నిమ్మకాయ, రూటేసి కుటుంబానికి చెందిన మంచి పండు. నిమ్మకాయ యొక్క పుల్లని మరియు తాజా రుచి గురించి తెలియయని ఇల్లు ఉండదు. నిజానికి, నిమ్మ యొక్క రుచి, నాలుకపై రుచి మొగ్గల మీద నుంచి త్వరగా విడిచిపోదు. నిమ్మకాయను వంటల్లో ప్రత్యేకమైన రుచి మరియు వాసనకు మాత్రమే కాకుండా, ఆయుర్వేద మరియు సాంప్రదాయ వైద్యంలో అనేక రకాలుగా ఉపయోగిస్తారు. నిమ్మకాయ నీరును సాంప్రదాయకంగా దాని బరువు తగ్గుదల మరియు విషపదార్దాల నిర్ములన ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ఇది సిట్రస్ కుటుంబంలోనే విటమిన్ సి యొక్క ఉత్తమ వనరుల్లో ఒకటి, విటమిన్ సి అనేది నిమ్మకాయకు వృద్ధాప్య వ్యతిరేక మరియు రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగిస్తుంది.

నిమ్మకాయ అనేది ఒక సతతహరిత (evergreen) వృక్షం, ఇది 6 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. నిమ్మకాయ చెట్టు కొమ్మలు మీద ముళ్ళు ఉంటాయి. కొత్తగా వచ్చే నిమ్మ ఆకులు సాధారణంగా ఎరుపు రంగులో ఉంటాయి మరియు అవి నిమ్మకాయ చెట్టు కొమ్మల మీద వికల్పంగా (ఒకటి విడిచి ఒకటిగా) పెరుగుతాయి.ముదిరిన తర్వాత, ఈ ఆకులు ఒకవైపు ముదురు ఆకుపచ్చ రంగును మరియు మరో వైపు లేత ఆకుపచ్చని రంగులోకి మారుతాయి. నిమ్మకాయ పువ్వులు ఘాడమైన సువాసనతో తెల్లగా ఉంటాయి, అవి ఒకొక్కటిగా లేదా గుత్తులుగా నిమ్మకాయ చెట్ల కొమ్మలపై పూస్తాయి. నిమ్మకాయ పండు ఆకుపచ్చ రంగులో కాస్తుంది మరియు పక్వానికి చేరినప్పుడు పసుపు రంగులోకి మారుతుంది.

మీకు తెలుసా?
నిమ్మకాయ, మనకి నేడు తెలిసినట్లుగా కాక, మాడరిన్ మరియు సిట్రాన్ వంటి అడవి సిట్రస్ జాతుల నుండి రూపొందిన ఒక మిశ్రజాతి (హైబ్రిడ్). క్రిస్టోఫర్ కొలంబస్ 1493 లో తన ప్రయాణంలో నిమ్మ గింజలను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోకి ప్రవేశపెట్టాడు.

నిమ్మ గురించి కొన్ని ప్రాథమిక నిజాలు

 • శాస్త్రీయ నామం: సిట్రస్ లిమోన్ (Citrus limon)
 • కుటుంబం: రూటేసి (Rutaceae)
 • సాధారణ నామాలు: నిమ్మ, నింబూ
 • సంస్కృత నామం: నింబుక
 • ఉపయోగించే భాగాలు: పండు
 • స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్టీర్ణం: నిమ్మకాయ చెట్టును భారతదేశం యొక్క స్థానిక చెట్టుగా భావిస్తారు, కానీ ఇది మెక్సికో, మొరాకో, జపాన్, గ్రీస్, అల్జీరియా, ఆఫ్రికా, ఈజిప్టు మొదలైన దేశాలలో కూడా విస్తృతంగా సాగు చేస్తారు.
 • శక్తి శాస్త్రం: చల్లదనం
 1. నిమ్మకాయ పోషక విలువలు - Lemon nutrition facts in Telugu
 2. నిమ్మకాయ ఆరోగ్య ప్రయోజనాలు - Lemon health benefits in Telugu
 3. నిమ్మకాయలు ఎలా ఉపయోగించాలి - How to use lemons in Telugu
 4. ఒక రోజుకి ఎంత నిమ్మరసం తీసుకోవాలి - How much lemon to take in a day in Telugu
 5. నిమ్మకాయ యొక్క దుష్ప్రభావాలు - Side effects of Lemon in Telugu
Advertisement' height='1px' width='1px' ALT='Advertisement'/>

100 గ్రాముల నిమ్మ యొక్క పోషక విలువలు :

వివరములు

పరిమాణము

నీరు

89గ్రాములు

పిండి పదార్థం (Carbohydrate)

9 గ్రాములు

పీచు పదార్థం (Fiber)

2.8 గ్రాములు

మాంసకృతులు (Protein)

1 గ్రాము

కొవ్వులు (Fats)

0.3 గ్రాములు

విటమిన్ సి (Vitamin C)

53 మిల్లీ గ్రాములు

శక్తి: 29 కిలో కెలోరీలు

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.
Long time capsule
₹719  ₹799  10% OFF
BUY NOW

నిమ్మకాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన ఒక అద్భుతమైన పండు. ముఖ్యంగా, ఇది విటమిన్ C. యొక్క ఒక ఉత్తమ మూలం. నిమ్మకాయ యొక్క క్రమమైన వినియోగం శరీరానికి ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్లతో మత్రమే అందించక, విటమిన్ C లోపం వాల్ల వచ్చే స్కర్వీ వ్యాధిని కూడా తగ్గిస్తుంది.

 • బరువు తగ్గడానికి: సాధారణంగా, తేనె మరియు గోరు వెచ్చని నీటిలో నిమ్మకాయను కలుపుకొని బరువు తగ్గుదల కోసం ఉపయోగిస్తారు, ఎందుకంటే శరీరంలో అదికొవ్వులని తొలగిస్తుంది. అయితే, ఖచ్చితమైన జీవక్రియ మరియు ప్రభావం పూర్తిగా తెలియదు.
 • రోగనిరోధకత కోసం: ఇమ్మ్యూనోమోడ్యులేటరీ చర్యలు కలిగి ఉన్న విటమిన్ సి యొక్క ఉత్తమ వనరులలో నిమ్మకాయ ఒకటి. దగ్గు మరియు జలుబు వంటి సమస్యల ఉపశమనం లో నిమ్మకాయ సహాయం చేస్తుంది మరియు అంటువ్యాధులు నుండి రక్షించే ఒక యాంటీబయాటిక్గా అది పనిచేస్తుంది.
 • చర్మం మరియు జుట్టు కోసం యాంటీఆక్సిడెంట్గా: నిమ్మకాయలోని విటమిన్ సి ఒక అద్భుతమైన యాంటీఆక్సిడెంట్గా కూడా పనిచేసి చర్మం మరియు జుట్టు కోసం అనేక ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఆక్సీకరణ నష్టాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా అది వృద్ధాప్య లక్షణాలను తొలగిస్తుంది మరియు, మచ్చలు మరియు పిగ్మెంటేషన్ కోసం సమర్థవంతమైన పరిష్కారం. జుట్టు కోసం కొల్లాజెన్ ప్రోటీన్ ను పెరిగేలా చేసి  జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
 • రక్తహీనత కోసం: నిమ్మకాయ విటమిన్ సి యొక్క గొప్ప మూలం అయినందున, ఇది ఆహారంలోని నుండి ఇనుము శోషణకు సహాయపడుతుంది, తద్వారా రక్తహీనత నివారిస్తుంది.
 • గుండె, కాలేయం మరియు మూత్రపిండాల కోసం: ఒక యాంటీఆక్సిడెంట్గా, ఇది రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ తగ్గించడం ద్వారా ఈ అవయవాల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది, కాలేయ గాయాలు మరియు మూత్రపిండాలు రాళ్ళు నివారిస్తుంది.

బరువు తగ్గుదల కోసం నిమ్మకాయ - Lemon for weight loss in Telugu

నిమ్మకాయ సాధారణంగా ఉపయోగించే బరువు తగ్గుదల నివారణలలో ఒకటి. సాంప్రదాయకంగా, నిమ్మ మరియు తేనెల మిశ్రమం శరీర బరువును తగ్గించడానికి కొంచెం నీటితో తీసుకోబడుతుంది. నిమ్మకాయలో ఉండే పాలీఫెనోల్స్(polyphenols) బరువు పెరుగుదల నిరోధత బాధ్యత వహిస్తాయని జంతు అధ్యయనాలు సూచిస్తున్నాయి.

శరీర బరువు మీద నిమ్మ డిటాక్స్ ఆహార విధానం (నిమ్మరసం, మాపుల్ సిరప్ మరియు పామ్ సిరప్) యొక్క ప్రభావాలను పరీక్షించడానికి కొరియాలో క్లినికల్ అధ్యయనం జరిగింది. ఈ అధ్యయనం ప్రకారం,పైన పేర్కొన్న ఆహారం శరీరంలో కొవ్వును మొత్తం తగ్గిస్తుంది. అయితే, శరీర బరువు తగ్గించడానికి నిమ్మ లేదా నిమ్మ రసం యొక్క ఖచ్చితమైన ప్రభావాలను నిర్ధారించడానికి క్లినికల్ అధ్యయనాలు లేవు.

(మరింత సమాచారం: ఊబకాయం చికిత్స)

ఒక యాంటిఆక్సిడెంట్ గా నిమ్మకాయ - Lemon as an antioxidant in Telugu

నిమ్మకాయ విటమిన్ సి యొక్క గొప్ప వానరుల్లో ఒకటి, ఇది తెలిసిన ఒక ప్రతిక్షకారిణి (యాంటిఆక్సిడెంట్). కనీసం రెండు వేర్వేరు అధ్యయనాలు నిమ్మ తొక్క సారాలు యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాల యొక్క గొప్ప మూలకాలు అని సూచిస్తున్నాయి. ఇన్ విట్రో (ప్రయోగశాల ఆధారిత) అధ్యయనాలు నిమ్మరసం యాంటియోక్సిడెంట్లను అధికంగా కలిగి ఉంటుందని పేర్కొన్నాయి. జర్నల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీలో ఒక వ్యాసం, నిమ్మకాయలో ఉండే ఏరియోడిక్టల్ (eriodictyol), అనే ప్రతిక్షకారిణి (యాంటిఆక్సిడెంట్) ఆల్ఫా-టోకోఫెరోల్ (విటమిన్ ఇ) కంటే చాలా సమర్థవంతంగా ఉంటుందని పేర్కొంది.

గుండెకు నిమ్మకాయ - Lemon for heart in Telugu

క్లినికల్ అధ్యయనాలు విటమిన్ సి అధికంగా ఉండే పండ్ల యొక్క సాధారణ వినియోగం గుండె ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని సూచిస్తున్నాయి. విటమిన్ సి యొక్క యాంటీఆక్సిడెంట్ ప్రభావాలు గుండె ధమనుల (arteries) లో కొవ్వు ఆక్సీకరణ మరియు కొవ్వు చేరడాన్ని మరియు గుండె పోటుల ప్రమాదాన్ని తగ్గించటానికి సహాయపడతాయి. అంతేకాకుండా, కొన్ని జంతు అధ్యయనాలు నిమ్మకాయ మరియు నిమ్మతొక్క ప్రభావవంతమైన హైపోలియోపిడెమిక్ (కొలెస్టరాల్ను తగ్గిస్తుంది) ప్రభావాలను కలిగిఉంటుందని తెలిపాయి. మరిన్ని అధ్యయనాలు నిమ్మకాయలో ఉండే కొన్ని రకాల ఫ్లేవనోయిడ్లు (flavnoids) శరీర కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో ఉపయోగకరంగా ఉంటాయని సూచిస్తున్నాయి. తక్కువ కొలెస్ట్రాల్ స్థాయిలు హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరియు హృదయ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయం చేస్తాయి.

నిమ్మకయ ఒక యాంటీమైక్రోబయాల్ - Lemon as an antimicrobial in Telugu

నిమ్మకాయలు యొక్క యాంటీమైక్రోబియాల్ సంభావ్యతను పరీక్షించడానికి అనేక అధ్యయనాలు నిర్వహించబడ్డాయి. నిమ్మ సారాలా తో పోలిస్తే నిమ్మ రసం మరింత ప్రభావవంతమైన యాంటీమైక్రోబయాల్ అని అటువంటి ఒక అధ్యయనం సూచిస్తుంది. సాధారణ బ్యాక్టీరియలు ఐన ఎస్చెరిచియా కోలి (Escherichia coli), స్టెఫిలోకాకస్ (Staphylococcus) మరియు క్యాండిడా అల్బికాన్స్ (Candida albicans) వంటి శిలీంధ్రాలు (fugus) వంటి వ్యాధులను కలిగించే క్రిములను చంపడంలో నిమ్మ రసం బాగా సమర్థవంతమైనదని తెలిపింది. మరింత అధ్యయనంలో నిమ్మ తొక్కల యొక్క మిథనాలిక్ సారాలలో ఉన్న ఫిటోకెమికల్ (phytochemicals) (మొక్కలలో ఉన్న రసాయనాలు) స్టెఫిలోకోకస్ ఆరియస్ (Staphylococcus aureus) మరియు ఎస్చెరిచియా కోలికి (Escherichia coli) వ్యతిరేకంగా గమనింప్పదగ్గ యాంటీ బాక్టీరియల్ చర్యను చూపించినట్లు సూచనలు ఉన్నాయి.

అదనంగా, బాసిల్లస్ సబ్లిటిస్ ( Bacillus subtilis), సాల్మోనెల్లా టైఫిమూరియం ( Salmonella typhimurium), మరియు ఎంటరోకోకస్ ఫెకాలిస్ (Enterococcus faecalis) వంటి కొన్ని ఇతర బ్యాక్టీరియాల పెరుగుదలను కూడా నిమ్మకాయ సారాలు సమర్థవంతంగా నిరోధిస్తున్నాయని నివేదించబడింది. అయితే, ఈ సాక్ష్యాధారాలన్నీ ల్యాబ్-ఆధారిత అధ్యయనాల నుండి వచ్చాయి. మానవులలో నిమ్మ సారాలా యొక్క క్రములను ఎదుర్కోనే సామర్ధ్యం, చర్య లేదా నిమ్మ మోతాదును పరీక్షించడానికి క్లినికల్ ట్రయల్స్ లేవు.

రక్తహీనత కోసం నిమ్మకాయ - Lemon for anemia in Telugu

నిమ్మకాయల్లో ఉన్న విటమిన్ సి మరియు సిట్రిక్ యాసిడ్ శాతం ఆహార నుండి ఇనుము అధికంగా గ్రహించడానికి సహాయపడుతుంది. 4,358 మంది వ్యక్తులపై జరిపిన ఒక క్లినికల్ అధ్యయనంలో, విటమిన్ సి యొక్క ఆహార వనరులు అనేవి నేరుగా ఐరన్ మరియు హేమోగ్లోబిన్ స్థాయిలును రక్తంలో మెరుగుపరచడంలో పెరగడంతో సంబంధం కలిగి ఉన్నాయని తేలింది. మరింత అధ్యయనం ప్రకారం, సిట్రిక్ యాసిడ్లో ఆహారం నుండి సులభంగా ఇనుము తీసుకునే కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి.

(మరింత సమాచారం: రక్తహీనత చికిత్స)

ముఖం మరియు చర్మం కోసం నిమ్మకాయ - Lemon for face and skin in Telugu

నిమ్మ రసం ప్రకాశవంతమైన మరియు ఆరోగ్యకరమైన చర్మం కోసం పురాతన నివారణలలో ఒకటి అయ్యుంటుంది. తేనె, గులాబీ నీరు, చక్కెరతో ఇంటిలో తయారు చేరిన టొనర్లు, స్క్రబ్లు, మరియు చర్మాన్ని తెల్లబర్చే క్రములు వంటి వివిధ రకాల సూత్రీకరణలలో నిమ్మకాయను ఉపయోగిస్తారు.

అధ్యయనాలు నిమ్మకాయ ఒక అద్భుతమైన యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఆక్సిడెంట్ అని సూచిస్తున్నాయి. ఈ రెండు లక్షణాలు నల్ల మచ్చలు,చర్మం నల్లబడడం, మరియు అకాల వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంతోపాటు మొటిమలు మరియు మచ్చలు వంటి సాధారణ చర్మ సమస్యలను పారద్రోలుతాయి. (మరింత సమాచారం: పిగ్మెంటేషన్ కోసం గృహ చిట్కాలు)

జుట్టు కోసం నిమ్మకాయ - Lemon for hair in Telugu

నిమ్మరసం యొక్క యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను చర్మం మరియు ముఖానికి మాత్రమే పరిమితం కాకుండా, జుట్టు ఆరోగ్యాన్ని నిర్వహించి మరియు మెరుగుపరుస్తుంది. సాంప్రదాయకంగా, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి నిమ్మరసం మరియు కొబ్బరి మిశ్రమాన్ని ఉపయోగిస్తారు.

నిమ్మకాయలో ఉన్న విటమిన్ సి శరీరంలో కొల్లాజెన్ శాతాన్ని పెంచుతుంది, ఇది జుట్టు పెరుగుదలకు బాధ్యత వహించే ఒక ముఖ్యమైన ప్రోటీన్. నిమ్మరసం యొక్క క్రమమైన ఉపయోగం మీ చర్మాన్ని అంటువ్యాధుల నుండి సురక్షితంగా ఉంచడం మాత్రమే కాక, సుదీర్ఘకాలం పాటు ఆరోగ్యకరమైన మరియు మెరిసే వెంట్రుకలతో మీరు జుట్టును ఉండేలా చేసి, జుట్టు నెరవడాన్ని మరియు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

అధిక రక్తపోటు కోసం నిమ్మకాయ - Lemon for high blood pressure in Telugu

ఎన్నో అధ్యయనాలు నిమ్మకాయ మరియు నిమ్మరసం యొక్క హైపోటెన్సివ్ (రక్తపోటును తగ్గించటం) ప్రభావమును సూచిస్తాయి.

అకస్మాత్తుగా పెరిగిన రక్తపోటుపై నిమ్మ రసం యొక్క ప్రభావాలను పరీక్షించడానికి 5 మంది అధిక రక్తపోటు రోగులపై చిన్న అధ్యయనం జరిగింది. అందరు రోగులు ముప్పై నిమిషాల్లో వారి అధిక రక్తపోటులో గణనీయమైన తగ్గింపును చూపించారు. అదనంగా, నిమ్మకాయ యొక్క పాలిఫినోల్ శాతం దాని హైపోటెన్సివ్ ప్రభావానికి కారణమని సూచించబడింది.

జపాన్ మహిళలపై జరిపిన మరొక అధ్యయనం శరీరంలోని రక్తపోటు స్థాయిలను నిర్వహించడానికి క్రమంగా నిమ్మకాయ తీసుకోవడం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలిపింది. జర్నల్ ఆఫ్ ఫార్మసీ అండ్ ఫార్మకాలజీలో పేర్కొన్న క్లినికల్ అధ్యయనంలో, నిమ్మరసం తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న ప్రజలలో సిస్టోలిక్ రక్తపోటును తగ్గిస్తుందని తెలిపింది. కానీ, అదే అధ్యయనంలో నిమ్మకాయ హైపోటెన్సివ్ ప్రభావాలుకు బదులుగా ప్రశాంతత ఆసుపత్రి వాతావరణానికి కారణం కావచ్చునని సూచించింది.

అధిక రక్తపోటు పరిష్కారంలో నిమ్మకాయ మరియు నిమ్మ రసం యొక్క ప్రభావాన్ని నిర్ధారించడానికి మరిన్ని అధ్యయనాలు అవసరమవుతాయి.

(మరింత సమాచారం: అధిక రక్తపోటు చికిత్స)

కాలేయం కోసం నిమ్మకాయ - Lemon for liver in Telugu

ఇన్ వివో (జంతు ఆధారిత) అధ్యయనాలు నిమ్మరసంతో ఆల్కహాల్ వల్ల కలిగే కాలేయ నష్టాలనును సమర్థవంతంగా నిరోధించవచ్చని సూచిస్తున్నాయి. నిమ్మకాయ ఒక సిట్రస్ పండు అవ్వడం వలన సిట్రిక్ యాసిడ్ కు అది మంచి మూలకం. 1-2g మోతాదు గల సిట్రిక్ యాసిడ్ శరీరంలో స్వేచ్ఛా రాశుల (Free radicles) వలన సంభవించే కాలేయ ప్రమాదాన్ని తగ్గించవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి, మరియు నిమ్మకాయ యొక్క హెపాటోప్రొటెక్టివ్ (కాలేయమును కాపాడటం) ప్రభావం దాని యాంటీఆక్సిడెంట్ లక్షణాల వలన అని సూచించింది. మానవ ఆధారిత అధ్యయనాలు లేనందు వల్ల, కాలేయ ఆరోగ్యాన్ని కాపాడడంలో నిమ్మకాయ యొక్క ప్రయోజనాలు గురించి మరింత తెలుసుకోవడానికి వైద్యునితో మాట్లాడటం మంచిది.

మూత్రపిండాల్లో రాళ్ళ కోసం నిమ్మకాయ - Lemon for kidney stones in Telugu

యుఎస్ (US) లో చేసిన ఒక అధ్యయనం, నిమ్మ రసం మానవులలో మూత్రపిండాలు రాళ్ళ పరిమాణాన్ని తగ్గించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుందని సూచించింది. మూత్రపిండాల రాళ్ల సమస్యతో బాధపడుతున్న 52 మందికి 44 నెలల పాటు నిమ్మరసం చికిత్స (lemonade therapy) ఇవ్వబడింది. నియమిత కాలం ముగిసేనాటికి, నిమ్మరసం చికిత్స పొందిన అందరి రోగులలో రాళ్ళ యొక్క గణనీయమైన తగ్గింపును గమనించారు. అయినప్పటికీ, మూత్రపిండాల రాళ్ళ చికిత్సలో నిమ్మ యొక్క సిట్ర్యూరిక్ (citrauric) ( మూత్రం లో సిట్రిక్ యాసిడ్) ప్రభావాలు మరియు పునరుత్పాదకత యొక్క ఖచ్చితమైన జీవక్రియ కోసం మరింత అధ్యయనాలు అవసరమవుతాయి.

రోగనిరోధకత శక్తి కోసం నిమ్మకాయ - Lemon for immunity in Telugu

రోగనిరోధక వ్యవస్థపై నిమ్మకాయ ప్రభావాన్ని నిర్ధారించడానికి ఎలాంటి అధ్యయనాలు లేనప్పటికీ, నిమ్మకాయలోని విటమిన్ సి శాతం కొన్నిఇమ్మ్యూనో మోడ్యులేటింగ్ (immunomodulating) (రోగనిరోధక వ్యవస్థను నియంత్రిస్తుంది) ప్రయోజనాలకు కారణమవుతుంది. సాంప్రదాయకంగా, జలుబు మరియు దగ్గు వంటి వాటిని అరికట్టడంలో నిమ్మకాయ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. శరీరంలోని ఆంటీబాడీలు మరియు ఫాగోసైటిక్ కణాలు (ఆంటీబాడీ కణాల కంటే ఇతర రోగనిరోధక వ్యవస్థ కణాలు) కోసం విటమిన్ సి ఒక అద్భుతమైన ప్రేరేపకమని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అదనంగా, నిమ్మకాయ ఒక అద్భుతమైన యాంటీబయాటిక్ గా కూడా గుర్తించబడుతుంది. అందువలన, ఇది దగ్గు, సాధారణ జలుబు మరియు ఇతర సాధారణ రుగ్మతలతో పోరాడటానికి సహాయపడవచ్చు.

నిమ్మకాయ యొక్క అత్యంత సాధారణ ఉపయోగం నిమ్మరసం రూపంలో ఉంటుంది. పానీయ పరిశ్రమల్లో  చాలా ఇష్టపడే రుచులలో పులుపు ఒకటి. చాలా పెద్ద వాణిజ్య పానీయ పరిశ్రమలు నిమ్మ రుచితో  కనీసం ఒక పానీయ రకాన్నీ ప్రారంభించాయి. సలాడ్లు, రొట్టెలు, కేకులు మరియు ఇతర మిఠాయిలతో సహా అన్ని రకాలైన తీపి మరియు రుచికరమైన వంటలలో దాని యొక్క పుల్లని మరియు చేదు రుచి  కోసం నిమ్మకాయ పై తోలు విస్తృతంగా ఉపయోగించబడుతుంది. నిమ్మకాయల ఉరగాయను సులభంగా సంవత్సరం పొడవునా ఉపయోగించుకోవచ్చు.

నిమ్మకాయ తొక్కలను సూర్యుని కింద లేదా మీ ఓవెన్ లో ఎండబెట్టి, పొడిలా చేసి ముఖం మరియు జుట్టు ముసుగులలో ఉపయోగించవచ్చు.

వినెగార్ తో  కలిపిన నిమ్మకాయను సామాన్లు మరియు కిటికీలను శుభ్రం చేసే  ఒక అద్భుతమైన సాధనం అని పిలుస్తారు.

పరిమళ చికిత్స నిపుణులు దాని తాజా  మరియు ప్రేరేపించే సువాసన కోసం నిమ్మ నూనె ఉపయోగించడానికి ఆసక్తి చూపిస్తారు.

నిమ్మకాయ గుళికలు మరియు మాత్రల రూపంలో కూడా వాణిజ్యపరంగా లభిస్తుంది.

నిమ్మ నీరు చెయ్యడం ఎలా

నిమ్మకాయ నీరు  ప్రధాన డిటాక్స్ నివారణలలో ఒకటి. ఖాళీ కడుపుతో వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి  తీసుకుంటే బరువు కోల్పోవాలనుకునే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంట్లోనే స్వంతంగా  నిమ్మ నీరు చేయడం కోసం ఇక్కడ ఒక పద్దతి ఉంది.

 • ఒక కూజాలో కొంచెం గోరువెచ్చని నీరు తీసుకోండి.
 • నిమ్మకాయను  నాలుగు ముక్కలుగా కోసి, కూజాలో వెయ్యండి.
 • తాగడానికి ముందు ఒక  25-30 నిమిషాల పాటు దానిని అలాగే ఉంచండి.

దీనిని పూర్తి నిమ్మకాయలలో చెయ్యవలసిన  అవసరం లేదు, కానీ నిమ్మ తొక్కను జోడించడం వలన  తొక్కలలో ఉండే అస్థిర నూనెల (volatile oils) అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. ఎక్కువ సేపు వేచి ఉండకూడదనుకుంటే, సగం నిమ్మకాయ రసాన్ని గోరు వెచ్చని నీటితో కలిపి  త్రాగవచ్చు. అల్లం మరియు తేనె వంటివి రుచి కోసం నిమ్మ నీటిలో జోడించవచ్చు. ఆలా చెయ్యడం వలన రుచి మొగ్గలకు మరింత అనుకూలముగా మాత్రమే ఉండక, ఆ పానీయం యొక్క ఆరోగ్య ప్రయోజనాలను కూడా పెంచుతుంది.

నిమ్మ నూనె చెయ్యడం ఎలా

నిమ్మకాయ పై తొక్క నుండి నిమ్మ నూనెను తయారు చేస్తారు, నిమ్మకాయ/పండు  చాలా తేమగా ఉంటుంది మరియు సుదీర్ఘకాలం ఉంచినట్లయితే దాని లో ఉన్న నూనె శాతం నిమ్మకాయ మీద బూజు చేరేలా చేస్తుంది. ఇది చాలా తక్కువ మందికి  తెలిసిన విధానం అయినప్పటికీ, సలాడ్ల కోసం లేదా వంటకాలకు ఏదైనా ఒక నిమ్మ రుచిని ఇవ్వడానికి నిమ్మ నూనెను ఉపయోగించవచ్చు. నిమ్మ నూనె యొక్క కొన్ని చుక్కలు ముఖం ముసుగులు లేదా జుట్టు నూనెతో కలిపి ఒక తాజా మెరుపు  పొందుటకు ఉపయోగించవచ్చు. నిమ్మనూనె, ఒక ఘాడమైన నూనె అందువలన చర్మ చికాకు నివారించేందుకు ఆలివ్ నూనె లేదా కొబ్బరి నూనె వంటి మరొక నూనెతో దానిని కలిపి ఉపయోగించాలి. నిమ్మకాయ లేదా నిమ్మనూనె యొక్క అలెర్జీ ప్రతిచర్య  అవకాశాలను నివారించడానికి మొదట చిన్న పరీక్ష చెయ్యడం ఎల్లప్పుడూ మంచిది. మణికట్టు మీద లేదా మోచేతి మీద కానీ కొద్దీ మొత్తంలో నూనెను రుద్దడం ద్వారా పరీక్షను సులభంగా చేయవచ్చు. నూనె పూసిన ప్రాంతంలో ఎరుపు, దద్దుర్లు లేదా వాపు వంటి ఏవిధమైన సంకేతాలనైనా చూపిస్తే నూనెను ఉపయోగించవద్దు.

ఇంట్లో నిమ్మనూనె తయారు చేయడం కోసం ఇక్కడ ఒక సులభమైన పద్దతి ఉంది.

 • కొన్ని నిమ్మకాయల తొక్కలును తియ్యండి  (మీ కూజా పరిమాణాన్ని బట్టి) మరియు తొక్కతో ఏమైనా పండ్ల ముక్కలు ఉండిపోతే వాటిని తొలగించండి.
 • దాని ఉపరితలంపై ఉన్న ఏ దుమ్ము లేదా బాక్టీరియాను తొలగించడానికి తొక్కలను శుభ్రంగా కడగాలి.
 • పొడిగా ఉన్న గాలి చేరని కూజాలో తొక్కలను ఉంచండి మరియు దానిలో కూజా అంచు వరకు మీకు నచ్చిన ఏదైనా ఒక రకం నూనెను  పోయాలి.
 • కూజాను మూసివేసి, చల్లని, పొడి ప్రదేశంలో 2-3 వారాలు పాటు ఉంచండి.
 • పై నుండి మీ నూనెను తీసుకొని, మీరు కూజా నుండి నిమ్మతొక్కలను వడకండి లేదా కొన్ని రోజులు ఉంచవచ్చు.
 • ఎల్లప్పుడూ అవసరమైన నూనెను తీసుకున్న తర్వాత కూజాను మూసివేయాలని గుర్తుంచుకోండి.
 • మీరు ఏదైనా బూజు పెరుగుదలను గమనిస్తే వెంటనే దాన్ని పారబోయ్యండి.

ఆలివ్ నూనెకు బలమైన వాసన ఉండదు కాబట్టి మీరు ఈ పద్దతిలో ఆలివ్ నూనెను ఉపయోగించడం మంచిది. కానీ, మీరు మరొక నూనె కోరుకుంటే దాన్ని  కూడా ఉపయోగించవచ్చు.

నిమ్మ రసం  యొక్క ఖచ్చితమైన మోతాదు వ్యక్తిగత శరీర రకం మరియు శారీరక స్థితిపై ఆధారపడి ఉంటుంది. మీరు ఆరోగ్య అనుబంధకంగా నిమ్మను  తీసుకోవాలనుకుంటే, వైద్యునితో తనిఖీ చేసుకోవడం మంచిది.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Kesh Art Hair Oil by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to more than 1 lakh people for multiple hair problems (hair fall, gray hair, and dandruff) with good results.
Bhringraj hair oil
₹425  ₹850  50% OFF
BUY NOW
 • నిమ్మ రసం యొక్క  సరాసరి పూత చర్మాన్ని చికాకుపరచవచ్చు. కాబట్టి  చర్మం మీద పూసే ముందు కొంత నీరు లేదా నూనె తో నిమ్మ రసాన్ని  పలచన చెయ్యడం ఉత్తమం.
 • నిమ్మకాయ యొక్క సిట్రిక్ యాసిడ్ శాతం దంతాలను కొంచెం కరిగించే  ప్రభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి నిమ్మ నీరు ఎల్లప్పుడూ మితంగా తీసుకోవాలి.
 • నిమ్మరసం కొంతమందిలో ఆమ్లత (acidity) ను కలిగించిందని నివేదించబడింది. (మరింత సమాచారం: ఆమ్లత కారణాలు)

Medicines / Products that contain Lemon

వనరులు

 1. United States Department of Agriculture Agricultural Research Service. Basic Report: 09150, Lemons, raw, without peel. National Nutrient Database for Standard Reference Legacy Release [Internet]
 2. Kiecolt-Glaser JK, Graham JE, Malarkey WB, Porter K, Lemeshow S, Glaser R. Olfactory influences on mood and autonomic, endocrine, and immune function.. Psychoneuroendocrinology. 2008 Apr;33(3):328-39. PMID: 18178322
 3. Fukuchi Y, Hiramitsu M, Okada M, Hayashi S, Nabeno Y, Osawa T, Naito M. Lemon Polyphenols Suppress Diet-induced Obesity by Up-Regulation of mRNA Levels of the Enzymes Involved in beta-Oxidation in Mouse White Adipose Tissue.. J Clin Biochem Nutr. 2008 Nov;43(3):201-9. PMID: 19015756
 4. Kim MJ, Hwang JH, Ko HJ, Na HB, Kim JH. Lemon detox diet reduced body fat, insulin resistance, and serum hs-CRP level without hematological changes in overweight Korean women.. Nutr Res. 2015 May;35(5):409-20. PMID: 25912765
 5. Joshipura KJ et al. The effect of fruit and vegetable intake on risk for coronary heart disease. Ann Intern Med. 2001 Jun 19;134(12):1106-14. PMID: 11412050
 6. Yokoyama T, Date C, Kokubo Y, Yoshiike N, Matsumura Y, Tanaka H. Serum vitamin C concentration was inversely associated with subsequent 20-year incidence of stroke in a Japanese rural community. The Shibata study. Stroke. 2000 Oct;31(10):2287-94. PMID: 11022052
 7. Padayatty SJ et al. Vitamin C as an antioxidant: evaluation of its role in disease prevention. J Am Coll Nutr. 2003 Feb;22(1):18-35. PMID: 12569111
 8. Hyunjoo Lee, Minji Woo, Mijeong Kim, Jeong Sook Noh, Yeong Ok Song. Antioxidative and Cholesterol-Lowering Effects of Lemon Essential Oil in Hypercholesterolemia-Induced Rabbits. Prev Nutr Food Sci. 2018 Mar; 23(1): 8–14. PMID: 29662842
 9. Terpstra AH, Lapré JA, de Vries HT, Beynen AC. The hypocholesterolemic effect of lemon peels, lemon pectin, and the waste stream material of lemon peels in hybrid F1B hamsters. Eur J Nutr. 2002 Feb;41(1):19-26. PMID: 11990004
 10. Terpstra AH, Lapré JA, de Vries HT, Beynen AC. The hypocholesterolemic effect of lemon peels, lemon pectin, and the waste stream material of lemon peels in hybrid F1B hamsters. Eur J Nutr. 2002 Feb;41(1):19-26. PMID: 11990004
 11. Kim HK, Jeong TS, Lee MK, Park YB, Choi MS. Clin Chim Acta. 2003 Jan;327(1-2):129-37. PMID: 12482628
 12. Péneau S et al. Relationship between iron status and dietary fruit and vegetables based on their vitamin C and fiber content. Am J Clin Nutr. 2008 May;87(5):1298-305. PMID: 18469253
 13. Ballot D et al. The effects of fruit juices and fruits on the absorption of iron from a rice meal.. Br J Nutr. 1987 May;57(3):331-43. PMID: 3593665
 14. Juliet M. Pullar, Anitra C. Carr, and Margreet C. M. Vissers. The Roles of Vitamin C in Skin Health. Nutrients. 2017 Aug; 9(8): 866. PMID: 28805671
 15. Yoji Kato et al. Effect on Blood Pressure of Daily Lemon Ingestion and Walking. J Nutr Metab. 2014; 2014: 912684. PMID: 24818015
 16. Tong Zhou et al. Protective Effects of Lemon Juice on Alcohol-Induced Liver Injury in Mice. Biomed Res Int. 2017; 2017: 7463571. PMID: 28567423
 17. Omar M.E. Abdel-Salam et al. Citric Acid Effects on Brain and Liver Oxidative Stress in Lipopolysaccharide-Treated Mice. J Med Food. 2014 May 1; 17(5): 588–598. PMID: 24433072
 18. Kang DE, Sur RL, Haleblian GE, Fitzsimons NJ, Borawski KM, Preminger GM. Long-term lemonade based dietary manipulation in patients with hypocitraturic nephrolithiasis. J Urol. 2007 Apr;177(4):1358-62; discussion 1362; quiz 1591. PMID: 17382731
 19. Ströhle A, Hahn A. [Vitamin C and immune function]. Med Monatsschr Pharm. 2009 Feb;32(2):49-54; quiz 55-6. PMID: 19263912
 20. Carr AC, Maggini S. Vitamin C and Immune Function. Nutrients. 2017 Nov 3;9(11). pii: E1211. PMID: 29099763
Read on app