myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

కృష్ణపటలశోథ (యువెటిస్) అంటే ఏమిటి?

కంటిలోని కృష్ణపటలం లేక నల్లగుడ్డు (Uvea) వాపెక్కి మంట కలగడం మరియు దాని పరిసరభాగంలోని కణజాలం కూడా వాపుదేలడం, మంట పెట్టడాన్నే “కృష్ణపటల శోథ” (Uveitis)గా పిలుస్తారు. ఈ రుగ్మత ఒక కన్ను లేదా రెండు కళ్ళనూ దెబ్బ తీయొచ్చు. సరైన సమయంలో చికిత్స చేయకపోతే ఇది అంధత్వానికి దారితీస్తుంది. కృష్ణపటలశోథ (నల్ల కనుగుడ్లు వాపు) ఏర్పడ్డ భాగాన్నిబట్టి ఈ రుగ్మత మూడు రకాలు- ముందుభాగం (anterior), మధ్యభాగం  (intermediate) మరియు వెనుకభాగం (posterior) ఉంటాయి. కొన్ని సందర్భాల్లో, కంటి నల్లగుడ్డులోని ఈ మూడు పొరలు (అంటే ముందు, మధ్య, వెనుకభాగం) కూడా రుగ్మతకు  గురవుతాయి. ఈ కంటి రుగ్మత ఆకస్మికంగా సంభవించొచ్చు మరియు స్వల్పకాలికమైందిగా, తీవ్రమైనదిగా లేదా దీర్ఘకాలికమైన కంటిజబ్బుగా కూడా కొనసాగుతుంది.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

దీని సాధారణ చిహ్నాలు మరియు లక్షణాలు కొన్ని:

 • తగ్గిన దృష్టి
 • అస్పష్టమైన లేదా మసకబారిన దృష్టి
 • మచ్చలు నల్లగా కనిపిస్తాయి మరియు కంటిచూపులో ద్యోతకమవుతూ ఉంటాయి
 • కాంతికి సున్నితత్వం లేదా ఫోటోఫోబియా  
 • కన్ను ఎరుపెక్కడం మరియు నొప్పి పెట్టడం
 • తలనొప్పి
 • చిన్న కనుపాపలు (small pupil)
 • నల్లకనుగుడ్డు (Iris) యొక్క రంగు మారుతుంది
 • కళ్ళలో నీరు కారడం

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

కృష్ణపటలశోథ (యువెటిస్) యొక్క ఖచ్చితమైన కారణం తెలియదు. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ కళ్ళతో సహా వివిధ కణజాలాలపై దాడి చేసే స్వయం ప్రతిరక్షక పరిస్థితుల్లో సాధారణంగా ఈ కంటిరుగ్మత కనిపిస్తుంది. దీనికి కొన్ని కారణాలు క్రింది విధంగా ఉన్నాయి:

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

డాక్టర్ కంటిని భౌతికంగా తనిఖీ చేస్తారు, వ్యక్తి పొగమంచుకమ్మినట్లుండే దృష్టిని కల్గి ఉన్నారా  లేదా స్పష్టమైన దృష్టిని కలిగిఉన్నారా అనేదాన్ని పరిశీలిస్తారు. కొన్ని పరీక్షలు కూడా నిర్వహిస్తారు, అవి:

 • సాధారణ రక్త పరీక్షలు ద్వారా తెల్ల రక్త కణాలు లెక్కింపు మరియు ప్రోటీన్ స్థాయిలు తనిఖీ
 • వివరణాత్మక శారీరక పరీక్షతోపాటు పూర్తి వైద్య చరిత్రను గుర్తించడం
 • స్కిన్ పరీక్షలు
 • కంటి ద్రవాల పరీక్ష

రోగనిర్ధారణ తరువాత, రోగిని వివిధ పద్ధతుల ద్వారా చికిత్స చేస్తారు, ఆ పద్ధతులివి:

 • కార్టికోస్టెరాయిడ్ మందులు వాపు తగ్గించడంలో సహాయపడతాయి.
 • మిడ్రియాటిక్ ఐ డ్రాప్స్ మందును కనుపాపను విస్తరించేందుకు ఉపయోగిస్తారు.
 • సంక్రమణ విషయంలో, యాంటీబయాటిక్స్ ను వ్యాధిని నియంత్రించడానికి ఇస్తారు.
 • దృష్టి కోల్పోయే ప్రమాదం ఉన్నట్లయితే, ఇమ్యునోస్ప్రెసెంట్స్ సూచించబడవచ్చు.
 • నల్ల కల్లద్దాలను కాంతి సున్నితత్వానికిగాను  వాడవచ్చు.
 1. కృష్ణపటలశోథ (యువెటిస్) కొరకు మందులు

కృష్ణపటలశోథ (యువెటిస్) కొరకు మందులు

కృష్ణపటలశోథ (యువెటిస్) के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine NamePack SizePrice (Rs.)
BetnesolBETNESOL 0.1% EYE DROPS 5ML0
WysoloneWYSOLONE 20MG TABLET33
HomideHomide 2%W/V Eye Drop24
ChlorocolCHLOROCOL 1% EYE OINTMENT 3GM19
PropyzolePropyzole Cream0
Chloromycetin (Pfizer)Chloromycetin 125 Mg Suspension48
Lotepred TLotepred T Eye Drop122
Propyzole EPropyzole E Cream0
ChlorophenicolChlorophenicol 250 Mg Capsule9
BrugelBrugel 5% W/W Gel114
Canflo BnCanflo Bn 1%/0.05%/0.5% Cream34
LotetobLotetob 0.3/0.5% Eye Drops76
Toprap CToprap C Cream28
Chlor SuccChlor Succ 1 Gm Injection38
FbnFbn 0.03% Eye Drop50
Crota NCrota N Cream27
TobaflamTobaflam Eye Drop129
Canflo BCanflo B Cream27
CloralCLORAL LOZENGES TABLET48
FlurbinFlurbin 0.03% W/V Eye Drop51
Sigmaderm NSigmaderm N 0.025%/1%/0.5% Cream45
DiflumoxDiflumox 5 Mg/0.5 Mg Drop148
FucibetFUCIBET 10GM CREAM44
Rusidid BRusidid B 1%/0.025% Cream39

మీకు గానీ లేదా మీ కుటుంబములో ఎవరికైనా గానీ ఈ వ్యాధి ఉందా? దయచేసి ఒక సర్వే చేసి ఇతరులకు సహాయపడండి

References

 1. Cleveland Clinic. [Internet]. Cleveland, Ohio. Uveitis: Management and Treatment
 2. American Academy of Ophthalmology [internet] California, United States; Uveitis Diagnosis.
 3. National Eye Institute. Uveitis. National Institutes of Health
 4. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Eyes - uveitis
 5. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Uveitis
और पढ़ें ...