myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

పంటి చిగుళ్ల రక్తస్రావం అంటే ఏమిటి?

పంటి చిగుళ్ల రక్తస్రావం అనేది పంటి చిగుళ్ళ అనారోగ్యం లేదా వ్యాధికి సంబంధించిన ఒక  సంకేతము. కారణానికి చికిత్స, సరైన దంత పరిశుభ్రత మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి అనేవి చిగుళ్ళ రక్తస్రావ నిర్వహణలో ముఖ్యమైన విషయాలు.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

చిగుళ్ళు రక్తస్రావం ప్రారంభమం అయ్యే ముందు, అవి వాచీ (ఎరుపు మరియు వాపు) మరియు దంత దవనం చేస్తున్నప్పుడు లేదా ఫ్లోస్సింగ్ (flossing) (జింజివైటిస్)చేస్తున్నపుడు సులభంగా రక్తస్రావానికి గురిఅవుతాయి. వాపు తీవ్రమై మరియు దవడ ఎముక (పిర్యాడొంటిటీస్) కు విస్తరించినప్పుడు  రక్తస్రావం పెరుగుతుంది . వ్యాధి ముదిరే కొద్దీ, వివిధ లక్షణాలు కనిపిస్తాయి:

 • చెడు శ్వాస
 • నములుతున్నపుడు, నొప్పి మరియు కష్టం
 • చిగుళ్ళను  లాగినప్పుడు పళ్ళు బయటపడతాయి
 • దంతాల సున్నితత్వం పెరగడంతో దంతాలు వదులవుతాయి
 • చిగుళ్ళలో చీము చేరడం
 • నోటిలో తుప్పుపట్టినటువంటి లోహ రుచి, సంక్రమణ (infection) తీవ్రంగా ఉన్నప్పుడు నోటిలో లాలాజల స్రావం పెరుగుతుంది మరియు జ్వరం సంభవిస్తుంది

పంటి చిగుళ్ల రక్తస్రావం యొక్క  ప్రధాన కారణాలు ఏమిటి?

చిగుళ్ళ రక్తస్రావానికి దారితీసే వివిధ కారణాలు:

 • దంతా ధావనం మరియు ఫ్లోస్సింగ్ యొక్క తప్పు పద్ధతి లేదా గట్టి బ్రష్ను ఉపయోగించడం
 • దంత పరిశుభ్రత లేకపోవడం
 • చిగుళ్ళు మరియు దంతాల మధ్యన ఫలకం ఏర్పడటం వలన వచ్చే సంక్రమణ (infection)
 • గర్భధారణ సమయంలో హార్మోన్లలో మార్పులు
 • విటమిన్ సి (C) మరియు విటమిన్ కె (K) యొక్క లోపం
 • రక్తస్రావ రుగ్మతలు
 • రక్తం పల్చబడటానికి ఉపయోగించే మందులు
 • లుకేమియా (leukaemia) వంటి రక్త క్యాన్సర్
 • సక్రమం లేని కట్టుడు పళ్ళు
 • మధుమేహం
 • ధూమపానం
 • ఎయిడ్స్ (AIDS) వంటి రోగ నిరోధక సమస్యలు

ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

దంతాల పరీక్షల ఆధారంగా మరియు ఇతర రోగాల యొక్క లక్షణాలు (మధుమేహం వంటివి) మరియు చరిత్రల ఆధారంగా దంతవైద్యులు  చిగుళ్ళ రక్తస్రావాన్ని నిర్ధారిస్తారు. రోగ నిర్ధారణలో సహాయపడే వివిధ పరిశోధనలు:

 • రక్త పరీక్షలు
  • సంపూర్ణ రక్త గణన (Complete blood count) శరీరంలో సంక్రమణను గుర్తించడంలో సహాయపడుతుంది
  • పరిశోధనా అధ్యయనాల ప్రకారం, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు మరియు పెరిగిన సి-రియాక్టివ్ ప్రోటీన్ స్థాయిలకు కూడా చిగుళ్ళ మరియు పళ్ళ వ్యాధులతో సంభందం ఉందని  గుర్తించబడింది
 • ఎక్స్-రే: జాబోన్ X- రే (Jawbone X-ray)  దవడ ఎముకులలో చిగుళ్ల వ్యాధి తీవ్రతను గుర్తించడానికి సహాయపడుతుంది

చిగుళ్ళ రక్తస్రావ చికిత్స వ్యాధి యొక్క పురోగతిని ఆపడం మరియు దంతాలు మరియు చిగుళ్ళకు మరింత నష్టం జరగకుండా ఉండటానకి సహాయం చేస్తుంది.

 • సరైన దంత ధావనం మరియు ఫ్లాసింగు పద్ధతులు ఫలకమును తగ్గించడంలో సహాయం చేస్తాయి.
 • యాంటీబయాటిక్స్ సంక్రమణను (infection) తొలగించడానికి సహాయం చేస్తాయి.
 • వేడి నీరు లేదా హైడ్రోజన్ పెరాక్సైడ్ తో నోటిని పుక్కలిస్తే అది ఫలకాన్ని తగ్గిస్తుంది.
 • దంతవైద్యులు దంతాల యొక్క ఉపరితలం నుండి ఫలకము యొక్క పొరను స్కేలింగ్ (scaling) అని పిలిచే ప్రక్రియ ద్వారా తీసివేస్తారు.
 • విటమిన్ సి(C) లేదా కె (K) యొక్క లోపం కారణంగా చిగుళ్ళ రక్తస్రావం అవుతుంటే చికిత్సలో  విటమిన్ అనుబంధకాలను ఉపయోగిస్తారు.
 • ధూమపానం మరియు పొగాకు వాడకాన్ని పూర్తిగా నివారించాలి .
 • మీ వైద్యునిచే సిఫార్సు చేయబడకపోతే తప్పనిసరిగా ఆస్పిరిన్ వంటి రక్తాన్ని పల్చబరచే  మందులను తప్పనిసరిగా నివారించాలి.
 • దంత పరిశుభ్రతని నిర్వహించడానికి  క్రమమైన దంత చెక్-అప్ లు మరియు పళ్ళను  శుభ్రపరచడం వంటివి చేయాలి.
 1. పంటి చిగుళ్ల రక్తస్రావం కొరకు మందులు

పంటి చిగుళ్ల రక్తస్రావం కొరకు మందులు

పంటి చిగుళ్ల రక్తస్రావం के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine NamePack SizePrice (Rs.)
OtzOtz 200 Mg/500 Mg Tablet57
Pik ZPik Z 50 Mg/125 Mg Syrup30
OxanidOxanid 200 Mg/500 Mg Tablet47
Pin OzPin Oz 200 Mg/500 Mg Tablet81
Oxflo ZlOxflo Zl Suspension0
Piraflox OPiraflox O 200 Mg/500 Mg Infusion86
OxisozOxisoz Tablet60
Prohox OzProhox Oz 200 Mg/500 Mg Tablet48
Protoflox OzProtoflox Oz 200 Mg/500 Mg Tablet40
Bjain Candida albicans DilutionBjain Candida albicans Dilution 1000 CH63
Oxwal OzOxwal Oz 200 Mg/500 Mg Tablet78
Q Ford OzQ Ford Oz 200 Mg/500 Mg Tablet60
Qugyl OQugyl O 200 Mg/500 Mg Tablet67
Qmax OzQmax Oz 200 Mg/500 Mg Tablet96
Quino OzQuino Oz 200 Mg/500 Mg Tablet29
Qok OnQok On 200 Mg/500 Mg Tablet46
Rational PlusRational Plus 200 Mg/500 Mg Tablet64
Qubid OzQubid Oz 200 Mg/500 Mg Tablet54
Ridol OzRIDOL OZ TABLET 10S39
Quinagyl OzQuinagyl Oz Tablet56

మీకు గానీ లేదా మీ కుటుంబములో ఎవరికైనా గానీ ఈ వ్యాధి ఉందా? దయచేసి ఒక సర్వే చేసి ఇతరులకు సహాయపడండి

References

 1. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Bleeding gums
 2. National Institute of Dental and craniofacial Research. Gum Disease. USA; [lnternet]
 3. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Symptoms
 4. American Association for the Advancement of Science. A blood test may reveal systemic factors that relate to periodontal disease, especially in men. American Academy of Periodontology. Chicago; January 22, 2004
 5. Balhara Y. Bleeding gums: duloxetine may be the cause.. J Postgrad Med. 2007 Jan-Mar;53(1):44-5. PMID: 17244971
और पढ़ें ...