myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

ఆస్టియోపీనియా అంటే ఏమిటి?

ఆస్టియోపీనియా అంటే ఎముక యొక్క సాంద్రత తక్కువగా ఉండే ఒక పరిస్థితి, ఇది సాధారణం కంటే బలహీనమైన ఎముకలకు దారితీస్తుంది. ఆస్టియోపీనియా  బోలు ఎముకల వ్యాధి (osteoporosis) మరియు ఇతర ఎముకల ఫ్రాక్చర్స్ యొక్క  ప్రమాదాన్ని పెంచుతుంది.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

సాధారణంగా, ఆస్టియోపీనియా ఎటువంటి లక్షణాలను చూపించదు  మరియు ఒక స్పష్టమైన కారణం లేకుండా లేదా చిన్న గాయాలకే ఎముకలకు ఫ్రాక్చర్ సంభవించినప్పుడు మాత్రమే అది గుర్తించబడుతుంది. ఇతర ఎముకలకు కూడా ఫ్రాక్చర్స్ యొక్క ప్రమాదాన్ని సూచించే ఒక హెచ్చరికగా దీనిని  పరిగణించాలి .

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

ఈ పరిస్థితి యొక్క కారణం అనేక రకాలుగా ఉంటుంది అలాగే ఎముక బలాన్నిని ప్రభావితం చేసే పరిస్థితుల పై ఆధారపడి ప్రతీ వ్యక్తికి భిన్నముగా ఉంటుంది. ఈ సమస్యకు సంబంధించిన ప్రధాన కారణాలు వీటిని కలిగి ఉంటాయి:

 • ఎముక ఆరోగ్యం సరిగ్గా లేని కుటుంబ చరిత్ర
 • గ్లూటెన్ లేదా గోధుమలకు అలెర్జీ ఉన్న వ్యక్తులలో సెలియాక్  వ్యాధి కూడా ఉన్నపుడు అది ఆహారాన్నిండి తక్కువ/అల్పమైన కాల్షియం మరియు విటమిన్ D శోషణకు దారితీస్తుంది, అలాగే వివిధ వైద్య సమస్యలు కూడా ఆస్టియోపీనియాకు దారితీస్తాయి
 • వివిధ రకాల మందులు, గ్లూకోకోర్టికాయిడ్ (దీర్ఘకాలిక ఉపయోగం వలన) వంటి స్టెరాయిడ్లు
 • ఊబకాయం
 • చిన్న వయసులో ఉండే ఆడ అథ్లెట్లు
 • ఆహార రుగ్మతలు (ఈటింగ్ డిజార్డర్స్).
 • వృద్ధాప్యం (ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత)
 • ఏ కారణం వలన అయినా కాల్షియం మరియు విటమిన్ డి (D) యొక్క లోపం,
 • వ్యాయామం లేకపోవడం లేదా ఏ పని లేకుండా ఉండడం (inactivity)

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

వైద్యులు లక్షణాలు కుటుంబ మరియు ఆరోగ్య చరిత్రను గురించి పూర్తి తెలుసుకుంటారు, దానితో పాటు ప్రభావితమైన భాగాలను పరిశీలిస్తారు. వైదులకు రోగి యొక్క ఎముక ఆరోగ్యం మీద లేదా ఆస్టియోపీనియా మీద అనుమానం ఉన్నట్లయితే  వారు మరిన్ని పరీక్షలను సూచిస్తారు

 • ఎముక సాంద్రత పరీక్ష (bone density test) మరియు సాధారణంగా మొదటిసారి ఈ పరీక్ష చేసిన తరువాత రెండు నుండి ఐదు సంవత్సరాలకు మళ్ళి పరీక్షను జరపవలసిందిగా సలహా ఇవ్వబడుతుంది.
 • ఫ్రాక్చర్ సందర్భాలలో ప్రభావిత భాగం యొక్క ఎక్స్-రే
 • డ్యూయల్ ఎనర్జీ ఎక్స్- రే అబ్సార్పీషియోమెట్రీ (DEXA లేదా DXA, Dual-energy X-ray absorptiometry) స్కాన్.

ఆస్టియోపీనియా యొక్క చికిత్స:

 • ఆస్టియోపీనియా బోలు ఎముకల వ్యాధి అంత తీవ్రమైనది కాదు కాబట్టి ఎక్కువ మందుల అవసరం ఉండదు. చికిత్స యొక్క లక్ష్యం ఎముకను రక్షించడం మరియు దాని బలాన్ని మెరుగుపరచడంగా ఉంటుంది.
 • ఆస్టెయోపెనియాతో బాధపడుతున్న వ్యక్తికి కాల్షియం మరియు విటమిన్ Dలను అందించడం తప్పనిసరి.
 • విటమిన్ డి మరియు కాల్షియం అధికంగా ఉండే పాలు మరియు పాల ఉత్పత్తులు పెరుగు, జున్ను వంటివి, పాలకూర, బ్రోకలీ వంటి కూరగాయలు, సాల్మొన్ వంటి చేపలు, తృణధాన్యాలు, రొట్టె మరియు నారింజ రసం వంటి ఆహార పదార్దాలను తినే ఆహారంలో చేర్చాలి.
 • బరువు నియంత్రణ కోసం క్రమమైన వ్యాయామం మరియు బరువు నిర్వహణ వంటివి చేయాలి
 • ఎముకకు స్నేహపూర్వకంగా (bone-friendly) జీవనశైలిని అనుసరించాలి
 • ధూమపానం మరియు మద్యపానాన్ని నివారించాలి
 1. ఆస్టియోపీనియా కొరకు మందులు
 2. ఆస్టియోపీనియా వైద్యులు
Dr. Kamal Agarwal

Dr. Kamal Agarwal

ओर्थोपेडिक्स

Dr. Rajat Banchhor

Dr. Rajat Banchhor

ओर्थोपेडिक्स

Dr. Arun S K

Dr. Arun S K

ओर्थोपेडिक्स

ఆస్టియోపీనియా కొరకు మందులు

ఆస్టియోపీనియా के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine NamePack SizePrice (Rs.)
Uprise D3Uprise D3 1 K Capsule71.5
GemcalGemcal Kit160.5
CalcirolCalcirol 600000 Iu Injection210.0
D RozavelD Rozavel 10 Mg/1000 Iu Tablet150.0
Mahastat D3Mahastat D3 Tablet135.0
Calcitriol + Calcium Carbonate + ZincCalcium Carbonate 500 Mg + Calcitriol 0.25 Mcg + Zinc 7.5 Mg Tablet8.19
Rosufit DRosufit D 10 Mg/1000 Iu Tablet158.0
Rosuflo DRosuflo D 10 Mg/1000 Iu Tablet90.0
Rosuvas DRosuvas D 10 Mg/1000 Iu Tablet210.0
Rosycap D3Rosycap D3 10 Mg/1000 Iu Tablet99.0
Rozucor DRozucor D 10 Mg/1000 Iu Tablet150.0
Rozustat DRozustat D 10 Mg/1000 Iu Tablet122.1
Rosukem GoldRosukem Gold Tablet120.0
Calcium + Vitamin D3Calcium + Vitamin D3 500 Iu Tablet6.68
Zyrova D3Zyrova D3 5 Mg/1000 Iu Tablet120.0
Zyrova D3 ForteZyrova D3 Forte 10 Mg/1000 Iu Tablet180.8
DisprinDisprin Tablet4.7
T ScoreT Score Tablet166.67
Insulate NpInsulate Np Tablet200.0

మీకు గానీ లేదా మీ కుటుంబములో ఎవరికైనా గానీ ఈ వ్యాధి ఉందా? దయచేసి ఒక సర్వే చేసి ఇతరులకు సహాయపడండి

और पढ़ें ...