myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

పాలిసిస్టిక్ ఓవరీ అండాశయ సిండ్రోమ్ (PCOS) అంటే ఏమిటి?

పాలిసిస్టిక్ ఓవరి సిండ్రోమ్ లేక పి సి ఒ ఎస్ (PCOS) గా సంక్షిప్తీకరించిన ఈ రుగ్మత మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత కారణంగా కనపడే ఓ వ్యాధిలక్షణాల సంకలనం. ఇది సాధారణంగా 18-35 ఏళ్ల వయస్సు మధ్య ఉండే పునరుత్పాదక వయస్సున్న మహిళలను ప్రభావితం చేస్తుంది. ఈ రుగ్మత యొక్క పేరును దాని యొక్క సాంప్రదాయిక లక్షణాల నుండి పొందింది. బాధిత మహిళల అండాశయాలు (ఎల్లప్పుడు కాదు) 12 లేక అంతకంటే ఎక్కువ ఏకవిదారక ఫలాల్ని కల్గి ఉంటాయి. కనీసం ఒక అండాశయం లేక ఎక్కువ అండాశయాల్లో ఈ ఏకవిదారక ఫలాల్ని, ఫోక్లికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (FSH) మరియు లుటినైజింగ్ (luteinizing) హార్మోన్ (LH) వంటి ఇతర హార్మోన్ల చెదిరిన స్థాయిలతో పాటు అండాశయాలు కనీసం ఒక 12 లేదా ఎక్కువ ఫోలికల్స్ కలిగి ఉంటాయి.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

లక్షణాలు ఇలా ఉంటాయి

 • అమేనోరియా అంటే ఋతుచక్రాలు లేదా ముట్లు క్రమంగా లేకపోవడం
 • డిస్మెనోరియా అంటే బాధాకరమైన ఋతుచక్రాలు (ముట్లు)
 • అక్రమ ఋతుచక్రాలు
 • హిర్సూటిజం అనగా శరీరంపైన మరియు ముఖముపైన అధికమైన జుట్టు పెరుగుదల
 • మొటిమలు (acne)
 • కటి (పెల్విక్) ప్రాంతంలో నొప్పి
 • గర్భవతి కావడం కష్టమవడం
 • ఊబకాయం, ఉదరభాగంలో కొవ్వు చేరడమనే ధోరణిని కల్గి ఉండడం
 • పరిధీయ ఇన్సులిన్ నిరోధకత
 • వంధ్యత్వం/సంతానలేమి
 • రోగి ఋతు లోపాలు, అడ్రినల్ ఎంజైమ్ లోపాలు, వంధ్యత్వం, ఊబకాయం మరియు జీవక్రియ సిండ్రోమ్, లేదా మధుమేహం యొక్క కుటుంబ చరిత్రతో ఉండవచ్చు. ప్రత్యామ్నాయంగా, వారు (రోగులు) అధిక రక్తస్రావం లేదా దీర్ఘకాలిక ముట్లు (రుతుక్రమం) వస్తున్నట్లు  ఫిర్యాదు చేయవచ్చు.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

పోలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (లేక PCOS) జన్యు సిద్ధతను (genetic predisposition) చూపిస్తుంది మరియు తల్లిదండ్రుల నుండి ఓ అలైంగిక క్రోమోజోమ్ సంబంధిత (ఆటోసోమల్) ఆధిపత్య పద్ధతిలో వారసత్వంగా వచ్చినట్లు కనిపిస్తుంది. రోగులు తమ శరీరాల్లో, ముఖ్యంగా టెస్టోస్టెరాన్, ఆండ్రోజెన్ల (మగ హార్మోన్లు) స్థాయిని కలిగి ఉంటారు. ఈ హార్మోన్లు అండోత్సర్గం నమూనాలతో జోక్యం చేసుకుంటాయి మరియు ఇతర లక్షణాల శ్రేణికి దారి తీస్తుంది. హార్మోన్లు ఫోలికల్స్ యొక్క పరిపక్వత ఆటంకానికి దారితీస్తాయి. ఈ అపరిపక్వ ఏకవిదారక ఫలాలు (follicles) అండాశయం ద్రవం నిండిన తిత్తులు నిండినట్లుగా కనిపిస్తాయి.

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

రోగ నిర్ధారణ వివరణాత్మక వైద్య (క్లినికల్) చరిత్ర మరియు భౌతిక పరీక్షను కలిగి ఉంటుంది. ప్రయోగశాల పరిశోధనల్లో థైరాయిడ్ ఫంక్షన్ పరీక్షలు; FSH యొక్క స్థాయిలు, ప్రోలాక్టిన్, మరియు LH; టెస్టోస్టెరోన్ (testosterone) మరియు బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలు. వీటికి ముందు, అల్ట్రాసోనోగ్రఫీ వంటి నాన్-ఇన్వాసివ్ ఇమేజింగ్ను వైద్యుడు సూచించవచ్చు. అండాశయాల్లో ముత్యాల హారంలాగా తిత్తులు గోచరించడం జరుగుతుంది.

చికిత్సలో భాగంగా రోగిని ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోమని ప్రేరేపించడం. హార్మోన్ల సంతులనాన్ని తిరిగి పొందడానికి చేసుకోవాల్సిన మార్పులు ఆరోగ్యకరమైన ఆహారం, బరువు తగ్గడం మరియు క్రమం తప్పని సాధారణ వ్యాయామం. ఇంకా, హార్మోన్ల చికిత్సను డాక్టర్ సూచించవచ్చు. మెట్ఫోర్మిన్ వంటి ఇన్సులిన్ సెన్సిటిజింగ్ ఔషధాలను ప్రీ-డయాబెటీస్ లేదా ఇన్సులిన్ నిరోధకత కలిగినవారికి సహాయపడతాయి.

 1. పోలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ కొరకు మందులు

పోలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ కొరకు మందులు

పోలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine NamePack SizePrice (Rs.)
i-PillIpill 1.5 Mg Tablet100.0
Duoluton L TabletDuoluton L 0.25 Mg/0.05 Mg Tablet139.5
Loette TabletLoette Tablet177.1
Ovilow TabletOvilow 0.02 Mg/0.1 Mg Tablet104.0
Ovral G TabletOvral G 0.05 Mg/0.5 Mg Tablet160.74
Ovral L TabletOvral L 0.03 Mg/0.15 Mg Tablet64.47
Suvida TabletSuvida 0.3 Mg/0.03 Mg Tablet30.0
Triquilar TabletTriquilar Tablet90.5
Dearloe TabletDearloe 0.02 Mg/0.1 Mg Tablet93.02
Ergest TabletErgest 0.05 Mg/0.25 Mg Tablet68.48
Ergest Ld TabletErgest Ld 0.03 Mg/0.15 Mg Tablet70.56
Esro TabletEsro 0.03 Mg/0.15 Mg Tablet65.0
Esro G TabletEsro G 0.050 Mg/0.250 Mg Tablet70.0
Esro L TabletEsro L 0.02 Mg/0.10 Mg Tablet60.0
Florina TabletFlorina 0.1 Mg/0.02 Mg Tablet67.25
Florina G TabletFlorina G 0.05 Mg/0.25 Mg Tablet96.0
Florina N TabletFlorina N Tablet96.0
Mala D TabletMala D Tablet2.75
Nogestol TabletNogestol 0.15 Mg/0.03 Mg Tablet63.0
Orgalutin TabletOrgalutin 0.05 Mg/2.5 Mg Tablet22.91
Levora TabletLevora 0.03 Mg/0.15 Mg Tablet25.0
Lyna TabletLyna Tablet55.0
Oc 21 TabletOc 21 0.03 Mg/0.15 Mg Tablet78.0
Ovral TabletOvral Tablet70.56

మీకు గానీ లేదా మీ కుటుంబములో ఎవరికైనా గానీ ఈ వ్యాధి ఉందా? దయచేసి ఒక సర్వే చేసి ఇతరులకు సహాయపడండి

और पढ़ें ...