గుండె రక్తనాళాల సంకోచవ్యాధి (CAD) - Coronary Artery Disease (CAD) in Telugu

Dr. Nabi Darya Vali (AIIMS)MBBS

November 30, 2018

March 06, 2020

ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు
గుండె రక్తనాళాల సంకోచవ్యాధి
सुनिए ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

గుండె రక్తనాళాల సంకోచ (CAD) వ్యాధి లేదా  కరోనరీ హార్ట్ డిసీజ్ అంటే ఏమిటి?

గుండెకు ప్రాణవాయువు మరియు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు సంకోచించడాన్నే “గుండె రక్తనాళాల సంకోచ వ్యాధి” (coronary heart disease) అంటారు. దీన్నే “కరోనరీ హార్ట్ డిసీస్” అని ఆంగ్లంలో అంటారు. గుండె జబ్బుల్లో అత్యంత సాధారణ వ్యాధి ఇది.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

గుండె రక్తనాళాల సంకోచ వ్యాధి లేదా కొరోనరీ హార్ట్ డిసీజ్ యొక్క లక్షణాలు కొందరు వ్యక్తులలో స్పష్టంగా కనిపించవు. వ్యాధి యొక్క ప్రారంభ దశలోనే ఈ వ్యాధిలక్షణాలు ఎక్కువగా గోచరిస్తాయి.
గుండె రక్తనాళాల సంకోచవ్యాధి లేదా కొరోనరీ గుండె జబ్బు యొక్క సాధారణ లక్షణాలు:

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

గుండె మరియు ఇతర శరీర భాగాలకు రక్తం మరియు ఆక్సిజన్ సరఫరా చేసే రక్త నాళాల గోడలలో కొవ్వుతో కూడిన ఫలకాల (plaques) నిక్షేపాలు పేరుకుపోవడంవల్ల వాటి మార్గం మూసుకుపోవడమో, నాళాలు గట్టిపడటం లేదా నాళముయొక్క రక్తసరఫరా మార్గంలో అంతరాయమేర్పడ్డమో జరుగుతుంది. రక్త నాళాల మార్గం సంకుచితమవటానికి కొవ్వుతో కూడిన ఈ ఫలకాలు రక్తనాళాల లోపల పేరుకుపోవడం కారణం. ఈ కారణంగా గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల పనితీరు దెబ్బ తిని, గుండెకు రక్త ప్రవాహం తగ్గిపోతుంది. తద్వారా ఛాతీ నొప్పి మరియు శ్వాసలో సమస్యల వంటి గుండెవ్యాధి లక్షణాలకు కారణం కావచ్చు.

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి ఎలా చికిత్స చేస్తారు?

కరోనరి హృద్రోగ వ్యాధిని నిర్ధారించడానికి, వైద్యుడు క్రింది పరీక్షలను నిర్వహించవచ్చు:

 • గుండె మరియు ఊపిరితిత్తులను అంచనా వేయడానికి ఛాతీ ఎక్స్-రే
 • శారీరక వ్యాయామం సమయంలో హృదయ స్పందన రేటు మరియు చర్యను అంచనా వేయడానికి “వ్యాయామ ఒత్తిడి పరీక్ష” (exercise stress test) ను చేస్తారు.
 • ఎఖోకార్డియోగ్రామ్ అల్ట్రాసౌండ్ ఉపయోగించి గుండె యొక్క చిత్రాన్ని  పొందటానికి
 • హృదయ సామర్థ్యాన్ని గుర్తించేందుకు కార్డియాక్ కాథెటరైజేషన్
 • కొరోనరీ ఆంజియోగ్రామ్ ను హృదయ ధమనులలో ఏదైనా నిరోధాన్ని పర్యవేక్షించేందుకు చేస్తారు.  

కొరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడే కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి:

 • జీవనశైలి మార్పుల్లో భాగంగా తక్కువ-కొవ్వుతో కూడిన సమతుల్య ఆహారసేవనం, చురుకైన జీవనశైలిని కలిగి ఉండటం, ధూమపానం విడిచిపెట్టి, సాధారణ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం వంటివి  హృదయ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
 • ఈ వ్యాధివల్ల అధిక ప్రమాదం ఉన్నవారు అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు మరియు క్రమం లేని హృదయ స్పందన వంటి ప్రమాద కారకాలను తగ్గించడానికి మందులను ఉపయోగించవచ్చు.

ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడంతో పాటు వ్యాధి లక్షణాలను నిర్వహించడానికి మందుల వాడకాన్ని చికిత్సకు ఉపయోగిస్తారు.

గుండె రక్తనాళాల సంకోచ (కొరోనరీ హార్ట్ డిసీజ్) వ్యాధి చికిత్సకు కొన్ని విధానాలు లేదా శస్త్రచికిత్సలు కూడా చేయవచ్చు. అవి ఏవంటే:

 • యాంజియోప్లాస్టీ (స్టెంట్ ప్లేస్మెంట్-స్టెంట్లను అమర్చడం)
 • కొరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ
 • అతిచిన్న గుండె పోటు శస్త్రచికిత్స (Minimally invasive heart surgery)వనరులు

 1. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Coronary heart disease
 2. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Coronary Artery Disease (CAD)
 3. Healthdirect Australia. Coronary heart disease and atherosclerosis. Australian government: Department of Health
 4. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Heart Disease Facts
 5. National Health Portal. Coronary Heart Disease. Centre for Health Informatics; National Institute of Health and Family Welfare

గుండె రక్తనాళాల సంకోచవ్యాధి (CAD) కొరకు మందులు

గుండె రక్తనాళాల సంకోచవ్యాధి (CAD) के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

दवा का नाम

कीमत

₹352.1

20% छूट + 5% कैशबैक


₹38.01

20% छूट + 5% कैशबैक


₹49.0

20% छूट + 5% कैशबैक


₹278.2

20% छूट + 5% कैशबैक


₹105.7

20% छूट + 5% कैशबैक


₹117.49

20% छूट + 5% कैशबैक


₹14.0

20% छूट + 5% कैशबैक


₹271.95

20% छूट + 5% कैशबैक


₹165.24

20% छूट + 5% कैशबैक


₹17.91

20% छूट + 5% कैशबैक


Showing 1 to 10 of 993 entries