గుండె వేగంగా కొట్టు కోవడం (టాఖీకార్డియా) - Tachycardia in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

January 10, 2019

March 06, 2020

గుండె వేగంగా కొట్టు కోవడం
గుండె వేగంగా కొట్టు కోవడం

టాఖీకార్డియా (గుండె వేగంగా కొట్టు కోవడం) అంటే ఏమిటి?

విశ్రాంతి సమయంలో మనిషి గుండె నిముషానికి 70 నుండి 90 సార్లు నిలకడగా కొట్టుకుంటుంది. గుండె కొట్టుకోవడాన్నే “హృదయ స్పందన” అంటారు. హృదయ స్పందన నిమిషానికి 100 కంటే ఎక్కువసార్లు (బీట్స్) కొట్టుకున్నపుడు, దాన్నే “గుండె వేగంగా కొట్టుకోవడం” లేదా “టచికార్డియా” అని అంటారు. ఇది అరిథ్మియా (గుండె అసాధారణంగా కొట్టుకోవడం) యొక్క సాధారణ రూపాలలో ఒకటి. టాఖీకార్డియా శరీరధర్మం ద్వారా సంభవించవచ్చు (శారీరక శ్రమ లేదా గర్భధారణ సమయంలో జరుగుతుంది) లేదా రోగలక్షణాలవల్ల కూడా సంభవిస్తుంది.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

టాఖీకార్డియా అంటే గుండె చాలా వేగంగా కొట్టుకోవడం, అలాంటపుడు అది రక్తాన్ని సమర్ధమంతంగా సరఫరా చేయలేకపోతుంది. దీనివల్ల ముఖ్యమైన అవయవాలలో ఆక్సిజన్ స్థాయిలలో తగ్గుదల ఏర్పడి క్రింది లక్షణాలను ఉత్పత్తి చేస్తుంది:

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

గుండెలో ఒక విద్యుత్ ప్రేరణ ఉత్పత్తి చేయబడుతుంది, ఇది గుండె యొక్క రక్తం తోడే క్రియను (పంపింగ్ను) నియంత్రిస్తుంది. ఈ వ్యవస్థలో ఏదైనా మార్పు ఏర్పడ్డప్పుడు, గుండె వేగంగా కొట్టుకోవడం (టాఖీకార్డియా) జరగవచ్చు. ఈ మార్పుకు కారణాలు:

శారీరక కారణాలు

  • వ్యాయామం
  • పరుగు (రన్నింగ్)
  • ఆందోళన
  • గర్భందాల్చడం  

రోగలక్షణ కారణాలు

గుండె కొట్టుకునే రేటుపై ఆధారపడి, టాఖీకార్డియా క్రింది రకాలను కలిగి ఉంటుంది:

  • కర్ణికల దడలు - గుండె ఎగువ గదుల (atria) యొక్క వేగవంతమైన, కాని సమకాలీకరణ సంకోచాలు
  • కర్ణికల తల్లడం - గుండె ఎగువ గదులు ఓ క్రమమైన రేటులో చాలా వేగంగా కొట్టుకుంటాయి.
  • సూప్రావెంట్రిక్యులర్ టాఖీకార్డియా - గుండె యొక్క దిగువ గదులపైన  పెరిగిన హృదయ స్పందన (గుండె యొక్క దిగువ గదులనే వెంట్రికల్స్ అని అంటారు)
  • వెంట్రిక్యులర్ ఫిబ్రిల్లెషన్ - గుండె యొక్క జఠరికలు అక్రమంగా, వేగవంతంగా మరియు అస్తవ్యస్తరీతిలో కొట్టుకోవడం
  • వెంట్రిక్యులర్ టాఖీకార్డియా - హృదయ జఠరికల్లో క్రమమైన మరియు వేగవంతమైన హృదయస్పందన

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

వైద్య పరీక్ష (క్లినికల్ పరీక్షల్లో పల్స్ రేటును కొలవడం ఉంటుంది) సాధారణంగా టాఖీకార్డియా యొక్క ఉనికిని నిర్ణయిస్తుంది, కానీ అది రుగ్మత  కారణాన్ని ప్రతిబింబించదు. కాబట్టి, టాఖీకార్డియా యొక్క కారణాన్ని గుర్తించడానికి ఒక సంపూర్ణ వైద్య చరిత్ర మరియు కొన్ని పరిశోధనలు అవసరం. ఈ పరిశోధనలు:

  • ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (ECG) - గుండె యొక్క విద్యుత్ ప్రేరణలను తనిఖీ చేయడంలో సహాయపడుతుంది మరియు గుండె యొక్క కండరాలకు సంబంధించిన సమస్యలను నిర్ణయించడంలో కూడా సహాయపడుతుంది
  • ఎలక్ట్రోఫిజియాలజీ - హృదయ రక్తప్రసరణతో కూడిన సమస్యలను నిర్ధారిస్తుంది
  • ఎఖోకార్డియోగ్రామ్ - గుండె రక్తం తోడేదాన్ని (blood pumping) చూడడంలో సహాయపడుతుంది
  • CT మరియు MRI స్కాన్ - హృదయ నిర్మాణం చూడటంలో మరియు హృదయానికి జరిగిన నష్టాన్ని నిర్ణయించడంలో సహాయపడుతుంది
  • ఒత్తిడి పరీక్ష - భౌతిక ఒత్తిడి సమయంలో గుండె యొక్క పనితీరును నిర్ణయించడంలో సహాయపడుతుంది

టాఖీకార్డియా శారీరకకారణంవల్ల లేదా ఒత్తిడి కారణంవల్ల సంభవించినట్లైతే అది దానంతటదే సరిపోతుంది. అయితే, ఈ పెరిగిన హృదయ స్పందన నిర్వహణకు కొన్నిసార్లు కొన్ని చికిత్సలు అవసరం కావచ్చు.

  • ఔషధాలు - నోటిద్వారా కడుపుకిచ్చే (ఓరల్) లేదా సూది ద్వారా ఇచ్చే యాంటీ-అరీథ్మిక్ మందులు టాఖీకార్డియాను తగ్గించడంలో సహాయపడతాయి.
  • షాక్ థెరపీ లేదా కార్డియోవెర్షన్ - బాహ్య డిఫిబ్రిలేటర్ గుండె యొక్క ఎలెక్ట్రిక్ రిథంను పునరుద్ధరించడానికి ఉపయోగిస్తారు.
  • పేస్ మేకర్ - పేస్మేకర్ (Pacemaker) అనేది ఒక కృత్రిమ విద్యుత్ ప్రేరణ జెనరేటర్. ఇది గుండె కొట్టుకోవడాన్ని (గుండెచప్పుడును) క్రమబద్ధీకరించడానికి ఉపయోగకరంగా ఉంటుంది.



వనరులు

  1. National Heart, Lung, and Blood Institute [Internet]: U.S. Department of Health and Human Services; Arrhythmia
  2. Merck Manual Professional Version [Internet]. Kenilworth (NJ): Merck & Co. Inc.; Overview of Arrhythmias
  3. American Heart Association. Prevention and Treatment of Arrhythmia. [Internet]
  4. American Heart Association. Tachycardia: Fast Heart Rate. [Internet]
  5. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Arrhythmias

గుండె వేగంగా కొట్టు కోవడం (టాఖీకార్డియా) కొరకు మందులు

Medicines listed below are available for గుండె వేగంగా కొట్టు కోవడం (టాఖీకార్డియా). Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.