myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

స్త్రీల హైపోగోనాడిజం అంటే ఏమిటి?

స్త్రీల ప్రత్యుత్పత్తి అవయవాలు, ప్రత్యేకించి అండాశయాల పనితీరులో రుగ్మత లేదా వైఫల్యం అనేది స్త్రీల హైపోగోనాడిజాన్ని సూచిస్తుంది. కొన్నిసార్లు పిట్యూటరీ గ్రంథి, మెదడులోని హైపోథాలమస్ మరియు స్త్రీ లైంగిక అవయవాల మధ్య సమన్వయం మరియు పనితీరులో రుగ్మత కారణంగా స్త్రీల హార్మోన్ల విడుదల తగ్గడం లేదా పూర్తిగా లేకపోవడం జరుగుతుంది. దీని ఫలితంగా, అండాశయాల ద్వారా ఫోలికల్ స్టిములేటింగ్ హార్మోన్ (FSH, follicle stimulating hormone) మరియు లూటినైసింగ్ హార్మోన్ల (LH, luteinising hormone)  యొక్క విడుదలలో తగ్గుదల లేదా పూర్తిగా లేకపోవడం జరుగుతుంది. ఈ పరిస్థితిని హైపోగోనాడోట్రోపిక్ హైపోగోనాడిజం (HH, hypogonadotropic hypogonadism) అని పిలుస్తారు.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

స్త్రీల హైపోగోనాడిజంతో ముడిపడి ఉన్న ముఖ్య సంకేతాలు మరియు లక్షణాలు:

 • రజస్వల కాకపోవడం
 • రొమ్ములు మరియు జననేంద్రియ జుట్టు (pubic hair) వంటి ద్వితీయ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందకపోవడం
 • ఎత్తు పెరగడంలో వైఫల్యం
 • ఋతుచక్రాల లేమి (మరింత సమాచారం: అమేనోరియా కారణాలు మరియు చికిత్స)
 • మానసిక స్థితిలో తరచుగా మార్పులు
 • విధులు నిర్వహించడంలో బలహీనత మరియు అలసట
 • శరీరం నుండి వేడి ఆవిర్లు
 • హైపోగోనాడిజం వారసత్వంగా  సంక్రమించినప్పుడు వాసన గ్రహించడంలో అసమర్థత (కల్మన్ సిండ్రోమ్)
 • పిట్యూటరీ గ్రంథిలో కణితి వలన ఐతే,ఇతర హార్మోన్లలో లోపం, తలనొప్పి మొదలైనవి

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

స్త్రీల హైపోగోనాడిజం అనేది పుట్టుక వస్తుంది లేదా మాములుగా ఏర్పడుతుంది. స్త్రీల హైపోగోనాడిజానికి కారణమైయ్యే ముఖ్యమైన కారకాలు ఈ విధంగా ఉంటాయి:

 • జన్యువులలో అసాధారణత లేదా పుట్టుకతో లోపం
 • దీర్ఘకాలిక అంటురోగాలు లేదా వాపు వంటి  దీర్ఘకాలిక వ్యాధులు
 • ఆటోఇమ్యూన్ డిజార్డర్స్
 • పోషకాహారలోపం (అధిక బరువు నష్టం)
 • అధిక శారీరక వ్యాయామం (అథ్లెట్ల వలె)
 • స్టెరాయిడ్ మందులను అధిక మోతాదులో తీసుకోవడం
 • మందుల దుర్వినియోగం
 • మానసిక ఒత్తిడి పెరగడం
 • పిట్యూటరీ గ్రంథి మరియు హైపోథాలమస్ కు సంబంధించిన కణితి లేదా గాయం
 • మెదడులో క్యాన్సర్ చికిత్స కోసం రేడియేషన్ థెరపీ ఉపయోగం
 • ఐరన్ అధికంగా ఉండడం

దానిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

వైద్యులు స్త్రీల హైపోగోనాడిజంను ఈ క్రింది వాటి సహయంతో విశ్లేషిస్తారు:

 • వీటి  యొక్క వివరణాత్మక చరిత్ర తెలుసుకుంటారు
  • లక్షణాలు
  • రజస్వల (Menarche) మరియు ఋతు చక్రాలు
  • కుటుంబంలోని జన్యుపరమైన సమస్యలు
  • మునుపటి మరియు ప్రస్తుత అనారోగ్యం
  • రేడియేషన్, కెమోథెరపీ లేదా కార్టికోస్టెరాయిడ్స్ మరియు ఓపియట్స్ (opiates) వంటి మందుల యొక్క మునుపటి (గతం) లేదా ప్రస్తుత వాడకం
  • మానసిక ఒత్తిడి, నిరాశ మరియు ఆందోళన
 • జననేంద్రియ జుట్టు మరియు రొమ్ము అభివృద్ధి వంటి ద్వితీయ లైంగిక లక్షణాల తనిఖీ కోసం శారీరక పరీక్ష

 • రక్త పరీక్షలు
  • ఫోలికల్ స్టిములేటింగ్ హార్మోన్ (FSH) స్థాయిలు
  • గోనల్డోట్రోపిన్-విడుదల హార్మోన్ (GnRH, gonadotropin-releasing hormone) యొక్క ఇంజెక్షన్ తర్వాత లూటినైసింగ్ హార్మోన్ (LH) స్థాయిలు
  • థైరాయిడ్ హార్మోన్లు, ప్రొలాక్టిన్ హార్మోన్  (prolactin hormone) మరియు టెస్టోస్టెరోన్ (testosterone) స్థాయిలు
  • ఐరన్ స్థాయిలు
 • క్రోమోజోములలో లోపాలను గుర్తించడానికి క్యారోటైపింగ్ (Karyotyping) (ఉదా. టర్నర్ సిండ్రోమ్, కల్మన్ సిండ్రోమ్)
 • పిట్యుటరీ గ్రంధి మరియు హైపోథాలమస్లలో కణితులను గుర్తించడానికి మెదడు యొక్క మాగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్ (MRI, Magnetic resonance imaging)

స్త్రీల హైపోగోనాడిజం చికిత్స కారణం మీద ఆధారపడి ఉంటుంది. చికిత్స సాధారణంగా ఈ విధంగాఉంటుంది:

 • గోనల్డోట్రోపిన్-విడుదల హార్మోన్ (GnRH, gonadotropin-releasing hormone) ఇంజెక్షన్
 • హ్యూమన్ కోరియోనిక్ గోనడోట్రోపిన్ (HCG,Human chorionic gonadotropin) ఇంజెక్షన్
 • ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరాన్లను ఉన్న ఓరల్ (నోటి ద్వారా తీసుకునే) గర్భనిరోధక మాత్రలు
 • ఆహారవిధానం మరియు పోషకాహార మార్పులు
 • ఒత్తిడి నిర్వహణ
 • కాల్షియం మరియు విటమిన్ సప్లిమెంట్లు
 1. స్త్రీల హైపోగోనాడిజం కొరకు మందులు

స్త్రీల హైపోగోనాడిజం కొరకు మందులు

స్త్రీల హైపోగోనాడిజం के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine NamePack SizePrice (Rs.)
Duoluton L TabletDuoluton L 0.25 Mg/0.05 Mg Tablet134
Loette TabletLoette Tablet155
Ovilow TabletOvilow 0.02 Mg/0.1 Mg Tablet72
Ovral G TabletOvral G 0.05 Mg/0.5 Mg Tablet155
Ovral L TabletOvral L 0.03 Mg/0.15 Mg Tablet56
Suvida TabletSuvida 0.3 Mg/0.03 Mg Tablet24
Triquilar TabletTriquilar Tablet96
Dearloe TabletDearloe 0.02 Mg/0.1 Mg Tablet74
Ergest TabletErgest 0.05 Mg/0.25 Mg Tablet54
Ergest Ld TabletErgest Ld 0.03 Mg/0.15 Mg Tablet56
Esro TabletEsro 0.03 Mg/0.15 Mg Tablet52
Esro G TabletEsro G 0.050 Mg/0.250 Mg Tablet56
Esro L TabletEsro L 0.02 Mg/0.10 Mg Tablet48
Florina TabletFlorina 0.1 Mg/0.02 Mg Tablet0
Florina G TabletFlorina G 0.05 Mg/0.25 Mg Tablet76
Florina N TabletFlorina N Tablet76
Mala D TabletMala D Tablet40
Nogestol TabletNogestol 0.15 Mg/0.03 Mg Tablet0
Orgalutin TabletOrgalutin 0.05 Mg/2.5 Mg Tablet17
Levora TabletLEVORA TABLET 10S27
Lyna TabletLyna Tablet44
Oc 21 TabletOc 21 0.03 Mg/0.15 Mg Tablet62
Ovral TabletOvral Tablet52
Unwanted Pregcard TabletUnwanted Pregcard 21 Days Tablet46

మీకు గానీ లేదా మీ కుటుంబములో ఎవరికైనా గానీ ఈ వ్యాధి ఉందా? దయచేసి ఒక సర్వే చేసి ఇతరులకు సహాయపడండి

References

 1. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Hypogonadism
 2. American Academy of Family Physicians [Internet]. Leawood (KS); Amenorrhea: Evaluation and Treatment
 3. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; LH response to GnRH blood test
 4. Clinical Trials. Examination of Idiopathic Hypogonadotropic Hypogonadism (IHH)and Kallmann Syndrome (KS). U.S. National Library of Medicine. [internet].
 5. U.S food and drug administration. Treating Secondary Hypogonadism: While Preserving or Improving Testicular Function. US. [internet].
और पढ़ें ...