myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

అలర్జిక్ రినైటిస్ అంటే ఏమిటి?

ఇంట్లోనూ బయటా ఉండే ఎలెర్జీ కారకాల వల్ల వచ్చే సాధారణ జలుబు వంటి లక్షణాలను అనుభవిస్తుంటే ఆ పరిస్థితిని అలర్జీక్ రినైటిస్ లేదా గవత జ్వరం అని పిలుస్తారు. ఎలెర్జీ కారకాల జాబితా చాలా పెద్దదిగా ఉంది మరియు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క కారకానికి స్పందించరు. భౌతిక లక్షణాలు కాకుండా, చాలామందిలో అసౌకర్యం మరియు పని, ఇల్లు లేదా పాఠశాల వద్ద సాధారణ పనులు చేయడంలో కష్టంగా ఉంటుంది .

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

అలర్జీ ఫలితంగా వివిధ రకాల లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. ఈ ఎలెర్జీ దాడిలో చాలామంది వ్యక్తులు ఒకటి లేదా రెండు లక్షణాల కలయికను అనుభవిస్తారు. అత్యంత సాధారణ లక్షణాలు:

ప్రధాన కారణాలు ఏమిటి?

కొందరు వ్యక్తులలో, ముఖ్యంగా మొదటి ప్రతిచర్యను (reaction) ఎదుర్కొంటున్నప్పుడు, శరీరం అలర్జీకి కారణమయ్యే పదార్ధాలను నిరోధించడానికి యాంటీబాడీలను (antibodies)విడుదల చేయడం ద్వారా తనను తాను కాపాడుతుంది. అలర్జీ కారకాలకు గురయ్యే ప్రతిసారి, శరీరం స్వయంగా రసాయనాలను విడుదల చేస్తుంది, అప్పుడు ఇది గవత జ్వరం/అలర్జిక్ రినైటిస్ యొక్క లక్షణాలను ప్రేరేపిస్తుంది.

సాధారణ అలర్జీ కారకాలు:

 • చెట్లు, గడ్డి మరియు రాగ్ వీడ్ల నుండి పుప్పొడి.
 • పెంపుడు జంతువుల చర్మం మరియు లాలాజలం, చర్మ పొరలు.
 • దుమ్ము మరియు పురుగులు.
 • శిలీంధ్రాలు (fungus) నుండి విత్తనాలు.

ఎలా నిర్ధారిస్తారు మరియు చికిత్స ఏమిటి?

గవత జ్వరం యొక్క వ్యాధి నిర్ధారణ సాధారణ మరియు సూటిగా ఉంటుంది. పరిస్థితిని గుర్తించడానికి రెండు ప్రధాన పద్ధతులు ఉన్నాయి. ఇవి:

 • శరీరంపై ప్రభావం చూపుతున్న అలర్జీ కారకాలను గుర్తించడానికి మరియు రక్తంలో అలెర్జీ-పోరాట యాంటీబాడీ (antibody) పదార్థాల స్థాయిని అంచనా వేయడానికి రక్త పరీక్ష.
 • సంభావ్య అలర్జీ కారకాలను గుర్తించడానికి చర్మ నాటు పరీక్ష. అలర్జీ కారకాల యొక్క చిన్న మొత్తాలను శరీరంలోకి ప్రవేశింప చేస్తారు. వ్యక్తి ఆ ప్రత్యేక పదార్ధానికి ఒక అలెర్జీ ప్రతిస్పందన చూపితే, ఒక చిన్న దద్దురులా నాటు పెట్టిన ప్రాంతం వద్ద కనిపిస్తుంది.

అలెర్జీ కారకాల నుండి శరీరాన్ని కాపాడటానికి మరియు గవత జ్వరాన్ని దూరంగా ఉంచడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే ప్రతిచర్యకు కారణమవుతున్నా కారకాల నుండి దూరంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో లక్షణాల కోసం మందులు సూచించబడవచ్చు. తీవ్రమైన సందర్భాల్లో, బలమైన మందుల కోర్సు సూచించబడవచ్చు. వీటిలో కొన్ని:

 • దురద, వాపు మరియు కారుతున్న ముక్కు కోసం నేసల్ కార్టికోస్టెరాయిడ్స్ (Nasal corticosteroids).
 • తుమ్ము, ముక్కు కారడం మరియు దురద కోసం యాంటిహిస్టామైన్లు (antihistamines). ఇవి మాత్రలు లేదా స్ప్రేలుగా ఇవ్వవచ్చు. అవి హిస్టామిన్ రసాయనాన్ని నిరోధిడం ద్వారా పని చేస్తాయి, ఇది అలర్జీ ప్రతిచర్య సమయంలో విడుదలవుతుంది.
 • డికోంగ్స్టేట్లు (Decongestants) వివిధ రూపాల్లో లభిస్తాయి మరియు అవి శ్వాసించడం కష్టమైన ముక్కు నుండి ఉపశమనం అందిస్తాయి. కానీ అధిక రక్తపోటు, తలనొప్పి మరియు నిద్రలేమి వంటి దుష్ప్రభావాలు కలిగిస్తాయి.
 • ల్యూకోట్రిన్ మాడిఫైయర్ (Leukotriene modifier) అనే మందులు ల్యూకోట్రిన్ను అడ్డుకుంటాయి. ఇది అధిక శ్లేష్మం ఉత్పత్తి మరియు ముక్కు కారడం వంటి లక్షణాలకు బాధ్యత వహిస్తుంది.
 • లక్షణాలు నుండి ఉపశమనం అందించడానికి ఓరల్ కార్టికోస్టెరాయిడ్స్ ( oral corticosteroids).
 • ముక్కు కారటం కోసం నాసల్ ఇప్రట్రోపియం ( ipratropium) మరియు అది గ్రంధులలో శ్లేష్మం (mucus ) ఉత్పత్తిని తగ్గిస్తుంది.

ఇతర నివారణ చర్యలు అలెర్జీ షాట్లు, నాలుక కింద ఉంచే అలెర్జీ వ్యతిరేక మాత్రలు ఉన్నాయి, ఆవిరి పీల్చడం మరియు సైనసిస్ (sinuses) యొక్క ప్రక్షాళన.

 
 1. అలర్జిక్ రినైటిస్ (గవత జ్వరం) కొరకు మందులు
 2. అలర్జిక్ రినైటిస్ (గవత జ్వరం) వైద్యులు
Dr. K. K. Handa

Dr. K. K. Handa

कान, नाक और गले सम्बन्धी विकारों का विज्ञान

Dr. Aru Chhabra Handa

Dr. Aru Chhabra Handa

कान, नाक और गले सम्बन्धी विकारों का विज्ञान

Dr. Yogesh Parmar

Dr. Yogesh Parmar

कान, नाक और गले सम्बन्धी विकारों का विज्ञान

అలర్జిక్ రినైటిస్ (గవత జ్వరం) కొరకు మందులు

అలర్జిక్ రినైటిస్ (గవత జ్వరం) के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine NamePack SizePrice (Rs.)
Grilinctus CdGrilinctus Cd 4 Mg/10 Mg Syrup66
FormonideFormonide 20 Mcg/0.5 Mg Respules38
KolqKolq Capsule28
WikorylWIKORYL 325 TABLET DT 10S32
AlexALEX 100ML SYRUP79
EkonEkon 10 Mg Tablet14
BudamateBudamate 400 Inhaler296
ForacortForacort 100 Rotacap107
Solvin ColdSOLVIN COLD DROPS 15ML40
Tusq DXTUSQ DX 100ML SYRUP62
GrilinctusGRILINCTUS 100ML SYRUP76
Febrex PlusFEBREX PLUS 60ML SYRUP49
AllegraAllegra 120 mg Tablet132
PractinPractin Syrup87
AllercetAllercet 10 Mg Tablet12
BudecortBudecort 200 MCG Inhaler271
ActAct 5 Mg/60 Mg Tablet26
NormoventNormovent Syrup55
CetezeCETEZE 10MG TABLET 10S0
Alday AmAlday Am 5 Mg/60 Mg Tablet26
Parvo CofParvo Cof Syrup52
Ceticad PlusCeticad Plus Tablet4
AmbcetAmbcet 5 Mg/30 Mg Syrup32
Airtec FbAirtec Fb 6 Mcg/100 Mcg Capsule109
PhenkuffPhenkuff 4 Mg/10 Mg Syrup52

మీకు గానీ లేదా మీ కుటుంబములో ఎవరికైనా గానీ ఈ వ్యాధి ఉందా? దయచేసి ఒక సర్వే చేసి ఇతరులకు సహాయపడండి

References

 1. American Academy of Allergy, Asthma and Immunology [Internet]. Milwaukee (WI); RHINITIS (HAY FEVER)
 2. ENT Health [Internet]. American Academy of Otolaryngology–Head and Neck Surgery Foundation; Nose.
 3. Jitendra Varshney, Himanshu Varshney. Allergic Rhinitis: an Overview. Indian J Otolaryngol Head Neck Surg. 2015 Jun; 67(2): 143–149. PMID: 26075169
 4. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Allergic rhinitis
 5. Australian Institute of Health and Welfare. Allergic rhinitis ('hay fever'). Australia. [internet]
 6. Government of Western Australia. Hay fever (allergic rhinitis). Deperment of Health. [internet]
और पढ़ें ...