కీళ్ళవాత రుగ్మత - Rheumatic Disorder in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

January 05, 2019

March 06, 2020

కీళ్ళవాత రుగ్మత
కీళ్ళవాత రుగ్మత

కీళ్ళవాత (రుమాటిక్) రుగ్మత అంటే ఏమిటి?

కీళ్ళవాతాలు (రుమాటిక్ రుగ్మత) అంటే కీళ్ళు మరియు బంధన కణజాలాలను దెబ్బతీసే ఓ రుగ్మతల సమూహం. ఈ కీళ్లవాతాలు కీళ్లలో నొప్పి, వాపు మరియు పెడసరాన్ని కలుగజేస్తాయి. కొన్ని రకాలైన కీళ్లవాతాలు నరాలు, కండరాలు  మరియు కండరబంధనాల్ని మరియు అంతర్గత అవయవాలు వంటి ఇతర భాగాలను కూడా దెబ్బ తీస్తాయి. రోగనిరోధక వ్యాధులైన చర్మసంబంధ కీళ్ళవ్యాధి (సోరియాటిక్ ఆర్థరైటిస్) మరియు ముఖచర్మరోగం (లూపస్) వంటివి కూడా కీళ్ళవాత రరుగ్మతల కిందికే వస్తాయి.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

కీళ్ళవాతాలు (రుమాటిక్ రుగ్మత) యొక్క ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు వ్యాధి మీద ఆధారపడి ఉంటాయి. రుమాటిక్ వ్యాధులలో సాధారణంగా కనిపించే చిహ్నాలు మరియు లక్షణాల జాబితా:

ల్యూపస్ (ముఖచర్మవ్యాధి)

 • తలనొప్పి
 • ఛాతి నొప్పి
 • జ్వరం (ఫీవర్)
 • వెలుగులో చర్మం సున్నితత్వం రుగ్మత కలగడం
 • వాపుదేలిన కీళ్ళు
 •  ముక్కులో మరియు నోటిలో పూతలు (బొబ్బలవంటివి)
 • జుట్టు ఊడుట
 • కళ్ళు చుట్టూ మరియు కాళ్ళు, పాదాలు మరియు చేతుల్లో వాపు
 • ముక్కుదూలం మరియు బుగ్గలు పైన దద్దుర్లు, బొబ్బలు

రుమటాయిడ్ కీళ్లనొప్పి (ఆర్థరైటిస్)

స్క్లెరోడెర్మ

 • చర్మంలో అసాధారణతలు
 • ఉదయపు పెడసరం
 • చర్మంపై పసుపురంగులో మచ్చలు (పాచెస్) మరియు పొడి మచ్చలు
 • గట్టిపడిన మెరిసే చర్మం
 • బాధిత ప్రాంతాల్లో జుట్టు నష్టం
 • బరువు నష్టం
 • కీళ్ళు నొప్పి

జొగ్రెన్స్ సిండ్రోమ్

 • పొడి కళ్ళు
 • శోషరస గ్రంధులలో వాపు
 • దంత వ్యాధులు
 • లింఫోమా (క్యాన్సర్) (శోషరస గ్రంధులకు సంబంధించినది)

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

రుమాటిక్ రుగ్మతల యొక్క ప్రధాన కారణాలు మరియు ప్రమాద కారకాలు:

 • అఘాతం (ట్రామా)
 • అంటువ్యాధులు
 • జీవక్రియ సమస్యలు
 • కొన్ని హార్మోన్లు
 • నాడీ వ్యవస్థ సమస్యలు
 • కీళ్ళలో వాపు
 • ఎముకల చివరలను కప్పి ఉంచే కణజాలాలకు నష్టం
 • జన్యువులు
 • జాతి
 • రోగనిరోధక కణ గుర్తింపుతో సమస్యలు
 • పర్యావరణ కాలుష్యాలు
 • లింగపరంగా  ఆడవాళ్లు
 • వయసు

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

వైద్యుడు శారీరక పరీక్షను నిర్వహిస్తాడు. రోగ లక్షణాలు మరియు వ్యాధిని గుర్తించడానికి డాక్టర్ వైద్య చరిత్ర గురించి అడిగి తెలుసుకుంటాడు. నిర్దిష్ట యాంటీబాడీస్ అయిన యాంటీ-DNA, యాంటీ-RNA మరియు యాంటీ-న్యూట్రాఫిలిక్ ప్రతిరక్షక పదార్ధాల్ని కనుక్కోవడం కోసం రక్త పరీక్షలు మరియు ప్రభావిత-కీళ్లభాగం నుండి సేకరించిన ద్రవం యొక్క పరీక్షలు కూడా డాక్టర్ చేత ఆదేశించబడవచ్చు. ఎముకల్లో కంటికి కనబడదగ్గ మార్పులను చూసేందుకుగాను వైద్యుడు ఛాతీ ఎక్స్-రే మరియు MRI స్కాన్లను కూడా అభ్యర్థించవచ్చు.

రుమాటిక్ వ్యాధులకు ఉపయోగించే చికిత్స పద్ధతులు:

 • భౌతిక చికిత్స
 • వాపు తగ్గించడానికి కార్టికోస్టెరాయిడ్స్ (వాపు మందులు) మరియు నాన్-స్టెరాయిడ్ వాపు-నివారణా మందులు (non-steroidal anti-inflammatory drugs-NSAIDs)
 • యోగ
 • సర్జరీ
 • వ్యాధిని సవరించడం కోసం యాంటీ- రుమాటిక్ మందులు Disease-modifying anti-rheumatic drugs (DMARDs)
 • సవరించిన వ్యాయామం కార్యక్రమాలు
 • నొప్పి నివారితులువనరులు

 1. UCSF Benioff Children's Hospital [Internet]. University of California San Francisco; Rheumatic Disorders.
 2. Arthritis Foundation [Internet]. Georgia, United States; Rheumatoid Arthritis.
 3. Rheumatology Research Foundation [Internet]. Georgia: American College of Rheumatology. Sjögren's Syndrome.
 4. National Institute of Arthritis and Musculoskeletal and Skin Disease. [Internet]. U.S. Department of Health & Human Services; Rheumatoid Arthritis.
 5. National Institute of Arthritirs and Musculoskeletal and Skin Disease. [Internet]. U.S. Department of Health & Human Services; Arthritis and Rheumatic Diseases.
 6. National Institute of Arthritirs and Musculoskeletal and Skin Disease. [Internet]. U.S. Department of Health & Human Services; Systemic Lupus Erythematosus (Lupus).

కీళ్ళవాత రుగ్మత కొరకు మందులు

కీళ్ళవాత రుగ్మత के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।