myUpchar प्लस+ के साथ पूरेे परिवार के हेल्थ खर्च पर भारी बचत

సోడియం లోపం (సోడియం డెఫిషియన్సీ) అంటే ఏమిటి?

మామూలుగా రక్తంలో సోడియం ఉండాల్సిన స్థాయి కంటే తక్కువ స్థాయికి పడిపోవడాన్నే”సోడియం లోపం” అని పిలుస్తారు. సోడియం లోపాన్నే’హైపోనాట్రెమియా’ అని కూడా అంటారు. రక్తంలో సోడియం స్థాయిలు లీటరుకు 135-145 మిల్లీలీక్వివెంట్లు కంటే తక్కువగా ఉన్నప్పుడు సోడియంలోపం సంభవిస్తుంది. సోడియం అనేది ఎక్స్ట్రాసెల్లులర్ ద్రవం (జీవకణజాలం చుట్టూ ఉండే ద్రవం) యొక్క ప్రధాన మరియు అత్యవసర ఎలెక్ట్రోలైట్స్ లో ఒకటి. ద్రవం-విద్యుద్విశ్లేష్య (fluid-electrolyte) సంతులనాన్ని నిర్వహించడంలో సోడియం సహాయపడుతుంది.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

సోడియం లోపం తక్కువగా (లేక తేలికగా) ఉన్నప్పుడు వ్యాధి లక్షణాలు తక్కువగా కనిపిస్తాయి. రుగ్మత యొక్క తీవ్రత పెరిగినపుడు కింది వ్యాధి లక్షణాల్ని  గుర్తించారు.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

శరీరంలో పెద్ద మొత్తంలో నీటి ఉనికి కారణంగా సోడియం స్థాయిల్లో  క్షీణత ఏర్పడుతుందని కనుగొనబడింది. శరీరంలో సోడియం స్థాయిలు తగ్గడానికి గల కారణాన్ని శరీరం కేవలం సోడియంను మాత్రమే కోల్పోవడానికి లేదా సోడియం, నీరు రెండూ కలిసి కోల్పోవడానికి ఆపాదించొచ్చు.

కొన్ని ఇతర కారణాలు ఇలా ఉన్నాయి

 • మూత్రపిండాలు సరిగా పనిచేయకపోవడం
 • శరీరంలో ద్రవాలు పేరుకుపోవడం
 • సోడియం నష్టం కలిగించే మందుల వాడకం
 • కుంగుబాటు లేదా మూత్ర ఉత్పత్తిని పెంచే నొప్పి చికిత్సకిచ్చే మందులు
 • అధిక వాంతులు మరియు విపరీతమైన విరేచనాలు
 • పెరిగిన దాహం

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

మీ వైద్యుడు మీ శరీర ద్రవాలలో సోడియం స్థాయిల్ని గమనించడానికి కొన్ని పరీక్షలు చేయించమని అడుగుతారు. ప్రాథమిక అంచనాగా శారీరక పరీక్ష  నిర్వహించబడుతుంది. ఇతర రుగ్మతల్ని తోసిపుచ్చడానికి వ్యాధిలక్షణాలు ప్రశ్నించబడవచ్చు. సోడియం స్థాయిలు తెలుసుకోవడానికి రక్తం మరియు మూత్రం వంటి శరీర ద్రవాల విశ్లేషణ జరుగుతుంది. క్రింద ఇవ్వబడిన పరీక్షలు జరపవచ్చు

 • సీరం సోడియం
 • ఓస్మోలాలిటీ పరీక్ష (Osmolality test)
 • మూత్రంలో సోడియం
 • మూత్ర ఓస్మోలాలిటీ పరీక్ష (Urine osmolality)

సాధారణంగా, రుగ్మత యొక్క పరిస్థితి మరియు తీవ్రత ప్రకారం చికిత్స ఇవ్వబడుతుంది. ప్రధాన చికిత్స విధానాలు ఇలా ఉంటాయి

 • ఇంట్రావీనస్ ద్రవాలు
 • లక్షణాల ఉపశమనం కోసం మందులు
 • నీరు తాగడాన్ని తగ్గించడం

సోడియం స్థాయిలను పెంచే కొన్ని మందులు ఉన్నాయి, అయితే వాటిని ఉపయోగించేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. ఇతర పద్ధతులలో సోడియం మరియు ఉప్పు స్థాయిల్ని సరిచేయడానికి ద్యుద్వాహకలవణముల (electrolytes)ను తాగడం జరుగుతుంది. మూత్రపిండ వైఫల్యం ఉంటే, అధిక నీటిని తొలగించడానికి డయాలసిస్ ఉపయోగకరంగా ఉంటుంది.

మీ కీలక అవయవాలు ఎలాంటి సమస్యల్ని ఎదుర్కోకపోతే (రాజీపడకపోతే), సోడియం లోపాన్ని సరిదిద్దవచ్చు మరియు సోడియంలోపం అనేది దీర్ఘ కాలిక రుగ్మత కాదు.

 1. సోడియం లోపం కొరకు మందులు
 2. సోడియం లోపం వైద్యులు
Dr. Tanmay Bharani

Dr. Tanmay Bharani

एंडोक्राइन ग्रंथियों और होर्मोनेस सम्बन्धी विज्ञान

Dr. Sunil Kumar Mishra

Dr. Sunil Kumar Mishra

एंडोक्राइन ग्रंथियों और होर्मोनेस सम्बन्धी विज्ञान

Dr. Parjeet Kaur

Dr. Parjeet Kaur

एंडोक्राइन ग्रंथियों और होर्मोनेस सम्बन्धी विज्ञान

సోడియం లోపం కొరకు మందులు

సోడియం లోపం के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine NamePack SizePrice (Rs.)
RenolenRenolen Eye Drop47
HyprosolHyprosol 0.490 W/V/2 W/V Prefilled Syringe88
HysolHysol Eye Drop36
D.N.SDns Infusion38
Dns (Baxter)Dns 5 G/0.45 G Infusion24
Dns (Parenteral Drug)Dns 5%W/V/0.9%W/V Infusion20
Dns (Denis)Dns Infusion36
GrelyteGrelyte Solution25
Sodium Chloride (Albert)Sodium Chloride Solution23
TnaTna Peri Infusion1469
Leclyte G PlLeclyte G Pl Solution35
CatlonCatlon Drop54
SterofundinSterofundin Iso Infusion180
N.S (Parenteral)N.S Infusion18
RallidexRallidex Infusion337
Dextrose With Normal SalineDextrose With Normal Saline 5% Infusion17
Dns (Venus)Dns Solution36
Dns Water (Albert)Dns Water 0.9% W/V Infusion23

మీకు గానీ లేదా మీ కుటుంబములో ఎవరికైనా గానీ ఈ వ్యాధి ఉందా? దయచేసి ఒక సర్వే చేసి ఇతరులకు సహాయపడండి

References

 1. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Low sodium level
 2. Michael M. Braun et al. Diagnosis and Management of Sodium Disorders: Hyponatremia and Hypernatremia. Am Fam Physician. 2015 Mar 1;91(5):299-307. American Academy of Family Physicians.
 3. Oregon State University. [Internet] Corvallis, Oregon; Sodium (Chloride)
 4. National Kidney Foundation [Internet] New York; Hyponatremia
 5. Harvard School of Public Health. The Nutrition Source. The President and Fellows of Harvard College [Internet]
और पढ़ें ...