నరాల బలహీనత - Nerve Weakness in Telugu

Dr. Nabi Darya Vali (AIIMS)MBBS

January 03, 2019

March 06, 2020

నరాల బలహీనత
నరాల బలహీనత
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

నరాల బలహీనత అంటే ఏమిటి?

మన శరీరంలో సంకేతాల ప్రసారానికి నరాలు బాధ్యత వహిస్తాయి. నరాల రుగ్మతలు లేదా నరాలకయ్యే గాయాలు నరాల సాధారణ పనిని దెబ్బతీస్తాయి, అదే నరాల బలహీనతకు దారి తీస్తుంది. నరాల బలహీనత రుగ్మత మన శరీర భాగాల విస్తృత పనితీరును దెబ్బ తీస్తుంది, తద్వారా నరవైకల్య పరిస్థితులు దాపురిస్తాయి.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

నరాల బలహీనత యొక్క ప్రధాన చిహ్నాలు మరియు లక్షణాలు క్రింది విధంగా ఉన్నాయి:

 • నొప్పి
 • పొడిచినట్లుండడం లేక చక్కిలిగింత ఉన్నట్లుండడం
 • తిమ్మిరి
 • అనుభూతి జ్ఞానాన్నికోల్పోవడం
 • అలసట
 • కండరాల బలహీనత
 • ఫుట్ డ్రాప్ (పాదం ముందు భాగాన్నిపైకెత్తాలంటే వీల్లేని అసమర్ధత)

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

నరాల బలహీనతకు అనేక కారణాలు ఉండవచ్చు. అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి:

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

వ్యాధి సంకేతాలు మరియు లక్షణాలు నాడీ వ్యవస్థ యొక్క ప్రమేయాన్ని సూచిస్తాయి. అయినప్పటికీ, నరాల బలహీనత యొక్క వ్యాధి లక్షణాలు చాలా నిర్దిష్టమైనవి కాదు; అందువల్ల వైద్యపర నిర్ధారణ (క్లినికల్ డయాగ్నొసిస్) చాలా కీలకమైనది. రోగి వైద్య చరిత్ర, కుటుంబం చరిత్ర, మరియు వృత్తి చరిత్రల  గురించి అధ్యయనం చేయటం వలన డాక్టర్కు వ్యాధి యొక్క ముఖ్యమైన సమాచారాన్ని అందించవచ్చు, ఇది అంతర్లీన కారణాన్ని నిర్ధారణ చేయడంలో సహాయపడుతుంది. క్రింది రోగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు:

 • ఎలెక్ట్రో డయాగ్నగ్నోస్టిక్ పరీక్షలు
 • జ్ఞాన మరియు మోటార్ నరాల ప్రసరణ
 • ఎఫ్ (F) ప్రతిస్పందన
 • హెచ్ (H) రిఫ్లెక్స్
 • నీడిల్ ఎలెక్ట్రోమయోగ్రఫీ  
 • రక్త పరిశోధన (బ్లడ్ ఇన్వెస్టిగేషన్)
 • రోగనిరోధక రుగ్మతలు (ఆటోఇమ్యూన్ డిజార్డర్స్)
 • హెచ్ఐవి  
 • సియస్ఎఫ్ (CSF) పరీక్ష (సెరెబ్రోస్పైనల్ ద్రవం)

నరాల బలహీనత అనేది ఒకటి లేదా మరిన్ని అంతర్లీన పరిస్థితులు లేదా వ్యాధుల ఫలితంగా సంభవిస్తుంది. అందువల్ల, చికిత్స ప్రధానంగా వ్యాధికి కారకమైన అంతర్లీన పరిస్థితుల లేకవ్యాధుల్ని నయం చేయడంపై దృష్టి పెడుతుంది. ఇందుగ్గాను కింది చికిత్స ఎంపికలు అందుబాటులో ఉన్నాయి:

నొప్పిని నియంత్రించే మందులు:

 • నల్లమందు
 • నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (NSAIDS)
 • క్యాప్సైసిన్ పాచెస్
 • నైరాశ్య నిరోధకాల.
 • నరాల మరమ్మత్తు మరియు ప్రేరణ కోసం కైనెటిక్ థెరపీ.
 • విద్యుత్ప్రేరకం:
 • ట్రాన్స్క్యుటేనియస్ ఎలక్ట్రోస్టిములేషన్ (TCES)
 • విద్యుత్ ద్వారా సూదివైద్యం (electroacupuncture)
 • మాగ్నెటోథెరపీ: పల్సెడ్ అయస్కాంత క్షేత్రం ఎంజైమ్ ప్రేరణ ద్వారా నరములు పునరుత్పత్తి, రక్త ప్రసరణ పెరిగింది.
 • బయో లేజర్ ఉద్దీపన: నరాలని సరిచేయడానికి లేజర్ రేడియేషన్లను ఉపయోగించవచ్చు.
 • ముఖ పక్షవాతం చికిత్స కోసం ముఖ నాడీకండర నిరోధక పద్ధతులు.
 • కండరాలను బలోపేతం చేసేందుకు భౌతిక చికిత్స వ్యాయామాలు
 • యోగా మరియు ధ్యానం నరముల ఉధృతిని శాంతపరిచి వాటిని బలోపేతం చేసేందుకు.
 • శస్త్రచికిత్స జోక్యం.

నరాల బలహీనతను నిర్వహించడానికి, ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉండటం మరియు సమతుల్య ఆహారాన్ని తినడం ముఖ్యం.వనరులు

 1. Krzysztof Suszyński. Physiotherapeutic techniques used in the management of patients with peripheral nerve injuries. Neural Regen Res. 2015 Nov; 10(11): 1770–1772. PMID: 26807111
 2. Usha Kant Misra et al. Diagnostic approach to peripheral neuropathy. Ann Indian Acad Neurol. 2008 Apr-Jun; 11(2): 89–97. PMID: 19893645
 3. Sumit Kar et al. Nerve damage in leprosy: An electrophysiological evaluation of ulnar and median nerves in patients with clinical neural deficits: A pilot study. Indian Dermatol Online J. 2013 Apr-Jun; 4(2): 97–10. PMID: 23741664
 4. Shri K Mishra et al. The therapeutic value of yoga in neurological disorders. Ann Indian Acad Neurol. 2012 Oct-Dec; 15(4): 247–254. PMID: 23349587
 5. National Cancer Institute [Internet]. Bethesda (MD): U.S. Department of Health and Human Services; Nerve Problems (Peripheral Neuropathy) and Cancer Treatment.

నరాల బలహీనత వైద్యులు

Dr. Hemanth Kumar Dr. Hemanth Kumar Neurology
3 वर्षों का अनुभव
Dr. Deepak Chandra Prakash Dr. Deepak Chandra Prakash Neurology
10 वर्षों का अनुभव
Dr Madan Mohan Gupta Dr Madan Mohan Gupta Neurology
7 वर्षों का अनुभव
Dr. Virender K Sheorain Dr. Virender K Sheorain Neurology
19 वर्षों का अनुभव
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

నరాల బలహీనత కొరకు మందులు

నరాల బలహీనత के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

నరాల బలహీనత की जांच का लैब टेस्ट करवाएं

నరాల బలహీనత के लिए बहुत लैब टेस्ट उपलब्ध हैं। नीचे यहाँ सारे लैब टेस्ट दिए गए हैं:

टेस्ट का नाम