గొంతు మీద కంతి పెరుగుదల (గాయిటర్) - Goiter in Telugu

Dr. Anurag Shahi (AIIMS)MBBS,MD

December 28, 2018

October 29, 2020

గొంతు మీద కంతి పెరుగుదల
గొంతు మీద కంతి పెరుగుదల

గొంతు మీద కంతి (గాయిటర్) అంటే ఏమిటి?

“అయోడిన్ లోపం”గా కూడా పిలువబడే “గొంతు మీద కంతి” రుగ్మతలో థైరాయిడ్ గ్రంధి అసాధారణంగా పెరిగి “గొంతు మీద కంతి”గా తయారవుతుంది. అయోడిన్ యొక్క లోపం గొంతుమీద కంతి పెరగడానికి ముఖ్య కారణం. అయోడిన్ లేకపోవడం వలన, థైరాయిడ్ గ్రంధి హార్మోన్ థైరోక్సిన్ను తయారు చేయలేక పోతుంది, ఇది థైరాయిడ్ ప్రేరేపక హార్మోన్ (థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్-TSH) స్థాయిని పెంచుతుంది, దీని వలన థైరాయిడ్ గ్రంథి యొక్క వాపు ఏర్పడి “గొంతు మీద కంతి” (లేక గైట్రే) గా తయారవుతుంది..

గొంతు మీద కంతి రెండు రకాలుగా సంభవిస్తుంది, అవి,

  • గొంతు మీద విస్తారంగా వచ్చే కంతి: మొత్తం థైరాయిడ్ గ్రంధికి కంతి విస్తరించబడి ఉంటుంది.
  • నాడ్యులర్ గైట్రే: థైరాయిడ్ గ్రంధి యొక్క కొన్ని విభాగాలు లేదా బుడిపెలు (నూడిల్స్) మాత్రమే విస్తరించబడి ఉంటాయి..

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

గొంతు మీద కంతి యొక్క వ్యాధి లక్షణాలు వైవిధ్యంగా ఉంటాయి, ఇవి ఎక్కువగా రుగ్మతకు కారణమయ్యే కారకాల మీద ఆధారపడి ఉంటాయి.

  • గొంతు మీద కంతి యొక్క అత్యంత సాధారణ లక్షణం:
    • మెడ యొక్క మూలం వద్ద వాపు.
  • ఇతర లక్షణాలు:
    • గొంతులో పెడసరం (tightness)
    • బొంగురు గొంతు  
    • దగ్గు.
    • అన్నవాహిక (ఎసోఫాగస్ లేదా ఫుడ్ పైప్పై) పై విస్తరించిన థైరాయిడ్ గ్రంధి ఒత్తిడి కల్గించినపుడు తొందర ఏర్పడి మింగడంలో కష్టం కల్గుతుంది.
    • వాయు నాళము (wind pipe) పై ఒత్తిడి వలన శ్వాసతీసుకోవడంలో  కష్టపడటం.
  • హైపర్ థైరాయిడిజంతో సంబంధం కలిగి ఉన్న లక్షణాలు :
    • వేడికి అసహనం.
    • బరువు నష్టం.
    • పెరిగిన ఆకలి.
  • థైరాయిడ్‌ గ్రంథి మాంద్యం (హైపో థైరాయిడిజం)తో సంబంధం ఉన్న లక్షణాలు:
    • బరువు పెరుగుట.
    • చల్లని పదార్థాలకు అసహనం కల్గి ఉండడం.
    • మలబద్దకం.
    • చర్మం యొక్క పొడిదనం
    • అలసట.

ప్రధాన కారణాలు ఏమిటి?

గొంతుమీద కంతి యొక్క అత్యంత సాధారణ కారణాలలో ఒకటి అయోడిన్ లోపం.

ఆహార పదార్థాలసేవనంలో తక్కువైపోయిన అయోడిన్ కారణంగా, క్యాబేజీ, కాలీఫ్లవర్, మరియు బ్రోకలీ వంటి వాటి ఫలితంగా కూడా శరీరంలో అయోడిన్ తగ్గిపోవడం, సంభవించవచ్చు .

  • ఇతర కారణాలు:
    • థైరాయిడ్ గ్రంధుల మాంద్యం (హైపర్ థైరాయిడిజం) - అధిక థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు.
    • థైరాయిడ్ గ్రంధుల మాంద్యం (హైపోథైరాయిడిజం) - థైరాయిడ్ హార్మోన్ యొక్క తక్కువ స్థాయిలు.
    • గ్రేవ్స్ వ్యాధి - థైరాయిడ్ కణాల ద్వారా పెరిగిన థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి.
    • హషిమోటో వ్యాధి - రోగనిరోధక వ్యవస్థ అసాధారణతల వల్ల థైరాయిడ్ గ్రంధి దెబ్బతింది.
    • థైరాయిడ్ క్యాన్సర్
    • లిథియం మరియు పినిల్బోటోజోన్ వంటి కొన్ని మందులు కూడా గొంతు మీద కంతి  రావడానికి (గాయిటర్) దారి తీయవచ్చు.

ఈ రుగ్మత ఎలా నిర్ధారణ చేయబడుతుంది మరియు దీనికి చికిత్స ఏమిటి?

గొంతు మీద కంతి యొక్క నిర్ధారణలో ఓ భౌతిక పరీక్ష మరియు కొన్ని పరిశోధనలు సహాయపడతాయి.

ఈ రుగ్మతకు నిర్వహించే వైద్య పరిశోధనలు ఇలా ఉన్నాయి:

  • థైరాయిడ్ హార్మోన్ స్థాయిలను కొలిచే రక్త పరీక్షలు.
  • హషిమోటో మరియు గ్రేవ్స్ వ్యాధి విషయంలో ప్రతిరక్షకాలను గుర్తించడానికి రక్త పరీక్షలు.
  • అల్ట్రాసౌండ్ స్కాన్.
  • అయస్కాంత ప్రతిధ్వని ఇమేజింగ్ (MRI) లేదా కంప్యూటెడ్ టోమోగ్రఫీ (CT) స్కాన్.
  • బయాప్సి.
  • థైరాయిడ్ చర్యను అంచనా వేయడానికి హార్మోన్ పరీక్షలు.

గొంతు మీద కంతి రుగ్మతకు చికిత్స వ్యాధి కారణం, లక్షణాలు మరియు కంతి యొక్క పరిమాణంపై ఆధారపడి ఉంటుంది.

  • సాధారణ థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు కలిగిన కొద్దిగా తేలికైన థైరాయిడ్ గ్రంథిని  పరిశీలనలో ఉంచబడుతుంది.
  • మీ డాక్టర్ అసాధారణ థైరాయిడ్ చర్యలకు మందులు సూచించవచ్చు.
  • అవసరమైన అయోడిన్ స్థాయిలను నిర్వహించడం కోసం అయోడిన్ సప్లిమెంట్లను ఇవ్వవచ్చు.
  • హార్మోన్ థైరాక్సిన్ ను అతిగా ఉత్పత్తి చేసే థైరాయిడ్ సమస్యకుగాను  మీ వైద్యుడు రేడియోఆక్టివ్ థైరాయిడ్ థెరపీని మౌఖికంగా తీసుకోవాలని సిఫార్సు చేస్తాడు.
  • క్యాన్సర్ విషయంలో లేదా చాలా పెద్దగా ఉండే గొంతు మీద కంతి చికిత్సకు  రేడియో ఆక్టివ్ థైరాయిడ్ చికిత్సతో బాటుగా శస్త్రచికిత్స అవసరమవుతుంది.



వనరులు

  1. National Health Portal [Internet] India; Goitre
  2. Medeiros-Neto G. Multinodular Goiter. [Updated 2016 Sep 26]. In: Feingold KR, Anawalt B, Boyce A, et al., editors. Endotext [Internet]. South Dartmouth (MA): MDText.com, Inc.; 2000-.
  3. Sarah Muirhead. Diagnostic approach to goitre in children. Paediatr Child Health. 2001 Apr; 6(4): 195–199. PMID: 20084235
  4. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Simple goiter
  5. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Toxic nodular goiter

గొంతు మీద కంతి పెరుగుదల (గాయిటర్) వైద్యులు

Dr. Narayanan N K Dr. Narayanan N K Endocrinology
16 Years of Experience
Dr. Tanmay Bharani Dr. Tanmay Bharani Endocrinology
15 Years of Experience
Dr. Sunil Kumar Mishra Dr. Sunil Kumar Mishra Endocrinology
23 Years of Experience
Dr. Parjeet Kaur Dr. Parjeet Kaur Endocrinology
19 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

గొంతు మీద కంతి పెరుగుదల (గాయిటర్) కొరకు మందులు

Medicines listed below are available for గొంతు మీద కంతి పెరుగుదల (గాయిటర్). Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.