ఫుడ్ అలెర్జీలు - Food Allergies in Telugu

Dr. Rajalakshmi VK (AIIMS)MBBS

December 06, 2018

March 06, 2020

ఫుడ్ అలెర్జీలు
ఫుడ్ అలెర్జీలు

ఫుడ్ అలెర్జీలు అంటే ఏమిటి?

శరీరం యొక్క సహజ రక్షణ చర్యలు (natural defences) ఒక ప్రత్యేకమైన ఆహార పదార్థానికి గురైనప్పుడు/బహిర్గతం అయినప్పుడు, శరీరం అధికంగా ప్రతిస్పందించి యాంటీబాడీలు (antibodies) మరియు ఇతర పదార్ధాలను విడుదల చేస్తుంది, అప్పడు ఫుడ్ అలెర్జీ ఏర్పడుతుంది. ఫుడ్ అలెర్జీ ప్రతిచర్యలు వేగంగా వ్యాప్తి  చెందుతాయి మరియు వాటికి త్వరగా చికిత్స చేయకపోతే తీవ్ర అనారోగ్యానికి లేదా మరణానికి కూడా దారితీయవచ్చు.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

సాధారణంగా, ఫుడ్ అలెర్జీ యొక్క లక్షణాలు అలెర్జీ కలిగించే  ఆహరం తిన్న వెంటనే మొదలవుతాయి.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

కేవలం కొన్ని రకాలైన ఆహారాలు మాత్రమే 90% ఫుడ్ అలెర్జీలకు కారణమవుతున్నాయి, అవి వీటిని కలిగి ఉంటాయి

ఫుడ్ అలెర్జీకి ప్రమాద కారకాలు :

 • జన్యు సిద్ధత (జన్యుపరంగా సంక్రమించడం)
 • జీవనశైలి మార్పులు, ఆహారం మరియు పరిశుభ్రత వంటి పరిసరసంబంధి కారకాలు
 • తల్లపాలకు ప్రత్యామ్నాయంగా  సూత్రీకరించిన పాల (formula milk) ను  ఉపయోగించడం
 • తయారుగా ఉన్న ఆహార పదార్దాల (canned food items) వినియోగం

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

ఆరోగ్య చరిత్ర మరియు లక్షణాలు చాలా వరకు ఫుడ్ అలెర్జీని నిర్దారించడంలో సహాయం చేస్తాయి. లక్షణాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చని గమనించడం ముఖ్యం.

 • పరిశోధనలు (నిర్దారణ చర్యలు)
  • అలెర్జీని గుర్తించడానికి స్కిన్ ప్రిక్ టెస్ట్ (Skin prick test)
  • ఒక నిర్దిష్ట ఆహార పదార్థానికి వ్యతిరేకంగా విదులయ్యే ఇమ్యూనోగ్లోబులిన్ E (Ig E) యాంటీబాడీని కొలిచే రక్త పరీక్షలు
 • నివారణ
  • అలెర్జీకి  చికిత్స అనేది నిర్దిష్ట అలెర్జీ కారక ఆహారాన్ని తీసుకోవడం నివారించడం. అలెర్జీ కారక  ఆహారాన్ని రెండవసారి తీసుకున్న సందర్భంలో అనాఫిలాక్టిక్ ప్రతిచర్యల అవకాశాన్ని గురించి వారిని హెచ్చరించాలి
  • అలెర్జీలను నివారించడానికి ఆహార పదార్ధాలలో  అలెర్జీకి కారణమయ్యే పదార్ధం యొక్క ఉనికి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం
 • తీవ్ర అలెర్జీ ప్రతిచర్యల యొక్క నిర్వహణ
  • యాంటిహిస్టామైన్లు (Antihistamines) తేలికపాటి నుండి మధ్యస్త అలెర్జీ ప్రతిచర్యలకు సూచించబడతాయి
  • ప్రాణాంతక అనాఫిలాక్టిక్ ప్రతిచర్యల విషయంలో, ఎపినేఫ్రైన్ (అడ్రినలిన్) {epinephrine (adrenaline)} ఇంజెక్షన్ అవసరం. అదనంగా, లక్షణాల పై ఆధారపడి ఆక్సిజన్ సరఫరా మరియు ద్రవాలను ఎక్కించడం కూడా చెయ్యాలి.వనరులు

 1. American College of Allergy, Asthma & Immunology. Food Allergy. Illinois, United States. [internet].
 2. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Food allergy and intolerance
 3. Zukiewicz-Sobczak WA, Wróblewska P, Adamczuk P, Kopczyński P. Causes, symptoms and prevention of food allergy. Postepy Dermatol Alergol. 2013 Apr;30(2):113-6. PMID: 24278058
 4. U.S food and drug administration. What You Need to Know about Food Allergies. US. [internet].
 5. U.S food and drug administration. Food Allergens. US. [internet].

ఫుడ్ అలెర్జీలు వైద్యులు

Dr. Abhas Kumar Dr. Abhas Kumar Allergy and Immunology
10 वर्षों का अनुभव
Dr. Hemant C Patel Dr. Hemant C Patel Allergy and Immunology
32 वर्षों का अनुभव
Dr. Lalit Pandey Dr. Lalit Pandey Allergy and Immunology
7 वर्षों का अनुभव
Dr. Shweta Jindal Dr. Shweta Jindal Allergy and Immunology
11 वर्षों का अनुभव
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు