myUpchar Call

సారాంశం

స్వప్న స్ఖలనాన్ని ఆంగ్లంలో నైట్ ఫాల్ (night fall), వెట్ డ్రీం (wet dream), రాత్రిపూట స్ఖలనం (nocturnal emission), రతి కల (sex dream) అని కూడా పిలుస్తారు. ఇది అసంకల్పితంగా లేదా ఆకస్మికంగా కలిగే భావప్రాప్తి (spontaneous orgasm), ఇది నిద్రలో సంభవిస్తుంది మరియు మగవారిలో వీర్యం కారిపోవడానికి (ఉత్సర్గకు) దారితీస్తుంది లేదా ఆడవారిలో యోని స్రావం అవుతుంది. కౌమారదశలో మరియు లైంగికంగా చురుకైన పెద్దలలో ఇది చాలా సాధారణం, ముఖ్యంగా వారు శృంగార కలలు కన్నప్పుడు ఇది సంభవిస్తుంది. పురుషులలో స్ఖలనం అయిన ద్రవాన్ని “వీర్యం” అంటారు మరియు అకస్మాత్తుగా లేదా ఉదయాన్నే మేల్కొన్నప్పుడు ఇది లోదుస్తులపై కొద్దిగా మందపాటిగా, అంటుకున్న ఉత్సర్గంగా కనిపిస్తుంది. దీన్ని చూచిన వెంటనే మనిషి తన మనసులో ఒకింత ఇబ్బంది పడొచ్చు మరియు దీని గురించి ఎవరితోనైనా, ముఖ్యంగా తల్లిదండ్రులతో, చర్చించడం కొన్నిసార్లు ఇబ్బందికరంగా ఉంటుంది. స్వప్న స్ఖలనానికి కారణాలు హార్మోన్ల మార్పులు మరియు పెరిగిన లైంగిక కోరికలే. రోగ నిర్ధారణ ప్రధానంగా చరిత్ర మరియు క్లినికల్ పరీక్షల ద్వారా చేయబడుతుంది. దీని నివారణకు ఆలోచనా ప్రక్రియలో మార్పులు మరియు కొన్ని జీవనశైలి అలవాట్ల మార్పులు ఉంటాయి. సలహా సంప్రదింపులు (కౌన్సెలింగ్) చికిత్స యొక్క ఎంపిక. మూలికా నివారణలు లక్షణాలను నియంత్రించడంలో సహాయపడతాయి.

 1. స్వప్న స్ఖలనాన్ని ఎలా ఆపాలి - How to prevent nightfall in Telugu
 2. స్వప్న స్ఖలనం అంటే ఏమిటి - What is nightfall in Telugu
 3. స్వప్న స్ఖలనం లక్షణాలు - Nightfallsymptoms in Telugu
 4. స్వప్న స్ఖలనం కారణాలు మరియు ప్రమాద కారకాలు - Nightfall causes and risk factors in Telugu
 5. స్వప్న స్ఖలన నిర్ధారణ - Nightfall diagnosis in Telugu
 6. స్వప్న స్ఖలన చికిత్స - Nightfall treatment in Telugu
 7. ఇంట్లోనే స్వప్న స్ఖలనాన్ని ఎలా ఆపాలి - How to stop night fall at home in Telugu
 8. స్వప్న స్ఖలనం దుష్ప్రభావాలు - Nightfall side effects in Telugu
స్వప్న స్ఖలనం వైద్యులు

స్వప్న స్ఖలనాన్ని నివారించడానికి తెలిసిన పద్ధతులు ఏవీ లేవు. ఇది సహజ దృగ్విషయం కాబట్టి, నివారణ అవసరం లేదు. స్వప్న స్ఖలనం యొక్క పౌనఃపున్యం (ఫ్రీక్వెన్సీ) ఎక్కువగా ఉంటే (వారానికి 2-3 సార్లు) నివారణ చర్యలు సూచించబడతాయి. స్వప్న స్ఖలన పరిస్థితిని నియంత్రించడానికి ఈ క్రింది పద్ధతులను ప్రయత్నించవచ్చు:

 • అలాంటి కలలు ఎప్పుడు, ఎందుకు జరుగుతాయో అర్థం చేసుకోండి.
 • దానితో సంబంధం ఉన్న అపోహలను అర్థం చేసుకోండి మరియు దాని కోసం మిమ్మల్ని మీరు నిందించవద్దు.
 • ఏవైనా సందేహాలను తొలగించడానికి వైద్యుడి సహాయం తీసుకోండి.
 • మీ ఒత్తిడి స్థాయిని నివారించండి లేదా తగ్గించండి.
 • మీ వీపు మీద పడుకోండి.
 • కారంగా ఉండే ఆహారాన్ని మానుకోండి.
 • అశ్లీల వీడియోలు లేదా లైంగిక సంబంధిత కార్యక్రమాలు వంటి లైంగిక ప్రేరేపణలకు కారణమయ్యే వాటిని మానుకోండి.
 • మీ భాగస్వామితో ఆరోగ్యకరమైన లైంగిక సంబంధాలు పెట్టుకోండి లేదా క్రమం తప్పకుండా హస్త ప్రయోగం చేయండి.
Delay Spray For Men
₹349  ₹499  30% OFF
BUY NOW

స్వప్న స్ఖలనం  (లేదా రతి కల) అనేది ఒక సాధారణ పరిస్థితి, దీనిలో ఒక వ్యక్తి (సాధారణంగా కౌమారదశలో ఉన్న బాలురు లేదా లైంగిక కోరికలు కల్గిన పెద్దలు) శృంగార కలలు కంటూ ఉంటారు, దీనివల్ల నిద్రలో వారికి తెలియకుండానే వీర్యం విడుదల అవుతుంది. ఇది లోదుస్తులపై తెల్లటి రంగులో, అంటుకునే ఉత్సర్గగా కనిపిస్తుంది, ఇది మంచం చెమ్మగిల్లడానికి కూడా దారితీయచ్చు. సాధారణంగా, రాత్రి కన్న శృంగార కల పూర్తిగా మరచిపోవడం జరుగుతుంది. శృంగారకల కారణంగా వ్యక్తి హస్తప్రయోగం చేసుకోకుండా లేదా అతని పురుషాంగంపై ఎలాంటి  ప్రేరణ లేకుండా వీర్య స్ఖలనం అవుతుంది, ఏ విధంగానూ స్ఖలనంపై వ్యక్తికి నియంత్రణ ఉండదు. ఇది ఆడవారిలో కూడా జరుగుతుంది.

స్వప్న స్ఖలనం  వైద్య రుగ్మత కానందున ఇతర సంకేతాలు మరియు లక్షణాలు సాధారణంగా ఉండవు. ఇది కౌమారదశలో ఉన్న పురుషులు లేదా స్త్రీలలో సంభవించే సహజ దృగ్విషయం.

 • మగవారిలో, వారి లోదుస్తుల (అండర్ గార్మెంట్స్) మీద లేదా అర్ధరాత్రి బెడ్ షీట్ మీద (సాధారణంగా గా గాఢ నిద్రలో ఉన్నపుడు) స్వప్న స్ఖలనంవల్ల జిగటతో కూడిన ద్రవస్రావం (ఉత్సర్గ) అవుతుంది.
 • ఆడవారిలో, వారి లోదుస్తుల (అండర్ గార్మెంట్) పై యోని నుండి స్రవించిన ద్రవం (ఉత్సర్గగా) లేదా లైంగిక ప్రేరేపణ కారణంగా స్రవించే కందెన (లూబ్రికెంట్) గా కనిపిస్తుంది.

కారణాలు

యుక్తవయస్సు లేదా కౌమారదశలో, శరీరం చాలా హార్మోన్ల మార్పులకు లోనవుతుంది. ముఖ్యమైన మార్పులలో ఒకటి లైంగిక అవయవాల పరిపక్వత మరియు అనుబంధ హార్మోన్ల మార్పులు. ఇది వ్యతిరేక లింగంపట్ల (ఆడ-మగల మధ్య) ఆకర్షణను కలిగిస్తుంది. ఇది పెరిగిన లైంగిక కోరికలకు దారితీస్తుంది, ఈ లైంగిక కోరికలకుఇ ప్రేరణ ఏదంటే వ్యతిరేక లింగం వ్యక్తులతో సంబంధం కలిగి ఉండటం వల్ల, ఇతరులలో అశ్లీల వీడియోలను చూడటం వల్ల సంభవిస్తుంది. స్వప్న స్ఖలనం(నైట్ ఫాల్) అనేది లైంగిక కోరిక పెరగడంవల్ల మరియు వ్యక్తికి లైంగిక చర్య లేకపోవడంవల్ల కల్గుతుంది. నిద్రలో, కొన్నిసార్లు, శృంగారపరమైన మరియు లైంగికంగా ప్రేరేపించే కలలు మగవారిలో వీర్యం స్ఖలనం, ఆడవారిలో యోని స్రావాన్ని కలిగిస్తాయి. ఈ మార్పులన్నీ పురుషులలో టెస్టోస్టెరాన్ మరియు స్త్రీలలో ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరాన్ వంటి లైంగిక హార్మోన్ల యొక్క స్థిరమైన చర్య మరియు స్రావం కారణంగా సంభవిస్తూ ఉంటాయి. లైంగిక అవయవాలలో వీర్యం పెరగడం కూడా రతి కలలకు మరో ముఖ్యమైన కారణం.

ప్రమాద కారకాలు

స్వప్న స్ఖలనానికి సంబంధం ఉన్న ప్రమాద కారకాలు ఏవీ లేవు, ఎందుకంటే ఇది ఒక వ్యాధి కాదు మరియు మనిషి ఆరోగ్యాన్ని ఇది ఏ విధంగానూ దెబ్బ తీయదు.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Oil by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic oil is recommended by our doctors to lakhs of people for sex problems (premature ejaculation, lack of erection in the penis, lack of libido in men) with good results.
Men Massage Oil
₹399  ₹449  11% OFF
BUY NOW

స్వప్న స్ఖలనాన్ని నిర్ధారించేందుకు ఉన్న ఏకైక మార్గం ఏదంటే రాత్రి లేదా ఉదయాన్నే లోదుస్తుల మీద అంటుకునే వీర్యం లేదా యోనిస్రావం (ఉత్సర్గ) ఉనికిని గమనించడం. ఇది పూర్తిగా వ్యక్తి యొక్క చరిత్ర ఆధారంగా చేసిన క్లినికల్ నిర్ధారణ. రక్త పరీక్షలు లేదా ఇమేజింగ్ పరీక్షలు స్వప్న స్ఖలన నిర్ధారణకు సహాయపడవు.

స్వప్న స్ఖలనానికి చికిత్స చేయడానికి చికిత్స ప్రణాళిక లేదా ఓ పాలకపద్ధతి అంటూ లేదు. స్వప్న స్ఖలనం తరచుగా ఎదుర్కొనే వాళ్లకు మరియు స్వప్న స్ఖలన పరిస్థితి నుండి బాధపడుతున్న వ్యక్తులకు సలహా-సంప్రదింపులు (counselling) ఇవ్వబడుతాయి.

జీవనశైలి నిర్వహణ

స్వప్న స్ఖలనాన్ని  పరిమితం చేయడానికి ముందే నిర్వచించిన జీవనశైలి నిర్వహణ మార్పులు ఏవీ సూచించబడలేదు. అయితే, కొన్ని అంశాలు పౌనఃపున్యాన్ని (ఫ్రీక్వెన్సీని) తగ్గించడంలో సహాయపడతాయి, అవి:

 • యోగా లేదా శారీరక వ్యాయామాలలో పాల్గొనడం ద్వారా ఒత్తిడి నిర్వహణను ఎంచుకోవచ్చు.
 • హస్త ప్రయోగం మరియు భాగస్వామితో ఆరోగ్యకరమైన శారీరక సంబంధాలలో పాల్గొనడం మంచిది. (మరింత చదవండి - సురక్షితమైన సంభోగాన్ని ఎలా పొందాలి)
 • ధూమపానం మరియు మద్యపానం మానుకోండి.
 • ఒక వ్యక్తి యొక్క సంభోగ వాంఛను (సెక్స్ డ్రైవ్‌ను) పెంచే అశ్లీల వీడియోలు మరియు ఇతర కార్యకలాపాల వంటి లైంగికసంబంధమైన అసభ్యకరమైన సాహిత్యానికి  (కంటెంట్‌కు) అలవాటు పడటాన్ని పరిమితం చేయాలి.

స్వప్న స్ఖలనం  యొక్క పౌనఃపున్యాన్ని (ఫ్రీక్వెన్సీని) తగ్గించడంలో కొన్ని గృహ చిట్కాలు సహాయపడతాయి. అలాంటి  చిట్కాల్లో కొన్నింటినిక్కడ ఇస్తున్నాం:

 

స్వప్న స్ఖలనానికి దానిమ్మపండ్లు మరియు తేనె - Pomegranate and honey for nightfall in Telugu

ఏం చేయాలి?

ప్రతిరోజూ దానిమ్మపండు తినవచ్చు లేదా దానిమ్మ తొక్కలను ఎండలో రెండు మూడు రోజులు ఎండబెట్టి, ఎండిన ఆ తొక్కల్ని మిక్సర్లో వేసి పొడి చేసుకుని సిద్ధంగా ఉంచుకునేది. ఇప్పుడు, ఒక చెంచా దానిమ్మ తొక్క పొడిని కొంత తేనెతో కలపండి, సేవించండి.

మోతాదు

సంతృప్తికరమైన ఫలితాలు వచ్చేవరకు మీరు ఈ మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు తినవచ్చు.

ప్రయోజనాలు

దానిమ్మపండులో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి కాబట్టి అవి రక్త ప్రసరణను ప్రోత్సహిస్తాయి. దానిమ్మ తొక్కలు ఎటువంటి ప్రయోజనాలను చూపించకపోతే, ప్రతిరోజూ దానిమ్మ రసం త్రాగాలి. ఒకటి లేదా రెండు నెలలు దీన్ని సేవించండి మరియు మీరు స్వప్న స్ఖలనం పరిస్థితి నుండి బయట పడవచ్చు.

స్వప్న స్ఖలనాన్ని నియంత్రించడానికి అతిమధురం టీ - Sage or liquorice tea to control nightfall in Telugu

(అతిమధురాన్నే ‘యష్టిమధుకం’ అని కూడా అంటారు)

స్వప్న స్ఖలనాన్ని తగ్గించడానికి అతిమధురం టీ (కషాయ పానీయం)ని పడుకునే ముందు తాగాలి.

స్వప్న స్ఖలన నివారణకు అరటిపండ్లు - Bananas keep nightfall at bay in Telugu

ఏం చేయాలి?

ఒక గ్లాసు వేడి పాలతో రెండు అరటిపండ్లు తినండి.

మోతాదు 

రోజూ ఉదయం ఒకసారి.

ప్రయోజనాలు

అరటి పండ్లు మరియు పాలు స్వప్న స్ఖలన సమస్యకు పురాతనమైన మరియు ప్రభావవంతమైన గృహ చిట్కా. ఇది లైంగిక కోరికను మరియు తహతహ (లేక ఉద్రేకాన్ని)ను అంతం చేస్తుంది. అరటి పండ్లు, పాల సేవనంవల్ల పురుషుల జననాంగాలు బలంగా కూడా తయారవుతాయి.

మెంతులు మరియు తేనె స్వప్న స్ఖలనానికి ఒక పరిష్కారం - Fenugreek seeds and honey are a solution to nightfall in Telugu

ఏం చేయాలి?

మొదట, ఒక చెంచా తేనె మరియు రెండు చెంచాల మెంతులను తీసుకోండి. వాటిని బాగా కలపండి, ఇలా కలిపిన ఈ మిశ్రమాన్ని  ప్రతిరోజూ నిద్రపోయే ముందు సేవించాలి.

మోతాదు

సంతృప్తికరమైన ఫలితాలు పొందే వరకు రోజుకు ఒకసారి తీసుకోవాలి.

ప్రయోజనాలు

మెంతి గింజలు హార్మోన్లను సమతుల్యం చేయడానికి సహాయపడతాయి, ఇది స్వప్న స్ఖలనాన్ని నియంత్రిస్తుంది.

స్వప్న స్ఖలనం నివారించడానికి బాదం పాలు మరియు తేనె - Almond milk and honey to avoid nightfall in Telugu

ఏం చేయాలి?

రాత్రిపూట 6-7 బాదంపప్పులను నీటిలో నానబెట్టండి. ఉదయాన్నేవాటిపైన ఉండే పొట్టును (పీల్స్) తీసేసి మిక్సర్‌లో రుబ్బుకుని పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ యొక్క ఒక టీస్పూన్ ను వేడి పాలలో వేసి కొంచెం తేనె కూడా వేసి వేడిగా ఉన్నప్పుడే త్రాగాలి.

మోతాదు

రాత్రి నిద్రపోవటానికి అరగంట ముందు బాదం పాలు త్రాగాలి.

ప్రయోజనాలు 

బాదం పాలలో పొటాషియం, మెగ్నీషియం, సెలీనియం, విటమిన్ ఇ మరియు యాంటీఆక్సిడెంట్లు వంటి ప్రయోజనకరమైన ఖనిజాలు ఉన్నాయి, ఇవి శరీరాన్ని బలంగా మరియు ఆరోగ్యంగా చేస్తాయి.

స్వప్న స్ఖలనం నివారణిగా పెరుగు - Yoghurt as nightfall remedy in Telugu

ఏం చేయాలి?

మీరు పెరుగును అలాగే తాగొచ్చు లేదా భోజనంతో కలిపి కూడా పెరుగు తినవచ్చు. ఇది కాకుండా, “రైతా”, మజ్జిగ మరియు ఇతర పానీయాలను కూడా పెరుగు నుండి తయారు చేసుకుని తాగవచ్చు.

మోతాదు

రోజుకు రెండు మూడు సార్లు.

ప్రయోజనాలు

ఇది స్వప్న స్ఖలనానికి ఓ గొప్ప ఇంటి చిట్కా మాత్రమే కాదు, సాధారణ ఆరోగ్యానికి కూడా పెరుగు మంచిది. పెరుగు జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. పెరుగు తినడం వల్ల రాత్రిపూట బాగా నిద్ర వస్తుంది మరియు లైంగిక కలల నుండి బయటపడటానికి కూడా సహాయపడుతుంది.

స్వప్న స్ఖలనం నియంత్రించడానికి ఉల్లిపాయ మరియు తేనె - Onion and honey to control nightfall in Telugu

ఏం చేయాలి?

ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని దాని రసాన్ని తీయండి. ఇప్పుడు రసంలో కొంచెం తేనె కలపండి. వాటిని బాగా కలపండి, అటుపై ఆ మిశ్రమాన్ని తాగండి. మీరు ఉల్లిపాయలను సలాడ్లు మరియు శాండ్‌విచ్‌లలో కూడా తినవచ్చు.

మోతాదు

ఈ మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు త్రాగాలి.

ప్రయోజనాలు

జుట్టు రాలడం, దగ్గు మరియు మరెన్నో ఆరోగ్య సమస్యలకు ఉల్లిపాయ చికిత్స చేస్తుంది. దీనితో పాటు, స్వప్న స్ఖలనాలకు ఇది చాలా మంచి గృహచిట్కా (హోం రెమెడీ).

స్వప్న స్ఖలనం నయం చేయడానికి వెల్లుల్లి - Garlic to cure nightfall in Telugu

ఏం చేయాలి?

మొదట, రెండు మూడు వెల్లుల్లి పేయల్నికడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. వాటిని నమలండి మరియు ఒక గ్లాసు నీరు త్రాగాలి. ఇది కాకుండా, మీరు వండిన వంటలలో వెల్లుల్లిని కూడా చేర్చవచ్చు.

మోతాదు

ప్రతిరోజూ ఒకసారి నిద్రపోయే ముందు వెల్లుల్లిని సేవించండి.

ప్రయోజనాలు

వెల్లుల్లిలో అల్లిసిన్ ఉంటుంది, ఇది పురుషాంగానికి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది, ఇది స్వప్న స్ఖలనం  నిరోధిస్తుంది.

స్వప్న స్ఖలనం నివారించడానికి ఉసిరి - Amla (Indian gooseberry) to prevent nightfall in Telugu

ఏం చేయాలి?

మీరు ఒక గ్లాసు ఉసిరి (ఇండియన్ గూస్బెర్రీ) రసం తాగవచ్చు మరియు దానికి పసుపు మరియు తేనె కూడా జోడించవచ్చు. ప్రత్యామ్నాయంగా, మీరు ఒక గ్లాసు నీటిలో ఆమ్లా పౌడర్ కలపాలి మరియు తరువాత నిద్రవేళకు ముందు ఈ మిశ్రమాన్ని త్రాగవచ్చు.

మోతాదు

ఉసిరిక రసం మరియు ఉసిరి పొడి రోజుకు రెండు మూడు సార్లు తీసుకోవచ్చు.

ప్రయోజనాలు

ఉసిరి మొత్తం ఆరోగ్యానికి సమర్థవంతమైన గృహ చిట్కాగా పరిగణించబడుతుంది మరియు ఇది స్వప్న స్ఖలనం పరిస్థితిని పరిమితం చేయడానికి సహాయపడుతుంది. ఆమ్లాలోని విటమిన్ సి ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, ఇది స్వప్న స్ఖలనం  నివారించడానికి సహాయపడుతుంది.

స్వప్న స్ఖలనం యొక్క పరిణామం (ఫలితం) సాధారణంగా మంచిదే, ఎందుకంటే ఇది మగవారిలో మరియు కొన్నిసార్లు ఆడవారిలో సహజంగా సంభవించే (దృగ్విషయం) మామూలు క్రియ. స్వప్న స్ఖలనం కారణంగా నమోదు చేయబడిన సమస్యలు లేవు. స్వప్న స్ఖలనం గురించిన ఎపిసోడ్లను ఎవరితోనైనా చర్చించలేకపోతున్న కొంతమందిలో తక్కువ ఆత్మగౌరవం, మానసిక అవాంతరాలు మరియు ప్రవర్తనా మార్పులు సంభవించవచ్చు.

Dr. Chetan Gupta

Dr. Chetan Gupta

Sexology

Dr. Ashok kesarwani

Dr. Ashok kesarwani

Sexology
12 Years of Experience

Dr. Hemant Sharma

Dr. Hemant Sharma

Sexology
11 Years of Experience

Dr. Zeeshan Khan

Dr. Zeeshan Khan

Sexology
9 Years of Experience

వనరులు

 1. Planned Parenthood Federation of America. What’s the deal with erections, ejaculation, and wet dreams?. [Internet]
 2. National Health Portal [Internet] India; Kasrat-e- Ihtilaam (Excessive Nocturnal Emission)
 3. Koushik Sinha Deb, Yatan Pal Singh Balhara. Dhat Syndrome: A Review of the World Literature . Indian J Psychol Med. 2013 Oct-Dec; 35(4): 326–331. PMID: 24379489
 4. Om Prakash, Sujit Kumar Kar, T. S. Sathyanarayana Rao. Indian story on semen loss and related Dhat syndrome. Indian J Psychiatry. 2014 Oct-Dec; 56(4): 377–382. PMID: 25568479
 5. National Health Portal [Internet] India; Surát-e- Inzaal (Premature ejaculation)
Read on app