చిత్తవైకల్యం (డెమెన్షియా) - Dementia in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

November 30, 2018

July 31, 2020

చిత్తవైకల్యం
చిత్తవైకల్యం

చిత్తవైకల్యం అంటే ఏమిటి?

చిత్తవైకల్యం అనేది మేధస్సు పనితీరులో గణనీయమైన క్షీణతను కలిగించే ఒక వైద్య సంబంధమైన రుగ్మత. ఇది అనేక వ్యాధులలో సంభవించే పలు లక్షణాల యొక్క కూడిక. ఇది మేధాశక్తి మరియు ప్రవర్తనా తీరును తగ్గిపోయేలా చేసి, రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది ఒక ప్రపంచవ్యాప్త  సంక్షోభం మరియు భారతదేశంలో 4 మిలియన్ల మందికి పైగా ఏదో ఒకరకమైన డెమెంటియా ద్వారా ప్రభావితామైనారు.

దాని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

చిత్తవైకల్యం యొక్క లక్షణాలు సాధారణంగా నమ్మశక్యం కానివిగా ప్రారంభమై, క్రమక్రమంగా పురోగతిని చూపుతాయి.

  • సాధారణంగా ముడిపడి ఉన్న సంకేతాలు మరియు లక్షణాలు:
    • జ్ఞాన సామర్థ్యం తగ్గిపోవడం
    • జ్ఞాపకశక్తి తగ్గిపోవడం
    • శారీరక మరియు మానసిక స్థితి మార్పులు
    • మానసికచలనం (Psychomotor) మందగించడం
  • ప్రారంభ దశ లక్షణాలు: నిరాశ మరియు ఉదాసీనత
  • తరువాత దశ లక్షణాలు: ఆందోళన, చిరాకు, విభ్రాంతి మరియు క్రమరహితంగా తిరుగుతూ ఉండడం
  • చివరి దశ లక్షణాలు: నిగ్రహరాహిత్యం, గందరగోళ నడక, మ్రింగుటలో కష్టాలు మరియు కండరాల సలుపు

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

అధికముగా నాడీ కణములు (nerve cells) దెబ్బతినడం అనేది చిత్తవైకల్య లక్షణాలకు దారితీస్తుంది.

అతి సాధారణ కారణం అల్జీమర్స్ వ్యాధి, ఇది స్వల్ప-కాల జ్ఞాపకశక్తి లోపాలకు కారణమవుతుంది.

చిత్తవైకల్యానికి ఇతర సాధారణ కారణాలు:

  • రక్తనాళ చిత్తవైకల్యం (Vascular dementia): ఇది మెదడును సరఫరా చేసే రక్త నాళాలకు నష్టం కలిగించే సంభవిస్తుంది.
  • లీ బాడీ చిత్తవైకల్యం (Lewy body dementia): లీ బాడీలు(Lewy bodies) అనేవి వ్యక్తి యొక్క మేధస్సు పనితీరును ప్రభావితం చేసే ఒక రకమైన ప్రోటీన్ యొక్క అసాధారణమైన ముద్దలు.
  • ఫ్రంటోటెంపరల్ చిత్తవైకల్యం(Frontotemporal dementia): మెదడులోని వ్యక్తిత్వం, భాష మరియు ప్రవర్తనను నియంత్రించే  ప్రాంతాల్లో యొక్క నరాలు దెబ్బతినడం.
  • మిశ్రమ చిత్తవైకల్యం (Mixed dementia) : 80 సంవత్సరాల మరియు పైన వయసు ఉన్న ప్రజలు పైన పేర్కొన్న చిత్తవైకల్యాల కలయికను కలిగి ఉంటారని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
  • ఇతర అసాధారణ కారణాలు: హంటింగ్టన్స్ వ్యాధి, పార్కిన్సన్స్ వ్యాధి, పెద్ద మెదడు గాయం, జీవక్రియ (మెటబిలిక్) మరియు ఎండోక్రైన్  రుగ్మతలు, మందులకు ప్రతికూల ప్రతిస్పందనలు, విషప్రయోగం మరియు మెదడు కణితులు.

ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

చిత్తవైకల్యం యొక్క నిర్ధారణకు రోగి యొక్క ఆరోగ్య చరిత్ర మరియు భౌతిక పరీక్ష అవసరం.

వ్యైద్యులని సంప్రదించిన సమయంలోనే మేధాశక్తి పనితీరును యొక్క అంచనా జరుగుతుంది, కానీ అదనపు పరీక్షలు కూడా అవసరం కావచ్చు.

మినీ-మెంటల్ స్టేట్ ఎగ్జామినేషన్ (MMSE) అనేది మేధాశక్తి పనితీరును అంచనా వేసేందుకు విస్తృతంగా ఉపయోగించే పరీక్ష.

అవసరమైతే, తదుపరి పరిశోధనలు వీటిని కలిగి ఉండవచ్చు:

  • రక్త పరీక్షలు
  • మెదడు యొక్క ఎంఆర్ఐ (MRI) లేదా సిటి (CT) స్కాన్
  • ఇఇజి (EEG, ఎలెక్ట్రోఎన్సెఫాలోగ్రామ్)

మందులతో చికిత్స చాలా తక్కువ మార్పుని చూపిస్తుంది. నరాల సంకేతాలను ప్రసారం చేసే రసాయనాలను పెంచడానికి మందులు సూచించబడతాయి. చిత్తవైకల్యం  యొక్క ప్రారంభం దశలో కానీ మధ్య దశల్లో కానీ మాత్రమే అవి ఉపయోగకరంగా ఉంటాయి.

నిద్ర విషయంలో భంగాలు ఉంటే యాంటిడిప్రెసెంట్స్ (Antidepressants) ఉపయోగపడతాయి.

యాంటిసైకోటిక్స్ (antipsychotics) యొక్క ఉపయోగం మరణ కూడా  ప్రమాదానికి దారితీయవచ్చు.

సహాయక సంరక్షణ చిత్తవైకల్య రోగుల ఆరోగ్య నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. లక్షణాలు పెరిగే కొద్దీ, సహాయం అవసరం కూడా పెరుగుతుంది.



వనరులు

  1. EL Cunningham et al. Dementia. Ulster Med J. 2015 May; 84(2): 79–87. PMID: 26170481
  2. National Institute on Aging. What Is Dementia? Symptoms, Types, and Diagnosis. U.S Department of Health and Human Services. [Internet]
  3. Adrianne Dill Linton. Introduction to Medical-Surgical Nursing. Elsevier Health Sciences, 2015. 1408 pages
  4. Health On The Net. What causes dementia?. [Internet]
  5. Alzheimer's Association. Alzheimer's and Dementia in India. Chicago, IL; [Internet]
  6. National institute of neurological disorders and stroke [internet]. US Department of Health and Human Services; Dementia Information

చిత్తవైకల్యం (డెమెన్షియా) వైద్యులు

Dr. Kirti Anurag Dr. Kirti Anurag Psychiatry
8 Years of Experience
Dr. Anubhav Bhushan Dua Dr. Anubhav Bhushan Dua Psychiatry
13 Years of Experience
Dr. Alloukik Agrawal Dr. Alloukik Agrawal Psychiatry
5 Years of Experience
Dr. Sumit Shakya Dr. Sumit Shakya Psychiatry
7 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

చిత్తవైకల్యం (డెమెన్షియా) కొరకు మందులు

Medicines listed below are available for చిత్తవైకల్యం (డెమెన్షియా). Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.