విటమిన్ A కొవ్వులో కరిగే విటమిన్, ఇది కొన్ని ఆహార పదార్ధాలలో సహజంగా లభిస్తుంది. ఇది ప్రొవిటమిన్ A నుండి తీసుకోబడుతుంది మరియు ఆప్టిక్ ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది (కంటి చూపు).

విటమిన్ A ను రెటినోల్ అని కూడా అంటారు ఎందుకంటే ఇది మీ కంటిలో రెటీనా ఏర్పడటానికి సహాయపడే వర్ణద్రవ్యంను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ప్రపంచవ్యాప్తoగా అంధత్వానికి అత్యంత సాధారణ కారణం విటమిన్ A లేకపోవడం అనేది మీకు తెలుస్తుంది.

విటమిన్ A అనేది ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, ఇది ఫ్రీ రాడికల్స్ యొక్క హానికరమైన ప్రభావాల నుండి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడుతుంది. ఇది మీ శరీరానికి మరియు పిల్లల సరైన పెరుగుదల మరియు అభివృద్ధిలో ఒక ముఖ్యమైన పాత్ర కలిగి ఉన్నట్లు పరిగణించబడుతుంది.

ఇది మీ చర్మం, కణజాలం, శ్లేష్మ పొర, ఎముకలు మరియు దంతాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది మరియు అనేక కణాల సంబంధిత పనులను నిర్వహించడంలో కూడా చాలా ముఖ్యమైనది. మీ రోగనిరోధక వ్యవస్థ యొక్క పనితీరు మెరుగుపరచడంలో విటమిన్ A కూడా ఒక ముఖ్యమైన పాత్రను కలిగి ఉంది, ఇది అంటువ్యాధులతో పోరాడటంలో సహాయపడుతుంది.

వివిధ వయస్సుల సమూహాలకు విటమిన్ A యొక్క ముఖ్యమైన విధులను, రోజువారీ అవసరంతో పాటు, ఆహార వనరులు మరియు ఒక విటమిన్ A కలిగిన పదార్ధాలను అధికంగా తీసుకొన్నప్పుడు కలిగే ప్రభావాల గురించి ఈ వ్యాసం వివరిస్తుంది.

 1. విటమిన్ A రోజువారీ తీసుకోవలసినదిగా సిఫార్సు చేయబడినది - Vitamin A recommended daily intake in Telugu
 2. విటమిన్ A అధికంగా కలిగిన ఆహారాలు - Vitamin A rich foods in Telugu
 3. విటమిన్ A యొక్క ఆరోగ్య ప్రయోజనాలు - Health benefits of vitamin A in Telugu
 4. విటమిన్ A యొక్క దుష్ప్రభావాలు - Vitamin A side effects in Telugu

రోజువారీ తీసుకోవలసినదిగా సిఫార్సు చేయబడిన విటమిన్ A యొక్క మోతాదు మీ బరువు, ఎత్తు, లింగం మరియు వయస్సు వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. ఇది మీరు నివసించే ప్రాంతం మీద ఆధారపడి ఉంటుంది. విటమిన్ A లోపం లేదా పోషకాహార లోపం యొక్క అధిక ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో నివసిస్తున్న వ్యక్తులు అధిక మోతాదులో ఈ విటమిన్­ను తీసుకోవాలి

గర్భధారణ సమయంలో శిశువులు మరియు పిల్లలలో లోపాలను నివారించడానికి, తల్లి పాలను (చను బాలివ్వడం) అందించే వివిధ దశలలో మహిళలకు మరింత ఎక్కువ అవసరం అవుతుంది. మోతాదు యొక్క పరిధి చాలా వరకు మారుతూ ఉండగా, ఈ విటమిన్ వినియోగం యొక్క ఎగువ పరిమితులు క్రింద పేర్కొనబడ్డాయి. సూచించిన మోతాదుకు మించి తీసుకోకూడదని సూచించబడింది.

సాధారణంగా, ఆహారంలో ఈ విటమిన్ 3000 IU కంటే ఎక్కువ మోతాదు (బీటా-కెరోటిన్ 1 IU = 0.6 mcg) కలిగి ఉండరాదు మరియు డాక్టరుని సంప్రదించకుండా ఏవైనా అదనపు సప్లిమెంట్లను తీసుకోరాదని కూడా సిఫార్సు చేయబడింది.

బయిటి సప్లిమెంట్­లను తీసుకొనేటప్పుడు, ఏదైనా కాని, రెటినోల్­ బదులుగా బీటా-కరోటిన్ తీసుకోవడం మంచిది, కెరోటిన్ అనేది విటమిన్ A యొక్క పూర్వగామి (విటమిన్ A తయారు యొక్క బాధ్యతను కలిగి ఉంటుంది) మరియు శరీరం ద్వారా సహజంగా ఇది విటమిన్ A గా మారిపోతుంది, మరియు అది నిల్వ చేయబడుతుంది. అయినప్పటికీ, రెటినోల్ దుష్ప్రభావాలకు దారి తీస్తుంది మరియు హైపర్­విటమినోసిస్­ను కూడా దారి తీయవచ్చు, ఇది అధిక మొత్తంలో వినియోగించినప్పుడు విషపూరితం అవుతుంది. విటమిన్ A యొక్క దుష్ప్రబావాలు క్రింది విభాగాలలో చర్చించబడ్డాయి.

వయసు మరియు మోతాదు యొక్క గరిష్ట పరిమితి:

 • పుట్టినప్పటి నుండి 3 సంవత్సరాల వయసు వరకు: 600 ఎంసిజి
 • 4 సంవత్సరాల నుండి 8 సంవత్సరాలు వయసు వరకు: 900 ఎంసిజి
 • 9 సంవత్సరాల నుండి 13 సంవత్సరాల వయసు వరకు: 1700 ఎంసిజి
 • 14 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వయసు వరకు: 2800 ఎంసిజి
 • వయోజనులలో మోతాదు: 3000 ఎంసిజి
 • గర్భం ధరించి ఉన్న మరియు చనుబాలిచ్చేవారికి: 3000 ఎంసిజి
 • శిశువుల్లో లోపాలను నివారించడానికి 120,000 ఎంసిజి యొక్క సింగిల్ మోతాదులు కూడా తల్లులకు ఇవ్వబడతాయి. వాటిని సాధారణంగా బాగానే తట్టుకోగలుగుతారు, అవి తల్లి పాల శ్రేష్టతను ఏమాత్రం  ప్రభావితం చేయవు.
Multivitamin Capsules
₹649  ₹995  34% OFF
BUY NOW

విటమిన్ A కలిగిన ఆహార వనరులు ఈ క్రింది విధంగా:

 • ఎరుపు, ఆకుపచ్చ మరియు పసుపు రంగు మిరియాలు (క్యాప్సికమ్) వంటి సహజ రంగు పిగ్మెంట్ (బీటా-కెరోటిన్) కలిగిన క్యారట్లు మరియు ఇతర కూరగాయలు.
 • లిక్విడ్ బెల్ పేపర్ (కేప్సికం) ఎరుపు, ఆకుపచ్చ మరియు పసుపు సహజ రంగు పిగ్మెంట్ (బీటా-కెరోటిన్) కలిగిన క్యారట్లు మరియు ఇతర కూరగాయలు
 • బ్రోకలీ, కాలే, పాలకూర, గుమ్మడి, స్క్వాష్ వంటి ఆకు కూరలు.
 • కాడ్ లివర్ ఆయిల్
 • మామిడి, బొప్పాయి, ఆప్రికాట్లు వంటి పండ్లు
 • గుమ్మడికాయ
 • పాల ఉత్పత్తులు (పాలు, జున్ను, పెరుగు).
 • మాంసం, పౌల్ట్రీ మరియు చేపలు, ముఖ్యంగా సాల్మన్ వంటి జంతు ఉత్పత్తులు
 • గుడ్డు సొనలు
 • కాలేయం
 • అల్పాహారం తృణధాన్యాలు వంటి కొన్ని ప్యాక్ చేయబడిన ఆహారాలు

మీ ఆహారంలో ఈ విటమిన్ యొక్క మరిన్ని సహజ వనరులను చేర్చవలసినదిగా సిఫార్సు చేయబడింది. ఒక వైద్యుని సంప్రదించకుండా ఎలాంటి సప్లిమెంట్లను తీసుకోరాదనీ మీరు సలహా ఇవ్వబడతారు. గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా శిశువుల్లో జన్మ లోపాలకు కారణమవుతుండటం వలన వాటిని తీసుకోవడం తప్పనిసరిగా మానుకోవాలి 

మీ ఆరోగ్యానికి, ముఖ్యంగా మీ దృశ్య సంబంధిత ఆరోగ్యం మరియు రోగనిరోధక శక్తికి విటమిన్ A చాలా ముఖ్యమైన ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ మరియు విభిన్న వయస్సు గల వ్యక్తులకు వేర్వేరు ప్రయోజనాలను కలిగిస్తుంది, ఇది తదుపరి చర్చించబడుతుంది.

 • కంటి దృష్టిని కాపాడుట: కంటి దృష్టి మరియు వయస్సు సంబంధిత క్షీణతలను నివారించడంలో విటమిన్ A దాని యొక్క అనేక ప్రయోజనాలకు బాగా పేరు పొందింది. ఇది కెరోటినాయిడ్లతో తయారు చేయబడుతుంది, ఇది మీ కళ్ళను కాపాడుతూ దృష్టిని రక్షిస్తుంది.
 • వృద్ధాప్యాన్ని నిరోధిస్తుంది: విటమిన్ A దాని యాంటీ ఆక్సిడెంట్ చర్యతో పాటు, చర్మం యొక్క అకాల వృద్ధాప్యాన్ని నివారించడంలో సమర్థవంతంగా ఇది కొత్త చర్మ కణాలు ఏర్పర్చడంలో ఒక ముఖ్యమైన పాత్ర కలిగి ఉంటుంది. కాబట్టి, మీకు సిఫార్సు చేయబడిన మోతాదుని మీరు తీసుకొంటూ ఉంటె, మీరు చర్మంపై ఏర్పడే చారలు మరియు ముడుతల గురించి చింతిoచడం మానుకోవచ్చు.
 • గర్భిణీ స్త్రీలు కోసం: విటమిన్ A యొక్క లోపం ముందస్తు ప్రసవ వేదన కలుగ జేయడమే కాకుండా ఇది అభ్యాస వైకల్యం వంటి జన్మ లోపాలతో సంబంధం కలిగి ఉంటుంది.
 • శిశులకు మరియు పిల్లలకు: విటమిన్ A పిల్లలలో వ్యాధులను నివారించడానికి మరియు వారి సరైన అభివృద్ధికి సహాయపడుతుంది, ఇది శిశువులలో రోగనిరోధకతను మెరుగుపరుస్తుంది.
 • మెదడు పనితీరు మేరుగుపరచుట: విటమిన్ A పిల్లల మెదడు కణాల సరైన పెరుగుదల మరియు అభివృద్ధికి దోహదపడుతుంది మరియు ఇది వయోజనులలో మెదడులో సిర్కాడియన్ రిధమ్­లను నిర్వహించడంలో సహాయపడుతుంది, ఇది ఒత్తిడిని నివారించడంలో మరియు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. 
 • మశూచిక వ్యాధిలో కలిగే వికారాన్ని తగ్గిస్తుంది: విటమిన్ A యొక్క ఇంట్రాముస్కులర్ ఇంజెక్షన్ పోషకాహారలోపు పిల్లల్లో మశూచిక వ్యాధిని తట్టుకోనేలా చేస్తుంది. ఇది వ్యాధిగ్రస్తతను నివారించడానికి మరియు వాటి మనుగడ స్థాయిని పెంచడానికి కూడా సూచించబడింది.

విటమిన్ A కళ్ళకు ప్రయోజనాలను చేకూరుస్తుంది - Vitamin A benefits for eyes in Telugu

ఇప్పటికే చెప్పినట్లుగా, సరైన దృష్టి మరియు కంటి చూపు కోసం విటమిన్ A చాలా వరకు అవసరం అవుతుంది. దాని లోపం వలన కంటికి సంబంధించిన వివిధ సమస్యలు, ముఖ్యంగా కన్ను పొడిబారడం మరియు రాత్రి వేళలందు కంటి చూపు తగ్గటం వంటివి కలుగుతాయి. విటమిన్ A కెరొటినాయిడ్లతో తయారు చేయబడుతుంది, ఇవి వాటి యాంటీ ఆక్సిడెంట్ చర్యలు మరియు రక్షణ చర్యలకు బాగా ప్రాచుర్యం చెందాయి.

మన వయస్సు పెరిగేకొలదీ, బయోలాజికల్ ఆక్సీకరణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది మరియు కంటి చూపు ప్రభావితమవుతుంది. విటమిన్ A తో వయసు మళ్ళిన కారణంగా, కలిగే మేక్యులార్ క్షీణత (అంధత్వానికి దారితీసేలా అనారోగ్యాన్ని క్రమంగా ఎక్కువ చేయు వ్యాధి) తగ్గించవచ్చు, ఇది వ్యక్తిగత కంటి దృష్టిని మంచి దృష్టిగా ఉండేలా కాపాడుకోవడానికి సహాయపడుతుంది. కెరోటేనాయిడ్ అధికగా కలిగిన ఆహారాలలో సప్లిమెంటరీ డైట్ విటమిన్ A కంటే మరింత ప్రభావవంతంగా ఉంటుంది.

వయస్సు మళ్లే వారిలోనే కాకుండా, విటమిన్ A కంటి దృష్టికి సంబంధించిన ప్రయోజనకరమైన ప్రభావాలకు ప్రసిద్ధి చెందింది. రెటీనా క్షీణత (రెటీనాలోని కణాల క్షీణత) ను తగ్గించడంలో సహాయపడుతుంది, లేకుంటే ఇది అంధత్వానికి దారి తీస్తుంది. గర్భధారణ సమయంలో ఈ విటమిన్ యొక్క తగినంత స్థాయిలు నిర్వహించడంలో ఇది చాలా ముఖ్యమైనది. గర్భధారణ సమయంలో విటమిన్ A లోపం శిశువుల్లో జన్మ సంబంధిత లోపాలకు ముఖ్యమైన ప్రమాద కారకంగా ఉంటుంది. ఏదేమైనా, అవి ఇదే రకమైన నష్టాన్ని కలిగి ఉన్నందున, మందులు తీసుకోబడవు.

విటమిన్ A రేచీకటిని నివారిస్తుంది - Vitamin A prevents night blindness in Telugu

రెటినిటిస్ పిగ్మెంటోసా (వారసత్వంగా ఉన్న లోపాల సమూహం) కారణంగా రేచీకటి అనేది రెటీనా క్షీణత యొక్క మొదటి లక్షణం. ఈ పరిస్థితిలో కంటి రెటీనా యొక్క డిజెనరేషన్ కౌమారదశలో (యుక్తవయస్సులో) లేదా యవ్వన వృద్ధాప్యంలో ప్రారంభమవుతుంది, దీని ఫలితంగా, ప్రభావిత వ్యక్తులు వారి 40 సoవత్సరాల వయసులో అంధత్వం అధికం కావచ్చు.

ఇది ఒక వారసత్వ క్రమరాహిత్యం మరియు ఈ పరిస్థితి నివారించడానికి మరింత సంబంధితంగా చేస్తుంది ఇది చిన్న పిల్లకకు కుడా ప్రభావితం అవుతుంది. ఈ పరిస్థితికి చికిత్స సమానంగా విజయవంతం కానందున, మీ ఆహారంలో మరింత విటమిన్ A ను జోడించడం ద్వారా దాని ప్రమాదాన్ని తగ్గించటం మంచిది. విటమిన్ A రెటినాల్ (మరియు దృష్టి) కోసం ఒక ఇంధనం వంటిది అని చెప్పబడుతుంది, కాబట్టి తగినంతగా తీసుకోవాలి!

చర్మం కోసం విటమిన్ A యొక్క ప్రయోజనాలు - Vitamin A benefits for skin in Telugu

విటమిన్ A బాహ్యచర్మం యొక్క ఒక సాధారణ భాగం (చర్మం యొక్క పై పోర) మరియు బాహ్య చర్మ మార్పిడి (పాత చర్మ కణాల స్థానంలో కొత్త చర్మ కణాలు చేరడం) జరుగుతుంది. ఎపిడెర్మల్ టర్నోవర్ రేటు శిశువులు మరియు చిన్నపిల్లలలో ఎక్కువగా ఉంటుంది, మరియు ఇది క్రమంగా వయసుతో పాటు తగ్గుతుంది. ఇది చర్మానికి వృద్ధాప్యం మరియు ముడతలు పడిన ఆకృతిని కలిగిస్తుంది.

విటమిన్ A మీ చర్మ కణాలను ఏర్పరచడానికి మరియు నిర్వహించడానికి సహాయపడుతుంది, ఇది ముఖం మీద చారలు వంటి గీతలు మరియు క్రీజ్లను తగ్గించడంలో సహాయపడుతుంది. చికిత్స దాని స్థాయిని పెంచే లక్ష్యంతో ఉంటుంది కనుక విటమిన్ A అనేది బాహ్య చర్మానికి ఈ ప్రక్రియలో చాలా ముఖ్యమైనది. ఉపరితల (చర్మంపై పూయబడేవి) రెటినోయిడ్ ద్రావణాలు అటువంటి వాటికి ప్రత్యామ్నాయంగా ఉంటాయి.

ఇవి (ఫ్రీ రాడికల్స్ వలన కలిగే నష్టం) మరియు UV కిరణాలు ద్వారా మీ చర్మానికి కలిగే ఆక్సీకరణ కోల్పోవడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఎపిడెర్మల్ విటమిన్ A స్థాయిలను UV కిరణాలు మరింతగా తగ్గిస్తాయి. కాబట్టి, ప్రత్యక్ష సూర్యకాంతి నుండి చర్మాన్ని రక్షించడం కూడా చర్మానికి కలిగే నష్టాన్ని తగ్గించడంలో సహాయపడవచ్చు. సమయోచిత రెటినాయిడ్  కారకాలు, రెటినోల్ డీహైడ్రైడ్ వంటి సహజ రెటినోయిక్ యాసిడ్ ప్రీకర్సర్లు లేదా రెటినోల్ వంటివి యాసిడ్ రెటినోల్స్ కంటే ప్రయోజనకరమైనవి మరియు తక్కువ చికాకు కలిగించేవిగా ఉంటాయి.

అయితే, మీ వైద్యుని సంప్రదించకుండా ఈ కారకాలను ఉపయోగించకూడదని మీరు బాగా సిఫార్సు చేయబడతారు. ఇప్పటికే విటమిన్ A కలిగి ఉన్న క్రీమ్ మరియు మాయిశ్చరైజర్ వంటి కొన్ని దుఖాణంలో లభించే ఉత్పత్తులను ఎంచుకోవచ్చు.

క్యాన్సర్ చికిత్స కోసం విటమిన్ A - Vitamin A for cancer in Telugu

కణాల పెరగటం, విభేదించుట, విస్తరణ చెందుట మరియు అపోప్టోసిస్ (కణాలు కాలానుగునంగా వాటి యంతటగా చనిపోవడం) కోసం విటమిన్ A అవసరం అవుతుంది. ఇది ఆర్గోజెనిసిస్ (వివిధ శరీర అవయవాలను ఏర్పరచుట) ప్రక్రియను నియంత్రిస్తుంది మరియు శ్లేష్మం యొక్క రోగనిరోధక ప్రతిస్పందనలో ముఖ్యమైన పాత్ర కలిగి ఉంటుంది. ఈ కారణాల వలన, ఇది క్యాన్సర్ మరియు కొన్ని జీవక్రియ సంబంధిత వ్యాధుల నివారణ మరియు చికిత్స కోసం వాడుబడుతుంది.

బీటా-కెరోటిన్ కలిగిన ఆహార పదార్థాలను తినే వ్యక్తులు క్యాన్సర్ వలన కలిగే ప్రమాదం తక్కువగా కలిగి ఉంటారు అనేది వివిధ అధ్యయనాల ద్వారా నిరూపించబడింది. ఏమైనప్పటికీ, ఈ అధ్యయనాలు కొన్ని రకాల క్యాన్సర్ల నివారణలో కెరొటెనాయిడ్లు సహాయపడుతున్నాయని కూడా సూచించబడినవి, కానీ మిశ్రమ ఫలితాలను పొందడం జరిగింది. కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాలు ఈ పదార్ధాలతో పెరుగుతాయని తెలుస్తోంది, కాబట్టి వాటి పాత్ర ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉంది.

గర్భధారణలో విటమిన్ A యొక్క పాత్ర - Vitamin A in pregnancy in Telugu

ఇంతకు ముందు చెప్పినట్లుగా, విటమిన్ A యొక్క లోపం గర్భధారణ సమయంలో చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇది చాలా అవసరమైనది. ఇది పిండంలో అనేక జన్యు లోపాలకు కారణం కావచ్చు. పిండం సంబంధిత లోపాలు మాత్రమే కాకుండా, విటమిన్ A యొక్క లోపం ముందస్తు ప్రసవ వేదన వంటి ప్రమాదాన్ని కూడా అధికం చేసే అవకాశం ఉంది (39 నుండి 40 వరకు వారాలు నిండక ముందే బిడ్డ జన్మించుట). ఇది శిశువు ఆరోగ్యానికి మరియు మనుగడకు మరింత ముప్పు కలిగిస్తుంది. అలాంటి పిల్లలలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు మరియు అభ్యాస లోపాలు ఎక్కువగా ఉంటాయి, ఇవి యుక్తవయస్సు వరకు కొనసాగుతాయి.

అందువల్ల, గర్భధారణ సమయంలో విటమిన్ A అధికంగా కలిగిన పదార్థాలను మీ ఆహారంలో చేర్చడం అవసరం, అందువల్ల మీకు ఇలాంటి దుష్ప్రభావాలు కలిగి ఉండటం గాని లేదా ఏదైనా ఔషదం తీసుకోవలసిన అవసరం గాని ఉండదు. ఎగువ జాబితా నుండి మీరు తినే ఆహార పదార్థాల సంఖ్య కేవలం పెంచవచ్చు. విటమిన్ ఎ, మీ శిశువు యొక్క ఆరోగ్యాన్ని కాపాడటంతోపాటు, తల్లికి కూడా ఎలాంటి రక్తహీనత లేదా హైపర్­టెన్షన్ వంటి ప్రమాదాలు లేకుండా చేస్తుంది, మరియు బిడ్డ యొక్క తల్లి మంచి ఆరోగ్యాన్నికలిగి ఉండేలా నిర్థారిస్తుంది.

గర్భధారణ మరియు తల్లి పాలివ్వడంలో విటమిన్ A ఇతర ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. ఒక అధ్యయనంలో, క్యారట్ పిండికట్టు యొక్క సమయోచిత వాడుక రొమ్ము నుండి ఆతురతగా పాలు త్రాగుట తగ్గించడంలో సహాయపడుతుంది. రొమ్ములో కొంత వరకు పాలు అధికంగా ఉండటం వలన, రొమ్ములో వాపు, నొప్పి మరియు గట్టి-గడ్డ వంటి ఆకారాలు కలిగి ఉండటాన్ని సూచిస్తుంది. అయితే, ఇతర పరిశోధన ప్రకారం, రొమ్ము క్రియాశీలత స్వీయ పరిమితి అని సూచిస్తుంది, కాబట్టి రొమ్ముపై క్యారట్ యొక్క సమయోచిత వాడుక చికిత్సాపరమైన సామర్థ్యం కలిగి ఉంటుందని ఎలాంటి స్పష్టత లేదు.

(ఇంకా చదవండి: రొమ్ము గడ్డలకు కారణాలు)

పిల్లల కోసం విటమిన్ A - Vitamin A for children in Telugu

శిశువులు మరియు పిల్లల సరియైన పెరుగుదల మరియు అభివృద్ధికి సహాయం చేయడానికి విటమిన్ A అవసరం అవుతుంది. ఇది చిన్ననాటి అంటువ్యాధులు మరియు అనారోగ్యాలను నివారించడంలో సహాయపడుతుంది. శిశువులు మరియు పిల్లలలో విటమిన్ A వివిధ ఆరోగ్య సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.

ఇప్పటికే ఒక ఘన రూప ఆహారం తినడం ప్రారంభించిన పిల్లలకు విటమిన్ A కలిగిన ఆహారాన్ని తీసుకోవడం తగినది. అయినప్పటికీ, శిశువుల విషయంలో, విటమిన్ A యొక్క తగినంత స్థాయిలో తల్లి ద్వారా విటమిన్లను తీసుకోవడం ద్వారా నిర్వహించబడతాయి. అందువల్ల, పాలిచ్చే తల్లులకు రోజువారిగా తీసుకోవలసినదిగా సిఫార్సు చేయబడిన దాని కంటే ఎక్కువ అవసరం అవుతుంది. పాలులో కెరోటినాయిడ్స్ యొక్క స్థాయిలను పెంచడానికి రోజుకు కనీసం 1300 ఎమ్­సిజి రెటినోల్ అధికంగా కలిగిన ఆహారాన్ని రోజూ తీసుకోవటాన్ని సిఫార్సు చేయబడతారు.

తల్లి పాలివ్వడంలో విటమిన్ A యొక్క ఆహార సప్లిమెంట్ అనేది రోగనిరోధక పనితీరు మరియు పిల్లల్లో యాంటీ ఆక్సిడెంట్ పనితీరును మెరుగుపరుస్తుంది అనేది తెలిసిన విషయమే. అధిక మోతాదులో కూడా శిశువుల్లో గుర్తించదగిన ఎలాంటి ప్రమాదాలు కనిపించవు, అయినప్పటికీ, 3000 mcg కన్నా ఎక్కువ మోతాదుని తీసుకోరాదు.

మెదడు కోసం విటమిన్ A - Vitamin A for the brain in Telugu

విటమిన్ A అనేది మీ మెదడుకు చాలా అవసరమైన విటమిన్. మెదడు మీద దాని ప్రభావాలు జీవితం యొక్క అన్ని దశలలో చెప్పదగినది. ఇది బాల్యo మరియు శైశవంలో చాలా ముఖ్యమైన పాత్ర, కలిగి ఉంటుంది. ఇది యుక్తవయసులో కూడా మెదడు యొక్క సరైన పనితీరు మరియు సామర్థ్యాన్ని కలిగి ఉండేలా సహాయపడుతుంది.

(ఇంకా చదవండి: మెమరీ కోల్పోవటం)

పెద్దవారిలో మెదడులో ఏది ఏమయినప్పటికీ, మార్పు సంభవించే అవకాశం తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ, వయోజనులలో కూడా కొన్ని మార్పులు సాధ్యమే, ఇది నాడీ ప్లాస్టిసిటీ అని పిలువబడుతుంది, ఇది పెద్దవారిలో మెమరీ మరియు పనితీరుని నియంత్రిస్తుంది. ఇంతే కాకుండా, విటమిన్ A కూడా సర్కాడియన్ గమనం నిర్వహించడంలో సహాయపడుతుంది, ఇది మీ నిద్రను మరియు ఆహారపు చక్రాన్ని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. అందువలన, మీ మెదడు పనితీరును మెరుగుపర్చడానికి మీ ఆహారంలో ఎక్కువ విటమిన్ A ను చేర్చడం మంచిది. ఇది సిర్కాడియన్ గడియారాన్ని క్రమబద్దీకరించడంలో సహాయపడుతుంది, అనేక శరీర విధులు మెరుగుపరుస్తుంది మరియు నిద్రను నియంత్రించడానికి సహాయపడుతుంది.

(ఇంకా చదవండి: నిద్రలేమికి కారణాలు)

మశూచికం చికిత్స కోసం విటమిన్ A - Vitamin A for measles in Telugu

మశూచికం వ్యాధికి టీకాలు మరియు నివారణ చర్యలు లభ్యత ఉన్నప్పటికీ, భారతదేశంలో చాలా ప్రబలంగా ఉన్న ఒక అంటు వ్యాధి. ఇది ఒక తీవ్రమైన వైరల్ వ్యాధి మరియు శిశువుల్లో మరణం యొక్క ప్రమాదాన్ని పెంచుతుంది.  ప్రతీ ఏడాది భారతదేశంలో 5000 కంటే ఎక్కువ కేసులు రిపోర్ట్ చేయబడుచున్నాయి, మరియు విటమిన్ A లోపం మరియు పోషకాహారలోపం గల పిల్లలలో స్థిరముగా గుర్తించబడ్డాయి.

పోషకాహారలోపం ఉన్న పిల్లలలో విటమిన్ A యొక్క ఇంజెక్షన్లు కండరాల లోపల పరీక్షించబడినవి. వారు గణనీయంగా మశూచికం తగ్గిపోవడాన్ని గుర్తించారు. వారిలో మృతుల సంఖ్య తగ్గిపోతుంది మరియు వారి యొక్క మనుగడ రేటు మెరుగుపడింది.

(ఇంకా చదవండి: వ్యాధి సంక్రమణకు చికిత్స)

వృద్ధుల చికిత్స కోసం విటమిన్ A - Vitamin A for the elderly in Telugu

విటమిన్ A సప్లిమెంట్ వలన వృద్ధులకు అనేక ఆరోగ్య సంబంధిత ప్రయోజనాలు ఉన్నాయి. విటమిన్ A ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్­గా చర్మ వృద్ధాప్య ప్రభావాలను తగ్గిస్తుంది. ఇది చర్మం గట్టిగా మరియు మృదువైన వ్యక్తిగత వయసులో ఉంచడంలో సహాయపడుతుంది.

వృద్ధాప్యంలో దృష్టి సంబంధిత వ్యాధులను నివారించడంలో విటమిన్ A కూడా సహాయపడుతుంది మరియు రెటినాల్ క్షీణత మరియు అంధత్వాన్ని తగ్గిస్తుంది. ఇది కాకుండా, విటమిన్ A మెదడులో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గించడం ద్వారా వృద్ధులలో (మెదడు పనితీరును మరియు మెమరీ సంబంధించిన) కాగ్నిటివ్ రుగ్మతలు నిరోధించడంలో పని చేస్తుంది.

ఆక్సిడెటివ్ ఒత్తిడి తగ్గిపోయిన మెమరీ మరియు జ్ఞానం కోసం ఒక ప్రత్యేక వయస్సుగా బాధ్యత వహిస్తుంది. అందువల్ల, వారి మానసిక మరియు శారీరక పనితీరును మెరుగుపరుస్తుంది కనుక వృద్ధులకు విటమిన్ A ముఖ్యమైనది.

రెటినోల్ నందు విటమిన్ A అధికంగా ఉండడం వలన క్రింది దుష్ప్రభావాలను కలిగించవచ్చు:

శరీరంలో విటమిన్ A పెద్ద మొత్తాలలో నిల్వ చేయబడినట్లయితే కాలేయ నష్గ్తం వంటి తీవ్రమైన దుష్ప్రభావాలు సంభవించవచ్చు. ఇటువంటి సందర్భాల్లో నాడీ వ్యవస్థ యొక్క లోపాలు కూడా సాధ్యమే, మరియు బోలు ఎముకల వ్యాధి వృద్ధి చెందే ప్రమాదం పెరుగుతుంది.

రక్తంలో విటమిన్ A యొక్క అధిక మోతాదు ఉన్నప్పుడు తక్కువ ఆక్సిజన్ సంతృప్త స్థాయిలను కలిగిస్తుంది, ఇది పిల్లల్లో శ్వాస తీసుకోవటానికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. అందుచే, ప్రత్యేకంగా న్యుమోనియా నుండి బాధపడుతున్న లేదా కోలుకోవడం కోసం విటమిన్ A ఎక్కువగా పిల్లలకి ఇవ్వాల్సిన అవసరం లేదు,

(ఇంకా చదవండి: శ్వాసలోపం యొక్క చికిత్స)


Medicines / Products that contain Vitamin A

వనరులు

 1. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Vitamin A
 2. Duerbeck NB, Dowling DD. Vitamin A: too much of a good thing? Obstet Gynecol Surv. 2012 Feb;67(2):122-8. PMID: 22325302
 3. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Vitamin A
 4. National Institutes of Health; Office of Dietary Supplements. [Internet]. U.S. Department of Health & Human Services; Vitamin A.
 5. World Health Organization [Internet]. Geneva (SUI): World Health Organization; Vitamin A deficiency.
 6. Clare Gilbert. The eye signs of vitamin A deficiency. Community Eye Health. 2013; 26(84): 66–67. PMID: 24782581
 7. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Vitamin A
 8. Eggersdorfer M, Wyss A. Carotenoids in human nutrition and health.. Arch Biochem Biophys. 2018 Aug 15;652:18-26. PMID: 29885291
 9. Wu J, Cho E, Willett WC, Sastry SM, Schaumberg DA. Intakes of Lutein, Zeaxanthin, and Other Carotenoids and Age-Related Macular Degeneration During 2 Decades of Prospective Follow-up. JAMA Ophthalmol. 2015 Dec;133(12):1415-24. PMID: 26447482
 10. Zhou YM, Huang YF. Research on natural antioxidants in the treatment of retinal degeneration. Zhonghua Yan Ke Za Zhi. 2018 Apr 11;54(4):312-315. PMID: 29747361
 11. Kaukonen M et al. Maternal Inheritance of a Recessive RBP4 Defect in Canine Congenital Eye Disease.. Cell Rep. 2018 May 29;23(9):2643-2652. PMID: 29847795
 12. Sorg O, Saurat JH. Topical retinoids in skin ageing: a focused update with reference to sun-induced epidermal vitamin A deficiency. Dermatology. 2014;228(4):314-25. PMID: 24821234
 13. Radhika MS, Bhaskaram P, Balakrishna N, Ramalakshmi BA, Devi S, Kumar BS. Effects of vitamin A deficiency during pregnancy on maternal and child health. BJOG. 2002 Jun;109(6):689-93.
 14. Oliveira LM, Teixeira FME, Sato MN. Impact of Retinoic Acid on Immune Cells and Inflammatory Diseases. Mediators Inflamm. 2018 Aug 9;2018:3067126. PMID: 30158832
 15. World Health Organization [Internet]. Geneva (SUI): World Health Organization; Vitamin A supplementation in infants and children 6–59 months of age.
 16. Drugs and Lactation Database (LactMed) [Internet]. Bethesda (MD): National Library of Medicine (US); 2006-. PMID: 30000990
 17. McCaffery P, Zhang J, Crandall JE. Retinoic acid signaling and function in the adult hippocampus. J Neurobiol. 2006 Jun;66(7):780-91. PMID: 16688774
 18. Shearer KD, Stoney PN, Morgan PJ, McCaffery PJ. A vitamin for the brain. Trends Neurosci. 2012 Dec;35(12):733-41. PMID: 22959670
 19. Ransom J, Morgan PJ, McCaffery PJ, Stoney PN. The rhythm of retinoids in the brain. J Neurochem. 2014 May;129(3):366-76. PMID: 24266881
 20. Bichon A et al. Case report: Ribavirin and vitamin A in a severe case of measles. Medicine (Baltimore). 2017 Dec;96(50):e9154. PMID: 29390321
 21. Stephensen CB et al. Adverse effects of high-dose vitamin A supplements in children hospitalized with pneumonia. Pediatrics. 1998 May;101(5):E3. PMID: 9565436
Read on app