విటమిన్ కె కొవ్వులో కరిగే విటమిన్, ఇది మనిషి రక్తం గడ్డకట్టడానికి ముఖ్యమైన కొన్ని ప్రోటీన్ల ఉత్పత్తికి ప్రధానంగా అవసరం. విటమిన్ కె దాని పేరు డానిష్ పదం ‘కోగ్యులేషన్’ (cogulation) నుండి వచ్చింది, అంటే రక్తం గడ్డకట్టడం. రక్తం గడ్డకట్టే ప్రక్రియకు అవసరమైన పదమూడు ప్రోటీన్లలో, విటమిన్ కె నాలుగు ప్రోటీన్ల సంశ్లేషణలో కీలక పాత్ర వహిస్తుంది. ప్రతిస్కందకాలు (anticogulants) లేదా రక్తం పలుచబడటానికి మందులు వాడుతున్న వ్యక్తులు వారి విటమిన్ కె స్థాయిని కాపాడుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. బోలు ఎముకల వ్యాధి (ఎముకలు బలహీనపడటం), వాస్కులర్ కాల్సిఫికేషన్ (రక్త నాళాలలో కాల్షియం నిక్షేపణ), ఆస్టియో ఆర్థరైటిస్ (కీళ్ళవ్యాధి) మరియు క్యాన్సర్ వంటి వ్యాధుల చికిత్సలో విటమిన్ కె ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

  1. విటమిన్ కె యొక్క వనరులు - Sources of vitamin K in Telugu
  2. విటమిన్ కె యొక్క ప్రయోజనాలు - Benefits of vitamin K in Telugu
  3. విటమిన్ కె మోతాదు - Vitamin K dosage in Telugu
  4. విటమిన్ కె లోపం - Vitamin K deficiency in Telugu
  5. విటమిన్ కె యొక్క దుష్ప్రభావాలు - Side effects of vitaminK in Telugu

విటమిన్ కె ని వివిధ ఆహార వనరులలో రెండు రూపాల్లో చూడవచ్చు. ఈ రెండు రూపాలు విటమిన్ కె 1 మరియు విటమిన్ కె 2. విటమిన్ కె 1 (ఫైలోక్వినోన్ లేదా ఫైటోమెనాడియోన్) సాధారణంగా ముదురు ఆకుకూరలు వంటి మొక్కల ఆధారిత ఆహార వనరులలో లభిస్తుంది, అయితే విటమిన్ కె 2 (మెనాక్వినోన్) జంతువుల ఆహార వనరులు మరియు పులియబెట్టిన పాల ఉత్పత్తులలో ఎక్కువగా కనిపిస్తుంది.

విటమిన్ కె3 మూడవ రూపం, ఇది సింథటిక్, దీనిని ‘మెనాడియోన్’ అంటారు. ఇది అధికంగా విషపూరితంగా ఉన్నందున దీనిని USA యొక్క ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం నిషేధించింది.

విటమిన్ కె యొక్క జంతు వనరులు

విటమిన్ కె యొక్క కొన్ని సాధారణ మరియు సహజంగా లభించే జంతు వనరులు ఏవంటే గుడ్డు పచ్చసొన, మయోన్నైస్ (గుడ్డు పచ్చసొన తదితర పదార్థాలతో చేసిన క్రీం) , చికెన్ లివర్, చికెన్ బ్రెస్ట్, పెరుగు, వనస్పతి, గ్రౌండ్ గొడ్డు మాంసం, గౌడ వంటి గట్టి జున్ను, బ్లూ చీజ్, సలామి, వెన్న మరియు పులియబెట్టిన పాలు వంటి మృదువైన జున్ను (కేఫీర్).

విటమిన్ కె యొక్క మొక్కల వనరులు

విటమిన్ కె ప్రధానంగా బచ్చలికూర, బ్రోకలీ, కోల్‌స్లా మరియు శతావరి వంటి వండిన ముదురు ఆకుపచ్చ కూరగాయలలో లభిస్తుంది. ఇది సోయాబీన్ నూనె, ద్రాక్ష, రేగు, కిడ్నీ బీన్స్ మరియు నాటో (పులియబెట్టిన సోయా) మరియు సౌర్క్రాట్ వంటి కొన్ని సంప్రదాయ పులియబెట్టిన ఆహారాలలో కూడా కనిపిస్తుంది.

  • చర్మం కోసం: గాయాలు వేగంగా నయం కావడంలో విటమిన్ కె సహాయపడుతుంది. విటమిన్ కె కళ్ళ కింద నల్ల చారలు మరియు వృద్దాప్య లక్షణాలను నివారించడంలో సహాయం చేస్తుందని అధ్యయనాలు తెలిపాయి. 
  • ఎముకల కోసం: విటమిన్ కె ఎముక ఆరోగ్యం కోసం అవసరం మరియు ఆస్టియోపోరోసిస్ నివారణకు సహాయపడుతుంది. ఒక అధ్యయనంలో ఆస్టియోపోరోసిస్ ఉన్న వ్యక్తులకు కాల్షియంతో  పాటుగా విటమిన్ కె సప్లీమెంట్లను ఇవ్వడం వలన వారి ఎముకల సాంద్రత పెరిగినట్లు కొనుగొనబడింది.
  • గుండెకు: వాస్క్యూలర్ కాల్సిఫికేషన్ అంటే రక్త నాళాలలో ఫలకం అభివృద్ధి చెందే ఒక పరిస్థితి ఇది గుండె వ్యాధులకు కారణమవుతుంది. విటమిన్ కె అధికంగా ఉండే ఆహార విధానం దీనిని నివారిస్తుందని పరిశోధనలు తెలిపాయి.
  • పసిపిల్లలకు: ప్రపంచ ఆరోగ్య సంస్థ పసిపిల్లలకు విటమిన్ కె సప్లీమెంట్లు ఇవ్వాలని సిఫారసు చేసింది. ఇది శిశివులను విటమిన్ కె లోపం వలన ఏర్పడే రక్తహీనత నుండి రక్షిస్తుంది. అలాగే వివిధ సమస్యల నుండి కాపాడుతుంది.
  • విటమిన్ కె కాలేయ క్యాన్సర్ను నివారించడంలో సహాయం చేస్తుంది అలాగే చెక్కెర వ్యాధి రోగులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.

చర్మానికి విటమిన్ కె - Vitamin K for the skin in Telugu

విటమిన్ కె గాయాన్ని వేగంగా నయం చేయడానికి సహాయపడుతుంది. లేజర్ చికిత్స వల్ల కలిగే గాయాలపై విటమిన్ కె క్రీమ్ వాడటం వల్ల గాయాల తీవ్రత తగ్గుతుందని తెలిసింది. విటమిన్ కె క్రీమ్ యొక్క ఈ వైద్యం ప్రభావం వాడిన ప్రారంభ రోజులలో ఎక్కువగా కనిపిస్తుంది. విటమిన్ కె వృద్ధాప్యంతో కళ్ళ క్రింద ఏర్పడే చీకటి వృత్తాలతో పోరాడటానికి సహాయపడుతుందని మరియు ముఖం ముడతలు ఏర్పడటాన్ని తగ్గించడానికి మరియు వాటిని తిప్పికొట్టడానికి కూడా సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఎముకల ఆరోగ్యానికి విటమిన్ కె - Vitamin K for bones in Telugu

ఎముక ఆరోగ్యానికి విటమిన్ కె చాలా అవసరం మరియు బోలు ఎముకల వ్యాధిని నివారించడానికి ఈ విటమిన్ సహాయపడుతుంది. వృద్ధులలో బోలు ఎముకల వ్యాధి చాలా సాధారణమైన పరిస్థితి మరియు ప్రపంచవ్యాప్తంగా ఎముకల ఫ్రాక్చర్లకు (fractures) ప్రధాన కారణాలలో ఇది ఒకటి. బోలు ఎముకల వ్యాధి కారణంగా ముగ్గురు మహిళలలో ఒకరు మరియు 50 ఏళ్లు పైబడిన ఐదుగురు పురుషులలో ఒకరు ఎముక విరుగుళ్లను ఎదుర్కొంటున్నారని ఓ అంచనా. బోలు ఎముకల వ్యాధి ఉన్నవారి అధ్యయనంలో, కాల్షియంతో పాటు విటమిన్ కె సప్లిమెంట్స్ ఇచ్చిన వారు కాల్షియం మాత్రమే ఇచ్చిన ఇతరులతో పోలిస్తే వారి ఎముక సాంద్రతను మెరుగ్గా నిర్వహిస్తున్నట్లు గుర్తించబడింది. తక్కువ ఎముక సాంద్రతతో విటమిన్ కె తక్కువ స్థాయిలో తిరుగుతుందని పరిశోధకులు చూపించారు. అధిక విటమిన్ కె వినియోగం పురుషులు మరియు మహిళల్లో హిప్ ఫ్రాక్చర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది మహిళల్లో ఎముక ఖనిజ సాంద్రతను పెంచడానికి కూడా సహాయపడింది. తగినంత విటమిన్ కె పొందటానికి ప్రతిరోజూ ఆహారంలో పాలకూర వంటి ముదురు ఆకుపచ్చ ఆకు కూర యొక్క కనీసం ఒక వడ్డింపును చేర్చాలని సిఫార్సు చేయబడింది.

గుండెకు విటమిన్ కె - Vitamin K for the heart in Telugu

రక్తనాళాలలో ఫలకం ఏర్పడే రుగ్మతనే “వాస్కులర్ కాల్సిఫికేషన్” అంటారు. రక్తనాళాల కాల్సిఫికేషన్ హృదయ సంబంధ వ్యాధులకు (గుండె జబ్బులు) ముఖ్యమైన ప్రమాద కారకాల్లో ఒకటి. విటమిన్ కె అధికంగా ఉన్న ఆహారం గుండెలో రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించే చికిత్స తరువాత ధమనులలో ఫలకం ఏర్పడే రుగ్మతను (కాల్సిఫికేషన్‌ను) తిప్పికొట్టగలదని అధ్యయనాలు చెబుతున్నాయి. కాల్సిఫికేషన్ నుండి రక్త నాళాల పూర్తి రక్షణ కోసం విటమిన్ కె 1 మరియు విటమిన్ కె 2 రెండింటినీ తీసుకోవడం అవసరమని గమనించాలి. అలాగే, విటమిన్ కె 2 కన్నా రక్తనాళాలను కాల్సిఫికేషన్ నుండి రక్షించడంలో మరియు దాని ధమనులలో కాల్సిఫికేషన్ను తిప్పికొట్టడంలో విటమిన్ కె 2 మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది.

విటమిన్ డి సప్లిమెంట్లతో పాటు విటమిన్ కె తీసుకొన్న మహిళల్ని విటమిన్ డి సప్లిమెంట్లను మాత్రమే తీసుకునే మహిళలతో పోలిస్తే రుతుక్రమం ఆగిపోయిన మహిళల్లో రక్త నాళాల యొక్క సాగే లక్షణాలను బాగా నిర్వహించడానికి సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఆర్థరైటిస్ కోసం విటమిన్ కె - Vitamin K for arthritis in Telugu

ఎముకలు-కీళ్లనొప్పి (ఆస్టియో ఆర్థరైటిస్) అనేది మనిషిని బలహీనపరిచే రుగ్మత, ఇది మృదులాస్థిని దెబ్బతీయడం ద్వారా మరియు కీళ్లలో రెండు ఎముకల మధ్య ఖాళీని తగ్గించడం ద్వారా మీ శరీర కీళ్ళను దెబ్బ తీస్తుంది. ఇది పెడసరానికి (బిర్రబిగుసుకుపోవడం) మరియు నొప్పికి దారితీస్తుంది. విటమిన్ కె లోపం ఉన్నవారిలో కీళ్లనొప్పి (ఆస్టియో ఆర్థరైటిస్‌) ని నివారించడంలో విటమిన్ కె ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఇటీవలి పరిశోధనలో తేలింది.

కీళ్ళవాతం (రుమటాయిడ్ ఆర్థరైటిస్) అనేది స్వయం ప్రతిరక్షక వ్యాధి, దీనిలో శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థ నొప్పి మరియు మంట (వాపు) కు దారితీసే కీళ్ళపై దాడి చేస్తుంది. విటమిన్ కె 2 సప్లిమెంట్స్ కీళ్ళవాతము వల్ల కలిగే వాపు-మంటను తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

నవజాత శిశువులకు విటమిన్ కె - Vitamin K for newborns in Telugu

నవజాత శిశువులందరికీ పుట్టిన మొదటి గంట తర్వాత ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ రూపంలో విటమిన్ కె సప్లిమెంట్ ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సిఫారసు చేస్తోంది. నెలతక్కువ శిశువులు, పుట్టినప్పుడే గాయం ఉన్న శిశువులు మరియు తల్లి గర్భంలో విటమిన్ కె శోషణకు ఆటంకం కలిగించే కొన్నిఔషధాలకు గురైన శిశువుల్లో రక్తస్రావాన్ని నిరోధించడానికి విటమిన్ కె అవసరం. “విటమిన్ కె లోపంతో కూడిన రక్తస్రావం” అని పిలువబడే అరుదైన రుగ్మత నుండి రక్షించడానికి శిశువులకు విటమిన్ కె సప్లిమెంట్స్ ఇవ్వాలి. శిశువులలో విటమిన్ కె భర్తీ చాలా అవసరం ఎందుకంటే చాలా మంది పిల్లలు గర్భంలో ఉన్న తల్లుల నుండి లేదా తల్లి పాలిచ్చేటప్పుడు తగినంత విటమిన్ కె పొందరు కాబట్టి. విటమిన్ కె లోపం వల్ల అంతర్గత రక్తస్రావం మెదడు దెబ్బతినడానికి మరియు మరణానికి కూడా కారణం కావచ్చు. తల్లులు తమ గర్భధారణ సమయంలో మూర్ఛ, రక్తం గడ్డకట్టడం లేదా క్షయవ్యాధికి మందులు తీసుకుంటే నవజాత శిశువులకు విటమిన్ కె అనుబంధక మందులను భర్తీ చేయడం చాలా ముఖ్యం.

విటమిన్ కె యొక్క ఇతర ప్రయోజనాలు - Other benefits of Vitamin K in Telugu

  • క్యాన్సర్‌ను నివారిస్తుంది
    విటమిన్ కె కొన్ని రకాల క్యాన్సర్లను నివారించడానికి సహాయపడుతుంది. విటమిన్ కె కాలేయ క్యాన్సర్ మరియు కాలేయ సిరోసిస్ రుగ్మతలున్నవారికి ప్రయోజనకరంగా ఉంటుందని చూపించబడింది.
  • ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది
    విటమిన్ కె ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది మరియు చక్కెరవ్యాధి (డయాబెటిస్) మరియు ప్రీ-డయాబెటిస్ రుగ్మత ఉన్నవారికి సహాయపడుతుంది.

విటమిన్ కె కోసం సిఫార్సు చేయబడిన ఆహార భత్యం (RDA) లేదు, అందువల్ల, నేషనల్ అకాడమీల ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ వద్ద ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బోర్డ్ (FNB) తగినంతగా తీసుకోవడమనే (adequate intake-AI) స్థాయిని ఏర్పాటు చేసింది. అవసరమైన విటమిన్ కె స్థాయిలు మైక్రోగ్రాములలో (ఎంసిజి) పేర్కొనబడ్డాయి.

  • 6 నెలల లోపు శిశువులకు AI 2.0 mcg. ఈ శిశువులు ఆరోగ్యంగా ఉంటారని, సగటు బరువును కల్గి ఉంటారని మరియు తల్లిపాలివ్వబడ్డారని భావించబడుతుంది.
  • 7 నెలల నుండి 12 నెలల వయస్సు ఉన్న శిశువులకు 2.5 ఎంసిజి అవసరం.
  • 1 నుండి 3 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు 30 mcg యొక్క AI ని సిఫార్సు చేస్తారు, మరియు 4 నుండి 8 సంవత్సరాల మధ్య వయస్సు గలవారికి 55 mcg విటమిన్ K అవసరం.
  • 9 నుంచి 13 సంవత్సరాల మధ్య ఉన్న కౌమారదశకు 60 ఎంసిజి అవసరం, 14 నుంచి 18 సంవత్సరాల మధ్య టీనేజ్‌లకు 75 ఎంసిజి విటమిన్ కె అవసరం.
  • 19 ఏళ్లు పైబడిన మగవారికి 120 ఎంసిజిల AI అవసరం, ఆడవారికి 90 ఎంసిజి (గర్భిణీ మరియు పాలిచ్చే మహిళలతో సహా) అవసరం.

గాయం విషయంలో రక్తం గడ్డకట్టడానికి తీసుకునే సమయం సాధారణ సమయం కంటే అధిక పరిమితికి మించి ఉన్నప్పుడు మాత్రమే వ్యక్తులకు విటమిన్ కె లో లోపం ఉన్నట్లు చెబుతారు. ఇది సంభవిస్తుంది ఎందుకంటే రక్తం యొక్క ప్రోథ్రాంబిన్ చర్య (అనగా రక్తం గడ్డకట్టడానికి రక్షిత పనితీరు) విటమిన్ కె లోపంలో గణనీయంగా తగ్గుతుంది. అందువల్ల, అధిక లేదా అసాధారణ రక్తస్రావం తరచుగా విటమిన్ కె లోపం యొక్క మొదటి మరియు ఏకైక సంకేతం. ఏదేమైనా, ఈ సంకేతాలు తీవ్రమైన సందర్భాల్లో తప్ప స్పష్టంగా కనిపించవు. అందువల్ల, విటమిన్ కె లోపం తేలికగా నిర్ధారించబడదు.

నవజాత శిశువులలో విటమిన్ కె లోపం తల్లి పాలలో విటమిన్ కె తక్కువగా ఉండటం వల్ల మరియు పుట్టినప్పుడు సంభవిస్తుంది. ఆరోగ్యకరమైన పెద్దలలో విటమిన్ కె లోపం చాలా అరుదు. తీవ్రమైన జీర్ణ రుగ్మతలు ఉన్నవారు మరియు ఎక్కువ కాలం యాంటీబయాటిక్స్ తీసుకుంటున్న వ్యక్తులకు విటమిన్ కె లోపం వచ్చే ప్రమాదం ఉంది.

శరీరంలో విటమిన్ కె స్థాయికి అధిక పరిమితి ఏర్పాటు చేయబడలేదు ఎందుకంటే ఇది విషాన్ని కలిగించే అవకాశం చాలా తక్కువ. ఆహార వనరులు లేదా అనుబంధక మందుల నుండి విటమిన్ కె తీసుకోవడం వల్ల ఎటువంటి హానికరమైన ప్రభావాలు మానవులలో లేదా జంతువులలో నివేదించబడలేదని ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బోర్డు ప్రచురించిన ఒక అధ్యయనం పేర్కొంది.


उत्पाद या दवाइयाँ जिनमें Vitamin K है

వనరులు

  1. A. J. van Ballegooijen, J. W. Beulens. The Role of Vitamin K Status in Cardiovascular Health: Evidence from Observational and Clinical Studies . Curr Nutr Rep. 2017; 6(3): 197–205. PMID: 28944098
  2. Gerry Kurt Schwalfenberg. Vitamins K1 and K2: The Emerging Group of Vitamins Required for Human Health . J Nutr Metab. 2017; 2017: 6254836. PMID: 28698808
  3. Health Harvard Publishing. Harvard Medical School [Internet]. Vitamin K. Harvard University, Cambridge, Massachusetts.
  4. Neha S. Shah et al. The effects of topical vitamin K on bruising after laser treatment. Journal of American Academy of Dermatology
  5. Fatemeh Ahmadraji, Mohammad Ali Shatalebi. Evaluation of the clinical efficacy and safety of an eye counter pad containing caffeine and vitamin K in emulsified Emu oil base . Adv Biomed Res. 2015; 4: 10. PMID: 25625116
  6. James J DiNicolantonio et al. The health benefits of vitamin K . Open Heart. 2015; 2(1): e000300. PMID: 26468402
  7. Braam LA et al. Beneficial effects of vitamins D and K on the elastic properties of the vessel wall in postmenopausal women: a follow-up study. Thromb Haemost. 2004 Feb;91(2):373-80. PMID: 14961167
  8. World Health Organization [Internet]. Geneva (SUI): World Health Organization; Newborn Health.
  9. healthdirect Australia. Vitamin K at birth. Australian government: Department of Health
  10. National Institutes of Health; Office of Dietary Supplements. [Internet]. U.S. Department of Health & Human Services; Vitamin K.