myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

జననేంద్రియాలపై పులిపిర్లు అంటే ఏమిటి?

జననేంద్రియాలపై పులిపిర్లు అనేది మానవ పాపిల్లోమా వైరస్ (హెచ్.పి.వి) అనే అతిసూక్ష్మజీవివల్ల సాధారణంగా సంభవించే లైంగిక అంటువ్యాధి. ఇది నొప్పి, అసౌకర్యం మరియు దురద వ్యాధి లక్షణాల్ని, మరికొన్ని ఇతర లక్షణాలను కల్గి ఉంటుంది. పురుషులు మరియు మహిళలు ఇద్దర్లోనూ జననేంద్రియ భాగానికి సమీపంలో ఒక పులిపిరి లేదా పులిపిర్ల సమూహమే ఉండవచ్చు.పురుషుల కంటే మహిళలే ఈ వ్యాధిని శోకించుకునే ప్రమాదం ఎక్కువగా ఉంది.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

జననేంద్రియ పులిపిర్లు వివిధ రూపాల్లో పెరుగుతాయి. జననేంద్రియ పులిపిర్లులో అత్యంత సాధారణ సంకేతాలు:

 • చిన్నగా ఉండే బొడిపెలాగా లేక దద్దులాగా, చెల్లాచెదురుగా ఏర్పడ్డ దద్దులు లేక పులిపిర్లు (చర్మం రంగులో లేదా ముదురు రంగులో ఉండవచ్చు).
 • జననేంద్రియ భాగంలో పులిపిర్ల సమూహం.
 • గజ్జ ప్రాంతంలో దురద లేదా అసౌకర్యం.
 • సంభోగం సమయంలో రక్తస్రావం, ఆ తరువాత నొప్పి.

జననేంద్రియ పులిపిర్లు క్రింది భాగాల్లో కనిపిస్తాయి:

మహిళలలో:

 • యోని లోపల.
 • యోని, గర్భాశయం, లేదా గజ్జల్లో.

పురుషులలో:

 • పురుషాంగం మీద.
 • వృషణం, తొడ, లేదా గజ్జల మీద.

స్త్రీపురుషులిద్దరిలో

 • పాయువు లోపలివైపున మరియు చుట్టూ.
 • నోటి పెదవులు, నోరు, నాలుక లేదా గొంతు మీద.

వీటి ప్రధాన కారణాలు ఏమిటి?

జననేంద్రియ పులిపిర్లకు ప్రధాన కారణం  మానవ పాపిల్లోమా వైరస్ (HPV) తో సంక్రమణం. HPV సోకిన వ్యక్తి నుండి ఒక ఆరోగ్యకరమైన వ్యక్తికి జననేంద్రియ పులిపిర్లు వ్యాపిస్తాయి:

 • లైంగిక సంపర్కం (యోనిద్వారా, మౌఖికంగా, పాయువు ద్వారా) - చాలా చిన్న వయసులోనే వ్యక్తి లైంగిక సంపర్కంలో క్రియాశీలకంగా మారడం లేదా చాలామంది భాగస్వాములతో లైంగిక సంపర్కం లేదా లైంగిక చరిత్ర తెలియని వ్యక్తితో అసురక్షితమైన సంభోగం చేయడంవల్ల జననేంద్రియ పులిపిర్లు రుగ్మత అంటుకునే ప్రమాదం పెరుగుతుంది.
 • ప్రసవం (వ్యాధి సోకిన తల్లి నుండి శిశువుకు).

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

చర్మవ్యాధి నిపుణుడు శారీరక పరీక్ష ద్వారా మర్మాంగంపై నుండే పులిపిరిని పాక్షికంగా నిర్ధారణ చేస్తాడు, ఆ పిలిపిరనే లేదా దాని యొక్క భాగాలను ఒక సూక్ష్మదర్శిని క్రింద పరీక్ష కోసం ఒక ప్రయోగశాలకు పంపడం ద్వారా వ్యాధి ధ్రువీకరించబడుతుంది.

చర్మవ్యాధి నిపుణుడు సూచించే మందులు క్రిందవిధంగా ఉంటాయి:

 • పోడోఫిల్లోటాక్సిన్ (Podophyllotoxin) ఈమందు మొటిమ కణాల పెరుగుదలను ఆపడానికి.
 • ఇమిక్విమోడ్ (Imiquimod): ఈ మందును HPV తో పోరాడటానికి, శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థను పెంచడానికి వాడతార).

కొన్ని సందర్భాలలో కిందివాటిని నిర్వహిస్తారు:

 • క్రయోసర్జరీ (ద్రవ నత్రజని) మొటిమలను శీతలీకరిస్తుంది.
 • ఎక్సిషన్ లేదా శస్త్రచికిత్సచేత తొలగింపు.
 • ఎలెక్ట్రోకటరి (విద్యుత్ ప్రవాహం) మొటిమలను నాశనం చేస్తుంది.
 • లేజర్ చికిత్స (లేజర్ కాంతి) మొటిమలను నాశనం చేస్తుంది.

జననేంద్రియ భ్రమణాల చికిత్సకు అతి ముఖ్యమైన కారణం ఏమిటంటే HPV సంక్రమణం గర్భాశయ మరియు యోని క్యాన్సర్కు ప్రధాన కారణం . HPV కి వ్యతిరేకంగా టీకామందు పులిపిర్లు అలాగే క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

 1. జననేంద్రియాలపై పులిపిర్లు కొరకు మందులు
 2. జననేంద్రియాలపై పులిపిర్లు వైద్యులు
Dr. Jogya Bori

Dr. Jogya Bori

संक्रामक रोग

Dr. Lalit Shishara

Dr. Lalit Shishara

संक्रामक रोग

Dr. Alok Mishra

Dr. Alok Mishra

संक्रामक रोग

జననేంద్రియాలపై పులిపిర్లు కొరకు మందులు

జననేంద్రియాలపై పులిపిర్లు के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine NamePack SizePrice (Rs.)
SBL Arnica Montana Hair Oil Arnica Montana Hair Oil70.0
Arnica Montana Herbal ShampooArnica Montana Herbal Shampoo With Conditioner90.0
ADEL 33Adel 33 Apo Oedem Drop215.0
ADEL 40Adel 40 Verintex Internal Drop215.0
ADEL 56Adel 56 Habifac Drop215.0
ADEL 86Adel 86 Verintex N External Drop215.0
Mama Natura MunostimMunostim Globules90.0
PodowartPodowart Paint141.0
Schwabe Topi Thuja CreamTopi Thuja Cream180.0

మీకు గానీ లేదా మీ కుటుంబములో ఎవరికైనా గానీ ఈ వ్యాధి ఉందా? దయచేసి ఒక సర్వే చేసి ఇతరులకు సహాయపడండి

और पढ़ें ...