చెవుల్లో రింగుమనే మ్రోత (టిన్నిటస్) - Ringing in ears (Tinnitus) in Telugu

Dr. Abhishek Gupta

December 24, 2018

March 06, 2020

చెవుల్లో రింగుమనే మ్రోత
చెవుల్లో రింగుమనే మ్రోత

చెవుల్లో రింగుమనే మ్రోత అంటే ఏమిటి?

చెవుల్లో రింగుమనే మ్రోత లక్షణాన్నే వైద్యపరంగా “టిన్నిటస్” అని పిలుస్తారు మరియు ఎలాంటి బాహ్య కారణం లేకుండా అసాధారణమైన “రింగు రింగు”మనే ధ్వని లేదా సందడి ధ్వని ఒక చెవి లేదా రెండు చెవుల్లోను వినిపించడం దీని లక్షణం. చెవుల్లో ధ్వని గర్జనలాగా,  క్లిక్-క్లిక్ మనే ధ్వనిలా లేదా హిస్-హిస్ మనే బుసలుకొట్టే ధ్వని వినిపించవచ్చు. ఈ ధ్వని మృదువైనదిగా లేదా బిగ్గరగానూ ఉండవచ్చు. అయినప్పటికీ, టిన్నిటస్ అనేది ఒక వ్యాధి కాదు మరియు చెవుల్లో తమకిలా ఉంటోందని చాలామంది వ్యక్తులు వైద్యులకు నివేదించారు.

ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

చెవుల్లో రింగుమనే మ్రోత లేక టిన్నిటస్ అనేదే ఓ వ్యాధి లక్షణం, ఇది వినికిడి వ్యవస్థలో అసహజతను సూచిస్తుంది.

టిన్నిటస్ (Tinnitus) సాధారణంగా ఒకటి లేదా రెండు చెవుల్లో “రింగు రింగు” మనే ధ్వని  వినబడేదిగా వర్ణించబడింది. టిన్నిటస్ లక్షణం కల్గిన వ్యక్తి ఈ ధ్వనిని ఇంకా కింది విధంగా కూడా వర్ణించవచ్చు:

 • గర్జించే ధ్వనిన (Roaring)
 • బుసలు కొట్టే (హిస్ హిస్ మనే) ధ్వని (Hissing)
 • ఈల ధ్వని (విజ్లింగ్)
 • అస్పష్ట సందడిగా ఉండడం (Vague buzzing)

చెవుల్లో “రింగు రింగు” మనే ఈ ధ్వనిని కొందరు బిగ్గరగా ఉన్నట్లు నివేదించవచ్చు, ఇంకొందరు వ్య క్తులకు ఇది చాలా మందకొడిగా ఉండే ధ్వనిగా అనిపించొచ్చు. అయితే, టిన్నిటస్ లో ధ్వని తప్పనిసరిగా వెలుపలి మూలం నుండి రాదు. ఇది కొన్ని నిమిషాలు లేదా సుదీర్ఘకాలంపాటు చెవుల్లో అనుభవించవచ్చు.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

టిన్నిటస్ వృద్ధుల్లో చాలా సాధారణమైన లక్షణంగా ఉంటుంది, మరియు ఇది పురుషులు మరియు స్త్రీలకు కూడా వస్తుంది. టిన్నిటస్ కు కింద సూచించినటువంటి చాలా కారణాలే ఉండవచ్చు:

 • చెవి సంక్రమణం.
 • సైనస్ ఇన్ఫెక్షన్ (ముక్కు కారడం) .
 • హార్మోన్ల మార్పులు.
 • థైరాయిడ్ అసాధారణతలు.
 • చెవికి గాయం.
 • అలసట.
 • చెవి కాలువ మైనపు నిక్షేపం (ear wax) కారణంగా నిరోధించబడడం.
 • కొన్ని ఔషధాల సేవనంవల్ల

వృద్ధుల్లో టిన్నిటస్ రావడమనేది వినికిడి నష్టానికి మొదటి సంకేతం కావచ్చు.

కర్మాగారాలు మరియు సంగీత కార్యక్రమాల వంటి ధ్వని వాతావరణంలో పనిచేసే వ్యక్తులకు ఈ టిన్నిటస్ లక్షణం స్వల్ప కాలికంగా గాని లేదా శబ్దప్రేరిత వినికిడి నష్టం యొక్క నిరంతర లక్షణంగా కానీ అభివృద్ధి కావచ్చు.

టినిటస్ కుంగుబాటు మరియు ఇతర మానసిక అనారోగ్యాల లక్షణంగా కూడా కనిపిస్తుంటుంది.

టిన్నిటస్ చాలా సాధారణం కావడంతో, స్పష్టమైన కారణమంటూ ఏదీ లేకుండా కూడా  సంభవించవచ్చు.

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

టిన్నిటస్ యొక్క కారణాన్ని నిర్ధారించడానికి లేదా గుర్తించడానికి, వైద్యుడు ఒక వినికిడి పరీక్షను నిర్వహించి, ఎలాంటి ధ్వనిని వింటున్నారన్న దాని గురించి వ్యక్తిని మరింతగా  విచారణ చేయవచ్చు. CT మరియు MRI వంటి స్కానింగ్ మరియు ఇమేజింగ్ పరీక్షలు కూడా గాయం యొక్క ఏవైనా సంకేతాలను గుర్తించడానికి చేయవచ్చు. చెవిలో ఏదైనా విదేశీ శరీరం (foreign body) ఉనికిని  తనిఖీ చేయటానికి చెవి లోపల చూడ్డానికి ఉపయోగించే ఒక పరికరం “ఒటోస్కోపీ” ని వైద్యుడు నిర్ధారణలో ఉపయోగించవచ్చు.

సాధారణంగా, చెవుల్లో రింగు గింగు మనేది దానంతటదే మాయమైపోతుంది, దీనికి ప్రత్యేకమైన చికిత్స అవసరం లేదు. అయితే, ఈ చెవిరుగ్మత లక్షణానికి ఏదైనా నిర్దిష్ట కారణం ఉంటే, చికిత్స అవసరమవుతుంది.

రక్తనాళాల గాయం అయ్యుంటే దాన్ని చికిత్స చేసేందుకు మందులివ్వబడతాయి లేదా ఒత్తిడి సంబంధిత టిన్నిటస్ను కూడా మందులు ఇవ్వబడతాయి. వ్యక్తి యొక్క వినికిడి నష్టానికి హియరింగ్ ఎయిడ్ సాధనాలు ఇవ్వబడవచ్చు.వనరులు

 1. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Tinnitus.
 2. National Institutes of Health; National Institute on Deafness and Other Communication Disorders. [Internet]. U.S. Department of Health & Human Services; Tinnitus.
 3. Healthdirect Australia. Tinnitus. Australian government: Department of Health
 4. Byung In Han et al. Tinnitus: Characteristics, Causes, Mechanisms, and Treatments. J Clin Neurol. 2009 Mar; 5(1): 11–19. PMID: 19513328
 5. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Tinnitus.
 6. National Organization for Rare Disorders [Internet]; Tinnitus.

చెవుల్లో రింగుమనే మ్రోత (టిన్నిటస్) వైద్యులు

Dr. Chintan Nishar Dr. Chintan Nishar ENT
10 वर्षों का अनुभव
Dr. K. K. Handa Dr. K. K. Handa ENT
21 वर्षों का अनुभव
Dr. Aru Chhabra Handa Dr. Aru Chhabra Handa ENT
24 वर्षों का अनुभव
Dr. Jitendra Patel Dr. Jitendra Patel ENT
22 वर्षों का अनुभव
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

చెవుల్లో రింగుమనే మ్రోత (టిన్నిటస్) కొరకు మందులు

చెవుల్లో రింగుమనే మ్రోత (టిన్నిటస్) के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

చెవుల్లో రింగుమనే మ్రోత (టిన్నిటస్) की जांच का लैब टेस्ट करवाएं

చెవుల్లో రింగుమనే మ్రోత (టిన్నిటస్) के लिए बहुत लैब टेस्ट उपलब्ध हैं। नीचे यहाँ सारे लैब टेस्ट दिए गए हैं:

टेस्ट का नाम