myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

పంటి చిగురు వాపు అంటే ఏమిటి?

పండ్ల మీద పాచి పేరుకుపోవడంవల్ల పండ్ల చిగుర్లు వాచీ “పంటి చిగురు వాపు” (Gingivitis) అనే రుగ్మత సంభవిస్తుంది. దంతాల పాచి లేక దంత ఫలకం (dental plaque) అనేది దంతాలపై పేరుకుపోయే బ్యాక్టీరియాతో కూడిన, రంగులేని, బంకగుణంకల్గిన (sticky film) పారదర్శక పదార్ధం(బయోఫీల్మ్). ఈ పాచి లేదా ఫలకము పళ్ళు మధ్య కూడా పెరగొచ్చు. సరైన జాగ్రత్త తీసుకోకపోతే, ఈ పరిస్థితి తీవ్రమైన చిగుళ్ల నష్టం మరియు దంత నష్టం కలిగిస్తుంది.

దీని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

మీరు ఈ క్రింది వ్యాధిలక్షణాలను అనుభవిస్తే మీరు “పంటిచిగురు వాపు”ను కలిగి ఉండవచ్చు:

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

పంటి చిగురు వాపుకు ప్రధాన కారణం దంతాలపైనా చిగుళ్ల పైనా పాచి లేక ఫలకం పేరుకుపోవడం. ఇలా పేరుకుపోయిన పాచిలో (ఫలకంలో) ఉన్న బాక్టీరియా చిగుళ్లను బాధిస్తుంది మరియు వాపు మరియు రక్తస్రావం కలిగిస్తుంది. దంతాలపై పేరుకుపోయిన పాచితో కూడిన ఫలకం కఠినంగా తయారవుతుంది మరియు దంతచక్కర లేక దంతశర్కర అని పిలువబడే పదార్ధాన్ని ఏర్పరుస్తుంది, ఇది పాచికంటే గట్టిగా ఉంటుంది.

పంటి చిగురు వాపు (గ్యాంగ్విటిస్) ప్రమాదాన్ని పెంచే కారణాలు కింది విధంగా ఉన్నాయి:

 • నోటి పరిశుభ్రతను సరిగా నిర్వహించకపోవడం
 • ధూమపానం లేదా పొగాకు సేవనం
 • గర్భధారణ
 • పోషణ సరిగా లేకపోవడం
 • ఒత్తిడి
 • మధుమేహం , హెచ్ఐవి వైరస్ (హ్యూమన్ ఇమ్మ్యూనోడెఫిషియన్సీ వైరస్)   వంటి వ్యాధులు - సంక్రమణలు మరియు క్యాన్సర్ వ్యాధి
 • మూర్ఛ మందులు, క్యాన్సర్ మందులు, నోటిద్వారా తీసుకునే కాంట్రాసెప్టైవ్స్, మరియు స్టెరాయిడ్ మందుల వాడకం.

పంటి చిగురు వాపును ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

మీ దంతవైద్యుని క్రమం తప్పకుండా (రెగ్యులర్గా) సంప్రదించడంవల్ల పరిస్థితిని ప్రారంభదశలోనే గుర్తించడం వీలవుతుంది, ఎందుకంటే సాధారణంగా పరిస్థితి నొప్పిలేకుండా ఉంటుంది కాబట్టి. చికిత్సలో ప్రత్యేకంగా పాచిని శుభ్రపరిచే పరికరాలను ఉపయోగించడం ద్వారా దంతాల నుండి పాచిని (ఫలకం) తొలగించడం జరుగుతుంది.

ఈ స్థితిలో మీరు నొప్పిని అనుభవిస్తే, మీనొప్పిని తగ్గించడానికి మీ దంతవైద్యుడు ఒక నొప్పినివారిణి (painkiller) మందును సిఫారసు చేస్తారు. కొన్ని సందర్భాల్లో, యాంటీబయాటిక్ మందులు కూడా సూచించబడుతాయి. అంటురోగం ఎక్కువ స్థాయిలో చిగుళ్ళను గనుక బాధించి ఉన్నట్లయితే దంత తొలగింపు (teeth removal) అవసరమవుతుంది.

ఇలాంటి సాధారణ స్వీయ రక్షణ చిట్కాల ద్వారా మీరు పంటి చిగురు వాపును నిరోధించవచ్చు:

 • రోజుకు రెండుసార్లు మీ దంతాలను బ్రష్ చేయండి
 • పళ్ళ సందులోని పదార్థాల్నిరోజుకు ఒకసారైనా (flossing) తొలగించడం
 • క్రమం తప్పకుండా మౌత్ వాష్ను ఉపయోగించడం
 • రంగులో ఏదైనా మార్పు గమనించేందుకు రోజూ మీ చిగుళ్ళను తనిఖీ చేయండి
 • క్రమం తప్పకుండా దంత తనిఖీ (dental check-up)
 1. పంటి చిగుళ్ల వాపు (జింజివైటిస్) కొరకు మందులు

పంటి చిగుళ్ల వాపు (జింజివైటిస్) కొరకు మందులు

పంటి చిగుళ్ల వాపు (జింజివైటిస్) के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine NamePack SizePrice (Rs.)
OtorexOtorex Drop60
Mama Natura NisikindSchwabe Nisikind Globules88
Schwabe Aconitum napellus LMSchwabe Aconitum napellus 0/1 LM80
Quik KoolQuik Kool Gel60
Dr. Reckeweg Aconite Nap QDr. Reckeweg Aconite Nap Q 176
Ora FastOra Fast Cream52
Orex LoOrex Lo Gel46
Zytee RbZytee Rb 0.02%/9% Gel76
KaypenKaypen 125 Mg Tablet0
UniwaxUNIWAX EAR DROPS 10ML0
UlcehealUlceheal 0.02%/9% Gel12
ZypexZypex 0.02% W/W/9% W/W Mouth Ulcer Gel39
Raybrom Eye DropRaybrom Eye Drop88
Raycrom 4Raycrom 4 Eye Drops0
Cromyl Forte DropCromyl Forte Drop30
GaticheckGaticheck Eye Drop40
GatisolGatisol Eye Drop47

మీకు గానీ లేదా మీ కుటుంబములో ఎవరికైనా గానీ ఈ వ్యాధి ఉందా? దయచేసి ఒక సర్వే చేసి ఇతరులకు సహాయపడండి

References

 1. National Health Service [Internet] NHS inform; Scottish Government; Gum disease.
 2. Merck Sharp & Dohme Corp. [Internet]. Kenilworth, NJ, USA; Gingivitis.
 3. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Gingivitis.
 4. Anuja Chandra. et al. Epidemiology of periodontal diseases in Indian population since last decade. J Int Soc Prev Community Dent. 2016 Mar-Apr; 6(2): 91–96. PMID: 27114945
 5. American Dental Association. [Internet]. Niagara Falls, New York, U.S.; Gingivitis.
और पढ़ें ...