myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

విటమిన్ B1 లోపం అంటే ఏమిటి? 

విటమిన్ B1 ని “థియామిన్” అని కూడా  పిలుస్తారు. మన శరీరం యొక్క సరైన పనితీరుకు అవసరమైన విటమిన్లులో విటమిన్ B1 ఒకటి. విటమిన్ B1 లోపం అనేక ప్రమాదకర పరిస్థితులకు కారణమవుతుంది, వీటిలో కొన్ని మరింత ప్రమాదకరమైనవి.

విటమిన్ B1 లోపం ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

సాధారణ లక్షణాలు

 • థియామిన్ లోపం ప్రధానంగా ‘బెరిబెరి’ అని పిలవబడే ఒక వ్యాధికి దారి తీస్తుంది. ఈ వ్యాధి రెండు రకాలు-పొడి బెరిబెరి మరియు తడి బెరిబెరి.  
 • పొడి బెరిబెరిలో, నరములు బాధించబడుతాయి, మరియు రోగికి జోము లేక తిమిరి ఉంటుంది.  చేతులు మరియు కాళ్ళలో తిమ్మిరి నొప్పి మరియు అలసటతో పాటు మరియు జలదరింపును అనుభవిస్తాడు.
 • తడి బెరిబెరిలో గుండె పెద్దదవుతుంది, అంటే గుండె విస్తారమవుతుంది. శ్వాస కుంఠితమవుతుంది. కాళ్ళు ఊటలకు గురవుతాయి. హృదయ స్పందన రేటు పెరుగుతుంది.

ఇతర లక్షణాలు

 • రోగికి ఆకలి తగ్గిపోతుంది మరియు వేగంగా బరువు కోల్పోతారు.
 • ఈ వ్యాధికి గురైన వ్యక్తి యొక్క మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుంది. మరియు మానసిక గందరగోళం ఏర్పడొచ్చు మరియు జ్ఞాపకశక్తి  కోల్పోవచ్చు.
 • మద్యపాన వ్యసనపరుల్లో థయామిన్ లోపం వల్ల వెర్నిక్-కోర్సకోఫ్ సిండ్రోమ్ ఏర్పడుతుంది. ఈ వెర్నిక్-కోర్సకోఫ్ వ్యాధి లక్షణాల సంపుటిలో వ్యక్తికి  సమన్వయలోపం, కండరాల బలహీనత, వస్తువులు రెండుగా కనబడే దృష్టిదోషం మరియు సంతులనం కోల్పోవడం ఉంటుంది.

B1 లోపం యొక్క సమస్యలు శాశ్వత నరాల నష్టం, కోమా మరియు గుండె వైఫల్యం (heart failure).

విటమిన్ B1 లోపం యొక్క ప్రధాన కారణాలు ఏమిటి? 

 • ఏదైనా పోషకాహార లోపం ప్రధానంగా తగినంత ఆహారం తీసుకోకవడంవల్ల లేదా బలహీనమైన శోషణ ద్వారా సంభవిస్తుంది.

కింద పేర్కొన్న ప్రమాదకారకాల్ని కల్గిన వ్యక్తి వాటి కారణంగా థయామిన్ లోపానికి మరింత చేరువై బాధింపబడతారు.

 • మద్యపాన వ్యసనాన్ని కల్గి ఉండడం ఓ పెద్ద ప్రమాద కారకం. ఎందుకంటే ఇది (మద్యపాన వ్యసనం) థయామిన్ యొక్క శోషణను తగ్గిస్తుంది.
 • దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నవారికి మరియు మూత్రకారక మందుల్ని (diuretics) సేవిస్తున్నవారికి థయామిన్ లోపం వాటిల్లే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
 • ఆహార కారకాలు కూడా థయామిన్ లోపం ప్రమాదానికి దోహదం చేస్తాయి, ఉదాహరణకి, తెల్ల బియ్యంతో కూడిన ఆహారం. తెల్లబియ్యంలో థియామిన్ చాలా తక్కువగా ఉంటుంది.
 • క్యాన్సర్ మరియు హెచ్ఐవి రోగులు విటమిన్ B1 లోటు ప్రమాదానికి  ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంది.

విటమిన్ B1 లోపం ఎలా నిర్ధారింపబడుతుంది మరియు దీనికి చికిత్స ఏమిటి? 

వ్యాధి లక్షణాలు, వైద్య చరిత్ర మరియు పరిశోధనలు ఆధారంగా విటమిన్ B1 లోపం యొక్క రోగ నిర్ధారణ చేయబడుతుంది.

 • రక్త కణాలలో థయామిన్ పైరోఫాస్ఫేట్ యొక్క స్థాయిని అంచనా వేయడానికి ప్రత్యేక పరీక్షలు జరుగుతాయి.
 • థియామిన్ శోషణ మరియు థైరాయిడ్ పనితీరులో సహాయపడే ఎంజైమ్ల స్థాయిలను పరీక్షించడానికి పరీక్షలు కూడా ఉన్నాయి.

ప్రాథమిక చికిత్సలో, కడుపులోకి ఔషధసేవనం (oral medicines)  లేదా నరాల్లోకి (ఇంట్రావీనస్ గా) థయామిన్ ను ఇవ్వడం ఉంటుంది. వ్యాధి లక్షణాలు తక్షణమే తగ్గడం మొదలవుతాయి.

 • నరాల సమస్యలు పరిష్కరించబడడానికి ఎక్కువ సమయం అవసరం కావచ్చు. చికిత్స ప్రధానంగా వ్యాయామం మరియు థయామిన్ మందును కొన్ని నెలలపాటు వాడాల్సి పడొచ్చు.  
 • పోషక-సంపన్నమైన, బాగా సమతుల్య ఆహారం తీసుకోవడం మరియు థియామిన్ సప్లిమెంట్లను తీసుకోవడం వలన పరిస్థితి మెరుగుపడుతుంది. తృణధాన్యాలు, మాంసం, బీన్స్ మరియు గింజలు వంటి ఆహారాలు థయామిన్ యొక్క గొప్ప వనరులు.
 1. బి 1 విటమిన్ లోపం కొరకు మందులు
 2. బి 1 విటమిన్ లోపం కొరకు డాక్టర్లు
Dr. B.P Yadav

Dr. B.P Yadav

एंडोक्राइन ग्रंथियों और होर्मोनेस सम्बन्धी विज्ञान

Dr. Vineet Saboo

Dr. Vineet Saboo

एंडोक्राइन ग्रंथियों और होर्मोनेस सम्बन्धी विज्ञान

Dr. JITENDRA GUPTA

Dr. JITENDRA GUPTA

एंडोक्राइन ग्रंथियों और होर्मोनेस सम्बन्धी विज्ञान

బి 1 విటమిన్ లోపం కొరకు మందులు

బి 1 విటమిన్ లోపం के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine NamePack SizePrice (Rs.)
TiamTiam Tablet99.9
ThiaminThiamin 100 Mg/Ml Injection48.3
Bigvin PlusBigvin Plus Soft Gelatin Capsule75.0
Cynocal 16Cynocal 16 Tablet57.0
Mycobal Plus (Marc)Mycobal Plus Syrup84.38
NervijenNervijen Capsule111.0
Sioneuron ForteSioneuron Forte Tablet10.92

మీకు గానీ లేదా మీ కుటుంబములో ఎవరికైనా గానీ ఈ వ్యాధి ఉందా? దయచేసి ఒక సర్వే చేసి ఇతరులకు సహాయపడండి

सम्बंधित लेख

और पढ़ें ...