భ్రాంతి రుగ్మత - Delusional Disorder in Telugu

Dr. Nabi Darya Vali (AIIMS)MBBS

November 30, 2018

March 06, 2020

భ్రాంతి రుగ్మత
భ్రాంతి రుగ్మత
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

భ్రాంతి రుగ్మత అంటే ఏమిటి ?

భ్రాంతి రుగ్మత (delusional disorder) అనేది ఓ రకమైన మానసిక రుగ్మత  లేక మతిభ్రమ (సైకోసిస్). ఇదో తీవ్రమైన మానసిక అనారోగ్యం. ఈ రుగ్మతకు లోనైనవాళ్లు అసాధారణ నమ్మకాలలో అమిత విశ్వాసం కలిగి ఉంటారు. అసత్య కల్పనల్ని నిజమని విశ్వసిస్తూ, అనుభవపూర్వకమైన  ప్రయోగాత్మక సాక్ష్యాలను పూర్తిగా విస్మరిస్తుంటారు. దీన్నే గతంలో “భ్రాంతుల వల్ల కలిగే మానసిక రుగ్మత” (పారనాయిడ్ రుగ్మత) గా సూచించేవారు.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

భ్రాంతి రుగ్మత యొక్క అత్యంత సాధారణ లక్షణం మరీ విపరీతం కానీ భ్రమలు కల్గి ఉండటం.

ఇతర లక్షణాలు:

 • అసాధారణ మానసిక కల్లోలం
 • సాధారణ కార్యకలాపాల్లో ఏమాత్రం శ్రద్ధ లేనట్లు కన్పించడం లేక ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తారు
 • భ్రమలు మరియు భ్రాంతికి సంబంధించిన చెదిరిన ప్రవర్తన
 • అపసవ్యమైన ఆలోచనా ప్రక్రియ
 • విపరీతమైన తర్కం
 • సాధారణంగా తక్కువ ప్రాముఖ్యత ఉన్న సంఘటనలు మరియు పరిసరాలకు సంబంధించి ఉన్నతమైన స్వీయ-సూచన భావన

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

ప్రధాన కారకాలు:

 • జన్యు కారకాలు: కుటుంబంలో ఎవరైనా ఓ సభ్యుడు కొన్ని మానసిక రుగ్మతలు లేదా మనోవైకల్యానికి (స్కిజోఫ్రెనియా) గతంలో గురై ఉంటే ప్రస్తుతం ఆ కుటుంబంలోనివారికి ఈ వ్యాధి సంభవించే అవకాశం ఎక్కువ ఉందని గుర్తించబడింది .
 • జీవ కారకం: నాడీ వ్యవస్థలో రసాయనాల అసమతుల్యత.
 • పర్యావరణ లేదా మానసిక కారకం: గాయం లేదా ఒత్తిడికి సంబంధించిన చరిత్ర, మద్యపాణం లేదా మత్తుపదార్థ దుర్వినియోగ చరిత్ర ఉన్నట్లయితే.
 • చెవిటి వ్యక్తులు సాధారణంగా భ్రాంతిపూరిత రుగ్మతలతో బాధపడుతుంటారు. దృష్టి లోపాలు కల్గినవారు లేదా ఇతర జబ్బులతో సామాజికంగా వేరుచేయబడినవారిలో మరియు వలసదారులలో కూడా భ్రాంతిపూరితమైన రుగ్మతలు ఎక్కువగా ఉంటాయి.

భ్రాంతి రుగ్మతను ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

ఇతర మానసిక రుగ్మతల మాదిరిగానే భ్రాంతి రుగ్మతకు కూడా నిర్దిష్ట నిర్ధారణా పద్ధతి అంటూ ఏదీ లేదు.

 • రోగ నిర్ధారణ కొరకు సరైన వైద్య చరిత్ర మరియు క్లినికల్ పరీక్షలు అవసరం.
 • రోగ నిర్ధారణ పరీక్షలో రేడియోగ్రాఫిక్ పరీక్షలతో పాటు నరాల పరీక్ష.
 • భ్రాంతి రుగ్మతలను గుర్తించడం మరియు అంచనా వేయడంలో ఎలక్ట్రోఎన్సెఫలోగ్రఫీ (Electroencephalography) చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

మానసిక రుగ్మతలకు ఔషధాలు మరియు మానసిక చికిత్సల కలయికతో కూడిన చికిత్స  అవసరం ఉంటుంది.

 • ఔషధాలు: ఆంటిసైకోటిక్స్, యాంటిడిప్రెసెంట్స్ మరియు ట్రాన్క్విలైజర్స్ (tranquilisers).
 • తీవ్రమైన కేసుల్లో రోగికి ఆసుపత్రి స్థిరీకరణ మరియు సంరక్షణ అవసరం కావచ్చు.

రోగి యొక్క అభిజ్ఞా మరియు ప్రవర్తనా చికిత్సతో వ్యక్తిగత మరియు కుటుంబ చికిత్స యొక్క మానసిక చికిత్స అనేది మానసిక చికిత్స.

వ్యక్తిగత చికిత్స ద్వారా వక్రీకృతమైన మరియు అవాస్తవ ఆలోచనా విధానాన్ని  సరిదిద్దడానికి సహాయపడుతుంది.

కుటుంబ చికిత్స- మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తితో మంచిగా వ్యవహరించడానికి కుటుంబానికిచ్చే చికిత్స పనిచేస్తుంది.

అభిజ్ఞ-ప్రవర్తనా చికిత్స అనేది ఒక వ్యక్తి ఆలోచన మరియు ప్రవర్తనా సరళిని సవరించడానికి లేదా మార్చడానికి  సహాయపడే మానసిక-సాంఘిక జోక్యం (psychosocial intervention).వనరులు

 1. Stein Opjordsmoen et al. Delusional Disorder as a Partial Psychosis. Schizophr Bull. 2014 Mar; 40(2): 244–247. PMID: 24421383
 2. Cleveland Clinic. [Internet]. Cleveland, Ohio. Delusional Disorder: Management and Treatment
 3. Alistair Munro. Delusional Disorder: Paranoia and Related Illnesses. Cambridge University Press, 1999. 261 pages
 4. National Health Service [Internet]. UK; Cognitive behavioural therapy (CBT)
 5. Chandra Kiran, Suprakash Chaudhury. Understanding delusions. Ind Psychiatry J. 2009 Jan-Jun; 18(1): 3–18. PMID: 21234155

భ్రాంతి రుగ్మత వైద్యులు

Dr. Hemanth Kumar Dr. Hemanth Kumar Neurology
3 वर्षों का अनुभव
Dr. Deepak Chandra Prakash Dr. Deepak Chandra Prakash Neurology
10 वर्षों का अनुभव
Dr Madan Mohan Gupta Dr Madan Mohan Gupta Neurology
7 वर्षों का अनुभव
Dr. Virender K Sheorain Dr. Virender K Sheorain Neurology
19 वर्षों का अनुभव
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

భ్రాంతి రుగ్మత కొరకు మందులు

భ్రాంతి రుగ్మత के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।