కంటి పొరలో రక్తస్రావం - Subconjunctival Hemorrhage in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

January 10, 2019

July 31, 2020

కంటి పొరలో రక్తస్రావం
కంటి పొరలో రక్తస్రావం

కంటిపొరలో రక్తస్రావం అంటే ఏమిటి?

కంటి లోపల అనేక రక్తనాళాలు ఉన్నాయి. ఈ నరాలు గాయం లేదా ఇతర కారణాల వలన చిట్లితే (బీటలువారితే), కంటిలో కంటిని కప్పి ఉన్న పారదర్శక పొర క్రింద అంతర్గత రక్తస్రావం ఏర్పడుతుంది. ఈ కంటిపొరనే ‘కంజుంక్టివా’ అంటారు. కంజుక్టివివ పొర క్రింద రక్తం స్రవిస్తుంది కనుక ఇది “ఉప-కంజుక్టివిల్ రక్తస్రావం” (subconjunctival haemorrhage) గా పిలువబడుతుంది.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

కొన్నిసార్లు మీకు మీ కంట్లో ఈ ‘ఉప-కంజుక్టివిల్ రక్తస్రావం’ రుగ్మత ఏర్పడి కంట్లో రక్తం కారుతోందని చాలా కాలం వరకూ మీకు తెలియకుండానే పోవచ్చు.

 • కంటి యొక్క తెల్లని భాగం (స్క్లేరా)లో  ఎర్రటి మచ్చలు ఏర్పడ్డమే ‘కంటిపొరలో రక్తస్రావం’ రుగ్మతకు అత్యంత సాధారణమైన గుర్తు
 • మీరు బాధిత కంటిలో కొంచెం దురద అనుభవిస్తారు.
 • నొప్పి మరియు మంట వంటి లక్షణాలు చాలా అరుదు, మరియు చాలా సార్లు వ్యక్తికి అలాంటి అసౌకర్యం ఏదీ ఉండదు..
 • కాలక్రమేణా, కంటిలో ఏర్పడ్డ ఎరుపు మచ్చ/ల రంగు గోధుమరంగులోకి లేదా పసుపు రంగులోకి మారవచ్చు.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

 • చాలామటుకు కంటిపొర రక్తస్రావాలు ( subconjunctival haemorrhages) చాలా సహజసిద్ధమైనది మరియు ప్రత్యేక కారకం లేదా కారణం లేకుండానే ఉత్పన్నమవుతాయి.
 • కొన్నిసార్లు, విపరీతమైన తుమ్ములు లేదా దగ్గు కంటిపొరలో రక్తస్రావానికి దారి తీస్తాయి. ఈ తుమ్ములు, దగ్గులు కంటికి బాధాకరమైన గాయం ఏర్పరచి ఈ రుగ్మతను ప్రేరేపిస్తుంది.
 • రక్తస్రావం లోపాలు, మధుమేహం మరియు అధిక రక్తపోటు వంటి వైద్య పరిస్థితులు ఈ కంటిపొర రక్తస్రావం రుగ్మతకు తీవ్రమైన ప్రమాద కారకాలు.
 • కంటిని బలంగా రుద్దటంవల్ల కూడా కంటి రక్త నాళం చిట్లడం లేదా తెగడం జరిగి రక్తస్రావం అవ్వడానికి కారణమవుతుంది.
 • అరుదుగా, కంటిశుక్లం శస్త్రచికిత్స లేదా లాసీక్ వంటి లేజర్ శస్త్రచికిత్స వల్ల కలిగే దుష్ప్రభావంవల్ల కంటిపొరలో రక్తస్రావం రుగ్మత కలగొచ్చు.

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

 • మీ కంటిని పరిశీలించడం ద్వారానే డాక్టర్ కంటిపొరలో రక్తస్రావం వ్యాధిని నిర్ధారించవచ్చు.
 • మీ రక్తపోటు కూడా తనిఖీ చేయబడుతుంది.
 • అంతర్లీన వైద్య పరిస్థితి ఎదో ఉందని అనుమానిస్తే తప్ప, ఇతర రోగనిర్ధారణ పరీక్షలు అవసరం లేదు.
 • వైద్యకేసు ఇదే అయితే ,రోగనిర్ధారణ చేయటంలో సంపూర్ణ వైద్య చరిత్ర మరియు భౌతిక పరీక్ష ముఖ్యమైనది.

చికిత్స

 • సాధారణంగా, చికిత్స అవసరం లేదు.
 • ఒక వారం లేదా రెండు వారాలల్లో కంటిపొరలోంచి రక్తం కారడం దానంతటదే  ఆగిపోతుంది.
 • మీ కళ్ళపట్ల కొంత జాగ్రత్త తప్పిస్తే మరెలాంటి వైద్య చికిత్స అవసరం లేదు.
 • కళ్ళలో ఏదైనా మండినట్లు (బర్నింగ్) గాని లేదా దురద పెడుతున్నా ఉపశమనానికిగాను డాక్టర్ కంటి చుక్కల మందును సిఫారసు చేయవచ్చు.వనరులు

 1. Bercin Tarlan, Hayyam Kiratli. Subconjunctival hemorrhage: risk factors and potential indicators . Clin Ophthalmol. 2013; 7: 1163–1170. PMID: 23843690
 2. Mimura T et al. Subconjunctival hemorrhage and conjunctivochalasis. Ophthalmology. 2009 Oct;116(10):1880-6. PMID: 19596440
 3. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Subconjunctival hemorrhage
 4. National Health Portal [Internet] India; Sub-conjunctival Haemorrhage
 5. Merck Manual Consumer Version [Internet]. Kenilworth (NJ): Merck & Co. Subconjunctival Hemorrhage.
 6. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; International Notes Acute Hemorrhagic Conjunctivitis -- Mexico