పిత్తాశయవాపు - Cholecystitis in Telugu

Dr. Rajalakshmi VK (AIIMS)MBBS

November 29, 2018

March 06, 2020

పిత్తాశయవాపు
పిత్తాశయవాపు

పిత్తాశయవాపు అంటే ఏమిటి?

పిత్తాశయవాపు అంటే పిత్తాశయానికి సంభందించిన వాపు. పిత్తాశయం, పిత్త వాహిక (bile duct)  లేదా పిత్తాశయము లోకి ప్రవేశించే గొట్టాలలో పిత్తాశయ రాళ్లు ఏర్పడడం వలన ఈ పిత్తాశయవాపు సంభవిస్తుంది. ఇది పురుషుల కంటే మహిళలను ముఖ్యంగా ప్రభావితం చేస్తుంది. పిత్తాశయ రాళ్లు ఏర్పడంలో సంభావ్యత 40 సంవత్సరాల లోపు వయసు ఉన్న పురుషులతో పోలిస్తే మహిళలలో ఎక్కువగా ఉంది. భారతదేశంలో, దీని ప్రాబల్యం దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే, ఉత్తరాది రాష్ట్రాలలో ఎక్కువగా ఉన్నది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో, పిత్తాశయ రాళ్లు ప్రతి సంవత్సరం సుమారు 1 మిలియన్ మందిలో సంభవిస్తాయి, వయోజన జనాభాలో ఇది 10-15% గా  నివేదించబడినది.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

కొందరు వ్యక్తులు ఉదర ప్రాంతంలో కొద్దిగా సున్నితత్వాన్ని తప్ప మరే లక్షణాలను చూపించకపోవచ్చు. ప్రధాన లక్షణాలు వీటిని కలిగి ఉంటాయి:

  • కడుపులో కుడివైపున  ఎగువ ప్రాంతంలో ఆకస్మిక లేదా తీవ్రమైన నొప్పి
  • వికారం
  • వాంతులు
  • తక్కువ స్థాయి జ్వరం
  • కళ్ళు పసుపు రంగులోకి మారడం
  • టీ-రంగు మూత్రం
  • లేత రంగు మలం

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

కారణం ప్రధానంగా రాళ్ళ సంబంధమైన మరియు రాళ్ళ సంబంధంకాని  పిత్తాశయపు వాపుగా విభజింపబడింది.

  • రాళ్ళ సంబంధమైన పిత్తాశయవాపు (Calculous cholecystitis):
    • సాధారణ మరియు తేలికపాటి పిత్తాశయవాపు రకం.
    • 95% కేసుల్లో చూడవచ్చు.
    • ప్రధాన సిస్టిక్ వాహికలో (cystic duct) అడ్డంకుల కారణంగా సంభవిస్తుంది.
    • సాధారణంగా పిత్తాశయ రాళ్ళు లేదా పిత్తాశయ బురద (biliary sludge) వలన అడ్డంకులు ఏర్పడతాయి.
  • రాళ్ళ సంబంధంకాని పిత్తాశయవాపు (Acalculous cholecystitis):
    • అరుదుగా సంభవించే మరియు తీవ్రమైన పిత్తాశయవాపు రూపం.
    • ఏదొక దీర్ఘకాలిక అనారోగ్యం, సంక్రమణం లేదా పిత్తాశయ గాయం ఫలితంగా ఇది అభివృద్ధి చెందుతుంది.
    • శస్త్రచికిత్స, గాయాలు, కాలిన గాయాలు, రక్తం విషతుల్యం కావడం (blood poisoning), సెప్సిస్ మరియు పోషకాహారలోపం వంటి యాదృచ్ఛిక సమస్యలతో ఇది ముడిపడి ఉంటుంది

ఎలా నిర్ధారిస్తారు మరియు చికిత్స ఏమిటి?

శారీరక పరీక్షలో రోగులు సాధారణంగా కనిపించవచ్చు. కొన్నిసార్లు పిత్తాశయములో సున్నితత్వాన్ని గమనించవచ్చు మరియు అది తీవ్రమైన పరిస్థితిని తెలుపవచ్చు. పరీక్షించినప్పుడు మర్ఫీ సైన్ అనేది సానుకూలంగా ఉండవచ్చు.

  • రక్త పరీక్షలు: ఏమైన అంటువ్యాధులు లేదా సమస్యలను తనిఖీ చేసేందుకు.
  • రేడియోలాజికల్ పరీక్షలు:
    • ఉదరం యొక్క అల్ట్రాసోనోగ్రఫీ (Ultrasonography)
    • కంప్యూటెడ్ టోమోగ్రఫీ (CT) స్కాన్
    • మాగ్నెటిక్ రెసోనాన్స్ కోలాంజియోపేంక్రియాటోగ్రఫీ (MRCP)
    • ఎండోస్కోపిక్ రెట్రోగ్రేడ్ కోలాంజియోపేంక్రియాటోగ్రఫీ (ERCP)

చికిత్స పద్ధతులు:

  • ప్రారంభ చికిత్స: పిత్తాశయమును శుభ్రపరచడానికి ఉపవాసం మరియు హైడ్రేషన్ స్థాయిని నిర్వహించడానికి నరాల్లోకి  (ఇంట్రావీనస్) ద్రవాలను ఎక్కించడం.
  • మందుల ద్వారా చికిత్స(Medical therapy): ఇది సాధారణంగా అధికంగా ఉన్న పిత్తాశయ రాళ్ల కోసం ఇవ్వబడుతుంది. ఈ మందులు పిత్తాశయ రాళ్లను కరిగించి మరియు మరింతగా అడ్డుకోవడాన్ని నివారిస్తాయి.
  • శస్త్ర చికిత్స (Surgical therapy): లాపరోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ (Laparoscopic cholecystectomy) అనేది సమస్య పునరావృత్తాన్ని నివారించడానికి రాళ్ళతో పాటు పిత్తాశయన్ని తొలగించే ఒక పద్ధతి.

శస్త్రచికిత్స కానీ పద్ధతులు:

  • ఎక్స్ట్రాకోర్పోరియల్ షాక్ వేవ్ లిథోట్రిప్పీ (Extracorporeal shock wave lithotripsy): అధిక శక్తి ధ్వని తరంగాలను (High-energy sound waves) ఉపయోగించి రాళ్లను విచ్ఛిన్నం చేయడం.
  • పెర్క్యుటేనియస్ థెరపీ (Percutaneous therapy)
  • ఎండోస్కోపిక్ పిత్తాశయం స్టెంటింగ్ (Endoscopic gallbladder stenting)

జీవనశైలి సవరింపులు:

  • లక్షణాలను తగ్గించడానికి క్రింది ఆహారాలను నివారించాలి.
    • కొలెస్ట్రాల్ అధికంగా ఉండే ఆహారాలు
    • శుద్ధి చేసిన చక్కెర
    • బీన్స్
    • ఉల్లిపాయలు లేదా మిరియాలు
    • కాఫిన్
    • గింజలు, పండ్లు మరియు కూరగాయలు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులను అందించే చేపలు మరియు ఆలివ్ నూనె వంటి వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తినాలి.

ఆరోగ్యకరమైన జీవనశైలిని ఏర్పరచుకోవడం అనేది పిత్తాశయవాపు యొక్క ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.



వనరులు

  1. World Gastroenterology Organisation. The Growing Global Burden of Gallstone Disease. Milwaukee, WI; [Internet]
  2. Dr Alok Chandra Prakash et al. Prevalence and Management of Cholelithiasis in East India. Department Of General Surgery, Ranchi,Jharkhand,India. Volume 15, Issue 12 Ver. V (December. 2016), PP 34-37
  3. National Institute of Diabetes and Digestive and Kidney Diseases [internet]: US Department of Health and Human Services; Symptoms & Causes of Gallstones
  4. National Health Service [Internet]. UK; Acute cholecystitis
  5. Jones MW, O'Rourke MC. Acute Cholecystitis. Acute Cholecystitis. StatPearls [Internet]. Treasure Island (FL): StatPearls Publishing; 2019 Jan-.

పిత్తాశయవాపు కొరకు మందులు

Medicines listed below are available for పిత్తాశయవాపు. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.