హార్మోన్ల అసమతుల్యత - Hormonal Imbalance in Telugu

Dr. Anurag Shahi (AIIMS)MBBS,MD

January 03, 2019

March 06, 2020

హార్మోన్ల అసమతుల్యత
హార్మోన్ల అసమతుల్యత

హార్మోన్ల అసమతుల్యత అంటే ఏమిటి ?

మానవ శరీరంలోని హార్మోన్ల సాధారణ స్థాయిలలో కలిగే కల్లోలాన్ని”హోర్మోన్ల అసమతుల్యత”గా పిలువబడుతుంది. హార్మోన్లు అనేవి మన శరీరంలోని ఎండోక్రైన్ గ్రంథులు స్రవించే రసాయనాలు. ఈ రసాయనాలు మన రక్తప్రసరణ ప్రవాహంలో ప్రయాణించి, అవయవాలకు సందేశాలను పంపి, తద్వారా ఆ అవయవాల పనులను నియంత్రించి, సమన్వయపరిచే విధిని నిర్వర్తిస్తాయి. హార్మోన్లలో అస్థిరత లేక హెచ్చుతగ్గులు అనేవి గర్భధారణ సమయంలో లేదా వయస్సు పెరగడం వంటి దశల్లో సహజంగా సంభవిస్తాయి. హార్మోన్ల అసమతుల్యత అనేది లింగం మరియు పర్యావరణ కారకాల ప్రకారం మారుతూ ఉంటుంది. శరీరంలో హార్మోన్ల అసమతుల్యత  ఏర్పడినపుడు దానిపట్ల శ్రద్ధ వహించకపోతే అది భౌతిక మరియు మానసిక అసాధారణ పరిస్థితులకు దారి తీయవచ్చు.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

అంతర్లీన కారణాల ఆధారంగా హార్మోన్ల అసమతుల్యత యొక్క ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు క్రింది విధంగా ఉంటాయి:

 • అలసట
 • చెమట పట్టుట
 • ఆందోళనతో కూడిన భావాలు
 • చిరాకు
 • సంతానలేమి 
 • చనుమొనల్లో ఉత్సర్గ
 • వేగంగా బరువు పెరగడం
 • పెద్దవారిలో (వయోజనుల్లో)  మొటిమలు
 • బరువు నష్టం
 • అక్రమమైన (క్రమరహిత) రుతు చక్రాలు
 • జ్ఞాపకశక్తి లోపాలు
 • బలహీనమైన కండరాలు మరియు ఎముకలు
 • జుట్టు ఊడుట
 • నిద్రలేమి (నిద్రపెట్టడంలో సమస్యలు)
 • వేడి సెగలు; వేడి ఆవిరులు
 • కుంగుబాటు (డిప్రెషన్)
 • చేతులు మరియు కాళ్ళు చల్లబడడం
 • మానసిక కల్లోలం
 • విరేచనాలు లేక మలబద్దకం వంటి భేది సమస్యలు

హార్మోన్ల అసమతుల్యత ఏర్పడ్డప్పుడు హృదయ స్పందన రేటులో మార్పులు, రక్తపోటు మరియు రక్తంలో చక్కెర స్థాయిలల్లోమార్పులు కూడా మనం చూడవచ్చు.

హార్మోన్ల అసమతుల్యతకుప్రధాన కారణాలు ఏమిటి?

హార్మోన్ల అసమతుల్యతకు ప్రధాన కారణాలు:

 • ఒత్తిడి
 • దీర్ఘకాలంపాటు అలసటతో కూడిన జబ్బులక్షణాలు
 • జన్యు మార్పులు
 • స్టెరాయిడ్స్ వంటి కొన్ని మందులు
 • రుతుక్రమం ఆగిపోవడం (ముట్లడగడం లేక మెనోపాజ్)
 • గర్భం
 • కుటుంబ నియంత్రణ (గర్భనిరోధక)  మాత్రలు
 • ఆటో ఇమ్యూన్ పరిస్థితులు (రోగనిరోధకాల పొరబాటు చర్యలు)
 • అనుచితమైన ఆహారం
 • థైరాయిడ్ గ్రంధికి సంబంధించిన సమస్యలు - హైపర్ లేదా హైపో థైరాయిడిజం
 • వృద్ధాప్యం
 • కొన్ని అలెర్జీలు (అసహనీయతలు-శరీరానికి పడకపోవడం)  
 • పాలిసిస్టిక్ ఓవరి వ్యాధి, పిట్యూటరీ గ్రంధి గడ్డ (prolactinoma), కొన్ని గ్రంధులు (పిట్యూటరీ, థైరాయిడ్, అండాశయాలు, వృషణాలు, adrenals, హైపోథాలమస్, మరియు పారాథైరాయిడ్) అతిగా గాని లేదా చాలా మందంగా గాని పని చేయడం వంటి వైద్య పరిస్థితులు.  

హార్మోన్ల అసమతుల్యతను ఎలా నిర్ధారిస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

వివరణాత్మక చరిత్ర తీసుకోవడం మరియు భౌతిక పరీక్షలతో పాటు, హార్మోన్ స్థాయిలలో అసమతుల్యత సాధారణంగా లాలాజల మరియు సీరం పరీక్షల ఫలితాలను అంచనా వేయడం ద్వారా నిర్ధారణ చేయబడుతుంది. టెస్టోస్టెరోన్ మరియు ఈస్ట్రోజెన్ వంటి లైంగిక హార్మోన్ల స్థాయిలను గుర్తించడం కోసం పరీక్షలు చేయించమని (వైద్యుడిచే) కోరబడబడవచ్చు. అల్ట్రాసౌండ్ లేదా MRI వంటి ఇమేజింగ్ అధ్యయనాలూ అవసరం కావచ్చు.

హార్మోన్ల అసమతుల్యతను దాని అంతర్లీన కారణాన్ని నిర్వహించడం ద్వారా నిభాయించబడుతుంది, మరియు సాధారణంగా ఈ క్రింది పద్ధతుల ద్వారా చికిత్స చేయబడుతుంది:

 • సింధటిక్ హార్మోన్లను మాత్రలు, సారాంశాలు మరియు అతుకులు (patches) రూపంలో
 • హార్మోన్ల పునఃస్థాపన చికిత్స
 • ఒక క్రియాశీల జీవనశైలి మరియు ఒక ఆరోగ్యకరమైన ఆహారం హార్మోన్ల అసమతుల్యత యొక్క లక్షణాల ఉపశమనానికి సహాయకంగా సూచిస్తారు.
 • ఆందోళన మరియు కుంగుబాటు కల్గిన వ్యక్తులకు సహాయం చేయడానికి ఆందోళన-నివారణా మందులు (Anti-anxiety medication) మరియు కుంగుబాటు నివారణా (యాంటీ డిప్రెసెంట్స్) మందుల్ని ఇవ్వడం
 • హార్మోన్ల అధిక స్రావం విషయంలో హార్మోన్ వ్యతిరేక (hormone antagonists) మందులివ్వడంవనరులు

 1. Lucas Research. [Internet]. Viamark & Red Shark Digital. HORMONE IMBALANCE.
 2. National University of Natural Medicine. [Internet]. Women in Balance Institute. Causes of Hormone Imbalance.
 3. Rush University Medical Center. [Internet]. Congress Parkway Chicago, IL; His and Hers Hormones.
 4. Northwell Health. [Internet]. 1997, Great Neck, NY; 11 unexpected signs of hormonal imbalance
 5. Hormone Health Network. [Internet]. Endocrine Society.Glands & Hormones A-Z.

హార్మోన్ల అసమతుల్యత వైద్యులు

Dr. Narayanan N K Dr. Narayanan N K Endocrinology
16 वर्षों का अनुभव
Dr. Tanmay Bharani Dr. Tanmay Bharani Endocrinology
15 वर्षों का अनुभव
Dr. Sunil Kumar Mishra Dr. Sunil Kumar Mishra Endocrinology
23 वर्षों का अनुभव
Dr. Parjeet Kaur Dr. Parjeet Kaur Endocrinology
19 वर्षों का अनुभव
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

హార్మోన్ల అసమతుల్యత కొరకు మందులు

హార్మోన్ల అసమతుల్యత के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।