డెంగ్యూ (డెంగీ) జ్వరము - Dengue Fever in Telugu

Dr. Ajay Mohan (AIIMS)MBBS

February 06, 2019

September 11, 2020

డెంగ్యూ జ్వరము
డెంగ్యూ జ్వరము

సారాంశం

డెంగ్యూ అనునది దోమల ద్వారా వ్యాప్తిచెందే ఒక రకమైన వైరల్ ఇన్ఫెక్షన్. వ్యాధి రావడానికి నాలుగు రకాల వైరస్ లు కారణమవుతాయి మరియు డెంగ్యూ వ్యాధి అనునది వీటిలో ఒకదాని వలన వస్తుంది. ఒకసారి వ్యక్తి ఏదో రకమైన డెంగ్యూ వైరస్ వలన వ్యాధిని కలిగిఉంటే, ఆ ప్రత్యేక రకానికి జీవితకాల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దానితో పాటు వేరొక రకాలకు స్వల్పకాలిక (అధికముగా రెండు సంవత్సరాలు) పాక్షిక నిరోధము కలుగుతుంది, అయితే అన్ని నాలుగు జాతులు చివరకు ఒక వ్యక్తికి హాని చేస్తాయి.  అంటువ్యాధి సమయములో,  ఏదైనా ఒకటి లేక అన్ని రకాల డెంగ్యూ వైరస్ లు ప్రసరణలో ఉంటాయి.

డెంగ్యూ వైరస్ అనునది ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి ఆడ ఏడెస్ ఈజిప్ట్ దోమ వలన వ్యాపిస్తుంది.  వ్యాధిసోకిన వ్యక్తి యొక్క రక్తము త్రాగినప్పుడు, దోమ తాను కూడా ఈ వైరస్ ను పొందుకుంటుంది.   డెంగ్యూ వ్యాది క్రింద ఇవ్వబడిన లక్షణాలను కలిగిఉంటుంది, అవి హఠాత్తుగా అధిక-తీవ్రత జ్వరం, తీవ్రమైన తలనొప్పి, వికారం, కళ్ల వెనుకభాగములో నొప్పి, కీళ్లనొప్పి, అధికమైన అలసట, ఒళ్లు నొప్పులు, ఆకలి మందగించడం, మరియు చర్మము పై దద్దుర్లు అను లక్షణాలు. జ్వరం మరియు ఇతర లక్షణాలు సాధారణముగా ఒక వారంపాటు ఉంటాయి, దానికి సంబంధించిన బలహీనత మరియు ఆకలి మందగించడం అను లక్షణాలు కొన్ని వారాలపాటు నిలిచి ఉంటాయి.

డెంగ్యూ వ్యాధికి ప్రస్తుతానికి ఏ విధమైన యాంటివైరల్ చికిత్స అందుబాటులో లేదు.  మందులతో పాటు సహాయక సంరక్షణ ఉపయోగించడము వల్ల జ్వరమును తగ్గించవచ్చు, ద్రవాలను తీసుకోవడం, మరియు బెడ్ విశ్రాంతి అనునవి రికమెండ్ చేయగలిగినవి.  రక్తస్రావముతో కూడిన డెంగ్యూ జ్వరం అను సమస్యను కలిగి ఉండడం, ఒకవేళ దీనికి చికిత్స ఇవ్వకుండా వదిలేస్తే, ఇది దాదాపుగా డెంగ్యూ షాక్ సిండ్రోమ్ గా వృధ్ధి చెందుతుంది.

డెంగ్యూ (డెంగీ) జ్వరము యొక్క లక్షణాలు - Symptoms of Dengue in Telugu

ఒక వ్యక్తి జ్వరముతో బాధపడుచున్నాడంటే  సాధారణముగా ఆ వ్యాధి తీవ్రత ఉన్న ప్రాంతానికి అతడు అంతకు మునుపు వెళ్లి వచ్చి ఉండుట లేక అక్కడ ఉన్న వ్యక్తిని దర్శించి ఉండుట దానికి కారణం.  డెంగ్యూ వ్యాధి క్రింద సూచించబడిన గుర్తులు మరియు లక్షణాలను కలిగిఉంటుంది.

  • అనుకోకుండా హఠాత్తుగా అధిక జ్వరం (40°సె/ 104°ఫా), మరియు ఉష్ణోగ్రత అనునది నిరంతరాయముగా లేక తగ్గుతూ-పెరిగుతూ ఉంటుంది, నాలుగు లేక ఐదవ రోజున ఆగిపోతుంది మరియు తరువాత వెంటనే పైకి పెరుగుతుంది.  జ్వరం సాధారణముగా ఏడు నుండి ఎనిమిది రోజుల వరకు ఉంటుంది.
  • ఒక తీవ్రమైన తలనొప్పి.
  • వికారం మరియు వాంతులు ఏర్పడటం.
  • కీళ్లు, కండరాలు మరియు కళ్ల వెనుక వైపున నొప్పి.
  • బలహీనత.
  • రుచిలో మార్పు రావడం, మరియు ఆకలి తగ్గిపోవడం (ఆకలిమాంద్యం).
  • ఒక గొంతు నొప్పి.
  • గ్రంథులు మరియు శోషరస నోడ్స్ లలో వాపు.
  • దద్దుర్లు, మొదటి కొద్ది రోజులలో వెలిసివచ్చునట్లు ఉండే మచ్చల దద్ధుర్లతో పాటు ఆరంభములో చర్మము ఎర్రబాడటం వంటి లక్షణాలను కలిగిఉంటుంది.  మూడు నుండి ఐదు రోజులకు, పలుచని ఎర్రటి దద్దుర్లతో కూడిన చిన్నవైన బొడిపెలు ఒత్తిడి వలన పాలిపోయినట్లు కనిపించడం ప్రారంభిస్తాయి. అవి సాధారణముగా వీపుపై అభివృధ్ధి చెందుతాయి, ఇక్కడి నుండి మిగిలిన ప్రాంతాలకు విస్తరిస్తాయి.  అరచేతులు మరియు అరికాళ్లు మాత్రం విడిగా ఉంటాయి.  దద్ధుర్లు ఏర్పడడం అనునది సాధారణముగా శరీరము యొక్క ఉష్ణోగ్రత తరుగుదలతో సంబంధమును కలిగిఉంటుంది.  దద్దురు రేకులు లేక పొరలుగా ఏర్పడవచ్చు లేక చిన్న ఎరుపు మచ్చలుగా పుట్టుకొస్తాయి (రక్తస్రావం వలన), వీటిని పెటెచియ్ అని పిలుస్తారు.
  • తక్కువ రక్తస్రావ లక్షణాలు వీటిని కలిగిఉంటాయి రక్తం కారే చిగుళ్లుముక్కు నుండి రక్తము కారడం, అసాధారణముగా అధిక స్రావం మెన్సురేషన్ (బహిష్టు) సమయములో మరియు మూత్రములో రక్తము రావడం వంటి లక్షణాలు ఉంటాయి.

వ్యాధికారక దోమ వలన  వైరస్ ఒక వ్యక్తికి వ్యాపించిన తరువాత, లక్షణాలు రెండు నుండి ఏడు రోజుల వరకు నిలిచిఉంటాయి,  దాదాపుగా నాలుగు నుండి పది రోజుల పొదుగు కాలం తరువాత కూడా లక్షణాలు నిలిచిఉంటాయి.

తీవ్రమైన డెంగ్యూ అనునది తీవ్రమైన సమస్య, అది చాలా ప్రాణాంతకమైనది.  మొదటి లక్షణాలు సంభవించిన తరువాత మూడు నుండి ఏడు రోజులలో ఇవి సంభవిస్తాయి. శరీర ఉష్ణోగ్రతలో తగ్గుదలతో పాటు (38 °సె కంటే తక్కువ), హెచ్చరిక సంకేతాలు వీటిని కూడా కలిగిఉంటాయి:

  • క్రమముగా వాంతులు కావడం.
  • రక్తముతో తడిసిన వాంతులు.
  • వేగముగా లేక శ్వాస తీసుకోవడములో ఇబ్బంది (శ్వాసకోశ ఇబ్బంది).
  • చిగుళ్ల నుండి రక్తం కారడం.
  • తీవ్రమైన కడుపు నొప్పి.
  • అలసట.
  • విశ్రాంతి లేకపోవడం.
  • డెంగ్యూ షాక్ సిండ్రోమ్, ఇది డెంగ్యూ జ్వరము యొక్క తీవ్రమైన సమస్య. ఒక వ్యక్తి ఇంతకుమునుపే డెంగ్యూ వైరస్ ద్వారా వ్యాధిని కలిగిఉండి, మరలా వేరొక డెంగ్యూ వైరస్ ద్వారా మరొక ఇన్ఫెక్షన్ ను పొందుకోవడము ఫలితముగా ఏర్పడుతుంది. అనేక-అవయవాల వైఫల్య ఫలితముతో పాటు డెంగ్యూ షాక్ సిండ్రోమ్ యొక్క అభివృధ్ధి ప్రాణాంతకమని నిరూపించబడింది.

రికవరీ సమయము చాలా కాలం పాటు ఉంటుంది మరియు దీనికి రెండు వారాల వరకు సమయం కూడా అవసరమవుతుంది.  లక్షణాలు తగ్గిపోయిన తరువాత కూడా, వ్యక్తి అలసట మరియు బడలికను చాలాకాలం పాటు అనుభవిస్తాడు.  

డెంగ్యూ (డెంగీ) జ్వరము యొక్క చికిత్స - Treatment of Dengue in Telugu

ఈ రోజు వరకు ఏ విధమైన ప్రత్యేక యాంటివైరల్ చికిత్స అనునది లేదు. వ్యాధి అనునది సాధారణముగా స్వీయ-పరిమితి కలిగి ఉంటుంది, అనగా, కొంత కాలము గడిచిన తరువాత అది తనంతట తానుగా పరిష్కారమవుతుంది.  అయితే, లక్షణాల తీవ్రతను తగ్గించడానికి నియంత్రించడానికి స్వీయ-జాగ్రత్త మరియు జీవనశైలిలో మార్పులు అనునవి అవసరమవుతాయి.

స్థానికముగా డెంగ్యూ వ్యాధి ఉన్న ప్రాంతాలనుండి మీరు తిరిగి వచ్చిన రెండు వారాల లోపల ఒకవేళ మీరు జ్వరమును కలిగి ఉంటే లేక ఫ్లూ-వంటి లక్షణాలను కలిగి ఉంటే మీ డాక్టరును సంప్రదించాలి.  అదేవిధముగా, డెంగ్యూ కామన్ గా ఉండే ప్రాంతాలలో మీరు నివాసముండి, ఒకవేళ మీరు అటువంటి లక్షణాలను కలిగి ఉంటే మీ డాక్టరును సంప్రదించాలి.

జ్వరమును తగ్గించడానికి తగినంత హైడ్రేషన్ తో పాటు మదులతో కూడిన సపోర్టివ్ జాగ్రత్తను తీసుకోవాలి మరియు బెడ్ విశ్రాంతి కూడా రికమెండ్ చేయబడుతుంది.  జ్వరమును తగ్గించడానికి ఎసిటామైనోఫెన్ కూడా ఉపయోగిస్తారు.  డెంగ్యూ వ్యాధి ఉన్న సమయములో, డాక్టర్ ను సంప్రదించకుండా పెయిన్ కిల్లర్స్ (అనగా ఆస్పిరిన్) మరియు కార్టికోస్టెరాయిడ్స్ వంటి మందులను తీసుకొనకూడదు.  చర్మము యొక్క దద్దుర్ల నుండి ఉపశమనము కొరకు, క్యాలమైన్ లోషన్ ను అప్లై చేయాలి.  ఉపశమనము తరువాత మెరుగుపడిన వారిని అవుట్ పేషెంట్ సెట్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తారు.

ఒకవేళ అవసరమైతే హాస్పిటల్ లో చేరవలసి ఉంటుంది:

  • నిరంతరముగా (ఆగకుండా) వాంతులు కావడం.
  • వాంతిలో రక్తం రావడం.
  •  డీహైడ్రేషన్ యొక్క గుర్తులు.
  • వేగముగా ఊపిరితీసుకోవడం (శ్వాసకోశ ఇబ్బంది).
  • చిగుళ్ల నుండి రక్తము కారడం.
  • పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి.
  • తీవ్రమైన అలసట మరియు విశ్రాంతి లేకపోవడం.

జీవనశైలి నిర్వహణ

డెంగ్యూ జ్వరమును కలిగి వ్యక్తులు, ఆ వ్యాధి నుండి వేగముగా కోలుకోవడము కొరకు వారి యొక్క జీవన శైలిలో కొన్ని మార్పులను చేసుకోవాలి.  ఆ మార్పులు:

  • ఒకవేళ వ్యక్తి ద్రవాలను నోటి ద్వారా తీసుకునే సామర్థ్యము కలిగియుంటే ఓఆర్ఎస్ (ORS) (ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణము) ను త్రాగాలి.
  • పండ్ల రసాలను త్రాగడం.
  • తగినంత విశ్రాంతి తీసుకోవడం.
  • అలసట మరియు బలహీనతను కలిగించే భౌతిక కార్యకలాపాలను దూరముగా ఉంచాలి.  
  • వేరొక రకమైన డెంగ్యూ వైరస్ ల ద్వారా పొందిన సెకండరీ ఇన్ఫెక్షన్ ను తగ్గించడానికి కీటక చికిత్స దోమల వలలు ఉపయోగించాలి.
  • దోమ నిరోధకాలను మరియు కీటక నాశనశనములను లోపల మరియు అదేవిధముగా బయట ఉపయోగించాలి.
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Energy & Power Capsule by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for problems like physical and sexual weakness and fatigue, with good results.
Power Capsule For Men
₹719  ₹799  10% OFF
BUY NOW


వనరులు

  1. World Health Organization [Internet]. Geneva (SUI): World Health Organization; Dengue control.
  2. Center for Disease Control and Prevention [Internet], Atlanta (GA): US Department of Health and Human Services; Dengue and Dengue Hemorrhagic Fever .
  3. Malavige GN, Fernando S, Fernando DJ, Seneviratne SL. Dengue viral infections. Postgrad Med J. 2004 Oct;80(948):588-601. PMID: 15466994
  4. Stephenson JR. Understanding dengue pathogenesis: implications for vaccine design. Bull World Health Organ. 2005 Apr;83(4):308-14. Epub 2005 Apr 25. PMID: 15868023.
  5. Brian Walker Nicki R Colledge Stuart Ralston Ian Penman. Davidson's Principles and Practice of Medicine E-Book. 22nd Edition Churchill Livingstone; Elsevier: 1st February 2014. page 322.
  6. World Health Organization [Internet]. Geneva (SUI): World Health Organization; Dengue and severe dengue.
  7. World Health Organization [Internet]. Geneva (SUI): World Health Organization; Control strategies.
  8. Hang VT, Nguyet NM, Trung DT, Tricou V, Yoksan S, Dung NM, Van Ngoc T, Hien TT, Farrar J, Wills B, Simmons CP. [Link]. PLoS Negl Trop Dis. 2009;3(1):e360. doi: 10.1371/journal.pntd.0000360. Epub 2009 Jan 20. PMID: 19156192.

డెంగ్యూ (డెంగీ) జ్వరము వైద్యులు

Dr Rahul Gam Dr Rahul Gam Infectious Disease
8 Years of Experience
Dr. Arun R Dr. Arun R Infectious Disease
5 Years of Experience
Dr. Neha Gupta Dr. Neha Gupta Infectious Disease
16 Years of Experience
Dr. Anupama Kumar Dr. Anupama Kumar Infectious Disease
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

డెంగ్యూ (డెంగీ) జ్వరము కొరకు మందులు

Medicines listed below are available for డెంగ్యూ (డెంగీ) జ్వరము. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.