ముక్కు పొడిబారడం - Dry Nose in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

December 01, 2018

March 06, 2020

ముక్కు పొడిబారడం
ముక్కు పొడిబారడం

ముక్కు పొడిబారడం అంటే ఏమిటి?

వివిధ విదేశీ అణువులు (శరీరంతో సంబంధంలేని బాహ్య పదార్థాలు) నాసికా మార్గాల ద్వారా మానవ శరీరం లోకి ప్రవేశిస్తాయి, తద్వారా ముక్కులో తేమ తగ్గిపోయి, పొడిగా తయారవుతుంది, దీన్నే “ముక్కు పొడిబారడం” అంటారు. ఈ పరిస్థితినెదుర్కొనే వ్యక్తి చాలా అసౌకర్యంగా బాధపడతారు. ఈ పరిస్థితి ఇతర సమస్యలకు దారి తీస్తుంది.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

సంకేతాలు మరియు లక్షణాలు:

 • ముక్కు లోపలి భాగంలో పగుళ్లు లేక చీలికలు మరియు గాయాలు
 • నాసికామార్గంలో చికాకు లేక మంట
 • నాసికా రంధ్రంలో తీవ్రమైన దురద
 • నోరు, గొంతు పొడిబారి ఎండిపోయినట్లు తయారవడం.
 • అరుదుగా, ముక్కువాపు, ముక్కులో రక్తస్రావం
 • కొన్నిసార్లు, ఇది నాసికామార్గాల్లో అడ్డంకులేర్పడ్డానికి కారణమవుతుంది.

దీనికి ప్రధాన కారణాలు ఏమిటి?

పొడి ముక్కు పరిస్థితికి ప్రధాన కారణాలు క్రింది విధంగా ఉన్నాయి:

 • తక్కువ తేమ
 • పర్యావరణ కారకాలు

కింద పేర్కొన్నటువంటి కొన్నిమందుల యొక్క దుష్ప్రభావాలు (సైడ్ ఎఫెక్ట్స్):

 • రక్తాధిక్యం తగ్గించే మందులు (decongestants)
 • అలెర్జీకి కారణమైన హిస్ట మైన్లను నిరోధించే ఔషదాలు (Anti-histamines)
 • ప్రతిరక్షా నిరోధకాలు (Immunosuppressants)
 • మద్యపానం మరియు మాదకద్రవ్యాల వినియోగం
 • శరీరం లో హార్మోన్ల మార్పులు (రుతుక్రమం ఆగిన స్త్రీలు)
 • ముక్కులో మంటపెట్టే వ్యాధి (Rhinitis)
 • అధిక రక్త పోటు

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

ప్రారంభంలో, బాహ్య మరియు అంతర్గత ముక్కు యొక్క సంపూర్ణ భౌతిక పరీక్ష తరువాత ఒక వివరణాత్మక చరిత్ర, వ్యాధి సంకేతాలు మరియు లక్షణాల గురించిన వివరాల్ని వైద్యునిచే తీసుకోబడుతుంది. రోగి ఆరోగ్య చరిత్ర ఆధారంగా, వ్యక్తి యొక్క వయస్సు మరియు శారీరక పరీక్షల యొక్క అన్వేషణల్ని బట్టి వైద్యుడు ఈ క్రిందివాటిని చేయించమని సలహాలిస్తారు:

 • నాసికా కుహరం మరియు లలాట కోటరములు (paranasal sinuses) యొక్క కంప్యూటెడ్ టోమోగ్రఫీ (CT) తో పాటు ఎండోస్కోపీ మరియు నాసోఫారినాక్స్
 • వివిధ రక్త పరీక్షలు, అలెర్జీ పరీక్ష, మరియు మైక్రోబయోలాజికల్ స్వాబ్స్ వంటి ప్రయోగశాల పరిశోధనలు

చికిత్సా పద్ధతులు ఇలా ఉంటాయి

 • ముందస్తు కారకాలు తొలగించబడాలి.
 • తేమ: ఒక శుభ్రమైన తేమ లేదా ఆవిరి కారకం (cleaned humidifier or vaporizer) సహాయంతో, పొడిని తగ్గించి, పర్యావరణానికి తేమను జోడించవచ్చు.
 • ఉపరితలం పొరల్ని (క్రస్ట్లను) తొలగించడం.
 • గాయం కారకాల్ని వాడకూడదు మరియు సరైన శ్లేష్మ రక్షణ తీసుకోవాలి.
 • నోటిద్వారా కడుపుకు పుచ్చుకునే సూక్ష్మజీవనాశక మందులు లేదా స్థానిక సూక్ష్మజీవనాశక మందుల (యాంటీబయాటిక్స్) తో ఇన్ఫెక్షన్లకు చికిత్స .
 • ముక్కులోని “ఇంఫీరియర్ మరియు మిడిల్ టర్బినేట్” లను తొలగించేందుకు ను శస్త్రచికిత్సను ఉపయోగించకండి ఎందుకంటే ఈ  శస్త్రచికిత్స ముక్కు పొడిబారడానికి కారణమవుతుంది.వనరులు

 1. Hildenbrand T, Weber RK, Brehmer D. Rhinitis sicca, dry nose and atrophic rhinitis: a review of the literature. Eur Arch Otorhinolaryngol. 2011 Jan;268(1):17-26. PMID: 20878413.
 2. Sjogren's Syndrome Foundation. Simple Solutions for Dry Nose and Sinuses . Reston, Virginia. [internet].
 3. American Academy of Otolaryngology. Nosebleeds. Head and Neck Surgery Foundation; Alexandria, Virginia. [internet].
 4. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Stuffy or runny nose - adult
 5. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Nosebleed