతీయ పోస్ట్ డెలివరీ ఆహారం సాధారణంగా ఈ క్రింది పదార్ధాల వినియోగాన్ని సిఫార్సు చేస్తుంది:

  • పసుపు:
    ఇది అనేక విటమిన్లు, పొటాషియం, ఫైబర్, మాంగనీస్ మరియు మెగ్నీషియం యొక్క మూలంగా ఉంటుంది. భారతీయ వంటలో పసుపు ఒక ప్రామాణిక పదార్ధం మరియు అంతర్గత మరియు బాహ్య గాయాలు చికిత్స కోసం ఇది ఉపయోగపడుతుంది. పసుపు వాపు తగ్గించడానికి సహాయం చేయగలదని అధ్యయనాలు సూచిస్తున్నాయి మరియు ప్రసవం తరువాత ఏర్పడిన గాయాలను తగ్గించడంలో సహాయపడుతుందని భావిస్తారు. అయినప్పటికీ, దీని గురించి తెలుసుకోవడం కోసం మరిన్ని అధ్యయనాలు ఇంకా నిర్వహించాలి.
  • ఎండబెట్టిన అల్లం పొడి
    ఎండబెట్టి పొడి చేసిన అల్లంలో విటమిన్ ఇ మరియు అనేక ఖనిజాలు ఉంటాయి. దీనికి  వాపు నిరోధక ప్రభావం ఉంటుంది మరియు ఒక మోస్తరు మొత్తంలో దీనిని ఆహారంలో చేర్చాలని సూచించబడుతుంది.
  • కాయధాన్యాలు:
    భారతీయ ఆహార విధానం యొక్క ముఖ్యమైన భాగం కాయధాన్యాలు (పప్పులు). ప్రోటీన్లు, ఫైబర్లు, ఖనిజాలు, మరియు విటమిన్లలో అవి సమృద్ధిగా ఉంటాయి. అవి శరీరంలో కొవ్వు పేరుకుపోవడాన్ని నిరోధిస్తాయి మరియు జీర్ణ క్రియను కూడా సులభతరం చేస్తాయి. ప్రసవం తర్వాత ఆహారంలో పప్పులను చేర్చితే అవి బరువు తగ్గుదలను సాధించడంలో సహాయపడతాయి.
  • వాము:
    ఈ విత్తనాలను సాధారణంగా హిందీలో అజ్వైన్ అని పిలుస్తారు. ఆయుర్వేదంలో వాము, ప్రసవం తర్వాత తల్లులలో చనుబాలును పెంచుతుందని చెబుతారు. ఈ విషయంలో అధ్యయనాలు ఇంకా నిర్వహించవలసిన అవసరం ఉంది. ఇదికాక, వివిధ అధ్యయనాలు వాముకు యాంటీయాక్సిడెంట్ మరియు యాంటీసెప్టిక్ లక్షణాలు ఉన్నాయని అవి తల్లి మరియు శిశువులకు ప్రయోజనకరంగా ఉంటాయని సూచిస్తున్నాయి. కాబట్టి  ప్రసవం తర్వాత తీసుకునే ఆహారంలో వీటిని చేర్చాలని సిఫార్సు చేయబడుతుంది.
  • మెంతులు:
    మెంతులు లేదా మెంతి విత్తనాలు కాల్షియం, ఐరన్, విటమిన్లు మరియు ఖనిజాలకు గొప్ప వనరుగా ఉంటాయి. ఈ పోషకాలు తల్లి మరియు బిడ్డకు తగినంత మొత్తాలలో అవసరం. ఈ పోషకాలు మెంతి టీని పాలిచ్చే తల్లులకు ఒక ముఖ్య పానీయంగా చేస్తాయి.
  • రాగులు:
    వీటిని ఫింగర్ మిల్లెట్ అని కూడా పిలుస్తారు, ఇవి ఐరన్ మరియు కాల్షియం యొక్క అద్భుతమైన వనరులు, ఈ రెండు డెలివరీ తర్వాత అధిక మొత్తంలో అవసరమైన పోషకాలు. పాలు మరియు పాల ఉత్పత్తులకు అలెర్జీకి తల్లులు రాగులు మంచి ప్రత్యామ్నాయంగా సహాయపడతాయి.

కావలసిన ఫలితాలను సాధించడానికి సరైన ఆహారం ఎంపికలను చేసుకోవడంలో సహాయపడటానికి తల్లులు పోస్ట్ ప్రెగ్నన్సీ డైట్ చార్ట్ను అనుసరించవచ్చు. ఈ డైట్ చార్ట్ రోజూ అవసరమైన పోషకాలను తీసుకోవడానికి కూడా సహాయపడుతుంది, ఎందుకంటే ప్రసవం తర్వాత తల్లి మరియు బిడ్డ ఆరోగ్యానికి ఇది చాలా అవసరం.

ఆహారపదార్ద రకం

ఒక భాగంలో చేర్చవలసిన పరిమాణం

రోజుకు తీసుకోవలసిన భాగాలు

తృణధాన్యాలు, సాధారణంగా ఎక్కువ ఫైబర్ ఉండే తృణధాన్యాలు తీసుకోవాలి

  • క్రింద వాటిలో ఏదోకటి తీసుకోవచ్చు
  • వీట్ బ్రెడ్ ఒక స్లైసు (40గ్రా)
  • ఇంట్లో తయారు చేసిన తృణధాన్యాల అట్టు ఒకటి (40 గ్రా)
  • ½ కప్పు (70- 120గ్రా) వండిన అన్నం/ గోధుమలతో చేసిన నూడుల్స్ లేదా సేమియా
  • ¼ కప్పు (30గ్రా) మూసెలి (ఓట్స్ వంటి తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ వేసి చేసే చపాతీ)
  • ఒక చిన్న (35 గ్రా మఫిన్)

9

కూరగాయలు మరియు పప్పుధాన్యాలు/చిక్కులు

  • దాదాపు 75 గ్రా.
  • క్రింద వాటిలో ఏదోకటి తీసుకోవచ్చు
  • ½ కప్పు ఉడకబెట్టిన కూరగాయలు
  • ½ కప్పు వేయించిన చిక్కుడు గింజలు (బీన్స్),బఠాణీలు, శనగలు
  • బచ్చలి కూర, కాలే, బ్రోకలీ వంటి ఆకుకూరలు లేదా కీరదోస, క్యారెట్ వంటి కాయగూరల పచ్చి సలాడ్ ఒక కప్పు
  • ½  కప్పు స్వీట్ కార్న్ సూప్
  • ½  ఉడకబెట్టిన బంగాళాదుంప లేదా ఇతర స్టార్చ్ ఉండే కూరగాయలు
  • 1 మధ్యస్థ పరిమాణ టమాటా

7

పళ్ళు

దాదాపు 150 గ్రా

క్రింద వాటిలో ఏదోకటి తీసుకోవచ్చు

  • ఒక మధ్యస్థ సైజు  అరటి పండు, ఆపిల్, కమలా పండు,  బర్రి పండు
  • ఒక రెండు చిన్న ఆప్రికాట్ పళ్ళు, రేగుపళ్ళు

అప్పుడప్పుడూ:

  • ½ కప్పు (125 ఎం.ఎల్) పంచదార వేయని పండ్ల రసం
  • 30 గ్రా డ్రై ఫ్రూట్స్

 

2

పాలు, పెరుగు, చీజ్ లేదా/మరియు వేరే ప్రత్యామ్న్యాయాలు   

  • క్రింద వాటిలో ఏదోకటి తీసుకోవచ్చు
  • 1 కప్పు (250ఎం.ఎల్) మజ్జిగ
  • గట్టి చీజ్ 2 స్లైసులు (40 గ్రా)
  • 1 కప్పు (250 ఎం.ఎల్) సోయాబీన్, రైస్ లేదా ఇతర తృణధాన్యాలతో చేసిన పానీయం వాటిలో కనీసం 100mg/100 ml కాల్షియం ఉండాలి
  • 100గ్రా బాదం తొక్కతో సహా
  • 100గ్రా గట్టి టోఫు

2 ½

లీన్ (మెత్తని) మీట్ మరియు కోడి,చేప,గుడ్లు, గింజలు మరియు విత్తనాలు, పప్పుధాన్యాలు లేదా బీన్స్

  • 65గ్రా వండిన లీన్ మీట్
  • 80గ్రా వండిన లీన్ (మెత్తని) కోడి మాంసం
  • 100గ్రా వండిన చేప
  • 2 (120గ్రా) గుడ్లు
  • 1 కప్పు (150 గ్రా) వండిన ఎర్ర కందిపప్పు, శనగ పప్పు లేదా బఠాణీలు వంటి పప్పుధాన్యాలు లేదా బీన్స్
  • 170గ్రా టోఫు
  • 30గ్రా గింజలు, విత్తనాలు  

2 ½

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Prajnas Fertility Booster by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors for lakhs of male and female infertility problems with good results.
Fertility Booster
₹899  ₹999  10% OFF
BUY NOW

ప్రసవం తర్వాత తల్లి మరియు బిడ్డ సరైన పోషకాలను తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రసవంతర కాలంలో అనారోగ్యకరమైన ఆహారాలను తినడం వలన తల్లి,బిడ్డ ఇద్దరిలోను తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి. ప్రసవం తర్వాత నివారించవలసిన ఆహారాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి.

  • కార్బొనేటెడ్ పానీయాలను నివారించడం ఉత్తమం లేకపోతే అవి గ్యాస్ ను కలిగిస్తాయి. సాధారణంగా అటువంటి పానీయాలకు కృత్రిమ స్వీటెనర్లను కూడా కలుపుతారు అవి నవజాత శిశువుకు హాని కలిగించవచ్చు.
  • టీ మరియు కాఫీ వంటి అధిక మొత్తంలో కెఫిన్ ఉండే  పానీయాలు డిహైడ్రేటింగ్ చర్యలు చూపిస్తాయి మరియు మూత్రవిసర్జన రేటును పెంచుతాయి. కాఫిన్ పిల్లల అభివృద్ధిలో లోపాలకు కూడా దారితీస్తుంది. కాబట్టి అలాంటి ఆహారాలను, ప్రసవం తర్వాత తక్కువగా తీసుకోవాలి.
  • ప్రసవం తర్వాత మద్యపానం పూర్తిగా మానివేయాలి, ఎందుకంటే ఇది చనుబాలను తగ్గిస్తుంది మరియు నవజాత శిశువు అభివృద్ధిలో లోపాలకు దారి తీస్తుంది.
  • కందిపప్పు, రాజుల చిక్కుళ్ళు, శనగలు, పచ్చి బఠాణి వంటి ఆహారాలను ప్రసవం తర్వాత క్రమముగా ఆహారంలో చేర్చాలి, ప్రసవమైన మొదటి 40 క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ, బెండకాయలు మరియు ఉల్లిపాయలు వంటివి నివారించడం మంచిది ఎందుకంటే అవి ఉబ్బరం కలిగించవచ్చు.
  • వేయించిన ఆహార పదార్దాలు జీర్ణం కావడం కష్టం మరియు అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు కలిగిస్తాయి కాబట్టి వాటిని నివారించడం ఉత్తమం.
  • సిజేరియన్ డెలివరీ విషయంలో, ముఖ్యంగా మధుమేహంతో బాధపడే తల్లులలో, ప్రసవం తర్వాత దశలో అన్నం తీసుకోవడాన్ని నివారించడం ఉత్తమం. అన్నంలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి మరియు అవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి, ఇది గాయం యొక్క చికిత్స ప్రక్రియను ఆలస్యం చేస్తుంది. బ్రౌన్ రైస్ (పట్టు పెట్టని బియ్యం) తినవచ్చు, ఎందుకంటే ఇది అవసరమైన శక్తిని అందిస్తుంది మరియు తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది.
  • తయారుగా ఉన్న ఆహార ఉత్పత్తులు (Canned food products), ప్రత్యేకంగా కెన్డ్ (canned) చేప మరియు మాంసాలలో సోడియం ఎక్కువగా ఉండడంతోపాటు, ప్రీసర్వేటివ్లు కూడా ఉంటాయి. అటువంటి ఆహారాలలో ఉండే అధిక సోడియం రక్త పోటును పెంచగలదు మరియు అది తల్లి బిడ్డలకు హాని కలిగిస్తుంది.(మరింత సమాచారం: అధిక రక్తపోటు నిర్వహణ)

వనరులు

  1. Franca Marangoni et al. Maternal Diet and Nutrient Requirements in Pregnancy and Breastfeeding. An Italian Consensus Document. Nutrients. 2016 Oct; 8(10): 629. PMID: 27754423
  2. National Health Service [Internet]. UK; The Pregnancy Book
  3. Stanford Health Care [Internet]. Stanford Medicine, Stanford University; The New Mother - Taking Care of Yourself After Birth
  4. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Losing weight after pregnancy
  5. Office on Women's Health [Internet] U.S. Department of Health and Human Services; Recovering from birth.
  6. Department of Health Strong Bones for You and Your Baby. New York state Government [Internet]
Read on app