చర్మ అంటువ్యాధులు - Skin Infections in Telugu

Dr. Ayush PandeyMBBS

January 09, 2019

March 06, 2020

ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు
చర్మ అంటువ్యాధులు
చర్మ అంటువ్యాధులు
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

చర్మ అంటువ్యాధులు అంటే ఏమిటి?

శరీరం మొత్తానికి చర్మం ఒక బయటి రక్షణ పొరను ఏర్పరుస్తుంది. దీని అర్ధం చుట్టూ ఉన్న పరిసరాలలో ఉన్న అన్ని ఎజెంట్లకు/పరిస్థితులకు చర్మం గురవుతుంది- రసాయనాలు, బ్యాక్టీరియా మరియు అనేక ఇతర పదార్దాలు వాటిలో ఉంటాయి. కొన్నిసార్లు, ప్రతికూల పరిస్థితుల కారణంగా చర్మానికి ఇన్ఫెక్షన్/అంటువ్యాధులు సంభవించవచ్చు.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

లక్షణాలు కారణం మీద ఆధారపడి ఉన్నపటికీ, చర్మ ఇన్ఫెక్షన్లకు కొన్ని సాధారణ సంకేతాలు ఉన్నాయి: అవి

 • వాపు వలన ఎరుపుదనం మరియు దురద
 • చర్మం సున్నితంగా మరియు పొడిగా మారవచ్చు
 • తీవ్రమైన సందర్భాలలో చర్మం నుండి రక్తస్రావం లేదా చీము స్రవించడం కూడా జరుగుతుంది.
 • ఇన్ఫెక్షన్ వృద్ధి చెందితే, చర్మం పై చిన్న బొబ్బలు లేదా పైకి ఉబ్బినట్టు ఉండే గడ్డలు/బొబ్బలు కూడా ఏర్పడవచ్చు
 • క్రమంగా, చర్మం చిన్న సన్నని పొరలగా రాలిపోతుంది/ఊడిపోతుంది, లోపలి పొరలను బయటకు కనిపించేలా చేస్తుంది దాని వల్ల చర్మం రంగు మారిపోయినట్టు కనిపిస్తుంది
 • కొన్ని రకాల ఇన్ఫెక్షన్లలో చర్మం పొలుసులుగా మారవచ్చు.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

చర్మపు అంటువ్యాధులు బాక్టీరియా, వైరస్ లేదా ఫంగస్ వంటి సూక్ష్మజీవుల వలన సంభవిస్తాయి;

 • హెర్పిస్ జోస్టర్ వైరస్ వంటి వైరస్లు చర్మ ఇన్ఫెక్షన్లను కలిగిస్తాయి, ఉదా: చికెన్ పాక్స్ (అమ్మవారు/పొంగు) మరియు షింగల్స్. హ్యూమన్ పాపిల్లోమావైరస్ (Human papillomavirus) కూడా పొక్కుల వంటి చర్మ అంటువ్యాధులు కారణమవుతుంది.
 • బాక్టీరియా పొక్కులు (గుల్లలు) మరియు కురుపులు వంటి చర్మ ఇన్ఫెక్షన్లను లేదా సెల్యులైటిస్ మరియు కుష్టు రోగం (లెప్రసి) వంటి తీవ్రమైన అంటువ్యాధులు కారణం కావచ్చు. స్టెఫైలోకోకస్ (Staphylococcus) అనే బాక్టీరియం, సాధారణంగా చర్మపు ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది.
 • ఫంగల్ చర్మ అంటువ్యాధులు తామర, కాన్డిడియాసిస్ మరియు అథ్లెట్స్ ఫుట్ వంటి వాటిని కలిగి ఉంటాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్లు సాధారణంగా వేళ్ళ గోరరుల మరియు గోళ్ళ మొదలు (బేస్) మీద ప్రభావం చూపుతాయి.

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

 • ప్రతి సంక్రమణకు/ఇన్ఫెక్షన్ కు ఒక నిర్దిష్టమైన చర్మసంబంధ రూపం ఉంటుంది, ఇది చాలా వరకు రోగ నిర్ధారణకు సహాయం చేస్తుంది.
 • శారీరక పరీక్ష తరువాత, చర్మపు గాయం/పుండు యొక్క నమూనాను సేకరించి మైక్రోస్కోప్ ద్వారా పరిశీలన చేస్తారు.
 • శరీరంలోని ఇన్ఫెక్షన్ను నిర్దారించడానికి రక్త పరీక్షలు కూడా నిర్వహిస్తారు.

చికిత్స

 • చిన్న/తేలికపాటి చర్మ ఇన్ఫెక్షన్లు సాధారణంగా కొన్ని వారాలలో సహజంగానే వాటికవే తగ్గిపోతాయి.
 • బ్యాక్టీరియా చర్మ ఇన్ఫెక్షన్ల చికిత్సకు యాంటీబయాటిక్స్ ను ఉపయోగిస్తారు. ఇవి సమయోచితంగా, నోటి ద్వారా లేదా తీవ్రమైన సందర్భాల్లో ఇంట్రావీనస్ (నరాలలో ఎక్కించడం) గా  కూడా ఉపయోగించవచ్చు.
 • అదేవిధంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ల కోసం యాంటీ ఫంగల్ మందులను స్ప్రేలు, జెల్లు, క్రీమ్లు లేదా మాత్రల రూపంలో ఉపయోగించవచ్చు.
 • వాపు తగ్గించడానికి, వాపు నిరోధక మందులు ఇవ్వబడతాయి.
 • సంక్రమణ/ఇన్ఫెక్షన్ వ్యాప్తిని నివారించడానికి రోగిని ఇతరులకి దూరంగా ఉండాలని సూచిస్తారు, అలాగే మంచి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని కూడా సలహా ఇవ్వబడుతుంది.వనరులు

 1. Hani U et al. Candidiasis: a fungal infection--current challenges and progress in prevention and treatment.. Infect Disord Drug Targets. 2015;15(1):42-52. PMID: 25809621
 2. El Hayderi L,Nikkels-Tassoudji N,Nikkels AF. Incidence of and Risk Factors for Cutaneous Scarring after Herpes Zoster.. Am J Clin Dermatol. 2018 Dec;19(6):893-897. doi: 10.1007/s40257-018-0385-2. PMID: 30151702
 3. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Skin Infections.
 4. Aly R. Microbial Infections of Skin and Nails. In: Baron S, editor. Medical Microbiology. 4th edition. Galveston (TX): University of Texas Medical Branch at Galveston; 1996. Chapter 98.
 5. National Health Service [Internet]. UK; Fungal skin and nail infections: diagnosis and laboratory investigation guide for primary care.

చర్మ అంటువ్యాధులు వైద్యులు

Dr. R.K . Tripathi Dr. R.K . Tripathi Dermatology
12 वर्षों का अनुभव
Dr. Deepak Kumar Yadav Dr. Deepak Kumar Yadav Dermatology
2 वर्षों का अनुभव
Dr. Alpana Mohta Dr. Alpana Mohta Dermatology
3 वर्षों का अनुभव
Dr. Garima Dr. Garima Dermatology
3 वर्षों का अनुभव
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

చర్మ అంటువ్యాధులు కొరకు మందులు

చర్మ అంటువ్యాధులు के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

दवा का नाम

कीमत

₹49.64

20% छूट + 5% कैशबैक


₹74.9

20% छूट + 5% कैशबैक


₹29.0

20% छूट + 5% कैशबैक


₹29.65

20% छूट + 5% कैशबैक


₹16.23

20% छूट + 5% कैशबैक


₹16.38

20% छूट + 5% कैशबैक


₹11.83

20% छूट + 5% कैशबैक


₹70.8

20% छूट + 5% कैशबैक


₹24.15

20% छूट + 5% कैशबैक


₹34.13

20% छूट + 5% कैशबैक


Showing 1 to 10 of 982 entries