మానసిక అస్వస్థత - Mental Illness in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

December 24, 2018

September 11, 2020

మానసిక అస్వస్థత
మానసిక అస్వస్థత

సారాంశం

మన యొక్క ఆలోచన విధానం, ప్రవర్తన మరియు భావోద్వేగాలపై ప్రభావం చూపించే కొన్ని సంఘటనలను మనమందరమూ అనుభవించిఉంటాము.  ఇవి ఒక సంఘటన లేక ఒక వ్యక్తి లేక కొన్ని విషయాల ఫలితముగా ఏర్పడిన మనము ఊహించని లేక అంచనావేయలేని ప్రతిస్పందనలు.  వీటిని అధికముగా లేక అదనపు డిగ్రీలుగా కనుగొన్నప్పుడు, ఈ పరిస్థితులు లేక్ లక్షణాలు అనునవి కొన్ని ముందుగానే నిర్ణయించబడిన విషయము పైన ఆధారపడి గుర్తించబడతాయి.  మానసిక రుగ్మత యొక్క కారణాలు విస్తృతముగా ఉంటాయి మరియు ఇవి గాయాల సంఘటనలు, చిన్ననాటి బాధలు, నిర్లక్ష్యము, ప్రమాదము వలన ఏర్పడిన శారీరక వైకల్యము, చాలా దగ్గరి వ్యక్తిని కోల్పోవడం, జన్యు అలంకరణలో ఆటంకాలు, మెదడు లోపాలు లేక గాయాలు, ఇతరులతో పోలిస్తే అభివృధ్ధి చెందని లోపాలు అను అనేక కారణాలు కలవు.  మానసిక వ్యాధి యొక్క చికిత్స అనునది అంతర్లీన కారణముపైన ఆధారపడి ఉంటుంది మరియు ఇది కౌన్సెలింగ్, సైకోథెరఫీ,హిప్నోథెరపీ, మందులు, శస్త్ర చికిత్స మరియు ఇతర చికిత్సలను కలిగి ఉంటుంది. మానసిక వ్యాధి యొక్క నివారణ అనునది జీవితము పైన సానుకూల దృక్పథము, మందులు, వివిధ ఈవెంట్ల ద్వారా చిన్న పిల్లల యొక్క విధ్యను హ్యాండిల్ చేయడం మరియు జీవితములో ఒత్తిడి లేకపోవడం, ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక యాక్టివిటీలు మరియు హాబీలను వృద్ధి చేసుకోవడం ద్వారా జీవితాన్ని మరియు పనిని బ్యాలెన్స్ చేసుకోవడం వలన ఈ వ్యాధిని నియంత్రించవచ్చు.

మానసిక అస్వస్థత యొక్క లక్షణాలు - Symptoms of Mental Disorder in Telugu

ప్రతీ రకమైన మానసిక వ్యాధికి లక్షణాలు మారుతుంటాయి.  అవి ఈ క్రింది విధముగా ఉంటాయి:

ఆందోళన యొక్క లక్షణాలు

ఇక్కడ అనేక రకాల ఆందోళన రుగ్మతలు కలవు, మరియు ప్రతీ ఒక్క రుగ్మత దేనికదే విభిన్నముగా ఉంటుంది.  ఆందోళనలో అనుభవించే కొన్ని సాధారణ లక్షణాలు కలవు, అవి ఈ క్రింది వాటిని కలిగి ఉంటాయి:

  • సంఘటనలకు సంబంధించి ఎల్లప్పుడూ ఆందోళన చెందడం మరియు జీవితములోని పరిస్థితులు అనగా కెరీర్, ఫైనాన్స్, మరియు ఆరోగ్యమునకు సంబంధించిన వాటి గురించిన ఆందోళన.
  • చెదరిపోయిన నిద్ర పధ్ధతులు లేక నిద్రలేమి.
  • వివరించలేనటువంటి తల, శరీర, లేక కండరాల నొప్పి.
  • గుండెదడలు అనగా, క్రమముగాలేని, పెద్దగా మరియు వేగవంతమైన హృదయ స్పందనలు, వీటిని ఒక వ్యక్తి అనుభవిస్తూ ఉండవచ్చు.
  • వికారం మరియు తల తిరగడం.​​

కుంగుబాటు లేక మాంద్యం యొక్క లక్షణాలు

క్రుంగిపోయిన మనస్సు గుండా చాలా విషయాలు వెళతాయి.  అందులో కొన్ని సాధారణముగా పరిశీలించలేనటువంటి కుంగిపోయిన ఆలోచనలు.  అయితే, ఇక్కడ కొన్ని క్లాసిక్ లక్షణాలు అలారం గంటలను వెంటనే పెరుగుటకు సహాయపడతాయి.

  • బాధ లేక ఒంటరిని అన్న భావన.
  • అమితముగా తినడం లేక ఆకలితో ఉండడము అనునది ఒక వ్యక్తి వరుసగా బరువు పెరగడానికి లేక బరువు తగ్గడానికి కారణమవుతుంది.
  • నిద్ర లేకపోవడం లేక అతిగా నిద్రపోవడం.
  • అలసటయొక్క నిరంతర భావన.
  • శరీరములో నొప్పులు మరియు బాధలు.
  • జీర్ణ సమస్యలు.
  • ఆశావాదం లేకపోవడం.
  • నిష్ప్రయోజనము అనే భావన.
  • ఆందోళన మరియు తప్పు అనే భావన.
  • ఆత్మహత్యా ఆలోచనలు మరియు ధోరణులు.

స్కిజోఫ్రీనియా (మనోవైకల్యము) యొక్క లక్షణాలు

మనోవైకల్యము యొక్క లక్షణాలు ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి మారుతుంటాయి, ప్రత్యేకముగా టీనేజర్లు మరియు పెద్దల మధ్య మారుతుంటాయి.

  • టీనేజర్లు
    • భ్రమలు (ఉనికిలో లేని దానిని అనుభవించడం).
    • నిద్రలేమి.
    • సంబంధాల నుండి ఉపసంహరించుకోవడం,
    • నడిపింపు లేకపోవడం.
    • పేలవమైన విద్యా ప్రదర్శన.
  • పెద్దలు
    • భ్రమలు (అవాస్తవ నమ్మకాలు) మరియు భ్రాంతులు.
    • అస్పష్టమైన, సంబంధములేని, మరియు అసంపూర్ణ సంభాషణలు.
    • ఎదురుతిరిగే ప్రవర్తన, కోపము చూపించడం లేక దూకుడు, ఇంపల్సివ్ నెస్ (ప్రచోదనం).
    • సరియైన రక్షణ మరియు పరిశుభ్రత లేకపోవడం.
    • సామాజిక సంకర్షణలను ఏర్పరచడములో సిగ్గుతో దూరముగా వెళ్ళడం.

ఆటిజం లక్షణాలు

ఆటిజం చాలా విస్తృతమైన స్పెక్ట్రమును కలిగి ఉంటుంది, మరియు ఈ పరిదిలో పరిశీలించదగిన లక్షణాల సంఖ్య అస్థిరముగా ఉంటాయి. వీటిలో అధిక ముఖ్యమైన జనరలైజ్ చేయబడినవి వ్యక్తుల పైన క్రింద ఇవ్వబడిన అంశాలలో ప్రభావమును చూపిస్తాయి:

  • కమ్యూనికేషన్ 
    ఇది కొన్నిసార్లు ఆలస్యము చేయబడుతుంది మరియు రెండు సంవత్సరాల వరకూ అభివృధ్ధి చెందదు, మరియు పిల్లలు స్పష్టమైన భాష మాట్లాడువరకు ఇబ్బందిపడుతుంటారు.  అదనముగా, పిల్లలు వారి కమ్యూనికేషన్ కు భావోద్వేగాలను మరియు భావాలను కలిపి చెప్పరు, వ్యంగ్యమును వారు గ్రహించలేరు, పిలిచినప్పుడు ప్రతిస్పందించరు, మరియు కమ్యూనికేటింగ్ చేసేటప్పుడు ఆసక్తిని వారు చూపించరు.
  • ప్రవర్తన 
    ఎక్కువగా గుర్తించదగిన ప్రవర్తన ఏమిటంటే పునరావృతము విధానమును కలిగిఉండడం, ఇందులో కళ్ళు కొట్టడం లేక రెపరెపలాడించడం అనునవి ఉంటాయి.  వ్యతిరేక వస్తువులను జతచేయడం సాధారణముగా ఉంటుంది.  వారు అనేక సూచనలను గ్రహించలేరు మరియు తక్కువ దృష్టి పరిదిని కలిగి ఉంటారు.  వారు నైపుణ్యత కలిగి ఉండరు మరియు వారు గ్రహించడములో మరియు స్పందించడములో మట్టి ముద్దను పోలి ఉంటారు.  వారు శబ్దాలు, కాంతి, మరియు స్పర్శలకు అత్యంత సున్నితముగా ఉంటారు.
  • సామాజిక సంకర్షణ 
    వారు ఒంటరిగా ఉండడానికి సాధారణముగా ఇష్టపడతారు మరియు తక్కువ లేక పరిమితమైన సామాజిక సంకర్షణను కలిగి ఉంటారు.  వారంతట వారు విడిగా ఉండడములో సంతోషిస్తారు, తరచుగా ఒకే విధమైన పనినీ ఎక్కువ సమయం పాటు చేస్తూ ఉంటారు.  వారు భావాలను వ్యక్తం చేసేటప్పుడు కళ్ళలోకి చూసి చెప్పరు మరియు ఒకవేళ ఏదైనా చెప్పవలసివస్తే, వారు సాధారణముగా ఒక పదము లేక చిన్న వాక్యముతో స్పందిస్తారు.
  • రిగ్రెషన్
    ఒక చిన్న పిల్లవాడు లక్షణాలలో పెద్దగా ఉన్నను చిన్న పిల్లవాడిని పోలిన స్థితిని చూపించడము అనునది అత్యంత సాధారణమైన రిగ్రెషన్ లక్షణము.

మానసిక మాంద్యమూ యొక్క లక్షణాలు

ఐడి యొక్క లక్షణాలను జనరలైజ్ చేయుట చాలా కష్టము, ఎందుకనగా అవి రకమును బట్టి మారుతూ ఉంటాయి.  కొన్ని లక్షణాలు అన్ని కేసులలో చాలా సాధారణముగా ఉంటాయి, అవి క్రింది వాటిని కలిగి ఉంటాయి:

  • ఆలస్యమైన వృద్ధి మైలురాళ్లు, అనగా కూర్చోవడం, ప్రాకడం, నిలబడడం, మరియు నడవడం.
  • ఆలస్యమైన లేక అస్పష్టమైన మాట.
  • వయస్సుతో సంబంధములేని ప్రవర్తన.
  • ఐక్యూ(IQ) స్థాయిలు 70 కంటే తక్కువగా ఉండడం.
  • క్రమమైన రోజువారీ కార్యక్రమాలను నిర్వహించే సామర్థ్యము లేకపోవడం మరియు తమ బాగోగుల విషయములో ఇతరుల కొరకు చూడడం.
  • జ్ఞాపకశక్తి కొరత.
  • లాజికల్ రీజనింగ్ లేకపోవడం లేక చర్యల యొక్క ఫలితాలను ఊహించే సామర్థ్యం లేకపోవడం.
  • ఇంపల్సివ్ నెస్ మరియు ఆసక్తి లేకపోవడం.
  • ఆధారపడడం మరియు తక్కువ ఆత్మ-విశ్వాసం.
  • శ్రద్ధ లోపాలు, బిరుసు, మరియు నిరాశ కలిగి ఉండడం.
  • పాసివిటీ (కలుగజేసుకోకపోవడం) మరియు సామాజిక యాక్టివిటీల నుండి ప్రక్కకు తప్పుకోవడం.

హైపరాక్టివిటీ రుగ్మత శ్రద్దా లోపం యొక్క లక్షణాలు

ఎడిహెచ్డి యొక్క విభేదించలేనటువంటి కొన్ని లక్షణాలు క్రింద ఇవ్వబడ్డాయి:

  • దృష్టి పెట్టకపోవడం.
  • పేలవమైన ఏకాగ్రత.
  • అధిక స్థాయిలో పరధ్యానముగా ఉండడం.
  • మతిమరుపు.
  • పనులు పూర్తిచేయలేని అసమర్థత..
  • సూచనలను అనుసరించలేనటువంటి అసమర్థత.
  • కొంత సమయము వరకు నిశ్చలముగా లేక నిశ్శబ్దముగా కూర్చోలేని కష్టతరమైన అనుభవము.
  • విశ్రాంతి లేకపోవడం మరియు కరిచేటటువంటి ధోరణులు.
  • ఇతరులు మాట్లాడుతున్నప్పుడు భంగం కలిగించడం.

మానసిక అస్వస్థత యొక్క చికిత్స - Treatment of Mental Disorder in Telugu

ఆందోళన చికిత్స

ఆందోళనకు సంబంధించి నిర్ధిష్టముగా చూచించబడిన చికిత్స ఏదీ లేదు, ఎందుకనగా విభిన్నమైన ప్రజలు విభిన్న పద్దతులకు స్పందిస్తుంటారు.  అయితే, ఎక్కువ కేసులలో, విభిన్న రూపాలలో ఉండే చికిత్సల యొక్క కలయికను ఉపయోగిస్తారు.

  • ఒక పూర్తిస్థాయిగా మందులను వాడడము అనునది అవసరము, ఎందుకనగా పరిస్థితి భౌతికమైనది కాదు లేక ఒక వ్యక్తికి సంబంధించినది కాదు.
  • సూచించిన మందులు అనునవి లక్షణాలను గుర్తించడములో సహాయపడతాయి.  ఆందోళన-ఉపశమన మందులు అనునవి అత్యంత తీవ్రమైన కేసులలో అవసరమైనవి.
  • కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనునది రోగిని అర్థం చేసుకోవడానికి మరియు అతడు/ఆమె ఏ విధమైన బాధను అనుభవిస్తున్నది అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది మరియు దానిని నిర్వహించడానికి మరియు దానిని అధిగమించేందుకు ఇది సహాయం చేస్తుంది.

కుంగుబాటు యొక్క చికిత్స

కుంగుబాటుకు చికిత్స అనునది మూడు-విధాల అప్రోచ్ ను కలిగి ఉంటుంది.  ఈ చికిత్స యొక్క ప్రధాన కోర్స్ క్రింది వాటిని కలిగి ఉంటుంది:

  • ఈ పరిస్థితిని చికిత్స చేయడానికి యాంటిడిప్రెస్సంట్స్ ఉపయోగిస్తారు.  వీటిని ఎక్కువగా తీవ్రమైన సందర్భాలలో ఉపయోగిస్తారు మరియు చిన్న పిల్లల కేసులలో వీటిని ఎప్పుడూ సూచించరు.
  • సైకోథెరపీ అనునది వ్యక్తిల మధ్య సమస్యలు మరియు ఆ సమస్యలను డీల్ చేయడం పైన దృష్టి పెడుతుంది.  కొన్ని సంధర్భాలలో, గ్రూప్ థెరపీ కూడా సూచించబడుతుంది.
  • గ్రూపులను సపోర్ట్ చేయడం, తోటివారిని, స్నేహితులను, సహచరులను, మరియు కుటుంబ సభ్యులను కూడా కలుపుతుంది, వీరిని ప్రాక్టికల్ పధ్దతులలో కాంబాట్ కుంగుబాటు చికిత్సలో సహాయం చేయవసినదిగా కోరుతుంది, మరియు వారు ఆ పరిస్థితులను ఆ వ్యక్తి ధైర్యముగా ఎదుర్కొనగలిగేందుకు సహాయపడేలా వారిని ప్రోత్సహిస్తుంది.
  • కొన్ని చాలా తీవ్రమైన కేసులలో మరియు మానసిక మాంద్యం కేసుల్లో, ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీని సూచిస్తారు.

మనోవైకల్యము యొక్క చికిత్స

మనోవైకల్యము యొక్క చికిత్స అనునది వివిధ ప్రమాణాలను కలిగి ఉంటుంది, వీటి ద్వారా సమస్యలను గుర్తించగలగడం మరియు నిరంతర్ అభివృద్ధి సాధించడానికి సహాయపడుతుంది.  చికిత్స వీటిని కలిగిఉంటుంది:

  • మందులు 
    అత్యంత సాధారణముగా సూచించబడిన మందులు యాంటిసైకోటిక్ మందులు.  ఇవి అనుభవించిన క్లిష్టమైన లక్షణాలను నిర్వహించడములో సహాయంచేస్తుంది.  తక్కువ సాధ్యమైన డోసు అనునది యాంటిసైకోటిక్స్ ను ఉపయోగించి చికిత్సలో ఇవ్వబడుతుంది.
  • ఎలక్ట్రోకన్వల్సివ్ మరియు మాగ్నెటిక్ థెరపీ
    దీనిని భ్రమలను అనుభవించే లక్షణాలు గల ప్రజలను గుర్తించడములో వారికి సూచించబడుతుంది.
  • సైకోసోషియల్ థెరపీ 
    ఈ రకమైన చికిత్స అనునది సంక్లిష్టమైనది, ఇందులో కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, గ్రూప్ థెరపీ, పునరావాసం కొరకు  నైపుణ్య-ఆధారిత శిక్షణ, ఉద్యోగ మద్ధతు, మరియు ఆల్కహాలుకు వ్యతిరేకముగా థెరపీ మరియు పదార్థ దుర్వినియోగం.

ఆటిజం యొక్క చికిత్స

ఆటిజం చికిత్స అనునది వాస్తవముగా అసాధ్యము, మరియు జోక్యం అనునది పరిస్థితులకు అనుగుణముగా పోరాడుటకు వ్యక్తులను మరియు కుటుంబాన్ని సన్నద్దం చేయడాన్ని లక్ష్యముగా ఉంచుకుంది.

  • బిహేవియర్ మేనేజ్మెంట్ అనునది కావలసిన ప్రవర్తనను ప్రోత్సహించడానికి మరియు అవసరములేని దానిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
  • కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనునది వ్యక్తి ఆలోచనలు, భావోద్వేగాలు, మరియు పరిస్థితులతో రావడం పైన దృష్టి పెడుతుంది.
  • ఆకుపేషనల్ థెరపీ స్వాతంత్ర్యము అను భావన ఇవ్వడానికి మరియు ఇతరులపైన ఆధారపడడాన్ని తగ్గించడానికి ఇవ్వబడింది.
  • శారీరక థెరపీ అనునది సాధారణ శరీర కదలికలు అదేవిధముగా చక్కటి మోటార్ నైపుణ్యాలు అందుకోవడములో సహాయపడుతుంది.
  • స్పీచ్ థెరపీ అనునది ఆలోచనలు మరియు భావోద్వేగాలు స్పష్టముగా తెలుపడానికి మరియు ఉచ్చారణను మెరుపరచడానికి సహాయపడుతుంది.
  • సామాజిక నైపుణ్య థెరపీ అనునది వారి పరిసరాలతో ఇంటిగ్రేట్ కావడానికి వారిని ప్రోత్సహిస్తుంది మరియు అర్థవంతమైన సహవాసాలను ఏర్పరచడములో ప్రోత్సహిస్తుంది.
  • న్యూట్రిషన్ థెరపీ అనునది ఆరోగ్యమును మెరుగుపరచుకోవడానికి మరియు లోపాల రుగ్మతలను నివారించడానికి తోడ్పడుతుంది.
  • మందులు అనునవి మూర్చలు లేక కుంగుబాటు గుర్తించినప్పుడు, అటువంటి సందర్భాలలో సూచించబడతాయి.

మానసిక మాంద్యము యొక్క చికిత్స

ఐడి యొక్క చికిత్స అనునది ఎక్కువ సేపు కొనసాగే ప్రక్రియ, ఇది క్రమమైన కౌన్సిలింగ్ ను కలిగి ఉంటుంది.  ఐడి కలిగిన పిల్లలకు సహాయం కొరకు స్కూలు ద్వారా ప్రత్యేకముగా నిర్ధేశించిన ప్రోగ్రాములు సూచించబడతాయి, మరియు అక్కడ వారి ఒక ప్రత్యేక ఎడ్యుకేటర్ ఉంటాడు, అతడు పిల్లల యొక్క వ్యక్తిగత అవసరాలను తీర్చడము మాత్రమే కాకుండా వారి యొక్క జీవన నైపుణ్యాలను పెంచడములో తోడ్పడుతాడు.

ఐడి వంటి కేసులకు సంబంధించి కీ క్రిటేరియాలో  పిల్లలు ఒక గొప్ప పరిధి వరకు వారు నేర్చుకున్న అనుభవాలను ఆకలింపుచేసుకోవడానికి అనుమతించడమును కలిగి ఉంటుంది మరియు వారి సామాజిక నైపుణ్యాలను మరియు జీవన నైపుణ్యాలను మెరుపరుస్తుంది.  దీనిని సాధించడానికి, క్రింద ఇవ్వబడిన థెరపీల కలయికలను ఉపయోగిస్తారు:

  • కౌన్సెలింగ్
  • ఆకుపేషనల్ థెరపీ
  • బిహేవియరల్ థెరపీ
  • మందులు (చాలా తక్కువ కేసులలో)

ఎడిహెచ్డి యొక్క చికిత్స

ఇక్కడ వివిధ చికిత్స కోర్సులు కలవు, వాటిలో ప్రత్యామ్నాయ మరియు సహజ థెరపీలు కలవు.  మందులను ఉత్ప్రేరకాలు మరియు ఉత్ప్రేరకాలు కాని వాటి రూపములో, మెదడులోని డోపమైన్ స్థాయిలను పెంచడానికి లేక నార్ ఎఫినెఫ్రైన్ స్థాయిలను పెంచడానికి సూచిస్తారు.  ప్రయోజనాలు స్పష్టముగా ఉన్నటే, కొన్ని దుష్పలితాలు కూడా ఉన్నాయి.

సహజమైన నివారలు, ఆరోగ్యకరమైన ఆహారము, శారీరక యాక్టివిటీలలో పాల్గొనడం, మరియు ఒక నిద్రా పధ్ధతికి కట్టుబడి ఉండడమును ఇవి కలిగి ఉంటాయి.  యాక్టివిటీలు అనగా యోగా, ధ్యానము అనునవి కూడా శ్రద్ద మరియు కుంగుబాటును సులభముగా దూరం చేయడం వంటి ప్రభావాలను చూపిస్తాయి.



వనరులు

  1. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Mental Disorders
  2. American Psychological Association [internet] St. NE, Washington, DC. Anxiety.
  3. National Institute of Mental Health [Internet] Bethesda, MD; Anxiety Disorders. National Institutes of Health; Bethesda, Maryland, United States
  4. National Institutes of Health; [Internet]. U.S. Department of Health & Human Services; Understanding Anxiety Disorders.
  5. American Psychiatric Association [Internet] Washington, DC; What Are Anxiety Disorders?
  6. National Institute of Mental Health [Internet] Bethesda, MD; Depression. National Institutes of Health; Bethesda, Maryland, United States
  7. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Depression
  8. Markowitz, J.C., Weissman, M. (2004, October). Interpersonal psychotherapy: principles and applications. World Psychiatry. 3(3): 136–139. Retrieved from http://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC1414693/. PMID: 16633477
  9. Fischer BA, et al. Robert W Buchanan. Schizophrenia in adults: Clinical manifestations, course, assessment, and diagnosis; [Internet]
  10. Health Harvard Publishing, Published: June, 2010. Harvard Medical School [Internet]. Schizophrenia treatment recommendations updated. Harvard University, Cambridge, Massachusetts.
  11. Stone WL, Basit H, Los E. Fragile X Syndrome. [Updated 2019 Apr 25]. In: StatPearls [Internet]. Treasure Island (FL): StatPearls Publishing; 2019 Jan-
  12. Am Fam Physician. 2008 Dec 1;78(11):1301-1305. [Internet] American Academy of Family Physicians; AAP Releases Guidelines on Identification of Children with Autism Spectrum Disorders.
  13. Eunice Kennedy Shriver National Institute of Child Health and Human; National Health Service [Internet]. UK; What are the treatments for autism?
  14. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Facts About Intellectual Disability
  15. National Institutes of Health; [Internet]. U.S. Department of Health & Human Services; Intellectual and Developmental Disabilities.
  16. Bonath B, et al. (2016). Regional gray matter volume differences between adolescents with ADHD and typically developing controls: Further evidence for anterior cingulate involvement. DOI: J Atten Disord. 2018 May;22(7):627-638. PMID: 26748338
  17. National Institute of Mental Health [Internet] Bethesda, MD; Attention-Deficit/Hyperactivity Disorder. National Institutes of Health; Bethesda, Maryland, United States
  18. Zylowska L, et al. (2007). Mindfulness meditation training in adults and adolescents with ADHD: A feasibility study. DOI: J Atten Disord. 2008 May;11(6):737-46. Epub 2007 Nov 19. PMID: 18025249

మానసిక అస్వస్థత కొరకు మందులు

Medicines listed below are available for మానసిక అస్వస్థత. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.