కడుపు ఉబ్బరం అనేది కడుపు నిండుగా లేదా బిగువుగా ఉన్నట్లు అనిపించే ఒక భావన. ఇది కడుపులో వాయును పెంచి పొట్ట ఉబ్బేలా చేస్తుంది లేదా వాయువులను తగ్గించి పొట్టను చదరంగా  చేస్తుంది. మనందరికీ మన బొజ్జను దిండుతో గాని సంచితో గాని దాచిన ఒక సందర్భం ఉంటుంది. కొవ్వు పొట్ట లేదా బొజ్జ మనం వదించుకోవాలనుకుంటున్న దానిలో ఒకటి. ఇది కడుపు వాయువు, మలబద్ధకం, నీరు నిలుపుదల, అజీర్ణం, కొవ్వు చేరడం మొదలైన వాటి వల్ల సంభవిస్తుంది. శారీరక వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం, మరియు అంతర్లీన వైద్య పరిస్థితుల చికిత్స మీ ఉబ్బరాన్ని నయం చేస్తుంది.

  1. ఏవి కడుపు ఉబ్బరాన్ని కలిగిస్తాయి? - What causes bloating in the stomach in Telugu
  2. కడుపు ఉబ్బరానికి ఇంటి చిట్కాలు - Home remedies for bloating in Telugu
  3. ఉబ్బరాన్ని తగ్గించే ఆహారాలు - Foods that reduce bloating in Telugu
  4. ఉబ్బరాన్ని తగ్గించే మూలికలు - Herbs that reduce bloating in Telugu
  5. ఉబ్బరాన్ని ఎలా నివారించాలి - How to prevent bloating in Telugu

కడుపు ఉబ్బరం ఈ క్రింది కారణాల వల్ల కలుగవచ్చు

ప్రాసెస్డ్  ఫుడ్

జంక్ లేదా ఫాస్ట్ ఫుడ్స్ లో ట్రాన్స్ కొవ్వు (ట్రాన్స్ ఫ్యాట్), సంరక్షణకారులు (ప్రిజర్వేటివ్స్), కృత్రిమ సంకలనాలు (ఆర్టిఫిసియల్ ఎడిటివ్స్), పంచదార వంటి అనేక అనారోగ్యకరమైన పదార్ధాలు ఉంటాయి అవి క్యాలరీలో అధికంగా ఉంటాయి. ఇది పూర్తిగా జీర్ణం కావాడానికి మరియు జీర్ణ వ్యవస్థ నుండి పూర్తిగా బయటకు వెళ్లడానికి చాలా సమయం పడుతుంది. అందువల్ల, ఉబ్బరాన్ని నివారించడానికి సాధ్యమైనంత వరకు జంక్ ఫుడ్ నుండి దూరంగా ఉండటం మంచిది

అధిక పీచు పదార్థం తీసుకోవడం

గ్యాస్ట్రోఎంటరాలజీ మరియు హెపాటాలజీ పై మరొక జర్నల్ కొన్ని సాధారణ చక్కెరలు, ఆహార ఫైబర్స్ (ధాన్యపు, బీన్స్, వోట్స్, మొదలైనవి), మరియు కొన్ని సంక్లిష్ట (complex ) పిండిపదార్ధాలు వంటివి చిన్న ప్రేగులలో గ్రహించబడవు అవి పెద్దప్రేగులో బాక్టీరియాకు ఆహారంగా తయారుఅవుతాయి అని వివరిస్తుంది. ఈ బ్యాక్టీరియా వాటిని పులియబెట్టి (ferment ) మరియు వాయువును ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల, పై ఉత్పత్తులు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వలన ఉబ్బరం తగ్గుతుంది.

బాక్టీరియా అధిక పెరుగుదల

కొన్నిసార్లు, ప్రేగులలో అధికముగా పెరిగిన బాక్టీరియా ఎక్కువ మోతాదులో వాయువును ఉత్పత్తి చేసి, కడుపు ఉబ్బరాన్ని కలిగిస్తుంది.

ఋతుక్రమములో ఉబ్బరం

మీ శరీరంలో సెక్స్ హార్మోన్ల స్థాయిని మారినప్పుడు కడుపును సాగినట్లుగా చేసి ఉబ్బరం కలిగినట్లు చేస్తుంది. ప్రొజెస్టెరాన్ శరీరం నుండి అదనపు ద్రవాలను బయటకు పంపించడంలో సహాయపడుతుంది.దీని శాతం మీ రుతుక్రమం మొదలైయ్యే ముందు తగ్గి శరీరంలో ద్రావాలని నిల్వ ఉంచేసి కడుపు ఉబ్బరాన్ని కలిగిస్తుంది.

ప్రేగులలో వాపు

ప్రేగుల యొక్క వాపు అసాధారణ ప్రేగు కదలికలకు కారణమవుతుంది మరియు ఆహారాన్ని సులభంగా ప్రేగుల గుండా వెళ్ళనివ్వదు. ఇది కడుపు నిండుగా మరియు బిగుతుగా ఉన్న భావనను కలిగిస్తుంది.

మలద్ధకం

శరీరంలో జీర్ణమైన ఆహరం తోలగించడంలోని క్షీణతను మలబద్ధకం అని పిలుస్తారు. మీ మలం యొక్క సాంద్రత గట్టిగా మారినప్పుడు మలబద్దకం సంభవిస్తుంది మరియు మీ శరీరం నుండి వ్యర్థాలను పూర్తిగా తొలగించడానికి మీకు కష్టముగా మరియు బాధాకరముగా ఉంటుంది.

ఆలస్యంగా కడుపును ఖాళీచెయ్యడం

కొన్నిసార్లు, మీ ప్రేగు కండరములు లేదా నరములు సరిగా పని చేయకపోయినా లేదా మీ ప్రేగుల కండరాలు వ్యాకోచానికి గురైనప్పుడు, మీ కడుపు నుండి ఆహారము మీ ప్రేగుల నుండి వెళ్లకుండా నివారించబడుతుంది. ఇది ఉబ్బరానికి దారితీస్తుంది.

కొవ్వు చేరడం

పెద్దమొత్తంలో జంక్ ఫుడ్ మరియు ట్రాన్స్ కొవ్వును తీసుకోవడం వలన మీ కడుపులో కొవ్వు పెరుగుతుంది మరియు ఉబ్బరం కలిగిస్తుంది.

ధూమపానం

మీ సిగరెట్లోని పొగ మీ ఊపిరితిత్తులకు మాత్రమే హాని కలిగించదు అది మీ జీర్ణ వ్యవస్థకు కూడా హానికరం. ధూమపానంలో, పొగను కూడా పీల్చుకోవడం మాత్రమే కాకుండా జీర్ణ వ్యవస్థ లోకి కూడా మ్రింగివేయబడుతుంది అది కడుపు ఉబ్బరాన్ని కలిగిస్తుంది.

అజీర్ణం

కొందరు వ్యక్తులు లాక్టోస్ (పాలు మరియు ఇతర ఉత్పత్తులలో దొరుకుతుంది), గ్లూటెన్, బీన్స్, తదితర ఆహార పదార్థాల సంకుచితత్వం (intolerance)తో బాధపడుతారు మరియు వాటిని కష్టంగా జీర్ణం చేసుకుంటారు. ఇది సీన్స్ (crohn’s)వ్యాధి వంటి జీర్ణవ్యవస్థ యొక్క రుగ్మత కారణంగా కూడా సంభవించవచ్చు.ఇది ఉబ్బరానికి దారితీస్తుంది.

నీరు నిలుపుదల

అధిక చక్కెర లేదా ఉప్పును తినడం వల్ల శరీరంలో ముఖ్యంగా బొడ్డు ప్రాంతంలో నీటి నిలుపుదలకు మరియు ఉబ్బరానికి కారణం అవుతుంది.

మద్యపానం

అధిక ఆల్కహాల్ తీసుకోవడం, కాలేయం మరియు ప్యాంక్రియాస్ వంటి జీర్ణ అవయవాలను సాధారణ పనితీరుతో జోక్యం చేసుకుంటుంది. అందువలన ఆహారపు జీర్ణ ప్రక్రియకు ఇబ్బంది కలిగి ఉబ్బరం కలిగిస్తుంది.

Digestive Tablets
₹314  ₹349  9% OFF
BUY NOW

మా జాబితాలో కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి,అవి ఉబ్బరం మూల కారణాన్ని తీసివేయడంతో పాటు మీరు ఉబ్బరాన్ని వదిలించుకోవడానికి సహాయపడుతుంది:

నీరు త్రాగాలి

శరీరంలో నీటి శాతాన్ని ఎక్కువగా ఉంచుకుంటే అది కొవ్వు చేరకుండా చేసి, అధికంగా ఉన్న చెక్కెరలు మరియు ఉప్పులను బయటకు పంపివేస్తుంది అలాగే ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తుంది .

ధ్యానం

కడుపు ఉబ్బరం ఉన్న ప్రజలలో నిర్వహించిన ఒక అధ్యయనం ఒత్తిడి, ఆందోళన మరియు భావోద్వేగ సమస్యలు, వాటికి కడుపు ఉబ్బరం కలిగించే సంబంధం గురించి తెలియసేసింది. అయితే, కడుపు ఉబ్బరం వాటికి ప్రధాన కారణం కాదు, కానీ అలాంటి వ్యక్తుల్లో అది చాలా సాధారణం. అందువల్ల, మీ ఒత్తిడిని తగ్గిచుకోవడం వలన ఉబ్బరం మెరుగుపడుతుంది. ధ్యానం, సంగీతం, యోగ, విశ్రాంతి చికిత్స (relaxation therapy), సలహా సమావేశం (counselling) మొదలైనవి మీ ఒత్తిడిని తగ్గించే అనేక మార్గాలు.

మర్దన

పెద్దప్రేగులో ఆహారాన్ని తరలించడానికి మర్దన సహాయపడుతుంది. మీరు మీ పొత్తికడుపు పై వృత్తాకార కదలికలో మీ కడుపు కుడివైపు మర్దనా చెయ్యడం మొదలుపెట్టి మీ పాక్కటెముల వరకు చెయ్యాలి.

యోగ

యోగ మీ రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది మరియు అందువల్ల అంటువ్యాధులు మరియు వాపును ఎదుర్కొనేందుకు శరీర సామర్థ్యాన్ని పెంచుతుంది. ముందుకు వెనుకకు, మీ వీవుభాగం మీదకు ఒంగడం మరియు మీ ఛాతీకి దగ్గరగా మోకాలును తెచ్చుకోవడం లేదా వాటిని ఒక వైపుకు మడవాడం మరియు మీ తలను తిప్పడం వంటివి వ్యాయామాలు మీ కడుపుకు రక్త ప్రసరణ మెరుగుపరచడానికి మరియు ఉదర కండరాలు బలిష్ఠం చెయ్యడానికి సహాయ పడతాయి.

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా అనేది మా కడుపులో యాసిడ్తో పోరాడుతూ, ఉబ్బరం కలిగించే కారణాలలో ఒకటైన ఆమ్లత్వం నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. ఉబ్బరం కోసం ఒక కప్పు వేడి నీటిలో ఒక టీస్పూన్ బేకింగ్ సోడా వేసి వెంటనే త్రాగాలి. ఇలా ప్రతి రోజు చెయ్యాలి

కొబ్బరి నూనె

కొబ్బరి నూనె కూడా సహజమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎజెంట్లలో ఒకటి, ఇది మీ ప్రేగుల్ని మెత్తబర్చి తద్వారా ఉబ్బరాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. మీరు ఒక టీ స్పూన్ కొబ్బరి నూనెను త్రాగవచ్చు లేదా సలాడ్ కు జోడించవచ్చు లేదా ఒక పళ్ళ రసంలో కలపి తీసుకోవచ్చు.

ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్ జీర్ణతను మెరుగుపరచడంలో సహాయపడే లక్షణాలను కలిగి ఉంది. ఉబ్బరాన్ని తగ్గించడానికి, ప్రతిరోజూ ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ ఒక గ్లాసు వెచ్చని నీటితో కలిపి తాగవచ్చు.

ఆముదం నూనె

ప్రేగు మంట వ్యాధి (irritable bowel syndrome) చికిత్సలో గాస్టరోఎంటరోలాజికి సంబంధించిన ఒక పత్రిక, ఆముదం నూనె మీ ప్రేగు కోసం ఒక భేదిమందుల పనిచేస్తుంది మరియు సులభంగా ప్రేగులలో వాటిని బయటకు పంపడానికి సహాయపడుతుందని అందువల్ల, ఇది ఉబ్బరాన్ని నిరోధిస్తుందని సూచించింది. మీకు దాని రుచితో ఇబ్బంది ఆముదం నూనెను ఒక టీస్పూన్ త్రాగవచ్చు లేదా పళ్ళ రసంలో కలుపుకొని తాగావచు.

డిటాక్స్ రసం

డిటాక్స్ రసం అనేక ప్రయోజనాలను కలిగి ఉండే ప్రభావవంతమైన పానీయం. ఇది మీ ప్రేగుల్ని మెత్తబార్చి ఉబ్బరాన్ని తగ్గించడమే కాక శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది, మలబద్ధకం నుండి ఉపశమనం కలిగించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇంట్లో డిటాక్స్ రసం చేయడానికి, మీరు ఒక దోసకాయ, ఒక నిమ్మకాయ మరియు రెండు ఆపిల్ పండులను కలిపి మిశ్రమంలా చెయ్యాలి. నిమ్మకాయ శరీరం నుండి అదనపు ఉప్పును తొలగించడంలో సహాయపడుతుంది మరియు ఒక భేదిమందుల (laxative)లా పనిచేస్తుంది.

అరటి

అరటి పొటాషియం యొక్క గొప్ప మూలం మరియు ఉబ్బరానికి కారణమయ్యే ఉప్పు సంబంధిత నీటిని నిలువరించడంలో చాలా ప్రభావవంతమైనది. అరటిని తినడం వల్ల శరీరం నుండి అదనపు సోడియంను బయటకు పంపించి మరియు ఉబ్బరం తగ్గించడంలో సహాయం చేస్తుంది. 1-2 అరటి ప్రతి రోజు తినండి. ఎక్కువగా అరటిని తినడం కూడా మలబద్ధకానికి దారి తీయవచ్చు.

ప్రోబయోటిక్స్

ప్రోబయోటిక్స్ ఇటీవలే సూపర్ బాక్టీరియాగా ఉద్భవించాయి, ఇది మీ కడుపులో ఉన్న చెడు పురుగులను చంపి, మీ ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. గాస్ట్రోఎంట్రాలజీ కి సంభందించిన ప్రేగు మంట వ్యాధి (irritable bowl syndrome) యొక్క చికిత్సలో కడుపు సమస్యలను పరిష్కరించడంలో ప్రోబయోటిక్స్ ప్రభావవంతమైనవి అని ఒక పాత్రిక సూచిస్తుంది. అవి కడుపు వాయువు మరియు అంటురోగాల అభివృద్ధిని నిరోధిస్తాయి. ప్రోబయోటిక్ సప్లిమెంట్స్ పానీయాలు, క్యాప్సూల్స్, మొదలైన రూపాలలో అందుబాటులో ఉన్నాయి.వాటి మోతాదు విషయంలో ఏవైనా అనుమానాలు ఉంటె వాటి ప్యాకింగ్ పై సూచనలను చదవండి లేదా మీ వైద్యుడిని సంప్రదించండి.

గుమ్మడికాయ

గుమ్మడికాయలో ఫైబర్ మరియు పొటాషియం అధికంగా ఉంటుంది. గుమ్మడికాయ యొక్క ఫైబర్ జీర్ణక్రియలో సహాయపడుతుంది మరియు పొటాషియం మీ శరీరం నుండి అదనపు సోడియంను తొలగించడం ద్వారా ఉప్పులను సంతులనం చేయడంలో సహాయపడుతుంది.

గ్రీన్ టీ

గ్రీన్ టీ యాంటియోక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. ఇది మూత్రపు ఉత్పాదనను మెరుగుపరస్తుంది అందుచేత శరీరంలో ఉన్న అదనపు ఉప్పును విడుదలకు ఉపయోగపడుతుంది. అదనపు ఉప్పు నీరు నిలుపుదలకు మరియు ఉబ్బరంమునకు కారణమవుతుంది. గ్రీన్ టీ రోజుకు మూడు సార్లు తాగితే ఉబ్బరం నుండి ఉపశమనం కలుగుతుంది.

పళ్ళ రసం

పైనాపిల్ మరియు నారింజ రసం వంటి పండ్ల రసాలు మీ కడుపు యొక్క వాపును తగ్గిస్థాయి. ఒక కప్పు పళ్ళ రసంలో ఒక కప్పు నీటిని కలిపి చేసి ప్రతిరోజు త్రాగాలి. దానిని ఖాళీ కడుపుతో త్రాగకూడదు అది ఆమ్లతను కలిగించవచ్చు.

కివి పండు

గ్యాస్ మరియు ఉబ్బరం పై కేంద్రీకరించబడిన గ్యాస్ట్రోఎంటరాలజీ మరియు హెపాటాలజీ పత్రికలో, ఉబ్బరం నుండి ఉపశమనం కలిగించడంలో కీవి పండు యొక్క సారం సానుకూల ప్రభావాలు కలిగి ఉందని ఆధారాలు ఉన్నాయి.

అల్లం

అపానవాయువు (పిత్తుల) చికిత్స పై జర్నల్ కూడా ప్రేగుల యొక్క వాపును తగ్గించడంలో అల్లం సహాయపడి మరియు ఉబ్బరం నుండి ఉపశమనాన్ని అందిస్తుందాని తెలియజేసింది.ఇది భారతదేశంలో విస్తృతంగా ఉపయోగించే మూలికలలో ఒకటి. దాని రుచి మీకు ఇబ్బంది కలిగించకపోతే, అల్లం ముక్కలు కొన్ని తినడం వలన ఉబ్బరం తగ్గించటానికి సహాయపడతాయి. మీరు అల్లం టీ ని కూడా తయారు చేసుకోవచ్చు. దాని కోసం, ఒక కప్పు నీటికి అల్లం ఒక అంగుళం ముక్కను జోడించండి. 3-5 నిమిషాలు దాన్ని మరగబెట్టాలి. రుచి మెరుగుపరచడానికి తేనె మరియు నిమ్మరసం కూడా చేర్చవచ్చు. అది చల్ల బడకుండా రోజుకు మూడు సార్లు త్రాగండి.

సోంపు గింజలు

సోంపు గింజలు జీర్ణక్రియలో సహాయం చేస్తాయని,అపానవాయువు నివారణ కోసం ఇటీవలే ప్రచురించబడిన ఒక పత్రిక పేర్కొంది. మీరు సోంపు గింజలను నమలవచ్చు లేదా సోంపు టీ ని త్రాగవచ్చు. టీ ని తయారు చేసేందుకు, ఒక కప్పు నీటిలో ఒక సగం చెంచా నలగోట్టిన సోంపు గింజలు వేసి కొద్ధి నిమిషాలు మరిగించాలి. అది చల్ల బడకుండా రోజుకు రెండు సార్లు త్రాగాలి.

మిరియాలు

జీర్ణాశయ వ్యాధులు మరియు సైన్స్ యొక్క ఒక పాత్రిక, మిరియాల టీ జీర్ణ వ్యాధులపై దాని ప్రభావాన్నీ చూపి మరియు గ్యాస్ విడుదలకు మరియు కండరాల నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుందని తెలిపింది. ఇది ప్రేగుల లోని వాటిని సుఖభంగా బయటకు పంపడానికి సహాయపడుతుంది మరియు ఉబ్బరం తగ్గిస్తుంది.మీరు మిరియాల ఆకులు తీసుకొని నీళ్లలో ఉడక బెట్టి టీ ల చేసుకొని రోజుకి మూడు సార్లు త్రాగవచ్చు.

సీమ సోంపు గింజలు (caraway seeds)

సీమ సోంపు గింజలు మలబద్ధకం, ఉబ్బరం, గ్యాస్, గుండె మంట మొదలైన వాటిని నివారించడంలో సహాయపడతాయి. వీటిని తినవచ్చు లేదా నూనెగా తీసుకోవచ్చు.

అనాస పువ్వు

అనాసపువ్వు ప్రేగుల కండరాలను వాదులు చేసి, జీర్ణ వ్యవస్థలో ఆహరం సులభంగా ప్రయాణించడానికి సహాయపడుతుంది. అనాసపువ్వు టీ కోసం, ఒక కప్పు వేడి నీటితో ఒక టీ స్పూన్ అనాసపువ్వును వేసి, 5-10 నిముషాలు మరిగించాలి. ఈ టీని 2-3 సార్లు తాగాలి. ఇలా చేయడం వలన ఉబ్బరం తగ్గిపోతుంది.

కలబంద

కలబందకి యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు చిన్న భేదిమందు (laxative) చర్యలు ఉన్నాయి.ఇది మీ ప్రేగులను మెత్తగా చెయ్యడం మరియు మలబద్ధకం ఉపశమనం కోసం సహాయపడుతుంది. సగం లేదా పావు కప్పు కలబంద రసం తాగడం అనేది ఉబ్బరం తగ్గుదలకు సహాయపడుతుంది.

వేడి నిమ్మ నీరు

నిమ్మకాయ సహజమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫలం. ఇది శరీరం నుండి అధికం గా ఉన్న ఉప్పులను బయటకు పంపడంలో సహాయం చేస్తుంది. అధిక ఉప్పు శాతం కూడా ఉబ్బరానికి కారణం కావచ్చు.ఉబ్బరం నుండి ఉపశమనం పొందటానికి ఒక గ్లాసు వేడి నీటిలో ఒక నిమ్మకాయ పిండి, ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో త్రాగాలి.

చామంతి, తులసి, జీలకర్ర, పార్స్లీ, స్పర్మింట్ మొదలైనవి కూడా కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. ఈ మూలికలు టీ లేదా ఇతర ఆహార పదార్ధాలకి జోడించి ఉపయోగించవచ్చు, అవి  పెరుగు, మజ్జిగ, సలాడ్, మొదలైనవి
 

Probiotics Capsules
₹599  ₹770  22% OFF
BUY NOW

ఆరోగ్యకరమైన సమమైన పొట్ట కోసం మరియు ఉబ్బరాన్ని నివారించడం కోసం అనేక ఆహార మరియు జీవనశైలి మార్పులను చెయ్యాలి. పొట్ట పెరుగుదలను నిరోధించడానికి మీకు సహాయపడే కొన్ని విషయాల జాబితా క్రింద ఉంది.

పాల ఉత్పత్తులు మానండి

చాలామందికి ఇది తెలియదు, కానీ వారు లాక్టోజ్ అసహనం కలిగి ఉండవచ్చు, అనగా పాలు మరియు పాల ఉత్పత్తులను జీర్ణం చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు, ఇది ఉబ్బరానికి మూలమైన కారణం కావచ్చు. అందువల్ల, పాల ఉత్పత్తులు తీసుకున్న తర్వాత మీ పొట్ట ఎలా ఉందో గమనించండి. మీరు ఏవైనా వ్యత్యాసం గమనిస్తే కొన్ని వారాల పాటు మీ ఆహారాన్నిండి వాటిని తొలగించండి.

భారీ భోజనాన్ని మానేయాలి

భారీ భోజనం కడుపు నిండుదలకు కారణమవుతుంది మరియు జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇది ఆహారాన్ని ఆలస్యంగా కడుపు నుండి ఖాళీ చేస్తుంది మరియు ఉబ్బరంనికి దారితీసే అజీర్ణానికి కూడా కారణం కావచ్చు. అందువల్ల ఒకేసారి పెద్ద మొత్తంలో భోజనం చెయ్యడం కంటే చిన్న చిన్నగా ఎక్కువ సార్లు తినాలి.

ప్యాకేజ్డ్ ఆహారం మానేయాలి

చాలా సార్లు ప్యాక్డ్ ఆహార ఉత్పత్తులు సంరక్షణకారిణులను (preservatives) మరియు కృత్రిమ ఆహార పదార్థాలను కలిగి ఉంటాయి. అవి మీ జీర్ణాశయానికి సరిపడక, వాయువును, మలబద్ధకం, లేదా అజీర్ణం మీ జీర్ణాశయ పూత యొక్క వాపుకు దారితీస్తాయి. అందువల్ల, ఉబ్బరంతో భాదపడుతున్నపుడు ప్యాక్డ్ ఆహార ఉత్పత్తులను నివారించడం మంచిది.

చక్కెర తీసుకోవడం తగ్గించండి

ఇదితీపి ఇష్టపడే వారికి ఆనందంగా అనిపించకపోవచ్చు, కానీ చక్కెర తీసుకోవడాన్ని పరిమితం చేస్తే కడుపు ఉబ్బరం తగ్గించడంలో మీకు సహాయపడుతుంది. ఎందుకంటే ఎక్కువ చక్కెర తీసుకోవడం వలన శరీరంలో ముఖ్యంగా ముఖం,పొట్ట మరియు మెడ ప్రాంతంలో నీటి నిలుపుదల పెరుగుతుంది.

ఉప్పు తీసుకోవడం తగ్గించండి

అధిక ఉప్పు తీసుకోవడం అనేది చక్కెర లాంటి ప్రభావాన్ని కలిగి ఉంటుంది. నీరు నిలుపుదల ఉబ్బరానికి దారితీస్తుంది అందుకే, మీ ఆహారంలో ఉప్పు శాతం తగ్గించడం మంచిది.

నీరు త్రాగాలి

తగినంత నీరు త్రాగడం వలన శరీరంలో కొవ్వు చేరడాన్ని తగ్గించి అలాగే అధిక చెక్కెర మరియు ఉప్పులను బయటకు పంపి ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.

భోజనం చేసేటప్పుడు నీరు త్రాగవద్దు

భోజనం చేసేటప్పుడు కొంచెం కొంచెం నీటిని సేవించడం పెద్ద సమస్య కాదు, కానీ ఒక గ్లాసు లేదా రెండు గ్లాసుల నీటిని తాగితే జీర్ణ ప్రక్రియను ఆటంకపరుస్తుంది మరియు ఉబ్బరం కలిగించవచ్చు. అందువల్ల, మీ జీర్ణాశయ రసాలు పల్చబడకుండా ఉండడానికి తినేటప్పుడు అధిక శాతంలో నీరు తీసుకోకుండా ఉండాలి.

మద్యపానం ఆపండి

మద్యపాన వ్యసనం మరియు ఆల్కహాల్ దుర్వినియోగం యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ (National Institute of Alcoholism and Alcohol Abuse) యొక్క ఒక వ్యాసం ప్రకారం, మద్యపానం అనేది శరీరంలోని జీర్ణ మరియు ఇతర జీవక్రియల విధులతో సంబంధం కలిగి ఉంటుందని, తత్ఫలితంగా, ఆహారం సరిగా జీర్ణించబడదు మరియు ఇతర తీవ్రమైన వ్యదులతోపాటు ఉబ్బరం కలిగించే విధంగా కాలేయం లోపల మరియు వెలుపల కొవ్వును ఏర్పరచే ప్రమాదం కూడా ఉంది అని తెలిపింది. అందువల్ల, శారీరక రుగ్మత నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మద్యపానాన్ని నివారించాలి.

కొవ్వు ఆహారం మానుకోండి

కొవ్వులో అధికంగా ఉన్న ఆహారం ముఖ్యంగా వనస్పతి నూనెలో ఉన్న ట్రాన్స్-కొవ్వు ఉదర భాగంలో కొవ్వు పేరుకునేలా చేస్తుంది. అందువల్ల, కొవ్వును నివారించడానికి వీలైనంతగా కొవ్వు పదార్ధాల నుండి దూరంగా ఉండటం మంచిది.

పొగ త్రాగుట ఆపండి

ధూమపానం మరియు గ్యాస్ట్రోఇంటెస్టినల్ రుగ్మతలపై దాని ప్రభావాలపై ఇటీవల అధ్యయనం ధూమపానం అనేది కడుపు నొప్పి మరియు మలబద్ధకం వంటి ఇతర సమస్యలతో పాటు ఉబ్బరంతో సంబంధం కలిగి ఉందని సూచించింది. అందువల్ల, మీరు ఆరోగ్యకరమైన జీవితాన్ని మరియు సంతోషకరమైన పొట్టను కలిగి ఉండడానికి సిగరెట్లను మానేయాలి.

మద్యపానాన్ని పరిమితం చెయ్యాలి

"మద్యపాన వ్యసనం మరియు మద్యం దుర్వినియోగం యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్" (“National Institute of Alcoholism and Alcohol Abuse”) యొక్క ఒక వ్యాసం ప్రకారం, మద్యపానం అనేది శరీరంలోని జీర్ణ మరియు ఇతర జీవక్రియల విధులతో సంబంధం కలిగి ఉంటుందని, తత్ఫలితంగా, ఆహారం సరిగా జీర్ణించబడదు మరియు ఇతర తీవ్రమైన వ్యదులతోపాటు ఉబ్బరం కలిగించే విధంగా కాలేయం లోపల మరియు వెలుపల కొవ్వును ఏర్పరచే ప్రమాదం కూడా ఉంది అని తెలిపింది. అందువల్ల, శారీరక రుగ్మత నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మద్యపానాన్ని నివారించాలి.

జంక్ ఫుడ్ తగ్గించాలి

జంక్ ఫుడ్లో క్రొవ్వు పదార్దాలు, సంరక్షణకారులు (preservatives), కృత్రిమ సంకలనాలు (artificial additives), పంచదార వంటి అనేక అనారోగ్యకరమైన పదార్థాలు ఉంటాయి, ఇవి క్యాలరీలో అధికంగా ఉంటాయి మరియు పూర్తిగా జీర్ణం కావడానికి మరియు పూర్తిగా వ్యవస్థ నుండి బయటకు వెళ్లడానికి చాలా సమయం పడుతుంది. అందువల్ల, ఉబ్బరాన్ని నివారించడానికి సాధ్యమైనంత వరకు బయట జంక్ ఫుడ్ నుండి దూరంగా ఉండటం మంచిది.

ఒత్తిడిని తగ్గించాలి

మేము పైన చెప్పినట్లుగా, ఉబ్బరంతో పాటు చాలా జీర్ణకోశ సమస్యలలో ఒత్తిడి ఉంటుంది. అందువల్ల, మీ షెడ్యూల్లో కొంత సమయాన్ని మానసిక విశ్రాంతి (mind relaxation)కోసం కేటాయించండి. ఆరోగ్యకరమైన శరీరం మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థ కలిగి ఉండటంలో ఆరోగ్యకరమైన మనస్సు గొప్ప పాత్ర పోషిస్తుంది. సంతోషంగా ఉండండి మరియు ఉబ్బరాన్ని నిర్ములించండి.

క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యండి

ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం మరియు మీ రక్త ప్రసరణను మెరుగుపరుచుకోవడంలో క్రమబద్ధమైన వ్యాయామం ఎల్లప్పుడూ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పవలసిన అవసరం లేదు. కాబట్టి, ఉబ్బరం నుండి దూరంగా ఉండటానికి, మీరు చురుగ్గా మారాలి మరియు ఉదర కండరాలను మరియు శరీర కండరాలను క్రమం తప్పకుండా సాగదియ్యాలి.

నీటిని  పుష్కలంగా త్రాగాలి

మేము ముందు చెప్పినట్లుగా, నీరు శరీరం నుండి విషాలని, అదనపు చక్కెర, అధిక ఉప్పును, మరియు పొట్ట కొవ్వు వృద్ధిని నిరోధిస్తుంది. అందువల్ల, ఆరోగ్యకరమైన పొట్ట మరియు మెరిసే చర్మం కోసం నీటి పుష్కలంగా త్రాగాలి.

చక్కెర మరియు ఉప్పు తీసుకోవడం తగ్గించాలి

ఉప్పు మరియు చక్కెర తగ్గించడం అనేది నీరు నిలుపుదల నిరోధించడానికి మరియు ఉబ్బరాన్ని నిరోధించడానికి సహాయం చేస్తుంది, కానీ అది దీర్ఘకాలంలో, మీ శరీరం పూర్తి ఆరోగ్యానికి మంచి నిర్ణయం అని తెలుస్తుంది.

కార్బొనేటెడ్ పానీయాలను నివారించండి

రుచి గల సోడా మరియు బీర్ వంటి కార్బొనేటెడ్ పానీయాలు కార్బన్ డయాక్సైడును  కలిగి ఉంటాయి, ఇది మీ ప్రేగులు మరియు పెద్దప్రేగులో చేరి పొట్టను సాగదీస్తుంది. బీరు చక్కెర మరియు ఆల్కహాల్ను  కుడా కలిగి ఉంటుంది, కాబట్టి ఉబ్బరాన్ని నిరోధించడానికి దానిని తీసుకోవడం తగ్గించాలి.

ఆరోగ్యకరమైన ఆహారం తినండి

ఆరోగ్యవంతమైన ఆహారం ఆరోగ్యకరమైన మరియు సంతోషమైన జీర్ణకోశాన్ని తయారు చేస్తుంది. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆరోగ్యవంతమైన బ్యాక్టీరియా, ముఖ్యంగా పెరుగు, కూరగాయలు, పండ్లు, కూరగాయల రసాలు త్రాగడం, ఆకుపచ్చ ఆకు కూరలు తినడం, పాలు తీసుకోవడం వంటివి చెయ్యండి.

అతిగా తినడం మానుకోండి

మనం చాలా సార్లు మన కడుపు నిండడం కంటే మనసు నిండేలా తింటాము. దీనినే మనం అతిగా తినడం (over eating) అంటాము. అతిగా తినడం వల్ల అసౌకర్యంగా ఉండి, కొంత సమయం పాటు అది కొనసాగుతుంది, అది పెద్ద బొజ్జకు దారి తీస్తుంది. అందువల్ల, మీ భోజనాన్ని చిన్నగా మరియు తరచూ చెయ్యండి.

వనరులు

  1. Benjamin Misselwitz. Lactose malabsorption and intolerance: pathogenesis, diagnosis and treatment. United European Gastroenterol J. 2013 Jun; 1(3): 151–159. PMID: 24917953
  2. William L. Hasler. Gas and Bloating. Gastroenterol Hepatol (N Y). 2006 Sep; 2(9): 654–662. PMID: 28316536
  3. X Jiang et al. Prevalence and risk factors for abdominal bloating and visible distention: A population-based study. Gut. 2008 Jun; 57(6): 756–763. PMID: 18477677
Read on app