myUpchar Call

లైంగికంగా సంక్రమించే వ్యాధులు అంటే ఏమిటి?

లైంగిక సంక్రమణ వ్యాధులు, ఇవి సుఖ వ్యాధులుగా కూడా పిలువబడతాయి.  లైంగికంగా సంక్రమించే వ్యాధులు అంటే లైంగిక సంబంధం ద్వారా సంక్రమించే అంటువ్యాధులు/ఇన్ఫెక్షన్లు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా  ప్రతి రోజూ 1 మిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు లైంగిక సంక్రమణ వ్యాధులులతో నిర్దారించబడుతున్నారని గుర్తించబడింది. భారతదేశంలో సంవత్సరానికి 30-35 మిలియన్ల లైంగిక సంక్రమణ వ్యాధులు నివేదించబడుతున్నాయి.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

చాలా వరకు, లైంగిక సంక్రమణ వ్యాధుల యొక్క లక్షణాలు స్పష్టంగా ఉండవు/కనిపించవు. లైంగిక సంక్రమణ వ్యాధులు వ్యాధుల యొక్క సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు:

  • జననేంద్రియ అవయవాల నుండి అసాధారణ స్రావాలు
  • జననాంగ ప్రాంతం చుట్టూ పుళ్ళు లేదా పొక్కులు
  • మూత్రవిసర్జన సమయంలో అసౌకర్యం
  • యోని నుండి చెడు వాసనతో కూడిన స్రావాలు    
  • శరీర ఉష్ణోగ్రత పెరగడం
  • లైంగిక సంభోగ సమయంలో అసౌకర్యం

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

లైంగిక సంక్రమణ వ్యాధులు ప్రధానంగా  ఈ కింది కారణాల వలన కలుగుతాయి:

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

వైద్యులు శారీరక పరీక్ష, ఆరోగ్య చరిత్ర మరియు ప్రయోగశాల పరీక్షలను ఆదేశించవచ్చు. సంక్రమణ రకాన్ని బట్టి, ఇంకా అదనపు పరీక్షలు కూడా ఉంటాయి, అవి:

  • రాపిడ్ హెచ్ఐవి పరీక్ష
  • ఎలిసా (ELISA)
  • యోని/పురుషాంగ స్రావాల యొక్క పరిశోధనలు/పరీక్ష  

లైంగిక సంక్రమణ వ్యాధుల యొక్క చికిత్స అంతర్లీన సంక్రమణ బట్టి ఉంటుంది. వ్యాధిని  కలిగించిన బ్యాక్టీరియా, వైరస్ లేదా ఫంగస్ను బట్టి చికిత్సకు అవసరమైన యాంటీబయాటిక్స్, యాంటివైరల్స్ లేదా యాంటీ ఫంగల్స్ వంటి మందులు ఉపయోగించబడతాయి.

ఒక లైంగిక సంక్రమణ వ్యాధికి చికిత్స చెయ్యడం కంటే దానిని నివారించడం సులభం. ఒక లైంగిక సంక్రమణ వ్యాధిని ఈ క్రింది పద్ధతుల ద్వారా నిరోధించవచ్చు:

  • కండోమ్ల వాడకం లైంగిక సంక్రమణ వ్యాధుల వ్యాప్తిని నిరోధించడానికి సహాయపడుతుంది.
  • లైంగిక సంక్రమణ వ్యాధి నయమయ్యేంత వరకు లైంగిక సంబంధాన్ని నివారించడం మంచిది.
  • సాధారణ యోని వాతావరణం మహిళలను అంటువ్యాధుల నుండి రక్షించే విధంగా ఉంటుంది, కానీ వారు యోనిని అతిగా శుభ్రంచేసుకోవడం వల్ల (ఎక్కువ నీటిని ఉపయోగించి కడగం, హానికర రసాయనాలు ఉపయోగించడం వంటివి) సాధారణ యోని వాతావరణానికి  భంగం కలుగుతుంది, తద్వారా సంక్రమణలు కలిగే అవకాశం ఎక్కువ అవుతుంది కాబట్టి దానిని (యోనిని అతిగా శుభ్రంచేసుకోవడం) నివారించాలి.
  • హెచ్.పి.వి (HPV) వాక్సిన్ వంటి కొన్ని వాక్సిన్లు అటువంటి అంటురోగాలను నిరోధించటానికి సహాయపడతాయి.
  • బహుళ భాగస్వాములతో లైంగిక సంబంధం ఉండడం లైంగిక సంక్రమణ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది మరియు కాబట్టి దానిని నివారించాలి. ఒకే భాగస్వామితో లైంగిక సంబంధం కలిగి ఉండడం (మ్యూచువల్ మోనోగమి) అంటువంటి అంటురోగాలను నిరోధించడంలో సహాయపడుతుంది.
  • భాగస్వాములు ఇద్దరు ఏవైనా లైంగిక సంక్రమణ వ్యాధుల తనిఖీ కోసం ఒకసారి పరీక్షించుకోవడం అనేది సిఫార్సు చేయబడుతుంది.

సరైన జాగ్రత్త తీసుకోకపోతే, లైంగిక సంక్రమణ వ్యాధులు లైంగిక భాగస్వాముల మధ్య వ్యాపిస్తాయి. ఈ వ్యాధుల గురించి సరైన అవగాహన ఉంటే వీటిని నివారించవచ్చు.

లైంగికంగా సంక్రమించే వ్యాధులు వైద్యులు
Dr. Zeeshan Khan

Dr. Zeeshan Khan

Sexology
9 Years of Experience

Dr. Nizamuddin

Dr. Nizamuddin

Sexology
5 Years of Experience

Dr. Tahir

Dr. Tahir

Sexology
20 Years of Experience

Dr. Ajaz  Khan

Dr. Ajaz Khan

Sexology
13 Years of Experience

వనరులు

  1. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Sexually Transmitted Diseases
  2. Office on women's health [internet]: US Department of Health and Human Services; Sexually transmitted infections
  3. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; How You Can Prevent Sexually Transmitted Diseases
  4. American Academy of Pediatrics. Diagnostic Testing For Sexually Transmitted Infections. Committee on Infectious Diseases Pediatrics [internet]
  5. Centre for Health Informatics. [Internet]. National Institute of Health and Family Welfare Sexually transmitted infections
  6. National institute of child health and human development [internet]. US Department of Health and Human Services; What causes sexually transmitted diseases (STDs) or sexually transmitted infections (STIs)?
Read on app