myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

యోని క్యాన్సర్ అంటే ఏమిటి?

యోని క్యాన్సర్ అనేది మహిళా పునరుత్పాదక వ్యవస్థ(female reproductive system)లో కనిపించే ఓ అరుదైన క్యాన్సర్ రకం. అన్ని క్యాన్సర్లలో యోని క్యాన్సర్తో బాధపడే వాళ్ళ సంఖ్య 0.2% కంటే తక్కువగా ఉంటుంది. సాధారణంగా, 60 ఏళ్ల వయసు దాటిన మహళల్లో, అంటే లైంగిక కార్యకలాపాలు నిలిచి పోయిన వయసులో, ఈ యోని క్యాన్సర్ కనిపిస్తుంది. సాధారణ ఆరోగ్యకరమైన కణాలు మార్పులకు గురై, ఆ కణాలు నిరంతరంగా పెరిగి ఓ గడ్డలాగా తయారవుతూ యోనిలో క్యాన్సర్ గా మొదలవుతుంది. యోని క్యాన్సర్లలో అత్యంత సాధారణ రకం “స్క్యామ్ఔస్ సెల్ కార్సినోమా” పొలుసల కణ క్యాన్సర్. గ్రంధులలో మొదలయ్యే క్యాన్సర్ రకాన్ని “అడెనోక్యార్సినోమా” అని పిలుస్తారు. అనుసంధానమైన కార్సినోమా రకం క్యాన్సర్ చాలా అరుదు మరియు దీన్ని “సార్కోమా” అంటారు.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

యోని క్యాన్సర్ లో ప్రారంభ లక్షణాలను కానరావడం అనేది అసాధారణం, అయినప్పటికీ, వ్యక్తికి మాత్రం కొన్ని సంకేతాలు మరియు లక్షణాలు గోచరిస్తాయి:

 • రుతువిరతి సమయంలో లేదా తర్వాత అసాధారణ యోని స్రావం
 • మూత్రవిసర్జన సమయంలో నొప్పి
 • సంభోగం చేసేటపుడు నొప్పి
 • కటి (పెల్విక్) ప్రాంతంలో నొప్పి
 • యోని లో గడ్డలాంటిది ఉత్పత్తి అవడం
 • యోనిలోంచి అసహ్యకరమైన ఉత్సర్గ లేదా రక్తంతో కూడిన ఉత్సర్గ
 • యోని దురద
 • వెన్నులో నొప్పి
 • కాళ్ళలో నొప్పి
 • కాళ్ళ వాపు
 • మలబద్ధకం

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

యోని క్యాన్సర్ యొక్క ఖచ్చితమైన కారణం తెలియదు, కానీ క్యాన్సర్ వృద్ధిని ప్రేరేపించే ప్రమాద కారకాలు ఉన్నాయి. అలాంటి కారకాల్ని కింద పేర్కొంటున్నాం.

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

పై లక్షణాలు లేదా కారణాలు ఏవైనా ఉంటే గనుక వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. వైద్యుడు సంపూర్ణ వైద్య చరిత్రను వ్యక్తినడిగి తెలుసుకుంటాడు మరియు వ్యాధి లక్షణాలను చర్చిస్తారు మరియు కటి పరీక్ష మరియు PAP స్మియర్ పరీక్షను కలిగి ఉండే భౌతిక పరీక్షను నిర్వహిస్తారు. ఇందుకు చేసే ఇతర పరీక్షలు:

 • కోల్పోస్కోపీ: సూక్ష్మదర్శిని క్రింద పరిశీలించడానికి యోని నుండి కణజాలం నమూనా సేకరించబడుతుంది.
 • జీవాణుపరీక్ష: ఇతర పరీక్షలు క్యాన్సర్ను సూచిస్తున్నపుడు, బయాప్సీ అనేది ఆ పరీక్షల నిర్ధారణను ధృవీకరించే ఏకైక నిశ్చయాత్మక పరీక్ష.
 • ఛాతీ ఎక్స్-రే: క్యాన్సర్ ఊపిరితిత్తులకు వ్యాపించిందో లేదో చూడడానికి ఇది జరుగుతుంది.
 • అల్ట్రాసౌండ్ సోనోగ్రఫీ (USG) పొత్తికడుపు మరియు కటిప్రదేశం
 • కంప్యూటెడ్ టోమోగ్రఫీ (CT స్కాన్)
 • అయస్కాంత ప్రతిధ్వని ఇమేజింగ్ (Magnetic resonance imaging-MRI)
 • పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ (PET స్కాన్): దీన్ని రేడియోధార్మిక చక్కెరల సహాయంతో శరీరం లో ప్రాణాంతక కణితి కణాలను గుర్తించడం కోసం చేస్తారు.
 • సిస్టోస్కోపీ: మూత్రాశయం మరియు మూత్రనాళం లోపలికి చూసేందుకు దీన్ని చేస్తారు
 • యురెటరోస్కోపీ (Ureteroscopy): దీనిని ఉరేటర్ల (Ureters) లోపల చూడటానికి చేస్తారు
 • ప్రోక్టోస్కోపీ: పురీషనాళంలోనికి చూడడానికి దీనిని చేస్తారు

యోని క్యాన్సర్కు మూడు ప్రామాణిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.

శస్త్ర చికిత్స:

 • లేజర్ శస్త్రచికిత్స: లేజర్ పుంజం సహాయంతో కంతిని కోసేస్తారు
 • వైడ్ లోకల్ ఎక్సిషన్: క్యాన్సర్ గాయంతో పాటు కొన్ని ఆరోగ్యకరమైన కణజాలాల్ని కూడా కత్తిరించేయడం జరుగుతుంది.
 • యోని తొలగింపు: వ్యజినెక్టోమి సాయంతో యోని తొలగించబడుతుంది.
 • టోటల్ హిస్టరెక్టమీ: ఈ శస్త్ర చికిత్సలో మొత్తం గర్భాశయం అంటే సెర్విక్స్ (గర్భాశయం  దిగువభాగం) మరియు యూట్రస్ రెండింటినీ తొలగిస్తారు.

రేడియేషన్ థెరపీ: అధిక శక్తి X కిరణాలు లేదా ఇతర రేడియోధార్మిక పదార్ధాలు ఉపయోగించబడతాయి.

కెమోథెరపీ: క్యాన్సర్ కణాలను చంపడం ద్వారా క్యాన్సర్ పెరుగుదలని ఆపడానికి మందులు ఉపయోగించబడతాయి, లేదా క్యాన్సర్ కణాలు విభజింపబడటాన్ని ఆపడానికే ఈ కెమోథెరపీ.

చికిత్సలలో అధికభాగం వివిధ దుష్ప్రభావాలను  కల్గిస్తాయి, అవేమంటే వివిధ రకాలైన నొప్పులు  మరియు ఇతర వ్యాధి లక్షణాలు, అసౌకర్య భావాలు, వికారం, ఆకలి నష్టం, అతిసారం, వాంతులు, జుట్టు నష్టం, నిరాశ వంటివి కలిగి ఉంటారు.

 1. యోని క్యాన్సర్ కొరకు మందులు
 2. యోని క్యాన్సర్ వైద్యులు
Dr. Arabinda Roy

Dr. Arabinda Roy

ऑन्कोलॉजी

Dr. C. Arun Hensley

Dr. C. Arun Hensley

ऑन्कोलॉजी

Dr. Sanket Shah

Dr. Sanket Shah

ऑन्कोलॉजी

యోని క్యాన్సర్ కొరకు మందులు

యోని క్యాన్సర్ के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine NamePack SizePrice (Rs.)
AbraxaneAbraxane 100 Mg Injection16640.0
TortaxelTortaxel 100 Mg Injection4295.0
HycamtinHycamtin 1 Mg Tablet7500.0
ZpacZpac 100 Mg Injection2267.0
TopocanTopocan 2.5 Mg Injection5000.0
ZupaxelZupaxel 100 Mg Injection2267.0
TopotecTopotec 2.5 Mg Injection5125.0
BevetexBevetex 100 Mg Injection11453.0
CantopCantop 2.5 Mg Injection4430.15
DutaxelDutaxel 100 Mg Injection4085.0
MaclitaxelMaclitaxel 260 Mg Injection3678.0
PaxtalPaxtal 100 Mg Injection3997.0
PaxubaPaxuba 100 Mg Injection4250.0
CelplatCelplat 10 Mg Injection94.0
CisplatCisplat 10 Mg Injection94.0
CisteenCisteen 10 Mg Injection81.0
CizcanCizcan 10 Mg Injection77.0
CytoplatinCytoplatin 10 Mg Injection93.0
KemoplatKemoplat 10 Mg Injection84.0
PlatikemPlatikem 10 Mg Injection187.0
Platikem NovoPlatikem Novo 100 Mg Injection886.0

మీకు గానీ లేదా మీ కుటుంబములో ఎవరికైనా గానీ ఈ వ్యాధి ఉందా? దయచేసి ఒక సర్వే చేసి ఇతరులకు సహాయపడండి

और पढ़ें ...