బ్రోకలీ క్యాబేజీ కుటుంబానికి చెందిన ఒక మొక్క, దీని అద్భుతమైన ప్రయోజనాల దృష్ట్యా పూవురూపంలో ఉన్న ఈ కూరగాయ విస్తృతంగా ప్రశంసించబడింది. ఇది వివిధ రకాలైన పోషకాలు, ఖనిజాలు, మరియు విటమిన్ల యొక్క గొప్ప మూలం. ఆరోగ్యకరమైన ఆహారం కోసం బ్రోకలీని మనం తీసుకునే ఆహారంలో ఓ భాగంగా చేసుకొమ్మని పౌష్టికాహార నిపుణులు సిఫారసు చేస్తారు. బ్రోకలీ ఆకుపచ్చ రంగులో పెద్ద పెద్ద పువ్వు తలల్ని కల్గి ఉంటుంది. దీని నిర్మాణం ఎలా  ఉంటుందంటే ఒక దట్టమైన కొమ్మ నుండి ఓ చెట్టును పోలి, పూవుతో కూడిన తలను కల్గి ఉంటుంది, మరి దీన్ని మనం తినొచ్చు. పెద్ద పెద్ద బ్రోకలీ పూల తలల చుట్టూ ఆకులుంటాయి.

ఈ మొక్క బ్రస్సికా కుటుంబానికి చెందిన వృక్ష సమూహంలో చేర్చబడింది. కల్టివర్స్ గా పిలువబడే ఇవి సంప్రదాయిక మొక్కల సంతానోత్పత్తి ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేయబడే మొక్కల రకాలు. సహజంగా సంభవించే మొక్కల సముదాయం నుండి ఈ మొక్కలను ఎంపిక చేస్తారు, అప్పుడు అవి కావలసిన లక్షణాల సమూహాన్ని ఉత్పత్తి చేయగలవు లేదా వాటిని అప్పటికే ఉన్న లక్షణాలను పెంచుతాయి. బ్రోకలీకి కోసుపువ్వు (కాలీఫ్లవర్కు) కీ అద్భుతమైన పోలిక ఉంది, కోసుపువ్వు  కూడా అదే జాతులకు చెందిన మరో వృక్ష సమూహపు (కూరగాయ) మొక్క.

రోమన్ సామ్రాజ్యం కాలంనాటి నుండి బ్రోకలీ విలువైన ఆహార పదార్థంగా పరిగణించబడింది. బ్రోకలీ మొక్క ఉనికి క్రీస్తుకు పూర్వం 6 వ శతాబ్దం నుండి ఉన్నట్లు తెలుస్తోంది మరియు మధ్యధరా ప్రాంతాలలో ప్రస్తుత బ్రాసాకా పంటల్ని జాగ్రత్తగా పెంచిన ఫలితంగా ఉత్పత్తి చేయబడిందని చెప్పబడుతోంది. 'బ్రోకలీ' అనే పదాన్ని 'బ్రోక్కోలో' అనే పదం నుండి తీసుకోబడింది, ఇది 'క్యాబేజీ పుష్పం' అని సూచిస్తుంది.

బ్రోకలీ గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు

 • వృక్షశాస్త్రం (బొటానికల్) పేరు: బ్రాసియా ఒలెరాసియా వర్. ఇటాలికా (Brassica oleracea var. Italica)
 • సాధారణ పేరు: బ్రోకలీ
 • ఉపయోగించే భాగాలు: పువ్వులు, ఆకులు, తొడిమ, కాడలు
 • స్థానిక ప్రాంతాలు మరియు భౌగోళిక విస్తీర్ణం: ప్రపంచంలోని మధ్యధరా ప్రాంతాలు. ఎక్కువగా మితమైన మరియు ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో బ్రోకలీని సాగు చేస్తారు.
 1. బ్రోకలీ గురించిన పోషక వాస్తవాలు - Nutritional facts about broccoli in Telugu
 2. బ్రోకలీ దేనికి మంచిది? - What is broccoli good for in Telugu
 3. బ్రోకలీ రకాలు - Types of broccoli in Telugu
 4. ఆరోగ్యకరమైన మరియు సులభంగా చేసుకోగల బ్రోకలీ వంటకం - Healthy and simple broccoli recipe in Telugu
 5. బ్రోకలీ యొక్క దుష్ప్రభావాలు - Side effects of broccoli in Telugu

బ్రోకలీ పోషకాలు, ఖనిజాలు మరియు విటమిన్లకు నిలయం. 100 గ్రాముల ముడి బ్రోకలీలో ఉండే  పోషక విలువలు క్రింద పేర్కొనబడ్డాయి.

బ్రోకలీ పోషకాలు

100 g లకు విలువ

శక్తి

34 గ్రా

నీరు

89.30 గ్రా

పిండిపదార్థాలు (కార్బోహైడ్రేట్లు)

6.64 గ్రా

ప్రోటీన్లను

2.82 గ్రా

చక్కెర

1.7 గ్రా

ఆహార పీచు పదార్థం (ఫైబర్)

2.6 గ్రా

మొత్తం లిపిడ్లు

0.37 గ్రా

విటమిన్లు

 

విటమిన్ ఎ

31 ug

విటమిన్ B1

0.071 mg

విటమిన్ B2

0.117 mg

విటమిన్ B3

0.639 mg

విటమిన్ B6

0.175 mg

విటమిన్ B9

63 ug

విటమిన్ సి

89.2 mg

విటమిన్ ఇ

0.78 mg

విటమిన్ కె 

101.6 mg

మినరల్స్

 

పొటాషియం

316 mg

కాల్షియం

47 mg

ఫాస్ఫరస్  

66  mg

సోడియం

33  mg

మెగ్నీషియం

21  mg

ఐరన్

0.73  mg

జింక్

0.41  mg

కొవ్వు ఆమ్లాలు (లిపిడ్లు)

 

మొత్తం సంతృప్తకొవ్వులు

0.114  గ్రా

మొత్తం మోనోఅన్ స్యాచురేటెడ్ కొవ్వులు

0.031  గ్రా

మొత్తం బహుళఅసంతృప్త కొవ్వులు

0.112  గ్రా

(మరింత చదువు: విటమిన్ బి ఆహారాలు)

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Madhurodh Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for diabetes with good results.
Sugar Tablet
₹899  ₹999  10% OFF
BUY NOW

బ్రోకలీ యొక్క సాధారణ నిత్యసేవనంవల్ల గల ఆరోగ్య ప్రయోజనాలు భారీగా ఉంటాయి. బ్రోకలీలో మనకవసరమైన చాలా ఆహార పదార్ధాలు సమృద్ధిగా వుండటంవల్ల ఇది అందరికీ ఎంతో అభిమానమైన ఆహారవస్తువుగా మారింది. బ్రోకలీ యొక్క ప్రయోజనాలు క్రింద చర్చించబడ్డాయి. 

 • జీర్ణక్రియకు: బ్రోకలీలో అధికం మొత్తంలో ఫైబర్ ఉంటుంది,ఇది జీర్ణ క్రియకు ఉపయోగపడుతుంది. బ్రోకలీలో ఉండే ‘కాఎమ్పెఫొరోల్’  కడుపులో లోపలి పొరలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మలబద్దకం ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్ వంటి రుగ్మతలను ఇది నివారిస్తుంది.   
 • కేలేయం కోసం: బ్రోకలీ కాలేయ జీవక్రియను (మెటబాలిజం) నియంత్రిస్తుంది. పరిశోధనల ప్రకారం బ్రకోలి కాలేయంలో ట్రైగ్లిసెరైడ్ స్థాయిలను తగ్గించి వాటితో ముడి పడి ఉండే నాన్ అల్కోహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుందని తెలిసింది.     
 • యాంటీయాక్సిడెంట్గా: బ్రోకలీలో అధిక మొత్తంలో యాంటీయాక్సిడెంట్లు ఉంటాయి అవి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. బ్రోకలీలో యాంటీయాక్సిడెంట్ లక్షణాలు కలిగిన ఫినాలిక్ సమ్మేళనాలు ఉన్నట్లు పరిశోధనలలో తేలింది.     
 • మెదడుకు: బ్రోకలీకి  న్యూరో ప్రొటెక్టీవ్ (మెదడును రక్షించే) చర్యలు ఉన్నట్లు గుర్తించబడింది. మెదడు సమస్యలకు ముఖ్యకారణం ఆక్సీకరణ ఒత్తిడి బ్రోకలీలో  ఉండే యాంటీయాక్సిడెంట్ చర్యలు ఈ ఒత్తిడిని తగ్గించి మెదడు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.      
 • చెక్కెర వ్యాధికి: టైపు 2 మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులకు వారి ఆహారంలో బ్రోకలీ చేర్చడం వలన వారిలో ఇన్సులిన్ నిరోధకత పెరిగిందని అలాగే ఆక్సీకరణ ఒత్తిడి కూడా తగ్గిందని ఒక పరిశోధనలో తెలిసింది.   
 • చర్మం మరియు జుట్టు కోసం: బ్రోకలీలో ఉండే విటమిన్ సి ఆరోగ్యకరమైన చర్మానికి సహాయపడుతుంది. ఇది స్కర్వి వంటి వ్యాధుల నియంత్రణకు సహాయపడుతుంది. అలాగే అల్ట్రా వయొలెట్ కిరణాల వలన కలిగే చర్మ నష్టాన్ని కూడా తగ్గిస్తుంది.బ్రోకలీలో విటమిన్ ఎ కూడా ఉంటుంది. విటమిన్ సి మరియు విటమిన్ ఎ జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి మరియు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.  
 • కొలెస్ట్రాల్ కోసం: బ్రోకలీ తీసుకోవడం వలన చెడు కొలెస్ట్రాల్గా పిలవబడే తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ల (LDL)  స్థాయిలు తగ్గుతాయి, బ్రోకలీలో ఉండే గ్లూకోరేంఫనిన్ (glucoraphanin) అనే బయోఆక్టివ్ సమ్మేళనం దీనికి ముఖ్య కారణం.    

జీర్ణక్రియకు బ్రోకలీ - Broccoli for digestion in Telugu

బ్రోకలీలో పీచుఆహారపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. బ్రోకలీలో ఉన్న ఈ అధిక పీచుఆహారపదార్థాలు (ఫైబర్ కంటెంట్) శరీరం యొక్క జీర్ణ క్రియను నిర్వహించడానికి అద్భుతంగా తోడ్పడతాయి. బ్రోకలీలోని జీవచైతన్య సమ్మేళనం, ‘కాఎమ్పెఫొరోల్’, కడుపు లోపలి పొరను సురక్షితంగా ఉంచుతుంది మరియు ప్రేగులలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా స్థాయిల్ని నిర్వహిస్తుందని అధ్యయనాలు కనుగొన్నాయి.

ఆరోగ్యకరమైన పేగుబ్యాక్టీరియా (healthy gut bacteria) జీర్ణక్రియ ప్రక్రియలో సహాయపడతాయి, అందువలన మన ఆహారంలో బ్రోకలీని కూడా చేర్చడంవల్ల మలబద్ధకం మరియు పేగుల్లో మంట రుగ్మత (ఐబిఎస్) వంటి జీర్ణ రుగ్మతలను నిరోధించవచ్చు. అదనంగా, బ్రోకలీ నిర్వహించే జీర్ణ జీవక్రియ (digestive metabolism) యొక్క నియంత్రణ బరువు తగ్గింపు కార్యక్రమాలకు కూడా ప్రభావవంతమైనదిగా నిరూపించగలదు.

(మరింత సమాచారం: బరువు తగ్గుదల ఆహార పట్టిక)

కాలేయానికి బ్రోకలీ - Broccoli for liver in Telugu

మనం తినే ఆహారంలో బ్రోకలీని చేర్చడంవల్ల కాలేయానికి మంచి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. కాలేయ సిర్రోసిస్ మరియు కాలేయ క్యాన్సర్ వంటి నాన్-ఆల్కహాలిక్ కొవ్వు కాలేయ వ్యాధుల్లో (NAFLDs) ఇటీవల పెరుగుదల కానవస్తోంది. నివేదికలు మరియు గణాంకాల ప్రకారం కాలేయ క్యాన్సర్ ప్రస్తుత సందర్భంలో ఐదవ అతి సాధారణమైన క్యాన్సర్గా పరిగణించబడుతుంది. కాలేయ క్యాన్సర్ ను సాపేక్షకంగా నివారించవచ్చు, ఎందుకంటే దీనికి సంబంధించిన ప్రమాద కారకాలు ప్రధానంగా ఆహారం మరియు జీవనశైలికి సంబంధించినవే కాబట్టి.

బ్రోకలీ కాలేయంలో జీవక్రియను నియంత్రించడానికి మరియు NAFLD యొక్క అభివృద్ధిని నిరోధిస్తుందని అధ్యయనాలు కనుగొన్నాయి. కాలేయంలో ట్రైగ్లిజెరైడ్స్ తగ్గించడంలో బ్రోకలీ సహాయపడుతుందని పరిశోధకులు సూచిస్తున్నారు, ఇది NAFLD తో ముడిపడిన ప్రమాదాన్ని మరింత తగ్గిస్తుంది. అయితే, కాలేయ పనితీరు యొక్క సక్రమ నిర్వహణకు బ్రోకలీవల్ల జరిగే క్రియావిధానం గురించి ఇంకా పూర్తిగా అన్వేషించబడలేదు.

యాంటీఆక్సిడెంట్గా బ్రోకలీ - Broccoli as an antioxidant in Telugu

బ్రోకలీలో అధిక స్థాయిలో యాంటీఆక్సిడెంట్ (antioxidants) ఉంటాయి, ఇవి ఆరోగ్యానికి ప్రయోజనకరమైన ప్రభావాలను కలిగిస్తాయి. అనామ్లజనకాలు ఆక్సీకరణ ఒత్తిడి కారణంగా ఏర్పడే సెల్యులార్ నష్టాన్ని నివారిస్తాయి లేదా ఆ నష్టాన్ని ఆలస్యం చేస్తాయి.

బ్రోకలీలో పెద్ద సంఖ్యలో ఫినోలిక్ పదార్థాలు ఉన్నట్లు అధ్యయనాలు కనుగొన్నాయి, దీనివల్ల బ్రోకలీ అనామ్లజనక పదార్థంగా పనిచేయగలదు. అందువలన, బ్రోకలీలో మన శరీరంపై రక్షణ చర్యల్ని చేపట్టగలదు కాబట్టి ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడానికి మన ఆహారంలో దీన్ని చేర్చడం చాలా అవసరం.

(మరింత చదువు: యాంటీఆక్సిడెంట్ ఆహారాలు)

వాపు నివారిణిగా బ్రోకలీ - Broccoli as anti-inflammatory in Telugu

ఆహారంలో బ్రోకలీని చేర్చడంవల్ల కీళ్లనొప్పులు (ఆర్థరైటిస్) మరియు కీళ్లు మరియు ఎముకల నొప్పి (ఆస్టియో ఆర్థరైటిస్) వంటి వ్యాధుల వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇటీవలి ఓ అధ్యయనం ప్రకారం, బ్రోకలీలో ఉన్న జీవచైతన్య (bioactive) సమ్మేళనం, సల్ఫోరాఫాన్, పేర్కొన్నవ్యాధుల వల్ల వచ్చే వాపుకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఈ సమ్మేళనం కీళ్ళనాశనానికి కారణమయ్యే ఎంజైమ్లను నిరోధిస్తుందని నమ్ముతారు. అయినప్పటికీ, మరిన్ని అధ్యయనాలు ఈ పరిశోధనలకు మద్దతు ఇవ్వాల్సి ఉంది.

మెదడుకు బ్రోకలీ - Broccoli for brain in Telugu

బ్రోకలీ వినియోగం అల్జీమర్స్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించగలదని అధ్యయనాలు చెబుతున్నాయి. బ్రోకలీ పనితీరును బట్టి చూస్తే ఇది మెదడును రక్షించేది (న్యూరోప్రొటెక్టివ్) గా గుర్తించబడింది. నరసంబంధమైన (న్యూరోడెనెనరేటివ్) వ్యాధులకు సాధారణ కారకం ఆక్సీకరణ ఒత్తిడి. బ్రోకలీలో అనామ్లజనకాలు అధికంగా ఉంటాయి మరియు ఆక్సీకరణ ఒత్తిడి స్థాయిని గణనీయంగా తగ్గిస్తుంది.

2015 లో నిర్వహించిన ఒక అధ్యయనం ముడి బ్రోకలీ రసం యొక్క సేవనం అల్జీమర్స్ (జ్ఞాపక శక్తిని కోల్పోయే రుగ్మత) వ్యాధిని నిరోధించగలదని కనుగొంది. వయస్సుతో మూసివేయబడే ఒక ప్రత్యేక సిగ్నలింగ్ మార్గం అయిన Nrf2 ని తిరిగి క్రియాశీలకంగా మార్చడం ద్వారా బ్రోకలీ అల్జీమర్స్ ను నిరోధిస్తుంది. ఏదేమైనప్పటికీ, బ్రోకలీ యంత్రాంగం యొక్క ఖచ్చితమైన చర్యను అర్థం చేసుకోవడానికి.మరింత అధ్యయనం అవసరం.

చర్మానికి, జుట్టుకు బ్రోకలీ - Broccoli for skin and hair in Telugu

బ్రోకలీలో విటమిన్ సి చాలా అధిక మొత్తంలో ఉంటుంది మరియు ఆరోగ్యవంతమైన చర్మాన్ని నిర్వహించడానికి విటమిన్ సి అవసరం. ఈ విటమిన్ యొక్క లోపం పొడి చర్మ రుగ్మతలు మరియు స్కర్వీ (సి-విటమిన్ లోపవ్యాధి) వంటి వ్యాధులకు కారణమవుతుంది . బ్రోకలీని తినడంవల్ల అటువంటి చర్మవ్యాధులను దూరంగా ఉంచండి.

బ్రోకలీలో ఉన్న సమ్మేళనాల యొక్క అనామ్లజనిక లక్షణాలు చర్మం యొక్క వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం చేస్తాయి, ఇది అకాల వయస్సులో వచ్చే మచ్చలు మరియు ముడతలను నిరోధిస్తుంది. బ్రోకలీ సేవనం మీ చర్మానికి ప్రకాశవంతమైన కాంతినిస్తుంది. చర్మంపై అతినీలలోహిత కిరణం యొక్క ప్రభావాన్ని బ్రోకలీ తగ్గిస్తుందని కనుక్కోబడింది. బ్రోకలీలో ఫైటోన్యూట్రియెంట్, గ్లూకోరాఫానిన్ పుష్కలంగా ఉంది, ఇది చర్మంపై అతినీలలోహిత కిరణం యొక్క (UV) బహిర్గత ప్రభావాలను తిప్పికొడుతుందని సూచించబడింది.

అదనంగా, బ్రోకలీలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. విటమిన్ ఎ మరియు విటమిన్ సి రెండూ కలిసి తలవెంట్రుకల కుదుళ్ళలో తేమను కల్గించే సహజమైన కొవ్వుపదార్థాన్ని (sebum) ఉత్పత్తి చేస్తాయి. ఈ రెండు విటమిన్లు జుట్టు మూలాలను బలోపేతం చేస్తాయి, జుట్టు రాలడాన్ని మరియు వెంట్రుకలు తునగడాన్ని కూడా నివారిస్తాయి. కాబట్టి, మీరు పట్టులాంటి, ఒత్తైన మెరిసే జుట్టును సొంతం చేసుకోవాలంటే  మీ ఆహారంలో బ్రోకలీ తప్పకుండా ఉండేట్లు చూసుకోండి.

కళ్ళకు బ్రోకలీ - Broccoli for eyes in Telugu

బ్రోకలీ విటమిన్ ‘ఎ’ ని పుష్కలంగా కల్గి ఉంటుంది మరియు దీన్ని తినడంవల్ల కళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది. సరైన దృష్టికి అవసరమైన కళ్ళలోని కడ్డీలు మరియు కోన్ కణాల (rods and cone cells of eyes) అభివృద్ధికి విటమిన్ ఎ అవసరం. అదనంగా, విటమిన్ ఎ లోపం కళ్ళు పొడిబారిపోయే రుగ్మతకు మరియు కండ్లకలక, జీరోప్తాల్మియా (xerophthalmia) వంటి వ్యాధులకు దారి తీస్తుంది. బ్రోకలీలో అధిక మొత్తంలో ఉండే  విటమిన్ ఎ వల్ల ఇటువంటి కళ్ళ వ్యాధులను నివారించవచ్చు.

బ్రోకలీని తినడంవల్ల కంటిశుక్లాలు మరియు మాక్యులార్ డిజెనరేషన్ వంటి వయసు సంబంధిత కంటి రుగ్మతలకు సంబంధించిన ప్రమాదాలు కూడా దూరం కాగలవని అధ్యయనాలు కనుగొన్నాయి. ఆరోగ్యకరమైన కళ్ళకోసం చాలా చిన్న వయస్సులోనే పిల్లల ఆహారంలో బ్రోకలీని చేర్చమని పౌష్టికాహార నిపుణులు సిఫార్సు చేస్తారు.

చక్కెరవ్యాధికి బ్రోకలీ - Broccoli for diabetes in Telugu

చక్కెరవ్యాధి (మధుమేహం) రావడానికి గల ప్రధాన కారణాలలో ఒకటి ఆక్సీకరణ ఒత్తిడి. బ్రోకలీ యొక్క సేవనంవల్ల చక్కెరవ్యాధి (మధుమేహం) తక్కువ స్థాయికి దిగొస్తుంది దీనిక్కారణమేమంటే బ్రోకలీలో అనామ్లజని మరియు హైపోగ్లైసీమిక్ (బ్లడ్ షుగర్ని తగ్గించే గుణం) కూరగాయల లక్షణాలు పుష్కలంగా ఉండడమేనని నిర్ధారించబడింది.

టైప్ 2 చక్కెరవ్యాధి (డయాబెటీస్) ఉన్న రోగులపై జరిపిన అనేక వైద్య పరిశోధనలు (క్లినికల్ ట్రయల్స్) కనుగొన్నదేమిటంటే ఆహారంలో బ్రోకలీని చేర్చడం వలన చక్కెరవ్యాధి (మధుమేహం) తగ్గుముఖం పడుతుందని. ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరచడం ద్వారా మరియు ఆక్సీకరణ ఒత్తిడి స్థాయిని తగ్గించడం ద్వారా బ్రోకలీ చక్కెరవ్యాధిని తగ్గిస్తుందని గుర్తించవచ్చు. అయితే రక్త చక్కెర స్థాయిలను తగ్గించే బ్రోకలీ యొక్క ఖచ్చితమైన మెకానిజం ఏమిటన్నదాన్ని ఇంకా పరిశోధించాల్సి దించాల్సి ఉంది.

కొలెస్ట్రాల్ తగ్గించే బ్రోకలీ - Broccoli for cholesterol in Telugu

బ్రోకలీని సేవించడంవల్ల తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్లను (LDL) తగ్గించడంలో ప్రభావవంతమైనదిగా గుర్తించబడింది, తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్లను చెడు కొవ్వులు గా పిలుస్తారు. అధిక కొలెస్ట్రాల్ ఉన్న రోగులకు సంబంధించిన యాదృచ్ఛిక క్లినికల్ ట్రయల్స్ నివేదికల ప్రకారం అధ్యయనం కాలంలో బ్రోకలీ యొక్క సాధారణ వినియోగం రోగులలో LDL స్థాయిల్ని గణనీయంగా తగ్గించిందని సూచించింది. కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గించడంలో ప్రధాన జీవశరీర సమ్మేళనం గ్లూకోరాఫానిన్, బ్రోకలీలో అధికంగా లభిస్తుంది.

(మరింత చదువు: అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు)

క్యాన్సర్ కోసం బ్రోకలీ - Broccoli for cancer in Telugu

ప్రయోగాత్మక అధ్యయనాలు బ్రోకలీలోని ఉత్తమమైన ఆహారం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించగలదని సూచిస్తున్నాయి. జనవరి 2011 మరియు ఫిబ్రవరి 2012 మధ్య నిర్వహించిన ఒక వైద్య  అధ్యయనంలో (క్లినికల్ ట్రయల్), ఒకే కుటుంబానికి చెందిన బ్రోకలీ మరియు ఇతర కూరగాయలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని నిరూపితమైంది  బ్రోకలీని సేవించడంవల్ల శరీరం యొక్క జీవక్రియను పునరుద్ధరించడానికి సహాయపడుతుంది, ఆక్సీకరణ ఒత్తిడి కారణంగా సాధారణంగా జీవక్రియ పనిచేయదు.

బ్రోకలీ లోని గ్లూకోసినోలెట్స్ (glucosinolates) రక్షిత చర్య ద్వారా మధ్యవర్తిత్వం చేయబడుతుందనే వాస్తవం గురించి అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయినప్పటికీ, ఈ పరికల్పనకు మరింత పరిశోధన అవసరం. అదనంగా, బ్రోకలీలో కనుగొనబడిన బయోయాక్టీవ్ సమ్మేళనం ‘కాయెమ్ప్ ఫెరోల్’ క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలను కూడా కలిగి ఉందని, అధ్యయనాలు సూచిస్తున్నాయి.

బ్రోకలీ యొక్క పోషక ప్రయోజనాల కోసం దాన్ని సాగు చేస్తారు. అందుబాటులో ఉన్న బ్రోకలీ యొక్క సాధారణ రకాలు క్రింద పేర్కొనబడ్డాయి.

 • కాలిబ్రేజ్ బ్రోకలీ: దీనిని “బ్రోకలీ” అనే పిలుస్తారు, దీనికి ఈ పేరును దీన్ని మొదట పండించిన ప్రదేశం పేరునే పెట్టారు. ఇటలీలో కాలాబ్రియా లో బ్రోకలీ ని మొదట పండించారు. ఈ రకమైన బ్రోకలీ మందపాటి కాడలు మరియు పెద్ద ఆకుపచ్చ తలలు కలిగి ఉంటుంది.
 • మొలకెత్తే (Sprouting) బ్రోకలీ: ఈ రకమైన బ్రోకలీ సన్నగా ఉండే లేత కాడలు మరియు పెద్ద సంఖ్యలో తలలు కలిగి ఉంటుంది.
 • ఊదా రంగు (పర్పుల్) బ్రోకలీ: బ్రోకలీ యొక్క ఈ రకాన్ని ప్రధానంగా ఐరోపా మరియు ఉత్తర అమెరికాలో సాగు చేస్తారు. బ్రోకలీ యొక్క ఈ రకమైన ఫ్లవర్ మొగ్గలు చిన్నవి మరియు ఊదా రంగు కలిగి ఉంటాయి.
 • చైనీస్ బ్రోకలీ: బ్రోకలీ ఈ రకమైన బ్రోకలీలో పూవు యొక్కతలలు ఉండవు. ఇది ఇతర రకాల బ్రోకలీతో పోలిస్తే ముదురు ఆకుపచ్చ రంగు మరియు బలమైన రుచి కలిగి ఉంటుంది. ఇది ఆసియాలో ప్రధానంగా చైనాలో కనిపిస్తుంది మరియు మొక్క మొత్తాన్ని పూర్తిగా తింటారు.

బ్రోకలీని అనేక కార్బోహైడ్రేట్లు మరియు మాంసాలతో పాటు అనేక రకాల వంటకాల్లోను లేదా నంజుకునే వంటకం (సైడ్ వెజిటబుల్) గా ఉపయోగించవచ్చు. బ్రోకలీని సేవించే  అత్యంత సులభమైన మరియు ఆరోగ్యకరమైన మార్గం ఇక్కడ వివరించబడింది.

 • సుమారు 250 గ్రాముల బ్రోకలీని తీసుకోండి.
 • బ్రోకలీ యొక్క పుష్పగుచ్చాల్ని, కాండాలు మరియు ఆకుల్ని కావలసిన పరిమాణంలో ముక్కలుగా కట్ చేసుకోండి. వాటిని పూర్తిగా శుభ్రం చేయండి.
 • ఒక గిన్నెలో సుమారు 500 ml (2 పెద్ద కప్పులు) నీటిని తీసుకుని అందులో కట్ చేసుకున్న బ్రోకలీ ముక్కలను వేయండి.
 • బ్రోకలీ మిశ్రమాన్ని వేడి చేయండి, ఆ తర్వాత నీటిని వంచేయండి.
 • ఉప్పు మరియు మిరియాల (పొడి)ని వేసి ఆ తర్వాత ఆలివ్ నూనె యొక్క చినుకుల్ని సున్నితంగా చిలకరించండి.
 • ఇపుడు తయారైన మీ బ్రోకలీ వంటకాన్ని తిని ఆనందించండి. బ్రోకలీతో మీకిష్టమైన ఇతర కూరగాయలను జోడించి సలాడ్ను కూడా సిద్ధం చేసుకుని తినొచ్చు.
Karela Jamun Juice
₹494  ₹549  10% OFF
BUY NOW

బ్రోకలీని తినడంవల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అయితే, కొందరు బ్రోకలీని మితం మించి తినడంవల్ల కొన్ని దుష్ప్రభావాలు కలుగుతాయి. ఈ దుష్ప్రభావాలు క్రింద చర్చించబడ్డాయి.

 • బ్రోకలీలో రక్త చక్కరను (బ్లడ్ షుగర్) తగ్గించగల గుణం ఉండటం వల్ల దీన్ని తిన్నపుడు రక్త చక్కెర చాలా తక్కువకు పడిపోతుంది. అందువల్ల, బ్రోకలీని అధిక మొత్తంలో ఆహారంలో చేర్చినట్లయితే, రక్తంలో చక్కెర స్థాయిలను సమయోచితంగా పర్యవేక్షించుకోవడం అవసరం.
 • గర్భధారణ సమయంలో బ్రోకలీ యొక్క అధిక వినియోగం పొత్తికడుపు నొప్పి, ప్రేగు సంబంధిత అడ్డంకులు వంటి సమస్యలకు కారణమవుతుంది. అందువల్ల, గర్భిణీ స్త్రీలు బ్రోకలీని ఓ మోస్తరు మొత్తంలో మాత్రమే తినాలి, తద్వారా ఎలాంటి సమస్యలు రాకుండా నివారించుకోవచ్చు.
 • రక్తాన్ని పల్చబరిచే మందుల్ని(blood thinning medicines) తీసుకొనేవాళ్ళు బ్రోకలీని సేవించే ముందు తీసుకోవడం గురించి ఒక పౌష్టికాహార నిపుణుడిని సంప్రదించాలి, ఎందుకంటే దీనిలో విటమిన్ K అధిక మొత్తంలో ఉంటుంది కాబట్టి ఇది మందుల ప్రభావంతో జోక్యం చేసుకోవచ్చు.
 • కొన్ని బ్రోకలీలను తినటంవల్ల కొంతమందికి  చర్మంపై దద్దుర్లు, దురద వంటి అలెర్జీ ప్రతిచర్యలు (reactions) రావచ్చు . అలాంటి లక్షణాలు సంభవించినట్లయితే, మొదట మీ వైద్యుడిని సంప్రదించండి. (మరింత చదువు:  అలెర్జీ లక్షణాలు).

వనరులు

 1. Alessandra Masci et al. Neuroprotective Effect of Brassica oleracea Sprouts Crude Juice in a Cellular Model of Alzheimer's Disease . Oxid Med Cell Longev. 2015; 2015: 781938. PMID: 26180595
 2. Bahadoran Z et al. Broccoli sprouts reduce oxidative stress in type 2 diabetes: a randomized double-blind clinical trial. Eur J Clin Nutr. 2011 Aug;65(8):972-7. PMID: 21559038
 3. Latté KP, Appel KE, Lampen A. Health benefits and possible risks of broccoli - an overview. Food Chem Toxicol. 2011 Dec;49(12):3287-309. PMID: 21906651
 4. Sithara Suresh et al. Broccoli (Brassica oleracea) Reduces Oxidative Damage to Pancreatic Tissue and Combats Hyperglycaemia in Diabetic Rats . Prev Nutr Food Sci. 2017 Dec; 22(4): 277–284. PMID: 29333379
 5. Charlotte N Armah et al. A diet rich in high-glucoraphanin broccoli interacts with genotype to reduce discordance in plasma metabolite profiles by modulating mitochondrial function. Am J Clin Nutr. 2013 Sep; 98(3): 712–722. PMID: 23964055
 6. Tamara Sotelo et al. Identification of Antioxidant Capacity -Related QTLs in Brassica oleracea . PLoS One. 2014; 9(9): e107290. PMID: 25198771
 7. Christine Sturm, Anika E. Wagner. Brassica-Derived Plant Bioactives as Modulators of Chemopreventive and Inflammatory Signaling Pathways . Int J Mol Sci. 2017 Sep; 18(9): 1890. PMID: 28862664
Read on app